Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | గర్భధారణ కు ముందు పోషకాహారం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం పునరుత్పత్తి వయస్సు మరియు గర్భధారణ కు ముందు సమయంలో పోషకాహార అవసరాలను గురించి నేర్చుకుంటాము. |
00:14 | ముందుగా మనం ప్రోటీన్ తో ప్రారంభిద్దాం. |
00:17 | కండరాల కణజాలం యొక్క పెరుగుదల మరియు నిర్వహణకు ప్రోటీన్ అనేది అవసరం. |
00:22 | ఇది కణాల మరమ్మత్తులో మరియు ఎముకల అభివృద్ధికి అదేవిధంగా కీళ్ళ కొరకూ సహాయపడుతుంది. |
00:27 | ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మరియు కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఇంకా ఇది శక్తిని కూడా అందిస్తుంది. |
00:34 | ప్రోటీన్ రసాయనాలను సృష్టిస్తుంది అవి-
జీర్ణక్రియలో, శరీరంలోని టాక్సిన్స్ ను విచ్చిన్నం చేయడంలో, |
00:41 | రక్తంలో చక్కెరను సమంగా ఉంచడంలో మరియు మెదడు నుండి సంకేతాలను తీసుకెళ్లడంలో సహాయపడతాయి. |
00:47 | ప్రోటీన్ యొక్క లోపం అనేది-గర్భస్థ శిశువు యొక్క వయసుకు సరిపడిన పెరుగుదల తగ్గడానికి, |
00:52 | ఇన్ఫెక్షన్ సంక్రమించే ప్రమాదంతో పాటుగా, ఎత్తు తక్కువగా ఉండటం,జ్ఞాపకశక్తి మరియు చలించే నైపుణ్యాలు తగ్గడానికి దారితీస్తుంది. |
01:00 | పెద్దవారిలో, ఇది వీటికి దారితీస్తుంది - చర్మం పై ముడతలు రావడం,
జుట్టు రాలడం, |
01:05 | అలసట మరియు బలహీనత, |
01:08 | తరచుగా అంటువ్యాధులు రావడం మరియు కండరాల నష్టం. |
01:11 | కెరాటిన్ అని పిలువబడే మరొక ప్రోటీన్ అనేది జుట్టు, గోర్లు మరియు చర్మంలో ఒక ముఖ్యమైన భాగం. |
01:18 | ఆసక్తికరంగా, ఈ ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాలు అని పిలువబడే వివిధ పదార్ధాలతో రూపొందించబడింది. |
01:24 | ఇక్కడ మొత్తం 22 అమైనో ఆమ్లాలు ఉన్నాయి వీటిలో 9 అమైనో ఆమ్లాలను ఆహారం నుండి తీసుకోవాల్సిఉంటుంది. |
01:33 | ఇప్పుడు మనం రెండు రకాలైన ప్రోటీన్లను చూద్దాం - అవి సంపూర్ణ ప్రోటీన్లు మరియు
అసంపూర్ణ ప్రోటీన్లు |
01:41 | ఇంతకు ముందు పేర్కొన్న 9 అమైనో ఆమ్లాలు మొత్తం ప్రస్తుతం జంతువుల ప్రొటీన్లలో ఉన్నాయి. |
01:46 | అందుకే జంతువుల ప్రొటీన్లను సంపూర్ణ ప్రోటీన్లు అని అంటారు. |
01:51 | మరోవైపు, మొక్కల ఆధారిత ప్రోటీన్లలో, ఈ 9 అవసరమైన అమైనో ఆమ్లాలు అనేవి తక్కువ మొత్తంలో ఉన్నాయి. |
02:00 | ఉదాహరణకు, తృణధాన్యాలలో లైసిన్ తక్కువగా ఉంటుంది, అదే పప్పుధాన్యాలలో అయితే మెథియోనిన్ తక్కువగా ఉంటుంది. |
02:07 | అందువల్ల వేర్వేరు మొక్కల ప్రోటీన్లను కలయికలో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యం. |
02:13 | ఉదాహరణకు, ధాన్యాలు మరియు పప్పుధాన్యాలను కలయికలో తీసుకోవాలి, ఎందుకంటే అవి రెండూ అవసరమైన పరిమాణంలో అమైనో ఆమ్లాలు అందిస్తాయి కనుక. |
02:23 | ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన పోషకం అంటే (ఫ్యాట్) కొవ్వు గురించి నేర్చుకుంటాము. |
02:28 | ఆహారాల పదార్ధాల నుండి మంచి కొవ్వులు అనేవి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. |
02:32 | శరీరం ద్వారా ఉత్పత్తి చేయలేని ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి కొన్ని కొవ్వులు ఉన్నాయి.
అందువల్ల వాటిని ఆహారం నుండి తీసుకోవాలి. |
02:40 | ఈ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, |
02:42 | శరీరంలోని వేడిని తగ్గిస్తాయి
మరియు గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. |
02:48 | అవి బిడ్డ నెలలు నిండకుండా పుట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయిమరియు శిశువులో తెలివితేటలను పెంచుతాయి. |
02:56 | ప్రోటీన్ మరియు కొవ్వు ను గురించి తెలుసుకున్న తరువాత, మనం ఇప్పుడు విటమిన్-A గురించి నేర్చుకుంటాము. |
03:01 | విటమిన్-A అనేది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఇది కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది, |
03:07 | గర్భందాల్చే అవకాశాలను పెంచుతుంది మరియు
గర్భందాల్చే ముందు సమయంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. |
03:14 | విటమిన్A మాదిరిగానే, మొత్తం విటమిన్ B-కాంప్లెక్స్ అనేది జీవితంలోని అన్ని దశలలో మహిళల యొక్క బలం మరియు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. |
03:24 | ఈ మొత్తం B-విటమిన్స్ నుండి, మనం మొదట విటమిన్ B- 6 అంటే పైరిడాక్సిన్ ను చూద్దాం. |
03:31 | విటమిన్ B- 6 పైరిడాక్సిన్ అనేది నాడీ వ్యవస్థ యొక్క పనితీరు కోసం అవసరం, తద్వారా మెదడు అభివృద్ధి మెరుగుపడుతుంది. |
03:39 | అలాగే, ఇది గర్భం ధరించినప్పుడు వచ్చే వికారం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. |
03:44 | ఇంకొక పోషకం ఏమిటంటే,విటమిన్ B 12 ఇది ఫోలేట్ & కోలిన్ తో కలిసిఉంటుంది, ఇది రక్తహీనత మరియు న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. |
03:54 | న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి గర్భం యొక్క మొదటి నెలలో ఏర్పడే శిశువు యొక్క వెన్నెముక మరియు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే పుట్టుకతో వచ్చే లోపాలు. |
04:04 | గమనించండి న్యూరల్ ట్యూబ్ అనేది పిండం యొక్క ఒక భాగం అది మెదడు మరియు వెన్నుపాము లోనికి అభివృద్ధి చెందుతుంది. |
04:11 | అందువల్ల, గర్భవతి కావడానికి ముందు శరీరంలో తగినంత ఫోలేట్, విటమిన్-B 12 మరియు కోలిన్ ఉండటం చాలా ముఖ్యం. |
04:20 | విటమిన్ B-12 యొక్క లోపం రక్తహీనత, వంధ్యత్వం మరియు గర్భస్రావం వంటి వాటికి కూడా దారితీస్తుంది. |
04:27 | ఇప్పుడు, మనం మరొక ముఖ్యమైన పోషకం అనగా ఫోలేట్ గురించి నేర్చుకుంటాము. |
04:31 | విటమిన్-B 9 అని కూడా పిలువబడే ఈ ఫోలేట్, ఆరోగ్యకరమైన కొత్త కణాలను తయారు చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. |
04:38 | ఈ కణాలు ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను తీసుకువెళతాయి. |
04:43 | గర్భిణీ తల్లులలో ఫోలేట్ యొక్క లోపం అనేది రక్తహీనతకు, న్యూరల్ ట్యూబ్ లోపాలు అని పిలువబడే మెదడు మరియు వెన్నెముక యొక్క లోపాలకు దారితీస్తుంది. |
04:52 | న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి ఇదే ట్యుటోరియల్‌లో ముందు వివరించబడ్డాయని గమనించండి. |
04:58 | ఇప్పుడు మనం ఐరన్ యొక్క పాత్రను గురించి నేర్చుకుంటాము.
రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి మరియు పిండం పెరుగుదలకు ఇనుము (ఐరన్) అనేది అవసరం. |
05:07 | గర్భధారణలో హిమోగ్లోబిన్ అనేది తక్కువ స్థాయిలో ఉంటే- అది గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు, |
05:13 | ముందస్తు ప్రసవానికి, |
05:15 | తక్కువ బరువు ఉన్న బిడ్డ పుట్టడానికి మరియు గర్భస్రావాలకు దారితీస్తుంది. |
05:18 | ఇదే కాకుండా, హిమోగ్లోబిన్ అనేది ఇతర కణజాలాలకు మరియు కణాలకు ఆక్సిజన్ ను రవాణా చేయడానికి సహాయపడుతుంది. |
05:25 | తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ ఉండటం అనేది రక్తహీనతకు దారితీస్తుంది. |
05:30 | అంతేకాకుండా, వీటివలన మహిళల్లో ఐరన్ అనేది తక్కువగా ఉండవచ్చు- నెలవారీ వచ్చే ఋతుస్రావం వలన, |
05:36 | (పరాన్నజీవుల) పొట్ట పురుగులతో బాధపడడం వలన, |
05:38 | ఐరన్ తక్కువగా ఉండే ఆహారం మరియు ఆహారంలో ఉండే ఫైటిక్ యాసిడ్ మరియు ఆక్సలేట్స్ కారణంగా ఐరన్ ను తక్కువగా గ్రహించడం. |
05:45 | ఫైటిక్ ఆమ్లం మరియు ఆక్సలేట్స్ ను తగ్గించడానికి మరియు పోషకాలను గ్రహించడాన్ని పెంచడానికి - |
05:52 | వంట చేసే ముందు చేయాల్సిన పద్ధతులు నానబెట్టడం,మొలకెత్తడం, వేయించడం మరియు కిణ్వ ప్రక్రియ (పులియబెట్టడం) వంటివి ఉపయోగించండి. |
06:00 | ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనత యొక్క సంకేతాలు -
అలసట మరియు శక్తి లేకపోవడం, |
06:06 | ఊపిరి ఆడకపోవటం,
హృదయ స్పందన(గుండె కొట్టుకోవడం) రేటు పెరగడం |
06:10 | మరియు పాలిపోయిన చర్మం. |
06:11 | గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ ఐరన్ తోపాటుగా విటమిన్-C అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి ఎందుకంటే ఇది ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. |
06:19 | విటమిన్-C కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా తద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. |
06:25 | తరువాత, మనం కాల్షియం& విటమిన్ D యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటాము. |
06:30 | కాల్షియం ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది కనుక కాల్షియంను తీసుకోవాలని సూచిస్తారు. |
06:35 | ఎముక మరియు దంతాల అభివృద్ధి కొరకు పిండానికి కాల్షియం అవసరం. |
06:39 | కాల్షియం తక్కువ స్థాయిలో ఉంటే అది బలహీనమైన ఎముకలకు కారణమవుతుంది. |
06:43 | అయితే, గుర్తుంచుకోండి- కాల్షియం ను గ్రహించడానికి శరీరంలో విటమిన్-D అవసరం. |
06:50 | విటమిన్-D పొందటానికి ఉత్తమమైన మార్గం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాల సేపు సూర్యకిరణాలు శరీరాన్ని తాకేలా ఎండలో ఉండటం. |
06:59 | తరువాత, మనం కోలిన్ గురించి నేర్చుకుంటాము. |
07:02 | శిశువు యొక్క మెదడు పెరుగుదలకు కోలిన్ ముఖ్యమైనది, ఎందుకంటే ఇది జ్ఞాపకశక్తి మరియు శ్రద్ధను పెంచుతుంది. |
07:09 | కోలిన్ యొక్క లోపం అనేది పెద్దవారిలో కాలేయంలో కొవ్వు చేరడానికి, |
07:13 | గర్భస్రావానికి మరియు పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలకు దారితీస్తుంది, ఇవి ఈ ట్యుటోరియల్‌లో ఇంతకు ముందు ప్రస్తావించబడ్డాయి. |
07:20 | ముందుకు సాగుదాం ఇంకా మనం జింక్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. |
07:24 | రోగనిరోధక శక్తికి మరియు కణాల పెరుగుదలకు జింక్ ముఖ్యమైనది.ఇది శరీరంలో జన్యు పదార్ధం మరియు ప్రోటీన్ తయారీకి సహాయపడుతుంది. |
07:31 | ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది మహిళల్లో అండోత్సర్గము మరియు సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. |
07:37 | మరియు ఇది పిండం యొక్క పెరుగుదలకు ముఖ్యమైనది. |
07:40 | గమనించండి తీసుకునే ఆహారంలో జింక్ లేకపోవడం అనేది - రుచిని మరియు వాసనను గ్రహించడాన్ని ప్రభావితం చేస్తుంది. |
07:46 | మావి యొక్క పెరుగుదలను ఆలస్యం చేస్తుంది, ఇది తల్లి నుండి పిండానికి పోషకాలను రవాణా చేసే బొడ్డు త్రాడు. |
07:53 | జింక్ లేకపోవడం అనేది పిండం యొక్క పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తుంది మరియు శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి దారితీస్తుంది. |
08:00 | మనం చూసే మరో ముఖ్యమైన పోషకం అయోడిన్. |
08:05 | థైరాయిడ్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే థైరాయిడ్ హార్మోన్ యొక్క సాధారణ స్థాయిలలో నిర్వహించడానికి శరీరానికి అయోడిన్ అవసరం. |
08:13 | తల్లిలో అయోడిన్ యొక్క లోపం అనేది గర్భస్రావం మరియు ప్రసవంలో జీవంలేని బిడ్డ పుట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. |
08:21 | ఇది వీటికి కూడా దారితీస్తుంది - జనన వైకల్యాలు,
తక్కువ జనన బరువు, బిడ్డ బరువు పెరగకపోవడం మరియు శిశువులో బుద్ధి మాంధ్యం. |
08:30 | నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడే మరొక పోషకం మెగ్నీషియం. |
08:35 | ఇది మెదడులోని రక్త నాళాలను సడలించడం ద్వారా తిమ్మిరి మరియు మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది. |
08:41 | ఇది రక్తపోటు మరియు గుండె యొక్క లయ కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. |
08:45 | ఇది జన్యు పదార్ధాల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు ఎముకల వృద్ధిని పెంచుతుంది. |
08:51 | ఆరోగ్యకరమైన గర్భధారణకు ఆరోగ్యకరమైన పోషణ కాకుండా, మద్యం నివారించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది గర్భస్రావం లేదా బలహీనమైన పిండానికి దారితీస్తుంది. |
09:00 | వదిలిపెట్టాల్సిన ఇతర విషయాలు ఏంటంటే - పొగాకు, |
09:03 | సిగరెట్లు,
డ్రగ్స్, |
09:06 | సొంత మందులు ఉపయోగించడం, చక్కెర, టీ మరియు కాఫీ, జంక్ ఫుడ్ మరియు తియ్యటి పానీయాలను అధికంగా తీసుకోవడం. |
09:15 | ఈ పదార్థాలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మరియు గర్భం మీద ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. |
09:20 | గర్భవతి కావడానికి ముందు బరువును అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం అని గమనించండి. |
09:25 | తక్కువ బరువు ఉన్న మహిళలు గర్భం దాల్చితే చాలా చిన్న బిడ్డకు లేదా 7 నుండి 8 నెలల కాలంలో పుట్టే ముందస్తు శిశువులకు జన్మనిస్తారు. |
09:34 | అలాంటి పిల్లలకు అకాల మరణాల ప్రమాదం ఎక్కువ ఉంది. |
09:38 | అయితే, మరోవైపు, ఎక్కువ బరువుతో ఉన్న మహిళలకు గర్భధారణ మధుమేహం మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. |
09:45 | అలాగే, ఇది (నియోనాటల్) పుట్టిన నెలలోపల వచ్చే సమస్యలకు దారితీస్తుంది. |
09:49 | అందువల్ల మహిళలు గర్భం దాల్చే ముందు ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి (హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను) ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి. |
09:55 | దీనితో పాటు, శాఖాహారం మరియు / లేదా మాంసాహార ఆహారాలను కలిగిఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. |
10:05 | గుర్తుంచుకోండి, అన్ని మాంసాహార ఆహారాల్లోను ప్రోటీన్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్, విటమిన్ B-12, విటమిన్ B-9, జింక్, ఐరన్, కాల్షియం, కొలిన్, మరియు విటమిన్-D సమృద్ధిగా ఉంటాయి. |
10:18 | జంతువుల నుండి పొందిన ఆహారంతో పాటు, మొక్కల నుండి పొందిన ఆహారాలు, పప్పుధాన్యాలు, మిల్లెట్, తృణధాన్యాలు, కాయలు మరియు విత్తనాలు అనేవి బిడ్డలో ఇవి ఏర్పడటానికి సహాయపడతాయి- |
10:30 | రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, ఎముకలు, |
10:33 | కాలేయం, జుట్టు, చర్మం, కళ్ళు మరియు మెదడు. |
10:36 | ఇవే కాకుండా, శిశువు యొక్క ఎముకలు మరియు దంతాలు ఏర్పడటానికి పాల ఉత్పత్తులు కూడా సహాయపడతాయి. |
10:43 | ప్రత్యామ్నాయంగా, ఆకు కూరలు మరియు విత్తనాలలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది, మరియు అది శిశువు యొక్క ఎముకలు మరియు దంతాల యొక్క ఏర్పాటుకు సహాయపడుతుంది. |
10:52 | ఆకు కూరల మాదిరిగా, పండ్లలో కూడా విటమిన్-సి అధికంగా ఉంటుంది మరియు అవి -
రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, ఐరన్ ని గ్రహించడం ఇంకా అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. |
11:04 | స్త్రీ యొక్క సంతానోత్పత్తి మరియు శిశువు యొక్క పెరుగుదల కోసం, బీన్స్, కాయలు మరియు విత్తనాలను ఇతర నాన్-వెజ్ ఆహారంతో పాటుగా తీసుకోవాలి. |
11:14 | చేపలు, గుడ్లు వంటి వివిధ మాంసాహార ఆహారాలు మరియు పాల ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ను సమంగా నిర్వహించడానికి,
మంచి పెరుగుదలకు మరియు శారీరక లోపాలను నివారించడానికి సహాయపడతాయి. |
11:27 | గింజలు మరియు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ యొక్క పనితీరు మరియు కాలు తిమ్మిరిని నివారించడానికి ఇవి అవసరం. |
11:35 | ఇది మనల్ని గర్భధారణకు ముందు పోషకాహారంపై ఈ ట్యుటోరియల్ ముగింపుకు తీసుకువస్తుంది.
పాల్గొన్నందుకు ధన్యవాదములు. |