Difference between revisions of "Health-and-Nutrition/C2/How-to-bathe-a-newborn/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 | <center>Time</center> |<center>Narration</center> |- | 00:00 | నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి...")
 
 
Line 64: Line 64:
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| బొడ్డుత్రాడు పడిపోయిన తర్వాత, తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు శిశువుకు క్రమంగా స్నానం చేయడం ప్రారంభించవచ్చు.
+
| బొడ్డుత్రాడు పడిపోయిన తర్వాత, తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు శిశువుకు క్రమంగా సాధారణ స్నానం చేయడం ప్రారంభించవచ్చు.
  
 
|-
 
|-

Latest revision as of 10:02, 23 November 2019

Time
Narration
00:00 నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనేదానిపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో మనం, బిడ్డకు స్నానం చేయించడానికి ముందు మరియు చేయిస్తున్నసమయంలో తల్లి లేదా సంరక్షకుని కొరకు భద్రతా చిట్కాల గురించి నేర్చుకుంటాము.
00:15 బిడ్డకు మొదటిసారి ఎప్పుడు స్నానం చేయించాలి,

స్పాంజ్ స్నానం,

00:20 రోజువారీ స్నానం,

సాంప్రదాయ స్నానం,

00:23 కొండ ప్రాంతాలలోని లేదా చల్లని ప్రాంతాల్లోని మరియు ఉయ్యాలలో ఉండే పిల్లలకు స్నానం చేయించడం.
00:32 కొత్తగా తల్లితండ్రులు అయినవారంతా నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనేదాని గురించి ఆత్రుతతో ఉంటారు.
00:37 శిశువు కు స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
00:42 ఒక్క తప్పు జరిగిన అది నవజాత శిశువుకు చాలా హానిని కలిగిస్తుంది.
00:46 మనం ప్రారంభించడానికి ముందు, శిశువుకు స్నానం చేయించడానికి ముందు అనుసరించాల్సిన భద్రతా చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం -
00:54 తల్లి లేదా కుటుంబ సభ్యులు- ఎప్పుడూ శిశువును తాకే ముందు చేతివేళ్ల గోర్లను కత్తిరించుకోవాలి మరియు
01:02 ఎటువంటి ఉంగరాలు, గాజులు లేదా గడియారాలను ధరించకూడదు.
01:07 ఇది శిశువుకు గాయాలయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.
01:11 కనుక, శిశువుకు మొదటిసారి స్నానం ఎప్పుడు చేయించాలి?
01:16 ప్రసవించిన 48 గంటల తర్వాత తల్లి శిశువుకు స్పాంజ్ తో స్నానం చేయించడం ప్రారంభించవచ్చు.
01:22 బొడ్డు తాడు పడిపోయే వరకు స్పాంజ్ తో మాత్రమే స్నానం చేయించాలని గుర్తుంచుకోండి.
01:29 బొడ్డుత్రాడు పడిపోయిన తర్వాత, తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు శిశువుకు క్రమంగా సాధారణ స్నానం చేయడం ప్రారంభించవచ్చు.
01:38 ఏమైనప్పటికి, ఒక బిడ్డ తక్కువ జనన బరువు కలిగిఉంటే, అప్పుడు అలాంటి బిడ్డ 2 కిలోగ్రాముల వరకు బరువు పెరిగే వరకు వరకు స్పాంజ్ స్నానం మాత్రమే చేయించాలి.
01:49 స్పాంజ్ తో స్నానం ఎలా చేయించాలో చూద్దాం.
01:53 ప్రారంభించడానికి ముందు, గది మూసివేసిన కిటికీలతో తగినంత వెచ్చగా ఉందని నిర్దారించుకోండి.
02:00 స్పాంజి స్నానం చేయించే ముందు చాలా మృదువైన, శుభ్రమైన, చిన్న వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి.
02:07 శిశువును సురక్షితమైన, సమంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
02:12 నేల అయితే సురక్షితంగా ఉంటుంది.
02:15 శిశువును ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఉంచవద్దు.
02:19 స్నానం చేయించే నీటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు.
02:26 తల్లి తన మోచేయి లేదా మణికట్టు ఉపయోగించి నీటి యొక్క ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి.
02:32 స్నానం చేయించేటప్పుడు, శుభ్రపరచడానికి మొదట సబ్బు నీటిని వాడండి.
02:37 సబ్బు నీరు తయారు చేయడానికి ఎల్లప్పుడూ తేలికపాటి, రంగులేని మరియు వాసన లేని సబ్బును లేదా బేబీ సబ్బును వాడండి.
02:45 తరువాత సబ్బును తొలగించడానికి శుభ్రమైన నీటిని వాడండి.
02:50 మృదువైన చిన్న వస్త్రాన్ని నీటిలో ముంచి, ఎక్కువగా ఉన్న నీటిని పిండి వేయండి.
02:56 ఇప్పుడు శిశువు యొక్క కన్నును లోపలి మూలలో నుండి బయటి అంచు వరకు తుడవండి.
03:02 శరీరంలోని మిగిలిన భాగాలను తుడవడానికి అదే వస్త్రాన్ని ఉపయోగించవద్దు.
03:06 శరీరంలోని మిగిలిన భాగాలను శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి.
03:12 అలాగే, ఈ మూలల్లో శుభ్రం చేయడం మర్చిపోవద్దు -

చేతులు కింద, చెవుల వెనుక,

03:18 మెడ చుట్టూ,

చేతి వేళ్ల మధ్య మరియు కాలి వేళ్ల మధ్య ఇంకా జననేంద్రియ ప్రాంతంలో.

03:25 ఇప్పటి వరకు మనం స్పాంజ్-స్నానం అంటే ఏమిటో చర్చించాము, ఇప్పుడు రెగ్యులర్ స్నానం గురించి తెలుసుకుందాం.
03:31 దయచేసి గుర్తించుకోండి; బొడ్డు తాడు పడిపోయిన తరువాత ఆరోగ్యకరమైన పిల్లలందరికీ రెగ్యులర్ గా స్నానం చేయించాలి.
03:39 సాధారణ స్నాన సమయంలో, మీరు స్నానపు తొట్టెను ఉపయోగిస్తుంటే - మొదట, బాత్టబ్‌ను 2 అంగుళాల వరకు సబ్బు నీటితో నింపండి.
03:48 సబ్బు నీరు తయారు చేయడానికి, ముందు వివరించిన విధంగా ఎల్లప్పుడూ తేలికపాటి రంగులేని మరియు వాసన లేని సబ్బు లేదా బేబీ సబ్బును వాడండి.
03:58 మంచినీటిని కలిగి ఉన్న మరొక టబ్‌ను సిద్ధంగా ఉంచండి.
04:03 తరువాత, మీ మోచేయితో రెండు తొట్టెలలోను నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి.
04:09 మీరు నీటి ఉష్ణోగ్రత సరిగ్గా ఉందని అనుకున్న తరువాత, చాలా జాగ్రత్తగా శిశువును సబ్బు నీటిని కలిగి ఉన్న టబ్‌లో ఉంచండి, ఎల్లప్పుడూ తలకు ఆసరా ఉన్నట్టు నిర్ధారించుకోండి.
04:22 శిశువు ఇప్పటికే టబ్‌లో ఉంటే అదనంగా మళ్ళీ నీటిని జోడించవద్దు.
04:27 ప్రారంభించడానికి ముందుగా, వాసన లేని మరియు రంగులేని బేబీ షాంపూ లేదా సబ్బు ఉపయోగించి శిశువు తలను కడగాలి.
04:35 తరువాత మంచినీటితో సబ్బుపోయేలాగా సున్నితంగా కడగాలి.
04:39 తరువాత, చాలా కలుషితంగా ఉన్న మూలల్లో మరియు నాపీ ప్రాంతంతో పాటుగా మిగిలిన శరీరాన్ని శుభ్రం చేయండి.
04:47 చివరికి, శరీరంలోని మిగిలిన భాగాలను మంచినీటితో సున్నితంగా కడగాలి.
04:53 మరోవైపు - ఒకవేళ తల్లి లేదా సంరక్షకుడు సాంప్రదాయ భారతీయ పద్ధతిలో శిశువుకు స్నానం చేయించాలని అనుకుంటే, మీ కాళ్ళను ఒకదానికొకటి సమాంతరంగా చాపి నేలపై కూర్చోండి.
05:06 తరువాత, శిశువును మీ కాలు మీద ఉంచండి.
05:09 శిశువు యొక్క తల తల్లి లేదా సంరక్షకుని పాదాల దగ్గర ఉండాలి.
05:14 శిశువు యొక్క పాదాలు తల్లి లేదా సంరక్షకుని పొట్ట దగ్గర ఉండాలి.
05:20 ఇప్పుడు శిశువు స్నానం చేయడానికి సరైన స్థితిలో ఉంది.
05:24 స్నానం చేయించిన తరువాత, మృదువైన మరియు శుభ్రమైన తువ్వాళ్లను ఉపయోగించి శిశువును వెంటనే తుడవండి.
05:30 ముందు వివరించిన విధంగా మూలల్లో తుడవాలని గుర్తుంచుకోండి.
05:35 టాల్కమ్ పౌడర్ లేదా బేబీ పౌడర్ లను కూడా వాడకుండా ఉండండి.
05:40 బేబీ పౌడర్లు నవజాత శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి.
05:45 కళ్ళలో ఎప్పుడూ (సుర్మా) నీలాంజనం లేదా (కాజల్) కాటుకను వాడకండి.
05:49 (సుర్మా) నీలాంజనం లేదా (కాజల్) కాటుక వాడటం వలన నవజాత శిశువులలో విషప్రభావంలా ఇంకా ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు.
05:56 ఆసక్తికరంగా, కొండ ప్రాంతాలలో లేదా చల్లని ప్రాంతాల్లో నివసించే శిశువులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
06:04 అటువంటి ప్రదేశాలలో ఉన్న శిశువులకు, బొడ్డు త్రాడు పడిపోక ముందు, రోజూ స్పాంజి స్నానాన్నితొందరగా చేయించవచ్చు.
06:11 ఏమైనప్పటికి, శిశువును తుడిచిన వెంటనే, తల్లి లేదా సంరక్షకుడు శిశువు చర్మంతో తమ చర్మాన్ని తాకిస్తూ శిశువుకు చర్మ స్పర్శను అందించాలి.
06:20 ఇది శిశువులలో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
06:25 తలకి షాంపూ పెట్టడం అనేది వారానికి రెండుసార్లు చేయాలి అని దయచేసి గమనించండి.
06:30 ప్రతిరోజూ షాంపూ చేయవద్దు ఎందుకంటే ఇది తలమీద చర్మం పొడిబారిపోయేలా చేస్తుంది.
06:35 దీనివల్ల నవజాత శిశువుకు తలమీద చర్మంపై దళసరి పెచ్చుల్లా అవ్వడం లేదా పొరలుగా పొట్టులా రాలడం కూడా జరగవచ్చు.

దీనిని క్రేడిల్ కాప్ అని అంటారు.

06:45 ఈ పెచ్చులు లేదా పొరల చుట్టూ కొంచెం ఎర్రగా కూడా ఉండవచ్చు.
06:50 ఈ క్రెడిల్ క్యాప్ గురించి అంతగా భయపడాల్సింది ఏమీ లేదని గమనించండి.
06:54 ఇది దానంతట అదే వెళ్లిపోతుంది ఇంకా దీనికి ఎలాంటి చికిత్స చేయవలసిన అవసరం లేదు.
06:59 ఈ పొరలను మృదువుగా చేయడంలో బేబీ ఆయిల్ సహాయపడవచ్చు.
07:04 నూనెను రాసేటప్పుడు, కొంచం నూనె మాత్రమే తీసుకుని పెచ్చులలో రుద్దండి.
07:09 ఎక్కువ నూనెను రాస్తే అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
07:12 తరువాత, గంట లేదా రెండు గంటల లోపల కన్నీళ్లు రాని తేలికపాటి బేబీ షాంపూతో బిడ్డ జుట్టును కడగాలి.
07:20 ఆ తరువాత, ఈ పొరలు మరింత పెరగకుండా నివారించడానికి, ఒక గంట తరువాత పెచ్చులను సున్నితంగా దువ్వండి.
07:27 తలమీది చర్మంపై పుండ్లు పుట్టడానికి, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావడానికి దారితీస్తుంది కనుక ఈ పొరలను ఎప్పుడూ లాగవద్దు.
07:33 ఇది మనలను నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనే దానిపై ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదములు .

Contributors and Content Editors

Simhadriudaya