Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-adolescents/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 22:01, 21 December 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 కౌమారదశలో ఉన్నవారి కొరకు శాఖాహార వంటకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి :( యవ్వనదశ) కౌమారదశ అంటే ఏమిటి?
00:09 కౌమారదశలో ఉన్నపుడు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు
00:12 కౌమారదశలో ఉన్నవారి కొరకు ఇటువంటి శాఖాహార వంటకాలను ఎలా తయారు చేయాలి:

సోయాబీన్ కట్లెట్,

00:18 జొన్నలు మరియు టమోటాల తో అట్టు,
00:20 వేరుశెనగల కూర,

సజ్జలు చిరుధాన్యాలు ఇంకా జొన్నలు కూరగాయలతో ఖిచిడీ మరియు

00:24 లోపల ఏదయినా నింపి చేసిన పరాటాలతో నువ్వుల పచ్చడి (చట్నీ)
00:28 ముందుగా, మనం కౌమారదశ యొక్క కాలం ఏమిటో అర్థం చేసుకుందాం?
00:32 కౌమారదశ అంటే బాల్యం నుండి యుక్తవయస్సు వరకు మారే కాలం.
00:37 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల వారిని కౌమారదశగా పరిగణిస్తారు.
00:42 ఈ సమయంలో శారీరక, లైంగిక, మానసిక మరియు సామాజిక అభివృద్ధి మార్పులు ఉంటాయి.
00:49 ఇప్పుడు, మనం కౌమారదశ సమయంలో పోషకాహార అవసరాలు పెరగడానికి గల కారణాలను పరిశీలిద్దాం.
00:55 మొదటిది, ఎత్తు మరియు బరువు వంటి శారీరక పెరుగుదలలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది.
00:59 రెండవది, అనారోగ్యం మరియు గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాల సహాయాన్ని అందించడం కోసం.
01:06 ఈ సమయంలో, కౌమారదశలో ఉన్న వారిలో, ఒత్తిడి, ఆందోళన మరియు మానసిక స్థితి వంటి భావోద్వేగ మార్పులు కూడా సంభవించవచ్చు.
01:15 అలాగే, కౌమారదశలో ఉన్నపుడు సామాజిక అభివృద్ధి మార్పులూ ఉంటాయి.
01:20 ఉదాహరణకు, వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి.
01:25 వారి ఆహార ఎంపికలు అనేవి వారి స్నేహితులు ఇష్టపడే లేదా ఇష్టపడని వాటి ద్వారా ప్రభావితంకావొచ్చు.
01:29 అందువలన, ఈ అభివృద్ధి మార్పులకు సహాయంగా మంచి పోషణ అనేది ముఖ్యం.
01:35 కౌమారదశలో ఉన్న ఆడవారికి రోజుకు 2000-2400 కేలరీలు మరియు 40-55 గ్రాముల ప్రోటీన్ అవసరం.
01:43 కౌమారదశలోని వారికోసం కొన్ని ఆరోగ్యకరమైన శాఖాహార వంటకాలను మనం చూద్దాం.
01:47 మనం ప్రారంభించడానికి ముందు, ఈ ట్యుటోరియల్‌లో వివరించబడిన అన్ని వంటకాల్లో, 1 కప్పు అంటే 250 మిల్లీలీటర్లకు సమానం అని గమనించండి.
01:55 మన మొదటి వంటకం సోయాబీన్ కట్లెట్ :
01:58 దీన్ని తయారుచేయడానికి, మీకు కావాల్సిన పదార్దాలు:

సోయాబీన్స్ ¼ కప్పు, శనగపప్పు ¼ కప్పు,

02:04 బీట్‌రూట్ సగం,

ఉడికించిన బఠానీలు ¼ కప్పు,

02:07 వేరుశెనగ పొడి 2 టేబుల్ స్పూన్ లు,

శనగపిండి 1 టీస్పూన్,

02:11 ధనియాలపొడి 1 టీస్పూన్,

ఎర్ర కారం పొడి ½ టీస్పూన్,

02:16 ఎండు మామిడి పొడి ½ టీస్పూన్,

రుచికి సరిపడా ఉప్పు,

02:20 మునగాకుల పొడి 1 టీస్పూన్,

నువ్వులు 2 టీస్పూన్ లు, నూనె 1 టీస్పూన్.

02:26 ప్రారంభించడానికి,మొదట మనం సోయాబీన్స్ ను మొలకలు చేస్తాము.:

సోయాబీన్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

02:32 అదనంగా ఉన్న నీటిని తొలగించడానికి,వాటిని స్ట్రైనర్‌లో వేసి ఉంచండి.
02:35 సోయాబీన్లను వెలుతురు తగలకుండా చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచండి.
02:40 మొలకలు కనిపించే వరకు సోయాబీన్స్‌ను ప్రతిరోజూ 2-3 సార్లు కడగాలి.

ఇది సోయాబీన్స్ పాడవ్వకుండా చేస్తుంది.

02:49 సోయాబీన్స్ మొలకెత్తడానికి 3-4 రోజులు పట్టవచ్చు.
02:53 ఇప్పుడు, శనగపప్పును రాత్రంతా నానబెట్టండి.
02:56 మరుసటి రోజు స్ట్రైనర్‌లో వడకట్టండి.
02:58 ప్రెజర్ కుక్కర్‌లో, శనగపప్పు ఇంకా మొలకెత్తిన సోయాబీన్స్‌ను కలిపి ఉడికించాలి.
03:03 ఒక కప్పు నీరు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.

చల్లారిన తరువాత, సోయాబీన్స్ ఇంకా శనగపప్పును కలిపి ఒక చిక్కటి ముద్దలాగా తయారు చేయండి.

03:12 ఇప్పుడు మునగఆకుల పొడిని తయారుచేయడానికి:

సన్ననివేడి మీద మునగాకులను వేయించుకోవాలి.

03:17 దానిని చల్లారనిచ్చి మిక్సర్ లేదా గ్రైండర్ ఉపయోగించి పొడి తయారు చేసుకోండి.
03:22 కట్లెట్ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి-

ఒక గిన్నెలో సోయాబీన్స్, శనగపప్పు ముద్దని తీసుకోండి.

03:28 తురిమిన బీట్‌రూట్ ను, ఉడికించిన బఠానీలను వేయండి.

ఇప్పుడు వేరుశెనగ పొడి, శనగపిండి ఇంకా మునగఆకుల పొడిని కలపండి.

03:35 మిగిలిన మసాలాలను కూడా వేసి బాగా కలపండి.
03:38 తరువాత ఆ ముద్దతో చిన్న రౌండ్ కట్లెట్లను తయారు చేయండి.

కట్లెట్లను అన్ని వైపులా నువ్వుల గింజలతో సమానంగా కోట్ చేయండి.

03:45 ఇప్పుడు, ఒక పాన్ లో నూనె వేడి చేసి, కట్లెట్స్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.

సోయాబీన్ కట్లెట్ సిద్ధంగా ఉంది.

03:51 ఈ వంటకం లో:

ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ,ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి

03:57 మనం తరువాతి వంటకం జొన్నలు మరియు టొమాటో తోచేసే (దోశ) అట్టు కు వెళ్దాం.
04:01 ఈ వంటకం కోసం, మనకు కావాల్సినవి: 1/2 కప్పు మొలకెత్తిన జొన్నలు,

2 టేబుల్ స్పూన్ ల శనగపిండి, 1 టీస్పూన్ మునగఆకుల పొడి,

04:09 1 టొమాటో మరియు సగం ఉల్లిపాయ,

1 టేబుల్ స్పూన్ పెరుగు,

04:12 ½ టీస్పూన్ ఎర్ర కారం పొడి,

½ టీస్పూన్ ధనియాల పొడి,

04:16 ½ టీస్పూన్ పసుపు పొడి,

రుచికి తగినంత ఉప్పు,

04:19 1 teaspoon నూనె.
04:21 ఆకు పొడిని తయారుచేసే విధానం ఇదే ట్యుటోరియల్‌లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి.
04:27 మొదట మనం మొలకెత్తినజొన్న లను ఉపయోగించి జొన్న పొడిని తయారు చేస్తాము.
04:31 మొలకెత్తిన జొన్నలను ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఆరబెట్టండి.
04:34 ఇప్పుడు వాటిని పూర్తిగా ఆరిపోయే వరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
04:38 తరువాత, రోట్లో లేదా మిక్సీ లో వాటిని పొడి చేయండి.
04:42 ఇప్పుడు, తయారుచేయడం ప్రారంభిద్దాం:

ఒక బౌల్ లో జొన్న పొడి ఇంకా శనగపిండి ని తీసుకోండి.

04:48 మిగిలిన అన్ని పదార్థాలు, మసాలాలు వేసి కలపండి ఇంకా కొద్దికొద్దిగా నీటిని పోస్తూ బాగా కలపండి.
04:53 పిండి చిక్కగా అట్టు పోసుకునేలా ఉండాలి.
04:56 ఒక పాన్ వేడి చేసి నూనెతో గ్రీజు చేయాలి.
04:58 పాన్ మీద ఒక గరిట పిండిని పోసి గుండ్రంగా తిప్పుతూ అట్టులా పరచండి.
05:03 అట్టును మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
05:07 జొన్న అట్టు సిద్ధంగా ఉంది.
05:09 జొన్నలు, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్ యొక్క ఒక మంచి వనరు.
05:14 ఒకవేళ జొన్నపిండి అందుబాటులో లేకపోతే మీరు వీటిని ఉపయోగించవచ్చు-

రాగి పిండి లేదా సజ్జల పిండి లేదా తోటకూర గింజల పిండి(అమరాన్త్ పౌడర్)

05:22 (చీలా) ఈ అట్టును వీటితో తినవచ్చు

రాచ ఉసిరి పచ్చడి, కొబ్బరి పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ, టొమాటో పచ్చడి లేదా పెరుగు.

05:30 రాచఉసిరి కాయలు, నిమ్మకాయలు, టొమాటోలు, (గువా) జామపళ్ళు, నారింజ పళ్ళు ఇవన్నీ విటమిన్ సి యొక్క మంచి వనరులు.
05:37 మీ భోజనంతో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.ఇది శరీరంలో ఐరన్ గ్రహించడాన్ని పెంచుతుంది.
05:43 మగవారితో పోలిస్తే కౌమారదశలో ఉన్న ఆడవారిలో నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా ఐరన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.
05:50 మనం మన తరువాతి వంటకమైన వేరుశెనగల కూరకు వెళ్దాం.
05:53 ఈ వంటను తయారు చేయడానికి, మీకు కావాల్సినవి:

½ కప్పు వేరుశెనగలు, ½ కప్పు బీరకాయ ముక్కలు,

05:58 1 మీడియం సైజు ఉల్లిపాయ,

1 చిన్న టమోటా, 4-5 కొబ్బరి ముక్కలు,

06:04 ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,

½ టీస్పూన్ ఎర్ర కారం పొడి,

06:08 ½ టీస్పూన్ ధనియాలపొడి,

½ టీస్పూన్ పసుపు పొడి,

06:12 ½ టీస్పూన్ జీలకర్ర,

రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ నూనె.

06:18 తయారుచేసేవిధానం: మొదట వేరుశెనగలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
06:21 ఇప్పుడు వాటిని ప్రెజర్ కుక్కర్ లో 1 కప్పు నీరుపోసి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
06:25 ఈలోగా ఉల్లిపాయ, టమోటా, కొబ్బరి ముక్కలను రుబ్బుకుని చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి.
06:30 ఒక వంట పాత్రలో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.

ఇప్పుడు దాంట్లో రుబ్బిపెట్టుకున్న పేస్ట్ ను వేయండి.

06:37 బీరకాయ ముక్కలు ఇంకా మిగిలిన మసాలాలు అన్నీ వేయండి.

2 నిమిషాలు వేయించండి.

06:42 వంట పాత్రలో ఉడికించిన వేరుశెనగలను వేయండి.
06:45 ఇప్పుడు గ్రేవీ చేయడానికి అరకప్పు నీరుపోసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.

వేరుశెనగల కూర సిద్ధమైనది.

06:53 ఒకవేళ వేరుశెనగ లు అందుబాటులో లేకపోతే, మీరు వీటిని కూడా ఉపయోగించవచ్చు:

కాబూలీ శనగలు, కొమ్ము శనగలు, రాజ్మా, జీడిపప్పు.

07:02 ఇంకా ఒకవేళ బీరకాయ అందుబాటులో లేనట్లయితే మీరు వీటిని ఉపయోగించవచ్చు:

గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయలు లేదా క్యాప్సికమ్.

07:09 వేరుశెనగలలో మంచి నాణ్యమైన కొవ్వులు ఉంటాయి.
07:12 అవి కూడా: ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన వనరులు.
07:19 గింజలు మరియు చిక్కుళ్ళు కూడా ఫోలేట్ ను కలిగి ఉంటాయి.
07:22 కౌమారదశలో తగినంత ఫోలేట్ అనేది గర్భధారణ సమయంలో బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
07:28 తరువాత మనం సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో ఖిచ్డి చేయడాన్నినేర్చుకుంటాము.
07:33 ఈ వంటకాన్ని తయారుచేయడానికి మీరు-

తోటకూర గింజలు లేదా అరికెలు లేదా రాగులు లేదా కొర్రలను కలయికలో ఉపయోగించవచ్చు.

07:41 ఈ రెసిపీకి చేయడానికి కావాల్సిన పదార్థాలు:

సజ్జలు ⅓ కప్పు, జొన్నలు ⅓ కప్పు,

07:46 పెసరపప్పు ⅓ కప్పు,

1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు,

07:49 క్యారెట్లు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు వంటి కూరగాయలన్ని కలిసిన ముక్కలు ½ కప్పు,

మీడియం సైజు ఉల్లిపాయ సగం,

07:56 1 టీస్పూన్ జీలకర్ర,

1 టీస్పూన్ కరివేపాకు పొడి,

07:59 1టీస్పూన్ ధనియాలపొడి,

½ టీస్పూన్ పసుపు పొడి,

08:04 రుచికి సరిపడా ఉప్పు,

1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి.

08:07 ఆకు పొడిని తయారుచేసే విధానం ఇదే ట్యుటోరియల్‌లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి.
08:12 తయారీవిధానం: మొదట, సజ్జలు మరియు జొన్నలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
08:17 మరుసటి రోజు ఉదయం వాటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
08:20 ప్రెజర్ కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి.

దాంట్లో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి.

08:25 కూరగాయల ముక్కలు, మసాలాలు, ఉప్పు వేసి బాగా కలపండి.
08:29 దాన్ని 2 నిముషాలు వేయించండి.

కుక్కర్ లో సజ్జలు, జొన్నలు ఇంకా పెసరపప్పు వేయండి.

08:35 ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టండి.
08:38 3 విజిల్స్ వచ్చేవరకు పెద్ద మంట పైన ఉడికించాలి.
08:41 తరువాత చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి.
08:44 సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో ఖిచ్డి సిద్ధంగా ఉంది.
08:47 ఈ రెసిపీలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ అధికంగా ఉన్నాయి.
08:53 ఇప్పుడు మనం మన చివరి వంటకం నువ్వుల పచ్చడితో, లోపల ఏదయినా నింపి చేసే పరాటాలకు వచ్చాము
08:59 ఈ వంటని తయారుచేయడానికి, మీకు కావాల్సిన పదార్దాలు:

గోధుమపిండి 1 కప్పు, కొమ్ముశనగలు ½ కప్పు,

09:05 మీడియం సైజు ఉల్లిపాయ సగం,

½ టీస్పూన్ వాము,

09:08 1 టీస్పూన్ అవిసె గింజల పొడి,

½ టీస్పూన్ ఎండు మామిడి పొడి,

09:13 ½ టీస్పూన్ ధనియాల పొడి,

¼ టీస్పూన్ ఎర్ర కారం పొడి,

09:17 1నిమ్మకాయ,

ఉప్పు రుచికి సరిపడా, 2 టీ స్పూన్ల నూనె లేదా 2 టీ స్పూన్ల నెయ్యి.

09:23 మొదట మనం వేయించిన కొమ్ముశనగ ల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఒక పాన్ ను వేడిచేసి కొమ్ముశనగలను 2-3 నిమిషాలు వేయించుకోవాలి.

09:30 మాడిపోకుండా ఉండడానికి దానిని ఆపకుండా కలుపుతూ ఉండాలి.

అది వేగిన తర్వాత,చల్లారడానికి ఒక పక్కన పెట్టండి.

09:36 ఇప్పుడు, వేపిన కొమ్ముశనగలును గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేయాలి.
09:40 ఇప్పుడు ఫిల్లింగ్ (లోపల నింపేది) ను సిద్ధం చేయడానికి:

మొదట వేపిన కొమ్ముశనగ ల పిండిని మరియు తరిగిన ఉల్లిపాయల ముక్కలను కలపండి.

09:46 ఇప్పుడు అందులో ఎర్ర కారం పొడి, ఎండు మామిడి పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
09:52 ఫిల్లింగ్ ను ముద్దగాచేయడానికి కొంచెం నిమ్మరసం కొంచం నీళ్లు వేయండి.
09:55 మనం పరాటా ని ఎలా తయారుచేయాలో చూద్దాం.
09:58 గోధుమ పిండిని మరో గిన్నెలో తీసుకొని అందులో అవిసె గింజలు, వాము ఇంకా ఉప్పు వేయండి.
10:03 అవసరమైనంత నీళ్లు పోసి పిండిని మృదువుగా ఉండే ముద్దలా కలపండి.
10:07 ఇప్పుడు ఆ ముద్దని ఉండలు చేయండి.
10:09 పరాఠాలను చేయడానికి ముద్దని కొంచం వత్తి కొంచం ఫిల్లింగ్ ను తీసుకుని మధ్యలో పెట్టండి.
10:13 ముద్దలను సమంగా చేయడానికి ఫిల్లింగ్‌ను సరిగ్గా మడవండి.
10:17 ఇప్పుడు పరాఠా చేయడానికి దాన్ని మళ్ళీ వత్తండి.
10:20 పాన్ వేడిచేసి పరాటాను రెండువైపులా బాగా కాల్చాలి.

స్టఫ్డ్ పరాతా(లోపల నింపిచేసిన) సిద్ధంగా ఉంది.

10:25 ఫిల్లింగ్ కోసం, ఒకవేళ వేపిన కొమ్ముశనగలు అందుబాటులో లేకపోతే, మీరు వీటిని ఉపయోగించవచ్చు:
10:29 ఉడికించిన శనగపప్పును లేదా ఉడికించిన మొలకెత్తిన పెసలు,
10:34 పరాటాను నువ్వుల పచ్చడితో వడ్డించవచ్చు.
10:38 నువ్వుల పచ్చడి తయారీకి మీకు కావాల్సినవి:

¼కప్పు నువ్వులు,

10:42 1 టేబుల్ స్పూన్ శనగపప్పు,

4-5 తాజా కొబ్బరి ముక్కలు, చింతపండు 3-5 బొట్టలు,

10:49 1 ఎండు మిరపకాయ,

2-3 తెల్లుల్లీ రెబ్బలు,

10:52 1 టీ స్పూన్ జీలకర్ర,

రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె.

10:57 తయారీవిధానం: ఒక పాన్ లో నూనె వేసి వేడిచేయండి.
11:00 నువ్వులు, శనగపప్పు, వెల్లుల్లి, కొబ్బరిముక్కలు, ఎండుమిరపకాయ ఇంకా జీలకర్ర అన్ని వేసి వేయించండి.

దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి.

11:07 స్టవ్ మీదనుండి దించిన తర్వాత ఉప్పు ఇంకా చింతపండు వేయండి.

వీటన్నిటిని కలిపి రుబ్బండి.

11:14 మెత్తని పేస్ట్ లాగా చేయడానికి సగం కప్పు నీళ్లు వేయండి.

నువ్వుల పచ్చడి సిద్ధంగా ఉంది.

11:19 ఈ వంటకంలో:

ప్రోటీన్లు, కాల్షియం,మెగ్నీషియం, జింక్ మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉన్నాయి.

11:25 ఈ పోషకాలు కండరాల మరియు అస్థిపంజర అభివృద్ధికి సహాయపడతాయి.
11:29 చిన్న వయస్సు నుండే ఆహారం ద్వారా తగినంత కాల్షియం పొందడం అనేది చాలా ముఖ్యం.
11:34 కాల్షియం యొక్క లోపం తరువాతి దశలలో ఆడవారిలో (ఆస్టియోపొరోసిస్) బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.
11:40 ఈ ట్యుటోరియల్‌లోని అన్ని వంటకాలలో కౌమారదశలో తగినంత పెరుగుదల ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
11:47 కౌమారదశ కొరకు శాఖాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి ఇది మనలను తీసుకువస్తుంది.

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya