LaTeX/C2/Inside-story-of-Bibliography/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:29, 23 February 2018 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 బిబ్లియోగ్రఫీ ఎంట్రీలను సృష్టించడం పై ట్యుటోరియల్ కు స్వాగతం
00:06 దీని కోసం నేను BibTeX ను ఉపయోగిస్తాను. Bibtex అనేది LaTeX. నుండి వేరుగా ఉన్న ఒక యుటిలిటీ
00:14 ఈ ట్యుటోరియల్ లో మనం ఇప్పుడు ఒక pdf file ను ఎలా ఉత్పత్తి చేయాలో చూద్దాం.
00:20 మొదటి పేజీ శీర్షికను చూపిస్తుంది
00:25 మనం, మన టెక్స్ట్ ఉన్న రెండవ పేజీకు వెళ్దాం.
00:31 ఇక్కడ references ఒకటి నుండి ఆరు వరకు మరియు తదుపరి పేజీలో పదకొండు వరకు ఉన్నాయి.
00:41 ఈ సూచనలన్నీ అక్షర క్రమంలో పేర్కొనబడ్డాయి.
00:47 మీరు ఇక్కడ చూడవచ్చు.
00:52 ఇప్పుడు మనం దీని కోసం ఉపయోగించిన source file ను చూద్దాం.
00:59 మనం దీనిని ఒకసారి చూద్దాం.
01:07 ఇక్కడ సూచనలు ఏమీ లేవు అని బ్రౌజ్ చేయడం ద్వారా స్పష్టమవుతోంది.
01:13 source file లో ఈ సమాచారం ఏమి లేదు.
01:17 మరి, సూచనలు(references) ఎక్కడ ఉన్నాయి? అవి ref file లో ఉన్నాయి. అసలైన file పేరు ref.bib.
01:26 అది bibliography కమాండ్ కు అది డిఫాల్ట్ -
01:34 ఇది మీ ref.bib.
01:39 Ref.bib లో ఏముందో చూద్దాం.
01:52 ఇది వివిధ రకాల సూచన సమాచారాన్ని కలిగి ఉంటుంది, ఉదాహరణకి- పుస్తకము, టెక్-రిపోర్టు, వ్యాసం లేదా వ్యవహారాలు, మరియు ఇంకొన్ని వ్యవహారాలు ఉంటుంది.
02:09 ఈ ఫైల్ గురించి మళ్ళీ వెనకకు తిరిగి వచ్చినప్పుడు వివరిస్తాను.
02:13 ఇప్పుడు output లో రిఫరెన్స్ జాబితాను సృష్టించే ప్రక్రియపై దృష్టి పెడదాం..
02:19 మనము మరల source file అయిన references.tex ఉంచుదాము. .
02:31 ఈ పేజీ ఎగువకు వెళ్దాం
02:36 ముందుగా references ను పూర్వపదాలుగా గల ఫైళ్ళ జాబితాలు పొందండి.
02:44 మీకావలసినవి ఇవే (అవి ఇవే )
02:47 ముందుగా references.tex మినహా అన్ని ఫైళ్ళను తొలగిద్దాం.
03:04 దీన్ని నిర్ధారించండి
03:09 ఇప్పుడు మనము references.tex మాత్రమే కలిగివున్నాము
03:12 ఇప్పుడు నన్ను దీనిని కంపైల్ చేయనివ్వండి.
03:19 కంపైల్ చేశాక, మనకి కొన్ని నిర్దేశించని సూచనలు ఉన్నాయి అని, కొన్ని అనులేఖనాలను కోల్పోతున్నాయని హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది
03:39 ఇక్కడ మనము చూసినట్లు అయితే Pdf.tex ఆదేశం కొత్త ఫైల్స్ ను సృష్టిస్తుంది..
03:52 References.pdf కు అదనంగా కొన్ని కొత్త ఫైల్లు ఉన్నాయి, అవి references.log మరియు references.aux.
04:04 మొదటగా references.log ఫైల్ ను చూద్దాము.
04:15 ఇది చాలా సమాచారం కలిగి ఉంటుంది, వాస్తవానికి ఇది ఇక్కడ కనిపించే అన్ని సందేశాలను కలిగి ఉంటుంది.
04:20 కొంచెం క్రిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా సమాచారం మరియు అలాగే హెచ్చరికలు కూడా కనిపిస్తాయి.
04:36 ఇక్కడ కొన్ని ఫాంట్లు తప్పిపోతున్నారనే హెచ్చరిక ఇస్తుంది, తరచుగా ఇలాంటి వాటి వలన అంత ప్రభావం ఉండధు.
04:43 కొన్ని సూచనలు తప్పిపోయిన హెచ్చరికలు, మరియు కొన్ని అనులేఖనాలు తప్పిపోయిన హెచ్చరికలు అయితే మనకు చాలా ముఖ్యమైనవి.
04:50 మనం ఈ హెచ్చరికలను పరిష్కరించుకుంటాం.
04:55 ఇప్పుడు మనము రెండవ ఫైల్ references.aux ను తెరిచి చుద్దాం
05:04 ఇది అనేక citation ఆదేశాలను కలిగి ఉంది. అవి ఎక్కడ నుండి వచ్చాయి?
05:13 Citation యొక్క అన్ని ఆర్గుమెంట్స్ source fileలో cite command లో కనిపించాయి
05:18 మనము ఇప్పుడు చూడవచ్చు. దీన్ని ఇక్కడ తెరిచి ఉంచుతా.
05:26 అక్కడ ఉన్న Source file యొక్క స్క్రోల్ ఉపయొగించి క్రిందకి వెళ్ళండి.
05:31 ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను cite vk 79 ను కలిగి ఉన్నాను, ఆ vk79 ఇక్కడ వస్తుంది.
05:37 Cite tk 80, అది ఇక్కడ tk 80’ గా వస్తుంది మరియు అలాగే మిగిలినవి. అదేవిధంగా ఈ bibstyle-plain ఇక్కడ source file లో వస్తుంది.
05:51 మీరు పైకి వెళ్ళండి. ఇది bibliography style – plain ఆ plain ఇక్కడ కనిపిస్తుంది.
06:00 aux file వేరియబుల్ పేర్లను కూడానిల్వ చేస్తుంది. ఉదాహరణకు, నేను ఈ విభాగానికి ఒక లేబుల్ ను కలిగి ఉన్నాను.
06:11 అక్కడ కు వెళ్దాం.
06:18 సరే, లేబుల్ లేకుండా దీన్నిచేద్దాం.
06:26 ఉదాహరణకు, దీన్ని తొలగించి, దీన్ని కంపైల్ చేద్దాం
06:37 ఈ ఫైల్ ను తిరిగి తెరుద్దాం.
06:47 మనకు ఇకపై ఇది కలిగి లేదని గమనించండి.
06:50 కాబట్టి, నేను ఇక్కడ ఒక లేబుల్ label – sec arya ను ఉంచి,
07:06 సేవ్, మరియు కంపైల్ చేసి, తెరిస్తే,
07:13 మనం ఈ ఫైల్ కు వచ్చి, ఈ ఫైల్ ను మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది.
07:18 ఇక్కడ - new label sec arya కమాండ్ ఉండటం గమనించండి.
07:23 ఇది మనం ఇక్కడ ఉంచిన లేబుల్. అది సెక్షన్ 1 అని చెబుతుంది.
07:31 మరియు అది ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2 పేజీ సంఖ్యను సూచిస్తుంది - ఇది డాక్యుమెంట్ పేజీ 2.
07:41 తరువాత compilation సమయంలో, Latex aux file ను చదువుతుంది మరియు label సమాచారాన్ని లోడ్ చేస్తుంది.
07:48 అందువలన లేబుళ్ళను సరిదిద్దడానికి మనకు రెండు compilations అవసరం.
07:52 ఇప్పుడు సూచనలు జాబితా ఎలా సృష్టించబడాలో చూద్దాం; ఇది BibTeX ను ఉపయోగించవలసిన సమయం.
08:01 ఇక్కడ మనం BibTeX references ఆదేశం ను ఇస్తాము. - BibTeX references ఆదేశాన్ని ఇవ్వండి
08:17 ఇక్కడ ప్రస్తావించినట్లు references.aux నుండి ఇది ఇన్పుట్ ను తీసుకుంటుంది, ఉదాహరణకు, ఇది references.aux ఉపయోగించబడుతుందని చెప్తుంది..
08:30 ఇది plain.bst అని పిలువబడేstyle ఫైల్ ను,
08:39 plain కమాండ్ లో ఇచ్చినట్లు గా మరియు ref.bib నుండి డేటా ను ఉపయోగిస్తుంది అని చెబుతుంది. ref.bib గురించి ఇప్పటికే వివరించాము, మొదటి డేటాబేస్ ఫైల్ ref.bib.
08:51 source file లో మనం plain style మరియు ref bibని ఉపయోగించాము అని గుర్తుకుతెచ్చుకోండి.
08:56 ఇప్పుడు ఏ ఫైల్స్ సృష్టించబడ్డాయో చూద్దాము.
09:00 సరే, ఈ BibTeX.references ఆదేశం కారణంగా ఏ కొత్త ఫైల్స్ సృష్టించబడ్డాయో చూద్దాం
09:10 దీనిని జాబితాగా చేద్దాము. మీరు గతంలో చూసిన ఫైల్స్ కు అదనంగా,
09:15 మనకు రెండు కొత్త ఫైల్లు ఉన్నాయి, references.blg మరియు references.bbl.
09:23 references.blg ఫైల్ లో ఫార్మాటింగ్ సమాచారం ఉంటుంది; దీనిని చూద్దాము.
09:35 ఇది కొన్ని ఫార్మాటింగ్ సమాచారాన్ని కలిగి ఉందని మీరు చూడవచ్చు.
09:39 నన్ను దీని నుండి బయటకు రానివ్వండి.
09:41 మరియు ఈ ఫైల్ bbl కలిగి ఉన్నదాన్ని నన్ను చుడనివ్వండి. అదే References.bbl. కాబట్టి, ఇది గతంలో మనము చూసిన సూచనలు సమాచారం కలిగి ఉంటుంది,.
09:55 References.bbl లో cited referencesను, మనకు చివరగా pdf ఫైలులో వచ్చే క్రమంలో కలిగి ఉంటుంది.
10:07 సాధారణంగా, ఈ ఫైళ్ళను మానవీయంగా మార్చడం లేదా వాటిని చూడటానికి వీలుకాదు.
10:15 చివరి compilation లో, మనము references.bbl కనుగొనబడలేదు అనే హెచ్చరికను పొందుతాము.
10:23 అది మనము references.log ఫైల్ లో చూడవచ్చు. ఇక్కడ ఈ ఫైల్ ను తెరవండి.
10:35 సరే, ఇక్కడ చూద్దాం - ఉదాహరణకు ఇది references.bbl అనే ఫైల్ లేదు అని చెబుతుంది.
10:47 కాబట్టి ఇది మునుపటి compilationలో జరిగింది.
10:55 కాని BibTeX ను ఉపయోగించి,మనము references.bbl ఫైల్ ను సృష్టించాము.
11:01 మళ్ళీ కంపైల్ చేద్దాం.
11:10 ఇప్పుడు హెచ్చరికలు భిన్నంగా ఉంటాయి, అది ‘label’s may have changed’ అని చెప్పవచ్చు.
11:15 వాస్తవానికి, మనము ఈ ఫైల్ను కంపైల్ చేస్తున్నప్పుడు, references.bbl చదవబడుతుంది మరియు ఆ సూచనలు ఇక్కడ లోడ్ అవుతాయి.
11:27 మనము references.bbl లో చూసిన, అదే క్రమం లో ఉంటాయి, .
11:33 ఉదాహరణకు, మీరు ఇప్పుడు చూడవచ్చు.
11:37 ఉదాహరణ చూడండి, మొదటి సూచన "Chang and Pearson", ఇక్కడ కూడా "Chang and Pearson".
11:43 కానీ, ఈ సమాచారం ఇంకా సరైనది కాదు , మనము అప్పుడే వాటిని సరిగ్గా సైటింగ్ చేయలేదు.
11:53 కాబట్టి మనము కంపైల్ చేద్దాము - కాబట్టి ఇది మనము ముందుగా చెప్పినట్లుగా, మీరు దాన్ని మరోసారి కంపైల్ చేస్తే అది సరిగ్గా వస్తుంది.
12:03 మనము దీనిని ఎలా వివరించాలి, references. aux ఫైల్ లను చూద్దాం
12:15 మనము ఇంతకు ముందు కలిగిఉన్న Citation సందేశాలు పాటు, అదనపు సూచనలు కలిగి ఉంటాం
12:25 ఇది bibcite cp82 మరియ ఇంకా చాలా అనిచెబుతుంది.
12:33 ఇది bibliography లో Cp82 లేబుల్తో ఉన్నఅంశం reference 1 అని సూచిస్తుంది.
12:42 కాబట్టి మనము దీనిని ఉదాహరణగా చూడవచ్చు, మనము దీన్ని తెరచి, source file ని మళ్ళీ తెరుద్దాం -
12:52 ఇప్పుడు నన్ను cp82 కోసం వెతకనివ్వండి.
12:56 cp82 ఇక్కడ ఉంది మరియు సంబంధిత సూచన ఇక్కడ ఉంది మరియు ఇది ఈ అనులేఖనలో కనిపిస్తుంది.
13:07 ఇప్పుడు సూచన cp82 అను ఈ సమాచారం, ఐటమ్ నంబర్ 1 గా రిఫరెన్స్ లిస్ట్ లో కనిపిస్తుంది, అది references.aux ఫైల్ లో అందుబాటులో ఉంటుంది.
13:24 కాబట్టి, నేను తిరిగి కంపైల్ చేస్తే, ఇప్పుడు ఈ సమాచారం ఇక్కడ స్వయంచాలకంగా వస్తుంది.
13:41 ఇప్పుడు హెచ్చరికలు పోయాయని కూడా మనం గమనించవచ్చు.
13:47 LaTeX, references.aux నుండి రిఫరెన్స్ నంబర్ సమాచారం తీసుకొని ,source file లో cite కమాండ్ యొక్క లేబుళ్ళకు, అంటే వీటికి కేటాయిస్తుంది.
14:05 రిఫరెన్సులను సూచించే ఫైలు, ref.bib ను ఇప్పుడు చూద్దాము, ఇక్కడకు వద్దాం.
14:17 ref.bib,
14:24 ఈ పేజీ ఎగువకు వెళ్దాం
14:29 Emacs editorలో, మనకు జోండించాలనుకున్న సూచనను ఎంచుకోవడానికి గల, ఎంట్రీ రకాలను ఉపయోగించడానికి అవకాశం ఉంది.
14:36 ఉదాహరణకు, ఎంట్రీ రకాలు అని పిలువబడే ఒక ఉదాహరణ చూద్దాం.
14:50 కాబట్టి, Emacs editor లో, దీనిని సృష్టించడం సాధ్యమవుతుంది, మరియు మీరు ఈ రకం article in journal’ ని ఇన్వొక్ చేసినప్పుడు ,నేను పూరించగల ఒక ఖాళీగా ఉన్న రికార్డు ను పొందాను.
15:09 మీ editor లో ఈ సామర్థ్యం లేకుంటే, కంగారు పడవద్దు మీరు ఈ ఎంట్రీలను మానవీయంగా కుడా సృష్టించవచ్చు.
15:16 ప్రస్తుతానికి నేను దీన్ని చేయాలనుకోవడం లేదు కాబట్టి దీనిని రద్దు చేయనివ్వండి,
15:24 strings ను నిర్వచించడం మరియు ref.bib. ఫైల్ లో వాటిని వేరియబుల్స్ గా ఉపయోగించడం సాధ్యమవుతుంది.
15:33 ఉదాహరణకు, string JWC, John Wiley and Songs Limited, Chichester ను సూచిస్తుంది - ఇది కొన్ని సూచనల లో ఉపయోగించబడినది
15:44 ఉదాహరణకు ఈ సూచన, ప్రతి ప్రస్తావన రికార్డు ప్రారంభంలోనే కనిపించే కీలకమైన పదమును కలిగి ఉంటుంది.
15:52 ఉదాహరణకు, నేను ఈ సూచనను కలిగి ఉన్నాను, ఇది రికార్డు KMM07, ఇది ఇక్కడ కూడా కనిపిస్తుంది. వాస్తవానికి, ఈ కీవర్డ్ ద్వారా నేను ఈ రికార్డును సూచించాను.
16:09 ఇప్పుడు నేను BibTeX ను ఉపయోగించి, వివిధ రకాలైన రెఫరెన్సెస్ ను చూపవచ్చో వివరిస్తాను,
16:21 మనం మార్పులను చేసేముందు, ఇక్కడ సూచనలు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయా? అని చూడండి.
16:29 ఉదాహరణకు, B. C. Chang and Pearson, number 1, ఇది ఇక్కడ కనిపిస్తుంది.
16:37 ప్రస్తావించబడిన మొదటి రిఫరెన్స్ 3, తరువాత 2, తరువాత 11 ఉంది, ఎందుకంటే ఇక్కడ రిఫరెన్స్ లు అక్షరక్రమం లో ఉంటాయి.
16:50 బైబ్లియోగ్రఫీ శైలిని మార్చుదాం, ఇప్పుడు నన్ను ఇది చేయనివ్వండి.
16:59 ఇప్పుడు బైబిలియోగ్రఫీ శైలిని u-n-s-r-t కు తయారు చేద్దాం.ఇది IEEE జర్నల్స్లో ఉపయోగించిన విధంగా క్రమబద్ధీకరించని సూచన జాబితాను అందిస్తుంది.
17:13 ఒకసారి కంపైల్ చేయగా, స్టైల్ సమాచారంతో references.aux అప్డేట్ అవుతుంది.ఇప్పుడు అది u-n-s-r-t ను కలిగి ఉంటుంది.
17:25 BibTeX.references కమాండ్ తో BibTeX ను ఎగ్జిక్యూట్ చేయగా , references.bbl లోసూచన జాబితా సృష్టించబడుతుంది.
17:42 అది references.bbl ను సృష్టించి ఉండేది అని గమనించండి
17:47 కానీ ఇది క్రొత్త శైలి U-n-s-r-t కు అనుగుణంగా ఉంటుంది.
17:52 ఇప్పుడు మనము references.texను కంపైల్ చేద్దాం.
18:02 ఆర్డరింగ్ ఇప్పుడు మారిందని గమనించండి.
18:09 సూచనలు అక్షర క్రమంలో లేవు,
18:16 అయితే లేబుల్లు మార్చబడి ఉండవచ్చు, ఇక్కడ ఇది ఒక ఫిర్యాదు , క్రాస్ రిఫరెన్సులను పొందడానికి మళ్ళీ అమలు చేయండి,
18:24 మనము దీనిని తిరిగి అమలు చేద్దాము, ఇప్పుడు ఆ హెచ్చరిక సందేశం పోయింది మరియు ఇప్పుడు సూచనలు సోర్స్ లో ప్రస్తావించబడిన క్రమంలో ఉన్నాయి అని గమనించండి.
18:40 ఉదాహరణకు, reference 1, మొదట గా reference 2 రెండవదిగా, 3 వ, 4 వ, 5 వ మరియు మిగతావి సూచిస్తాయి.
18:54 కంప్యూటర్ సైన్స్ జర్నల్ల లో అవసరమైన సూచనలు ను ఇప్పుడు మనము సృష్టించాలి.
19:01 మనం ఇక్కడ కు వచ్చి ‘alpha’ అని పిలుస్తాం.
19:07 దీనిని ఒకసారి కంపైల్ చెయ్యనివ్వండి.
19:10 BibTeX ను చేద్దాం;
19:14 మరోసారి దాన్ని కంపైల్ చేద్దాం.
19:17 ఇది మార్చబడింది,కానీ ఇక్కడ సూచనలు మారలేదు
19:21 ఆ లేబుల్లు మార్చినట్లు ఫిర్యాదు వస్తుంది.
19:25 నేను మరోసారి కంపైల్ చేస్తే, ఇది ఖచ్చితంగా అదే
19:30 ఉదాహరణకు, మీకు B C Chang and Pearson అంటే అది ఇక్కడ ఉన్న CP82.
19:41 ఇప్పుడు ఈ ఎంట్రీల referncing కూడా ఇక్కడే ఉంది.
19:56 వెబ్ లో చాలా పెద్ద సంఖ్యలో ఇతర ప్రస్తావన శైలులు ఉన్నాయి
20:01 ifac మరియు రసాయన ఇంజనీరింగ్ జర్నల్ల లో ఉపయోగించిన శైలిని నేను ఇప్పుడు చూపిస్తాను.
20:08 ముందుగా, నేను ఇప్పుడు చూపుతున్న విధంగా ,పాకేజీల కమాండ్ ను ఉపయోగించుటకు Harvard ను జోడించండి.
20:19 శైలిని Ifac కు మార్చండి.
20:28 వీటిని Harvard. sty మరియు ifac.bst. అనే రెండు ఫైళ్ళ ను ఉపయోగించి అమలు చేస్తారు.
20:48 ఈ ఫైళ్ళు వెబ్ లో ఉంటాయి మరియు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
20:53 ఇప్పుడు ఇది కంపైల్ చేద్దాం అంటే pdf-LaTeX-references, BibTeX ను అమలు చేద్దాం.
21:09 దీనిని రెండుసార్లు కంపైల్ చేస్తే,
21:14 ఇక్కడ సూచించినట్లు మనము రిఫరెన్స్ జాబితాను పొందుతాము, ఇక్కడ సూచనలు క్రమ సంఖ్యలను లేకుండా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడతాయి.
21:23 సీరియల్ సంఖ్యలు అదృశ్యమయ్యాయి.
21:25 Referencing అనేది author names ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు, ఇక్కడ Vidyasagar 1985, మరియు సంవత్సరం.
21:39 మనము సూచనలను తరువాత పేజీలో కూడా చూడవచ్చు, ఇది మనకు కావలసినది అది అక్షరక్రమం లో ఉంది.
21:58 ఈ referencing శైలిని ఉపయోగించినప్పుడు, cite ఆదేశం పూర్తి సూచనను బ్రాకెట్లలో ఉంచుతుంది.
22:06 ఉదాహరణకు, source file ను చూడండి
22:12 మనం ఇక్కడున్నాం. ఇక్కడకు రండి. the text book by cite KMM07, the textbook by (Moudgalya, 2007b)ను ఉత్పత్తి చేస్తుంది.
22:27 ఇక్కడ పేరు Moudgalya బ్రాకెట్లలో రాకూడదు, సంవత్సరం మాత్రమే బ్రాకెట్లలో రావాలి.
22:35 ఇది cite-as-noun యొక్క ఆదేశం ను ఉపయోగించి చేస్తాము.
22:43 నన్ను దీనిని సేవ్ చేయ్యనివ్వండి.
22:45 Compile చెయ్యండి.
22:48 ఇది మీకు కావలసినది. ఇక్కడ ఇప్పుడు Moudgalya అనే పేరు బ్రాకెట్లకు వెలుపల కి వచ్చింది, బ్రాకెట్లలో సంవత్సరం మాత్రమే వచ్చింది.
23:00 ఈ సమస్యను cite-as-noun పరిష్కరిస్తుంది. ఇది మనము ఉపయోగించిన cite-as-noun referencing శైలికి ప్రత్యేకమైన ఒక ఆదేశం అని గమనించడం చాలా ముఖ్యం.
23:12 ఇది ఇతర referencing శైలులతో పని చేయకపోవచ్చు
23:16 ముందు చెప్పినట్లుగా, మనకి పెద్ద సంఖ్యలో referencing శైలులు ఉన్నాయి.
23:20 సరియైన స్టైల్ మరియు BST ఫైళ్ళను మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఈ ఉదాహరణలో నేను, Harvard.sty మరియు ifac.bst ఫైళ్ళను ఉపయోగించాను.
23:37 మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, పైన పేర్కొన్న అన్నిటిలో, మనం రిఫెెక్షన్స్ యొక్క డేటాబేస్ ను అంటే ref.bib ను మార్చలేదు.
23:47 ఇది BibTeX యొక్క అనుకూలం.
23:50 సూచనలు జాబితాను రూపొందించడానికి వివరించడం కోసం చాలా సమయాన్ని గడిపినప్పటికీ, వాస్తవానికి తుది వినియోగదారుకు అనుసరించాల్సిన విధానం చాలా సులభం.
24:02 ఒకటి .bib డేటాబేస్ ఫైల్ సృష్టించడం , .sty మరియు .bst ఫైల్స్ ను పొందటం.
24:10 ఇందులో చాలా వరకు ఇప్పటికే మీ installation లో అందుబాటులో ఉండవచ్చు.
24:15 మరొకసారి source file ను కంపైల్ చేసి , pdf LaTeX ను అమలు చేయండి, source file ను మరో రెండుసార్లు కంపైల్ చేయండి.
24:24 ఇది చాలా సరళమైన విధానం అని మీరు అంగీకరిస్తారా?
24:30 అంటే Bibtex మరియు Latex లను మద్దతు చెప్పమని కాదు.
24:35 మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
24:38 విన్నందుకు కృతఙ్ఞతలు..
24:40 అనువదించినది హరికృష్ణ. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india