KTurtle/C3/Programming-Concepts/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0001 అందరికి నమస్కారం.
0003 KTurtle లో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
0008 ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -
0012 KTurtleలో ఒక ప్రొగ్రామ్ ను రాయటం.
0015 వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం.
0018 ప్రింట్ కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం.
0022 ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం.
0024 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
0037 మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
0043 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http//spoken-tutorial.org
0049 కొనసాగించే ముందు, మనము KTurtle యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం.
0055 టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని స్ప్రైట్ అని పిలుస్తారు.
0100 స్ప్రైట్ అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్.
0110 స్ప్రైట్ హైడ్ అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
0115 ఒకవేళ అది దాచబడితే,స్ప్రైట్ షోకమాండ్ టర్టల్ను చూపిస్తుంది.
0121 క్లియర్ కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది.
0127 KTurtleలో,
0129 $ (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్.
0134 * (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది.
0141 ^ (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది.
0145 # హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
0150 sqrt అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి.
0158 కొత్త KTurtle అప్లికేషన్ తెరుద్దాం.
0202 డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి.
0207 type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి.
0213 KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది.
0220 మనము కే టర్టల్ ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరువవచ్చు.
0224 Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి.
0230 kturtle అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. KTurtle అప్లికేషన్ తెరుచుకుంటుంది.
0241 నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను.
0246 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
0255 #program to find square of a number ఎంటర్ నొక్కండి.
0315 # హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
0319 అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి.
0329 రిసెట్
0330 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి.
0338 $i= ask డబుల్ కోట్స్ లో enter a number for i and click OK.
0358 $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్
0403 ask కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. ఎంటర్ నొక్కండి.
0411 ఫాంట్ సైజ్ స్పేస్ 28.
0417 fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
0420 ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది.
0427 print $i*$i
0436 print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. ఎంటర్ నొక్కండి.
0445 spritehide
0448 spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
0453 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
0456 ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న Run బటన్ పై క్లిక్ చేయండి.
0503 ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది.
0507 ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
0510 ఫుల్ స్పీడ్,స్లో,స్లొవర్,స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్.
0517 నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను.
0521 ఒక input bar కనిపిస్తుంది.
0523 i కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
0529 15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
0535 ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం.
0542 నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
0546 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
0556 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
0603 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
0607 ప్రోగ్రామ్ ను వివరిస్తాను.
0609 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
0613 reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
0618 $i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్.
0625 ask కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది.
0631 fontsize 28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
0637 ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది.
0643 print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది.
0652 స్ప్రైట్ హైడ్, టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
0657 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
0700 i కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
0705 n కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
0718 తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం.
0727 నేను కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
0735 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
0743 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
0749 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
0752 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
0757 reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
0802 $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్.
0807 fontsize 28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
0812 print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది.
0819 spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
0824 ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం.
0828 i కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
0834 169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
0839 మళ్ళీrun చేద్దాం.
0842 i కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి.
0849 ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ nan. అంటే not a number(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం.
0856 ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు.
0902 తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం.
0908 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
0919 దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
0925 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
0931 ప్రోగ్రామ్ ను వివరిస్తాను.
0935 # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
0938 దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment.
0942 ప్రతి కామెంట్ కి ముందు ఒక # చిహ్నం తప్పక ఉంటుంది.
0948 reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
0953 $i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్.
0959 $C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది.
1007 fontsize 28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది.
1013 print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది.
1019 spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది.
1023 ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం.
1027 i కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
1034 343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
1040 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
1043 సారాంశం చూద్దాం.
1046 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి.
1049 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్
1052 Sqrt ఫంక్షన్ యొక్క ఉపయోగం.
1055 print కమాండ్ యొక్క ఉపయోగం.
1057 కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం.
1102 ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి
1108 ఒక సంఖ్య యొక్క ఘనం
1111 ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి.
1115 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http//spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
1119 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
1122 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
1127 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
1129 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
1132 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
1135 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండిcontact@spoken-tutorial.org
1144 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
1148 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
1155 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది http//spoken-tutorial.org/NMEICT-Intro
1159 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya