Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:33, 5 November 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 గర్భధారణ కు ముందు పోషకాహారం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం పునరుత్పత్తి వయస్సు మరియు గర్భధారణ కు ముందు సమయంలో పోషకాహార అవసరాలను గురించి నేర్చుకుంటాము.
00:14 ముందుగా మనం ప్రోటీన్ తో ప్రారంభిద్దాం.
00:17 కండరాల కణజాలం యొక్క పెరుగుదల మరియు నిర్వహణకు ప్రోటీన్ అనేది అవసరం.
00:22 ఇది కణాల మరమ్మత్తులో మరియు ఎముకల అభివృద్ధికి అదేవిధంగా కీళ్ళ కొరకూ సహాయపడుతుంది.
00:27 ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మరియు కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఇంకా ఇది శక్తిని కూడా అందిస్తుంది.
00:34 ప్రోటీన్ రసాయనాలను సృష్టిస్తుంది అవి-

జీర్ణక్రియలో, శరీరంలోని టాక్సిన్స్ ను విచ్చిన్నం చేయడంలో,

00:41 రక్తంలో చక్కెరను సమంగా ఉంచడంలో మరియు మెదడు నుండి సంకేతాలను తీసుకెళ్లడంలో సహాయపడతాయి.
00:47 ప్రోటీన్ యొక్క లోపం అనేది-గర్భస్థ శిశువు యొక్క వయసుకు సరిపడిన పెరుగుదల తగ్గడానికి,
00:52 ఇన్ఫెక్షన్ సంక్రమించే ప్రమాదంతో పాటుగా, ఎత్తు తక్కువగా ఉండటం,జ్ఞాపకశక్తి మరియు చలించే నైపుణ్యాలు తగ్గడానికి దారితీస్తుంది.
01:00 పెద్దవారిలో, ఇది వీటికి దారితీస్తుంది - చర్మం పై ముడతలు రావడం,

జుట్టు రాలడం,

01:05 అలసట మరియు బలహీనత,
01:08 తరచుగా అంటువ్యాధులు రావడం మరియు కండరాల నష్టం.
01:11 కెరాటిన్ అని పిలువబడే మరొక ప్రోటీన్ అనేది జుట్టు, గోర్లు మరియు చర్మంలో ఒక ముఖ్యమైన భాగం.
01:18 ఆసక్తికరంగా, ఈ ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాలు అని పిలువబడే వివిధ పదార్ధాలతో రూపొందించబడింది.
01:24 ఇక్కడ మొత్తం 22 అమైనో ఆమ్లాలు ఉన్నాయి వీటిలో 9 అమైనో ఆమ్లాలను ఆహారం నుండి తీసుకోవాల్సిఉంటుంది.
01:33 ఇప్పుడు మనం రెండు రకాలైన ప్రోటీన్లను చూద్దాం - అవి సంపూర్ణ ప్రోటీన్లు మరియు

అసంపూర్ణ ప్రోటీన్లు

01:41 ఇంతకు ముందు పేర్కొన్న 9 అమైనో ఆమ్లాలు మొత్తం ప్రస్తుతం జంతువుల ప్రొటీన్లలో ఉన్నాయి.
01:46 అందుకే జంతువుల ప్రొటీన్లను సంపూర్ణ ప్రోటీన్లు అని అంటారు.
01:51 మరోవైపు, మొక్కల ఆధారిత ప్రోటీన్లలో, ఈ 9 అవసరమైన అమైనో ఆమ్లాలు అనేవి తక్కువ మొత్తంలో ఉన్నాయి.
02:00 ఉదాహరణకు, తృణధాన్యాలలో లైసిన్ తక్కువగా ఉంటుంది, అదే పప్పుధాన్యాలలో అయితే మెథియోనిన్ తక్కువగా ఉంటుంది.
02:07 అందువల్ల వేర్వేరు మొక్కల ప్రోటీన్లను కలయికలో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యం.
02:13 ఉదాహరణకు, ధాన్యాలు మరియు పప్పుధాన్యాలను కలయికలో తీసుకోవాలి, ఎందుకంటే అవి రెండూ అవసరమైన పరిమాణంలో అమైనో ఆమ్లాలు అందిస్తాయి కనుక.
02:23 ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన పోషకం అంటే (ఫ్యాట్) కొవ్వు గురించి నేర్చుకుంటాము.
02:28 ఆహారాల పదార్ధాల నుండి మంచి కొవ్వులు అనేవి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
02:32 శరీరం ద్వారా ఉత్పత్తి చేయలేని ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి కొన్ని కొవ్వులు ఉన్నాయి.

అందువల్ల వాటిని ఆహారం నుండి తీసుకోవాలి.

02:40 ఈ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి,
02:42 శరీరంలోని వేడిని తగ్గిస్తాయి

మరియు గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

02:48 అవి బిడ్డ నెలలు నిండకుండా పుట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయిమరియు శిశువులో తెలివితేటలను పెంచుతాయి.
02:56 ప్రోటీన్ మరియు కొవ్వు ను గురించి తెలుసుకున్న తరువాత, మనం ఇప్పుడు విటమిన్-A గురించి నేర్చుకుంటాము.
03:01 విటమిన్-A అనేది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఇది కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది,

03:07 గర్భందాల్చే అవకాశాలను పెంచుతుంది మరియు

గర్భందాల్చే ముందు సమయంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

03:14 విటమిన్A మాదిరిగానే, మొత్తం విటమిన్ B-కాంప్లెక్స్ అనేది జీవితంలోని అన్ని దశలలో మహిళల యొక్క బలం మరియు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
03:24 ఈ మొత్తం B-విటమిన్స్ నుండి, మనం మొదట విటమిన్ B- 6 అంటే పైరిడాక్సిన్ ను చూద్దాం.
03:31 విటమిన్ B- 6 పైరిడాక్సిన్ అనేది నాడీ వ్యవస్థ యొక్క పనితీరు కోసం అవసరం, తద్వారా మెదడు అభివృద్ధి మెరుగుపడుతుంది.
03:39 అలాగే, ఇది గర్భం ధరించినప్పుడు వచ్చే వికారం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
03:44 ఇంకొక పోషకం ఏమిటంటే,విటమిన్ B 12 ఇది ఫోలేట్ & కోలిన్ తో కలిసిఉంటుంది, ఇది రక్తహీనత మరియు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.
03:54 న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి గర్భం యొక్క మొదటి నెలలో ఏర్పడే శిశువు యొక్క వెన్నెముక మరియు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే పుట్టుకతో వచ్చే లోపాలు.
04:04 గమనించండి న్యూరల్ ట్యూబ్ అనేది పిండం యొక్క ఒక భాగం అది మెదడు మరియు వెన్నుపాము లోనికి అభివృద్ధి చెందుతుంది.
04:11 అందువల్ల, గర్భవతి కావడానికి ముందు శరీరంలో తగినంత ఫోలేట్, విటమిన్-B 12 మరియు కోలిన్ ఉండటం చాలా ముఖ్యం.
04:20 విటమిన్ B-12 యొక్క లోపం రక్తహీనత, వంధ్యత్వం మరియు గర్భస్రావం వంటి వాటికి కూడా దారితీస్తుంది.
04:27 ఇప్పుడు, మనం మరొక ముఖ్యమైన పోషకం అనగా ఫోలేట్ గురించి నేర్చుకుంటాము.
04:31 విటమిన్-B 9 అని కూడా పిలువబడే ఈ ఫోలేట్, ఆరోగ్యకరమైన కొత్త కణాలను తయారు చేయడానికి శరీరానికి సహాయపడుతుంది.
04:38 ఈ కణాలు ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను తీసుకువెళతాయి.
04:43 గర్భిణీ తల్లులలో ఫోలేట్ యొక్క లోపం అనేది రక్తహీనతకు, న్యూరల్ ట్యూబ్ లోపాలు అని పిలువబడే మెదడు మరియు వెన్నెముక యొక్క లోపాలకు దారితీస్తుంది.
04:52 న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి ఇదే ట్యుటోరియల్‌లో ముందు వివరించబడ్డాయని గమనించండి.
04:58 ఇప్పుడు మనం ఐరన్ యొక్క పాత్రను గురించి నేర్చుకుంటాము.

రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి మరియు పిండం పెరుగుదలకు ఇనుము (ఐరన్) అనేది అవసరం.

05:07 గర్భధారణలో హిమోగ్లోబిన్ అనేది తక్కువ స్థాయిలో ఉంటే- అది గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు,
05:13 ముందస్తు ప్రసవానికి,
05:15 తక్కువ బరువు ఉన్న బిడ్డ పుట్టడానికి మరియు గర్భస్రావాలకు దారితీస్తుంది.
05:18 ఇదే కాకుండా, హిమోగ్లోబిన్ అనేది ఇతర కణజాలాలకు మరియు కణాలకు ఆక్సిజన్ ను రవాణా చేయడానికి సహాయపడుతుంది.
05:25 తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ ఉండటం అనేది రక్తహీనతకు దారితీస్తుంది.
05:30 అంతేకాకుండా, వీటివలన మహిళల్లో ఐరన్ అనేది తక్కువగా ఉండవచ్చు- నెలవారీ వచ్చే ఋతుస్రావం వలన,
05:36 (పరాన్నజీవుల) పొట్ట పురుగులతో బాధపడడం వలన,
05:38 ఐరన్‌ తక్కువగా ఉండే ఆహారం మరియు ఆహారంలో ఉండే ఫైటిక్ యాసిడ్ మరియు ఆక్సలేట్స్ కారణంగా ఐరన్ ను తక్కువగా గ్రహించడం.
05:45 ఫైటిక్ ఆమ్లం మరియు ఆక్సలేట్స్ ను తగ్గించడానికి మరియు పోషకాలను గ్రహించడాన్ని పెంచడానికి -
05:52 వంట చేసే ముందు చేయాల్సిన పద్ధతులు నానబెట్టడం,మొలకెత్తడం, వేయించడం మరియు కిణ్వ ప్రక్రియ (పులియబెట్టడం) వంటివి ఉపయోగించండి.
06:00 ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనత యొక్క సంకేతాలు -

అలసట మరియు శక్తి లేకపోవడం,

06:06 ఊపిరి ఆడకపోవటం,

హృదయ స్పందన(గుండె కొట్టుకోవడం) రేటు పెరగడం

06:10 మరియు పాలిపోయిన చర్మం.
06:11 గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ ఐరన్ తోపాటుగా విటమిన్-C అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి ఎందుకంటే ఇది ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది.
06:19 విటమిన్-C కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా తద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
06:25 తరువాత, మనం కాల్షియం& విటమిన్ D యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటాము.
06:30 కాల్షియం ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది కనుక కాల్షియంను తీసుకోవాలని సూచిస్తారు.
06:35 ఎముక మరియు దంతాల అభివృద్ధి కొరకు పిండానికి కాల్షియం అవసరం.
06:39 కాల్షియం తక్కువ స్థాయిలో ఉంటే అది బలహీనమైన ఎముకలకు కారణమవుతుంది.
06:43 అయితే, గుర్తుంచుకోండి- కాల్షియం ను గ్రహించడానికి శరీరంలో విటమిన్-D అవసరం.
06:50 విటమిన్-D పొందటానికి ఉత్తమమైన మార్గం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాల సేపు సూర్యకిరణాలు శరీరాన్ని తాకేలా ఎండలో ఉండటం.
06:59 తరువాత, మనం కోలిన్ గురించి నేర్చుకుంటాము.
07:02 శిశువు యొక్క మెదడు పెరుగుదలకు కోలిన్ ముఖ్యమైనది, ఎందుకంటే ఇది జ్ఞాపకశక్తి మరియు శ్రద్ధను పెంచుతుంది.
07:09 కోలిన్ యొక్క లోపం అనేది పెద్దవారిలో కాలేయంలో కొవ్వు చేరడానికి,
07:13 గర్భస్రావానికి మరియు పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలకు దారితీస్తుంది, ఇవి ఈ ట్యుటోరియల్‌లో ఇంతకు ముందు ప్రస్తావించబడ్డాయి.
07:20 ముందుకు సాగుదాం ఇంకా మనం జింక్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
07:24 రోగనిరోధక శక్తికి మరియు కణాల పెరుగుదలకు జింక్ ముఖ్యమైనది.ఇది శరీరంలో జన్యు పదార్ధం మరియు ప్రోటీన్ తయారీకి సహాయపడుతుంది.
07:31 ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది మహిళల్లో అండోత్సర్గము మరియు సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది.
07:37 మరియు ఇది పిండం యొక్క పెరుగుదలకు ముఖ్యమైనది.
07:40 గమనించండి తీసుకునే ఆహారంలో జింక్ లేకపోవడం అనేది - రుచిని మరియు వాసనను గ్రహించడాన్ని ప్రభావితం చేస్తుంది.
07:46 మావి యొక్క పెరుగుదలను ఆలస్యం చేస్తుంది, ఇది తల్లి నుండి పిండానికి పోషకాలను రవాణా చేసే బొడ్డు త్రాడు.
07:53 జింక్ లేకపోవడం అనేది పిండం యొక్క పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తుంది మరియు శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి దారితీస్తుంది.
08:00 మనం చూసే మరో ముఖ్యమైన పోషకం అయోడిన్.
08:05 థైరాయిడ్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే థైరాయిడ్ హార్మోన్ యొక్క సాధారణ స్థాయిలలో నిర్వహించడానికి శరీరానికి అయోడిన్ అవసరం.
08:13 తల్లిలో అయోడిన్ యొక్క లోపం అనేది గర్భస్రావం మరియు ప్రసవంలో జీవంలేని బిడ్డ పుట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
08:21 ఇది వీటికి కూడా దారితీస్తుంది - జనన వైకల్యాలు,

తక్కువ జనన బరువు, బిడ్డ బరువు పెరగకపోవడం మరియు శిశువులో బుద్ధి మాంధ్యం.

08:30 నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడే మరొక పోషకం మెగ్నీషియం.
08:35 ఇది మెదడులోని రక్త నాళాలను సడలించడం ద్వారా తిమ్మిరి మరియు మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.
08:41 ఇది రక్తపోటు మరియు గుండె యొక్క లయ కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది.
08:45 ఇది జన్యు పదార్ధాల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు ఎముకల వృద్ధిని పెంచుతుంది.
08:51 ఆరోగ్యకరమైన గర్భధారణకు ఆరోగ్యకరమైన పోషణ కాకుండా, మద్యం నివారించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది గర్భస్రావం లేదా బలహీనమైన పిండానికి దారితీస్తుంది.
09:00 వదిలిపెట్టాల్సిన ఇతర విషయాలు ఏంటంటే - పొగాకు,
09:03 సిగరెట్లు,

డ్రగ్స్,

09:06 సొంత మందులు ఉపయోగించడం, చక్కెర, టీ మరియు కాఫీ, జంక్ ఫుడ్ మరియు తియ్యటి పానీయాలను అధికంగా తీసుకోవడం.
09:15 ఈ పదార్థాలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మరియు గర్భం మీద ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
09:20 గర్భవతి కావడానికి ముందు బరువును అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం అని గమనించండి.
09:25 తక్కువ బరువు ఉన్న మహిళలు గర్భం దాల్చితే చాలా చిన్న బిడ్డకు లేదా 7 నుండి 8 నెలల కాలంలో పుట్టే ముందస్తు శిశువులకు జన్మనిస్తారు.
09:34 అలాంటి పిల్లలకు అకాల మరణాల ప్రమాదం ఎక్కువ ఉంది.
09:38 అయితే, మరోవైపు, ఎక్కువ బరువుతో ఉన్న మహిళలకు గర్భధారణ మధుమేహం మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
09:45 అలాగే, ఇది (నియోనాటల్) పుట్టిన నెలలోపల వచ్చే సమస్యలకు దారితీస్తుంది.
09:49 అందువల్ల మహిళలు గర్భం దాల్చే ముందు ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి (హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను) ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
09:55 దీనితో పాటు, శాఖాహారం మరియు / లేదా మాంసాహార ఆహారాలను కలిగిఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
10:05 గుర్తుంచుకోండి, అన్ని మాంసాహార ఆహారాల్లోను ప్రోటీన్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్, విటమిన్ B-12, విటమిన్ B-9, జింక్, ఐరన్, కాల్షియం, కొలిన్, మరియు విటమిన్-D సమృద్ధిగా ఉంటాయి.
10:18 జంతువుల నుండి పొందిన ఆహారంతో పాటు, మొక్కల నుండి పొందిన ఆహారాలు, పప్పుధాన్యాలు, మిల్లెట్, తృణధాన్యాలు, కాయలు మరియు విత్తనాలు అనేవి బిడ్డలో ఇవి ఏర్పడటానికి సహాయపడతాయి-
10:30 రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, ఎముకలు,
10:33 కాలేయం, జుట్టు, చర్మం, కళ్ళు మరియు మెదడు.
10:36 ఇవే కాకుండా, శిశువు యొక్క ఎముకలు మరియు దంతాలు ఏర్పడటానికి పాల ఉత్పత్తులు కూడా సహాయపడతాయి.
10:43 ప్రత్యామ్నాయంగా, ఆకు కూరలు మరియు విత్తనాలలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది, మరియు అది శిశువు యొక్క ఎముకలు మరియు దంతాల యొక్క ఏర్పాటుకు సహాయపడుతుంది.
10:52 ఆకు కూరల మాదిరిగా, పండ్లలో కూడా విటమిన్-సి అధికంగా ఉంటుంది మరియు అవి -

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, ఐరన్ ని గ్రహించడం ఇంకా అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

11:04 స్త్రీ యొక్క సంతానోత్పత్తి మరియు శిశువు యొక్క పెరుగుదల కోసం, బీన్స్, కాయలు మరియు విత్తనాలను ఇతర నాన్-వెజ్ ఆహారంతో పాటుగా తీసుకోవాలి.
11:14 చేపలు, గుడ్లు వంటి వివిధ మాంసాహార ఆహారాలు మరియు పాల ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ను సమంగా నిర్వహించడానికి,

మంచి పెరుగుదలకు మరియు శారీరక లోపాలను నివారించడానికి సహాయపడతాయి.

11:27 గింజలు మరియు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ యొక్క పనితీరు మరియు కాలు తిమ్మిరిని నివారించడానికి ఇవి అవసరం.
11:35 ఇది మనల్ని గర్భధారణకు ముందు పోషకాహారంపై ఈ ట్యుటోరియల్ ముగింపుకు తీసుకువస్తుంది.

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya