KTurtle/C3/Programming-Concepts/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:23, 3 March 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:03 కే టర్టల్లోప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -
00:12 కే టర్టల్లో ఒక ప్రొగ్రామ్ ను రాయటం.
00:15 వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం.
00:18 "ప్రింట్" కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం.
00:22 ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం.
00:24 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 11.10
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:37 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org

00:49 కొనసాగించే ముందు, మనము కే టర్టల్యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం.
00:55 టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని "స్ప్రైట్"అని పిలుస్తారు.
01:00 "స్ప్రైట్" అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్.
01:10 "స్ప్రైట్ హైడ్" అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
01:15 ఒకవేళ అది దాచబడితే,"స్ప్రైట్ షో"కమాండ్ టర్టల్ను చూపిస్తుంది.
01:21 "క్లియర్" కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది.
01:27 కే టర్టల్లో,
01:29 "$" (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్.
01:34 "*" (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది.
01:41 "^" (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది.
01:45 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
01:50 "sqrt" అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి.
01:58 కొత్తకే టర్టల్ అప్లికేషన్ తెరుద్దాం.
02:02 డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి.
02:07 type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి.
02:13 కే టర్టల్ అప్లికేషన్ తెరుచుకుంటుంది.
02:20 మనము కే టర్టల్ నుటెర్మినల్ఉపయోగించి కూడా తెరువవచ్చు.
02:24 Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి.
02:30 kturtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది.
02:41 నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను.
02:46 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
02:55 #program to find square of a number ఎంటర్ నొక్కండి.
03:15 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
03:19 అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి.
03:29 రిసెట్
03:30 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి.
03:38 $i= ask డబుల్ కోట్స్ లో"enter a number for i and click OK".
03:58 "$i" అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్
04:03 “ask” కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది.ఎంటర్నొక్కండి.
04:11 “ఫాంట్ సైజ్” స్పేస్ 28.
04:17 fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
04:20 ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది.
04:27 print $i*$i
04:36 print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. Enter నొక్కండి.
04:45 spritehide
04:48 spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
04:53 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
04:56 ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్నRun బటన్ పై క్లిక్ చేయండి.
05:03 ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది.
05:07 ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
05:10 ఫుల్ స్పీడ్,

స్లో, స్లొవర్, స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్.

05:17 నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను.
05:21 ఒక input bar కనిపిస్తుంది.
05:23 'i' కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
05:29 15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
05:35 ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం.
05:42 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
05:46 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
05:56 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి
06:03 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
06:07 ప్రోగ్రామ్ ను వివరిస్తాను.

.

06:09 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
06:13 reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
06:18 $i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్.
06:25 “ask” కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది.
06:31 fontsize28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
06:37 ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని,పిక్సల్స్ లో సర్దుతుంది.
06:43 print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది.
06:52 "స్ప్రైట్ హైడ్" ,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
06:57 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
07:00 'i' కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
07:05 'n' కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
07:18 తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం.
07:27 నేను కోడ్ ని టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
07:35 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి.
07:43 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
07:49 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
07:52 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
07:57 reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
08:02 $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్.
08:07 fontsize28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
08:12 print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది.
08:19 spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
08:24 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
08:28 'i' కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
08:34 169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
08:39 మళ్ళీrun చేద్దాం.
08:42 'i' కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
08:49 ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ "nan". అంటే "not a number"(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం.
08:56 ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు.
09:02 తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం.
09:08 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
09:19 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి
09:25 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
09:31 ప్రోగ్రామ్ ను వివరిస్తాను.
09:35 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
09:38 దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment.
09:42 ప్రతి కామెంట్ కి ముందు ఒక '#' చిహ్నం తప్పక ఉంటుంది.
09:48 reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
09:53 $i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్.
09:59 $C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది.
10:07 fontsize28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
10:13 print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది.
10:19 spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
10:23 ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం.
10:27 'i' కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
10:34 343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
10:40 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:43 సారాంశం చూద్దాం.
10:46 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి.
10:49 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ (కార్యక్రమం భావనలు)
10:52 "Sqrt" ఫంక్షన్ యొక్క ఉపయోగం.
10:55 "print" కమాండ్ యొక్క ఉపయోగం.
10:57 కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం.
11:02 ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి:
11:08 ఒక సంఖ్య యొక్క ఘనం
11:11 ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి.
11:15 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

11:19 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
11:22 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
11:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
11:29 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
11:32 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:35 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

11:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:48 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:55 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

11:59 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya