Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-adolescents/Telugu
|
|
00:01 | కౌమారదశలో ఉన్నవారి కొరకు శాఖాహార వంటకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి :( యవ్వనదశ) కౌమారదశ అంటే ఏమిటి? |
00:09 | కౌమారదశలో ఉన్నపుడు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు |
00:12 | కౌమారదశలో ఉన్నవారి కొరకు ఇటువంటి శాఖాహార వంటకాలను ఎలా తయారు చేయాలి:
సోయాబీన్ కట్లెట్, |
00:18 | జొన్నలు మరియు టమోటాల తో అట్టు, |
00:20 | వేరుశెనగల కూర,
సజ్జలు చిరుధాన్యాలు ఇంకా జొన్నలు కూరగాయలతో ఖిచిడీ మరియు |
00:24 | లోపల ఏదయినా నింపి చేసిన పరాటాలతో నువ్వుల పచ్చడి (చట్నీ) |
00:28 | ముందుగా, మనం కౌమారదశ యొక్క కాలం ఏమిటో అర్థం చేసుకుందాం? |
00:32 | కౌమారదశ అంటే బాల్యం నుండి యుక్తవయస్సు వరకు మారే కాలం. |
00:37 | 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల వారిని కౌమారదశగా పరిగణిస్తారు. |
00:42 | ఈ సమయంలో శారీరక, లైంగిక, మానసిక మరియు సామాజిక అభివృద్ధి మార్పులు ఉంటాయి. |
00:49 | ఇప్పుడు, మనం కౌమారదశ సమయంలో పోషకాహార అవసరాలు పెరగడానికి గల కారణాలను పరిశీలిద్దాం. |
00:55 | మొదటిది, ఎత్తు మరియు బరువు వంటి శారీరక పెరుగుదలలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది. |
00:59 | రెండవది, అనారోగ్యం మరియు గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాల సహాయాన్ని అందించడం కోసం. |
01:06 | ఈ సమయంలో, కౌమారదశలో ఉన్న వారిలో, ఒత్తిడి, ఆందోళన మరియు మానసిక స్థితి వంటి భావోద్వేగ మార్పులు కూడా సంభవించవచ్చు. |
01:15 | అలాగే, కౌమారదశలో ఉన్నపుడు సామాజిక అభివృద్ధి మార్పులూ ఉంటాయి. |
01:20 | ఉదాహరణకు, వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. |
01:25 | వారి ఆహార ఎంపికలు అనేవి వారి స్నేహితులు ఇష్టపడే లేదా ఇష్టపడని వాటి ద్వారా ప్రభావితంకావొచ్చు. |
01:29 | అందువలన, ఈ అభివృద్ధి మార్పులకు సహాయంగా మంచి పోషణ అనేది ముఖ్యం. |
01:35 | కౌమారదశలో ఉన్న ఆడవారికి రోజుకు 2000-2400 కేలరీలు మరియు 40-55 గ్రాముల ప్రోటీన్ అవసరం. |
01:43 | కౌమారదశలోని వారికోసం కొన్ని ఆరోగ్యకరమైన శాఖాహార వంటకాలను మనం చూద్దాం. |
01:47 | మనం ప్రారంభించడానికి ముందు, ఈ ట్యుటోరియల్‌లో వివరించబడిన అన్ని వంటకాల్లో, 1 కప్పు అంటే 250 మిల్లీలీటర్లకు సమానం అని గమనించండి. |
01:55 | మన మొదటి వంటకం సోయాబీన్ కట్లెట్ : |
01:58 | దీన్ని తయారుచేయడానికి, మీకు కావాల్సిన పదార్దాలు:
సోయాబీన్స్ ¼ కప్పు, శనగపప్పు ¼ కప్పు, |
02:04 | బీట్‌రూట్ సగం,
ఉడికించిన బఠానీలు ¼ కప్పు, |
02:07 | వేరుశెనగ పొడి 2 టేబుల్ స్పూన్ లు,
శనగపిండి 1 టీస్పూన్, |
02:11 | ధనియాలపొడి 1 టీస్పూన్,
ఎర్ర కారం పొడి ½ టీస్పూన్, |
02:16 | ఎండు మామిడి పొడి ½ టీస్పూన్,
రుచికి సరిపడా ఉప్పు, |
02:20 | మునగాకుల పొడి 1 టీస్పూన్,
నువ్వులు 2 టీస్పూన్ లు, నూనె 1 టీస్పూన్. |
02:26 | ప్రారంభించడానికి,మొదట మనం సోయాబీన్స్ ను మొలకలు చేస్తాము.:
సోయాబీన్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. |
02:32 | అదనంగా ఉన్న నీటిని తొలగించడానికి,వాటిని స్ట్రైనర్‌లో వేసి ఉంచండి. |
02:35 | సోయాబీన్లను వెలుతురు తగలకుండా చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచండి. |
02:40 | మొలకలు కనిపించే వరకు సోయాబీన్స్‌ను ప్రతిరోజూ 2-3 సార్లు కడగాలి.
ఇది సోయాబీన్స్ పాడవ్వకుండా చేస్తుంది. |
02:49 | సోయాబీన్స్ మొలకెత్తడానికి 3-4 రోజులు పట్టవచ్చు. |
02:53 | ఇప్పుడు, శనగపప్పును రాత్రంతా నానబెట్టండి. |
02:56 | మరుసటి రోజు స్ట్రైనర్‌లో వడకట్టండి. |
02:58 | ప్రెజర్ కుక్కర్‌లో, శనగపప్పు ఇంకా మొలకెత్తిన సోయాబీన్స్‌ను కలిపి ఉడికించాలి. |
03:03 | ఒక కప్పు నీరు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.
చల్లారిన తరువాత, సోయాబీన్స్ ఇంకా శనగపప్పును కలిపి ఒక చిక్కటి ముద్దలాగా తయారు చేయండి. |
03:12 | ఇప్పుడు మునగఆకుల పొడిని తయారుచేయడానికి:
సన్ననివేడి మీద మునగాకులను వేయించుకోవాలి. |
03:17 | దానిని చల్లారనిచ్చి మిక్సర్ లేదా గ్రైండర్ ఉపయోగించి పొడి తయారు చేసుకోండి. |
03:22 | కట్లెట్ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి-
ఒక గిన్నెలో సోయాబీన్స్, శనగపప్పు ముద్దని తీసుకోండి. |
03:28 | తురిమిన బీట్‌రూట్ ను, ఉడికించిన బఠానీలను వేయండి.
ఇప్పుడు వేరుశెనగ పొడి, శనగపిండి ఇంకా మునగఆకుల పొడిని కలపండి. |
03:35 | మిగిలిన మసాలాలను కూడా వేసి బాగా కలపండి. |
03:38 | తరువాత ఆ ముద్దతో చిన్న రౌండ్ కట్లెట్లను తయారు చేయండి.
కట్లెట్లను అన్ని వైపులా నువ్వుల గింజలతో సమానంగా కోట్ చేయండి. |
03:45 | ఇప్పుడు, ఒక పాన్ లో నూనె వేడి చేసి, కట్లెట్స్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.
సోయాబీన్ కట్లెట్ సిద్ధంగా ఉంది. |
03:51 | ఈ వంటకం లో:
ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ,ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి |
03:57 | మనం తరువాతి వంటకం జొన్నలు మరియు టొమాటో తోచేసే (దోశ) అట్టు కు వెళ్దాం. |
04:01 | ఈ వంటకం కోసం, మనకు కావాల్సినవి: 1/2 కప్పు మొలకెత్తిన జొన్నలు,
2 టేబుల్ స్పూన్ ల శనగపిండి, 1 టీస్పూన్ మునగఆకుల పొడి, |
04:09 | 1 టొమాటో మరియు సగం ఉల్లిపాయ,
1 టేబుల్ స్పూన్ పెరుగు, |
04:12 | ½ టీస్పూన్ ఎర్ర కారం పొడి,
½ టీస్పూన్ ధనియాల పొడి, |
04:16 | ½ టీస్పూన్ పసుపు పొడి,
రుచికి తగినంత ఉప్పు, |
04:19 | 1 teaspoon నూనె. |
04:21 | ఆకు పొడిని తయారుచేసే విధానం ఇదే ట్యుటోరియల్‌లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి. |
04:27 | మొదట మనం మొలకెత్తినజొన్న లను ఉపయోగించి జొన్న పొడిని తయారు చేస్తాము. |
04:31 | మొలకెత్తిన జొన్నలను ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఆరబెట్టండి. |
04:34 | ఇప్పుడు వాటిని పూర్తిగా ఆరిపోయే వరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి. |
04:38 | తరువాత, రోట్లో లేదా మిక్సీ లో వాటిని పొడి చేయండి. |
04:42 | ఇప్పుడు, తయారుచేయడం ప్రారంభిద్దాం:
ఒక బౌల్ లో జొన్న పొడి ఇంకా శనగపిండి ని తీసుకోండి. |
04:48 | మిగిలిన అన్ని పదార్థాలు, మసాలాలు వేసి కలపండి ఇంకా కొద్దికొద్దిగా నీటిని పోస్తూ బాగా కలపండి. |
04:53 | పిండి చిక్కగా అట్టు పోసుకునేలా ఉండాలి. |
04:56 | ఒక పాన్ వేడి చేసి నూనెతో గ్రీజు చేయాలి. |
04:58 | పాన్ మీద ఒక గరిట పిండిని పోసి గుండ్రంగా తిప్పుతూ అట్టులా పరచండి. |
05:03 | అట్టును మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. |
05:07 | జొన్న అట్టు సిద్ధంగా ఉంది. |
05:09 | జొన్నలు, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్ యొక్క ఒక మంచి వనరు. |
05:14 | ఒకవేళ జొన్నపిండి అందుబాటులో లేకపోతే మీరు వీటిని ఉపయోగించవచ్చు-
రాగి పిండి లేదా సజ్జల పిండి లేదా తోటకూర గింజల పిండి(అమరాన్త్ పౌడర్) |
05:22 | (చీలా) ఈ అట్టును వీటితో తినవచ్చు
రాచ ఉసిరి పచ్చడి, కొబ్బరి పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ, టొమాటో పచ్చడి లేదా పెరుగు. |
05:30 | రాచఉసిరి కాయలు, నిమ్మకాయలు, టొమాటోలు, (గువా) జామపళ్ళు, నారింజ పళ్ళు ఇవన్నీ విటమిన్ సి యొక్క మంచి వనరులు. |
05:37 | మీ భోజనంతో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.ఇది శరీరంలో ఐరన్ గ్రహించడాన్ని పెంచుతుంది. |
05:43 | మగవారితో పోలిస్తే కౌమారదశలో ఉన్న ఆడవారిలో నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా ఐరన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. |
05:50 | మనం మన తరువాతి వంటకమైన వేరుశెనగల కూరకు వెళ్దాం. |
05:53 | ఈ వంటను తయారు చేయడానికి, మీకు కావాల్సినవి:
½ కప్పు వేరుశెనగలు, ½ కప్పు బీరకాయ ముక్కలు, |
05:58 | 1 మీడియం సైజు ఉల్లిపాయ,
1 చిన్న టమోటా, 4-5 కొబ్బరి ముక్కలు, |
06:04 | ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
½ టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
06:08 | ½ టీస్పూన్ ధనియాలపొడి,
½ టీస్పూన్ పసుపు పొడి, |
06:12 | ½ టీస్పూన్ జీలకర్ర,
రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ నూనె. |
06:18 | తయారుచేసేవిధానం: మొదట వేరుశెనగలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. |
06:21 | ఇప్పుడు వాటిని ప్రెజర్ కుక్కర్ లో 1 కప్పు నీరుపోసి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. |
06:25 | ఈలోగా ఉల్లిపాయ, టమోటా, కొబ్బరి ముక్కలను రుబ్బుకుని చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి. |
06:30 | ఒక వంట పాత్రలో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.
ఇప్పుడు దాంట్లో రుబ్బిపెట్టుకున్న పేస్ట్ ను వేయండి. |
06:37 | బీరకాయ ముక్కలు ఇంకా మిగిలిన మసాలాలు అన్నీ వేయండి.
2 నిమిషాలు వేయించండి. |
06:42 | వంట పాత్రలో ఉడికించిన వేరుశెనగలను వేయండి. |
06:45 | ఇప్పుడు గ్రేవీ చేయడానికి అరకప్పు నీరుపోసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
వేరుశెనగల కూర సిద్ధమైనది. |
06:53 | ఒకవేళ వేరుశెనగ లు అందుబాటులో లేకపోతే, మీరు వీటిని కూడా ఉపయోగించవచ్చు:
కాబూలీ శనగలు, కొమ్ము శనగలు, రాజ్మా, జీడిపప్పు. |
07:02 | ఇంకా ఒకవేళ బీరకాయ అందుబాటులో లేనట్లయితే మీరు వీటిని ఉపయోగించవచ్చు:
గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయలు లేదా క్యాప్సికమ్. |
07:09 | వేరుశెనగలలో మంచి నాణ్యమైన కొవ్వులు ఉంటాయి. |
07:12 | అవి కూడా: ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన వనరులు. |
07:19 | గింజలు మరియు చిక్కుళ్ళు కూడా ఫోలేట్ ను కలిగి ఉంటాయి. |
07:22 | కౌమారదశలో తగినంత ఫోలేట్ అనేది గర్భధారణ సమయంలో బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. |
07:28 | తరువాత మనం సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో ఖిచ్డి చేయడాన్నినేర్చుకుంటాము. |
07:33 | ఈ వంటకాన్ని తయారుచేయడానికి మీరు-
తోటకూర గింజలు లేదా అరికెలు లేదా రాగులు లేదా కొర్రలను కలయికలో ఉపయోగించవచ్చు. |
07:41 | ఈ రెసిపీకి చేయడానికి కావాల్సిన పదార్థాలు:
సజ్జలు ⅓ కప్పు, జొన్నలు ⅓ కప్పు, |
07:46 | పెసరపప్పు ⅓ కప్పు,
1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, |
07:49 | క్యారెట్లు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు వంటి కూరగాయలన్ని కలిసిన ముక్కలు ½ కప్పు,
మీడియం సైజు ఉల్లిపాయ సగం, |
07:56 | 1 టీస్పూన్ జీలకర్ర,
1 టీస్పూన్ కరివేపాకు పొడి, |
07:59 | 1టీస్పూన్ ధనియాలపొడి,
½ టీస్పూన్ పసుపు పొడి, |
08:04 | రుచికి సరిపడా ఉప్పు,
1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి. |
08:07 | ఆకు పొడిని తయారుచేసే విధానం ఇదే ట్యుటోరియల్‌లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి. |
08:12 | తయారీవిధానం: మొదట, సజ్జలు మరియు జొన్నలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. |
08:17 | మరుసటి రోజు ఉదయం వాటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. |
08:20 | ప్రెజర్ కుక్కర్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి.
దాంట్లో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. |
08:25 | కూరగాయల ముక్కలు, మసాలాలు, ఉప్పు వేసి బాగా కలపండి. |
08:29 | దాన్ని 2 నిముషాలు వేయించండి.
కుక్కర్ లో సజ్జలు, జొన్నలు ఇంకా పెసరపప్పు వేయండి. |
08:35 | ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టండి. |
08:38 | 3 విజిల్స్ వచ్చేవరకు పెద్ద మంట పైన ఉడికించాలి. |
08:41 | తరువాత చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. |
08:44 | సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో ఖిచ్డి సిద్ధంగా ఉంది. |
08:47 | ఈ రెసిపీలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ అధికంగా ఉన్నాయి. |
08:53 | ఇప్పుడు మనం మన చివరి వంటకం నువ్వుల పచ్చడితో, లోపల ఏదయినా నింపి చేసే పరాటాలకు వచ్చాము |
08:59 | ఈ వంటని తయారుచేయడానికి, మీకు కావాల్సిన పదార్దాలు:
గోధుమపిండి 1 కప్పు, కొమ్ముశనగలు ½ కప్పు, |
09:05 | మీడియం సైజు ఉల్లిపాయ సగం,
½ టీస్పూన్ వాము, |
09:08 | 1 టీస్పూన్ అవిసె గింజల పొడి,
½ టీస్పూన్ ఎండు మామిడి పొడి, |
09:13 | ½ టీస్పూన్ ధనియాల పొడి,
¼ టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
09:17 | 1నిమ్మకాయ,
ఉప్పు రుచికి సరిపడా, 2 టీ స్పూన్ల నూనె లేదా 2 టీ స్పూన్ల నెయ్యి. |
09:23 | మొదట మనం వేయించిన కొమ్ముశనగ ల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
ఒక పాన్ ను వేడిచేసి కొమ్ముశనగలను 2-3 నిమిషాలు వేయించుకోవాలి. |
09:30 | మాడిపోకుండా ఉండడానికి దానిని ఆపకుండా కలుపుతూ ఉండాలి.
అది వేగిన తర్వాత,చల్లారడానికి ఒక పక్కన పెట్టండి. |
09:36 | ఇప్పుడు, వేపిన కొమ్ముశనగలును గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేయాలి. |
09:40 | ఇప్పుడు ఫిల్లింగ్ (లోపల నింపేది) ను సిద్ధం చేయడానికి:
మొదట వేపిన కొమ్ముశనగ ల పిండిని మరియు తరిగిన ఉల్లిపాయల ముక్కలను కలపండి. |
09:46 | ఇప్పుడు అందులో ఎర్ర కారం పొడి, ఎండు మామిడి పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. |
09:52 | ఫిల్లింగ్ ను ముద్దగాచేయడానికి కొంచెం నిమ్మరసం కొంచం నీళ్లు వేయండి. |
09:55 | మనం పరాటా ని ఎలా తయారుచేయాలో చూద్దాం. |
09:58 | గోధుమ పిండిని మరో గిన్నెలో తీసుకొని అందులో అవిసె గింజలు, వాము ఇంకా ఉప్పు వేయండి. |
10:03 | అవసరమైనంత నీళ్లు పోసి పిండిని మృదువుగా ఉండే ముద్దలా కలపండి. |
10:07 | ఇప్పుడు ఆ ముద్దని ఉండలు చేయండి. |
10:09 | పరాఠాలను చేయడానికి ముద్దని కొంచం వత్తి కొంచం ఫిల్లింగ్ ను తీసుకుని మధ్యలో పెట్టండి. |
10:13 | ముద్దలను సమంగా చేయడానికి ఫిల్లింగ్‌ను సరిగ్గా మడవండి. |
10:17 | ఇప్పుడు పరాఠా చేయడానికి దాన్ని మళ్ళీ వత్తండి. |
10:20 | పాన్ వేడిచేసి పరాటాను రెండువైపులా బాగా కాల్చాలి.
స్టఫ్డ్ పరాతా(లోపల నింపిచేసిన) సిద్ధంగా ఉంది. |
10:25 | ఫిల్లింగ్ కోసం, ఒకవేళ వేపిన కొమ్ముశనగలు అందుబాటులో లేకపోతే, మీరు వీటిని ఉపయోగించవచ్చు: |
10:29 | ఉడికించిన శనగపప్పును లేదా ఉడికించిన మొలకెత్తిన పెసలు, |
10:34 | పరాటాను నువ్వుల పచ్చడితో వడ్డించవచ్చు. |
10:38 | నువ్వుల పచ్చడి తయారీకి మీకు కావాల్సినవి:
¼కప్పు నువ్వులు, |
10:42 | 1 టేబుల్ స్పూన్ శనగపప్పు,
4-5 తాజా కొబ్బరి ముక్కలు, చింతపండు 3-5 బొట్టలు, |
10:49 | 1 ఎండు మిరపకాయ,
2-3 తెల్లుల్లీ రెబ్బలు, |
10:52 | 1 టీ స్పూన్ జీలకర్ర,
రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె. |
10:57 | తయారీవిధానం: ఒక పాన్ లో నూనె వేసి వేడిచేయండి. |
11:00 | నువ్వులు, శనగపప్పు, వెల్లుల్లి, కొబ్బరిముక్కలు, ఎండుమిరపకాయ ఇంకా జీలకర్ర అన్ని వేసి వేయించండి.
దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. |
11:07 | స్టవ్ మీదనుండి దించిన తర్వాత ఉప్పు ఇంకా చింతపండు వేయండి.
వీటన్నిటిని కలిపి రుబ్బండి. |
11:14 | మెత్తని పేస్ట్ లాగా చేయడానికి సగం కప్పు నీళ్లు వేయండి.
నువ్వుల పచ్చడి సిద్ధంగా ఉంది. |
11:19 | ఈ వంటకంలో:
ప్రోటీన్లు, కాల్షియం,మెగ్నీషియం, జింక్ మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉన్నాయి. |
11:25 | ఈ పోషకాలు కండరాల మరియు అస్థిపంజర అభివృద్ధికి సహాయపడతాయి. |
11:29 | చిన్న వయస్సు నుండే ఆహారం ద్వారా తగినంత కాల్షియం పొందడం అనేది చాలా ముఖ్యం. |
11:34 | కాల్షియం యొక్క లోపం తరువాతి దశలలో ఆడవారిలో (ఆస్టియోపొరోసిస్) బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. |
11:40 | ఈ ట్యుటోరియల్‌లోని అన్ని వంటకాలలో కౌమారదశలో తగినంత పెరుగుదల ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. |
11:47 | కౌమారదశ కొరకు శాఖాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి ఇది మనలను తీసుకువస్తుంది.
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |