LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:27, 23 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్‌మ్యాటింగ్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యూటోరియల్లో మనం,

స్ప్రెడ్‌షీట్ను పాస్వర్డ్ తో రక్షించడం

స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్ను పాస్వర్డ్ తో రక్షించడం

ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం

సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం

సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం.

00:25 ఇక్కడ మనము ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము.
00:35 Personal-Finance-Tracker.ods ఫైల్ను తెరుద్దాం.
00:40 ముందుగా ఈ ఫైల్ను పాస్వర్డ్ తో రక్షించడం నేర్చుకుందాం.
00:44 ఈ ఎంపిక వల్ల పాస్వర్డ్ తెలిసినవాళ్ళే ఈ ఫైల్ను తెరవ గలరు.
00:51 మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి Save As పై క్లిక్ చేయండి.
00:55 Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
00:58 Save with password బాక్స్ పై చెక్ పెట్టండి.
01:03 Save పై క్లిక్ చేయండి
01:06 మనము Save As ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
01:15 ఫైల్ ను స్థాన పూర్తి చేద్దాం.
01:18 Yes పై క్లిక్ చేద్దాం.
01:20 పాస్వర్డ్ ప్రవేశ పెడదాం.
01:23 Confirm బాక్స్లో కూడా మళ్ళి పాస్వర్డ్ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం.
01:30 Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం.
01:36 ఇప్పుడు ఈ ఫైల్ను మళ్ళి తెరిచి ఏమవుతుందో చూద్దాం.
01:41 Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది!
01:45 పాస్వర్డ్ తప్పుగా ప్రవేశ పెడదాం.
01:48 OK పై క్లిక్ చేద్దాం.
01:50 password is incorrect అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది.
01:56 ఇప్పుడు సరైన పాస్వర్డ్ ప్రవేశ పెడదాం.
01:59 ఫైల్ తెరుచుకుంటుంది.
02:01 పాస్వర్డ్ ఎంపిక ను తొలగించడం ఎలా? ఇది చాలా తేలిక.
02:07 Save with password ఎంపికను un-check చేద్దాం.
02:10 మళ్ళి Save ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు.
02:18 ఫైల్ను స్థాన పూర్తి చేద్దాం.
02:21 Yes పై క్లిక్ చేద్దాం.
02:23 ఫైల్ని మూసి మరల తెరుద్దమ్.
02:27 ఫైల్ను తెరవడానికి పాస్వర్డ్ అవసరం లేదు.
02:31 ఫైల్ లోని ప్రత్యేకమైన షీట్ను ఎలా పాస్వర్డ్ సురక్షితం చేయాలో చూద్దాం.
02:37 మెనూ బార్లో Tools పై క్లిక్ చేసి Protect Document మరియు Sheet పై క్లిక్ చేయండి.
02:44 Protect Sheet డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది.
02:47 షీట్ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను un-check చేయండి.
02:56 ఇప్పుడు Password ఫీల్డ్ లో abc లోయర్ కేస్లో ప్రవేశ పెట్టి Confirm ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి.
03:07 OK చేయండి.
03:08 ఇప్పుడు సెల్ లోని డేటాను ఎంపిక చేసుకొని మార్పులు చేద్దాం.
03:15 మనం ఏ సెల్ని కూడా ఎంపిక చేసుకోలేక పోతున్నాం!
03:18 షీట్లో ఎటువంటి మార్పులు చేయలేము!
03:22 మరి వేరే షీట్స్ సంగతేంటి?
03:24 Sheet 2 పై క్లిక్ చేద్దాం.
03:27 ఒక సెల్ను ఎంపిక చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిద్దాం.
03:30 కాల్క్ ఇతర షీట్స్లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది.
03:35 మొదటి షీట్కి మళ్ళి తిరిగి వెళ్దాం.
03:38 షీట్ను un-protect చేద్దాం.
03:41 ఇది తేలిక.
03:43 మెనూ బార్లో Toolsపై క్లిక్ చేసి Protect Document మరియు Sheetపై క్లిక్ చేయండి.
03:49 పాస్వర్డ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:53 abc స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి.
03:59 ఇప్పుడు మనం సెల్ల్స్ను మళ్ళి ఎంపిక చేసుకోగలుగుతున్నాం!
04:03 Ranges గురించి నేర్చుకుందాం.
04:06 స్ప్రెడ్షీట్లో సెల్ల్స్ రేంజ్ని నిర్వచించి ఒక డేటాబేస్గా ఉపయోగించవచ్చు.
04:12 ఈ డేటాబేస్ పరిధిలోని ప్రతి ఒక్క రో డేటాబేస్ రికార్డుకు సంబందించినది.
04:17 ఒక రో లోని ప్రతి ఒక్క సెల్ డేటాబేస్ ఫీల్డ్కు సంబందించినది
04:22 మీరు డేటాబేస్ లాగానే రేంజ్ పై కూడా సార్ట్, గ్రూప్ మరియు గణనలను చెయ్యవచ్చు.
04:30 Personal-Finance-Tracker.odsలో ఒక డేటాబేస్ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం.
04:38 ముందుగా, డేటాబేస్కు కావలసిన ఐటమ్సను ఎంపిక చేసుకుందాం.
04:43 SN హెడ్డింగ్ నుండి Account వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం.

డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం.

04:53 ఇప్పుడు, మన డేటాబేస్కు ఒక పేరు ఇద్దాం.
04:56 మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Define Range పై క్లిక్ చేద్దాం.
05:02 Name ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ dtbs అని టైప్ చేద్దాం.
05:08 OK క్లిక్ చేద్దాం.
05:10 మళ్ళి, మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Select Range పై క్లిక్ చేయండి.
05:15 కనిపించే Select Database Range డైలాగ్ బాక్స్లో dtbs పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి.
05:24 OK క్లిక్ చేయండి.
05:27 డేటాబేస్ డేటాను సార్ట్ చేద్దాం.
05:31 మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Sort పై క్లిక్ చేయండి.
05:35 Sort డైలాగ్ బాక్స్లో Sort by ఫీల్డ్ పై క్లిక్ చేసి SN ఎంపిక చేసుకోండి.
05:42 కుడి వైపున Descendingను ఎంపిక చేసుకోండి.
05:47 మొదటి Then by ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Cost ఎంచుకోండి.
05:54 మళ్ళి కుడి వైపున Descendingను ఎంచుకోండి.
05:58 రెండవ Then by ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Spent ఎంపిక చేసుకొని మళ్ళి Descendingను ఎంచుకోండి.
06:07 OK క్లిక్ చేయండి.
06:09 SN హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి.
06:15 ఇదే విధముగా, డేటాబేస్లో ఇతర ఆపరేషన్లు కూడా చెయ్యవచ్చు.
06:21 CTRL+Z కీలను నొక్కి sortను UNDO చేసి అసలైన డేటాను పొందవచ్చు.
06:28 క్యాల్క్లో Subtotal ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం.
06:34 Subtotal ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు.
06:43 Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను subtotal చేద్దాం.
06:49 ఎనిమిదవ(8)రోలో వున్న ఎంట్రీని చెరిపి వేద్దాం.
06:53 SN నుండి ACCOUNT వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం.
06:59 మెనూ బార్ నుండి Data మరియు Subtotalపై క్లిక్ చేద్దాం.
07:04 Subtotals డైలాగ్ బాక్స్లో Group by ఫీల్డ్ లో SN ఎంచుకుందాం.
07:11 ఇది డేటాను సీరియల్ నంబెర్ ప్రకారం అమరుస్తుంది.
07:15 తర్వాత Calculate subtotals for ఫీల్డ్ లో Cost ఎంపిక పై క్లిక్ చేయండి.
07:21 ఇది దిగువన వున్న అన్ని ఎంట్రీల మొత్తాన్ని లెక్కిస్తుంది.
07:26 Use function ఫీల్డ్ దిగువన Sumను ఎంపిక చేసుకొని OK చేయండి.
07:33 స్ప్రెడ్షీట్ లో Cost హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల Grand total కనిపించడం గమనించండి.
07:41 షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్లు 1 2 మరియు 3లను గమనించండి.
07:47 ఈ మూడు ట్యాబ్స్ డేటాకు సంబందించిన 3 వివిధ దృశ్యలను ఇస్తాయి.
07:52 ట్యాబ్ 1 పై క్లిక్ చేద్దాం.
07:54 Cost దిగువన వున్న డేటా యొక్క grand total మాత్రమే రావడం గమనించండి.
08:00 ట్యాబ్ 2 పై క్లిక్ చేద్దాం.
08:02 Costs దిగువన వున్న డేటా మరియు grand total కుడా రావడం గమనించండి.
08:08 ఇప్పుడు ట్యాబ్ 3 పై క్లిక్ చేద్దాం.
08:11 షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు Costs దిగువన వున్న డేటా యొక్క grand total రావడం గమనించండి.
08:18 ఫైల్ ముసివేద్దం.
08:21 Save or Discard changes మెసేజ్తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:26 Discard పై క్లిక్ చేయండి.
08:28 ఫైల్ను మళ్ళి తెరుద్దాం.
08:31 ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం.
08:37 Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది.
08:41 స్ప్రెడ్షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు.
08:49 ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్కు మోడ్ ఆఫ్ పేమెంట్ను పేర్కొనవచ్చు.
08:59 ఇప్పుడు హెడ్డింగ్ Date మరియు దాని డేటాను చెరిపేద్దాం.
09:04 హెడ్డింగ్ Received పక్కన మోడ్ ఆఫ్ పేమెంట్కు మరొక హెడ్డింగ్ MOP ఇద్దాం.
09:12 Items హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్, MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది.
09:21 అనగా, Salary, Electricity Bills మరియు ఇతర కంపోనేంట్లు.
09:27 ఇప్పుడు హెడ్డింగ్ MOP దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం.
09:33 వాటిలో Salary కంపోనేంట్కు సంబందించిన మోడ్ ఆఫ్ పేమెంట్ వుంది.
09:38 ఇప్పుడు మెనూ బార్లో Data పై క్లిక్ చేసి Validity పై క్లిక్ చేయండి.
09:43 Validity డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
09:47 Criteria ట్యాబ్ పై క్లిక్ చేయండి.
09:50 Allow ఫీల్డ్ డ్రాప్ డౌన్లో List పై క్లిక్ చేయండి.
09:55 Entries బాక్స్ వస్తుంది.
09:58 ఎంపికలను ప్రవేశ పెడదాం. ఇవి ఎంపిక చేసుకున్న సెల్ల్స్ను ద్రువికర్న చేయడం ద్వారా కనిపిస్తాయి.
10:05 చెల్లింపు యొక్క మొదటి మోడ్, In Cash అని టైపు చేసి కీబోర్డ్ నుండి Enter నొక్కుదాం.
10:13 చెల్లింపు యొక్క రెండవ మోడ్ Demand Draft అని టైపు చేద్దాం .
10:19 OK చేద్దాం.
10:21 ఎంపిక చేసుకున్న సెల్ల్స్ ద్రువికర్న చెయ్యబడ్డాయి.
10:25 ఇప్పుడు కనిపించే డౌన్ యారోను నొక్కుదాం.
10:30 Entries బాక్స్లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి.
10:36 దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో Format Paintbrush ఎంపిక పై క్లిక్ చేయండి.
10:43 తర్వాత, మౌస్ ఎడమ బటన్ను పట్టుకొని ద్రువికరించ వలసిన సెల్ల్స్ దిగువన వున్న సెల్ల్స్ పై లాగుతూ వాటిని ఎంపిక చేసుకోండి.
10:53 ఇప్పుడు మౌస్ బటన్ను వదిలివేయ్యండి.
10:57 ఎంపిక చేసుకున్న సెల్ల్స్ అన్ని ఇదే విధముగా ద్రువికరించ బడతాయి.
11:09 ఇప్పుడు MOP హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి.
11:17 మోడ్ ఆఫ్ పేమెంట్ కోసం రెండు ఎంపికలు వచ్చాయి.
11:21 In Cash ఎంపిక చేసుకుందాం.
11:25 ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో Cash లేదా Demand Draft ఎంపిక చేసుకోవచ్చు.
11:36 ఇప్పుడు మనంలిబ్రే ఆఫీసు క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:42 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,

స్ప్రెడ్షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం

స్ప్రెడ్షీట్ లోని ఒక షీట్ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం

డేటాబేస్కి రేంజ్లను నిర్వచించడం

సబ్ టోటల్స్ ఎంపికను వాడడం

సెల్ల్స్ను ద్రువికరించడం

12:01 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
12:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
12:07 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం.
12:13 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
12:17 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
12:20 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
12:27 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
12:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము,
12:42 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది.
12:50 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble