Health-and-Nutrition/C2/How-to-bathe-a-newborn/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనేదానిపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం, బిడ్డకు స్నానం చేయించడానికి ముందు మరియు చేయిస్తున్నసమయంలో తల్లి లేదా సంరక్షకుని కొరకు భద్రతా చిట్కాల గురించి నేర్చుకుంటాము. |
00:15 | బిడ్డకు మొదటిసారి ఎప్పుడు స్నానం చేయించాలి,
స్పాంజ్ స్నానం, |
00:20 | రోజువారీ స్నానం,
సాంప్రదాయ స్నానం, |
00:23 | కొండ ప్రాంతాలలోని లేదా చల్లని ప్రాంతాల్లోని మరియు ఉయ్యాలలో ఉండే పిల్లలకు స్నానం చేయించడం. |
00:32 | కొత్తగా తల్లితండ్రులు అయినవారంతా నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనేదాని గురించి ఆత్రుతతో ఉంటారు. |
00:37 | శిశువు కు స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. |
00:42 | ఒక్క తప్పు జరిగిన అది నవజాత శిశువుకు చాలా హానిని కలిగిస్తుంది. |
00:46 | మనం ప్రారంభించడానికి ముందు, శిశువుకు స్నానం చేయించడానికి ముందు అనుసరించాల్సిన భద్రతా చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం - |
00:54 | తల్లి లేదా కుటుంబ సభ్యులు- ఎప్పుడూ శిశువును తాకే ముందు చేతివేళ్ల గోర్లను కత్తిరించుకోవాలి మరియు |
01:02 | ఎటువంటి ఉంగరాలు, గాజులు లేదా గడియారాలను ధరించకూడదు. |
01:07 | ఇది శిశువుకు గాయాలయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. |
01:11 | కనుక, శిశువుకు మొదటిసారి స్నానం ఎప్పుడు చేయించాలి? |
01:16 | ప్రసవించిన 48 గంటల తర్వాత తల్లి శిశువుకు స్పాంజ్ తో స్నానం చేయించడం ప్రారంభించవచ్చు. |
01:22 | బొడ్డు తాడు పడిపోయే వరకు స్పాంజ్ తో మాత్రమే స్నానం చేయించాలని గుర్తుంచుకోండి. |
01:29 | బొడ్డుత్రాడు పడిపోయిన తర్వాత, తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు శిశువుకు క్రమంగా సాధారణ స్నానం చేయడం ప్రారంభించవచ్చు. |
01:38 | ఏమైనప్పటికి, ఒక బిడ్డ తక్కువ జనన బరువు కలిగిఉంటే, అప్పుడు అలాంటి బిడ్డ 2 కిలోగ్రాముల వరకు బరువు పెరిగే వరకు వరకు స్పాంజ్ స్నానం మాత్రమే చేయించాలి. |
01:49 | స్పాంజ్ తో స్నానం ఎలా చేయించాలో చూద్దాం. |
01:53 | ప్రారంభించడానికి ముందు, గది మూసివేసిన కిటికీలతో తగినంత వెచ్చగా ఉందని నిర్దారించుకోండి. |
02:00 | స్పాంజి స్నానం చేయించే ముందు చాలా మృదువైన, శుభ్రమైన, చిన్న వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి. |
02:07 | శిశువును సురక్షితమైన, సమంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. |
02:12 | నేల అయితే సురక్షితంగా ఉంటుంది. |
02:15 | శిశువును ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఉంచవద్దు. |
02:19 | స్నానం చేయించే నీటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు. |
02:26 | తల్లి తన మోచేయి లేదా మణికట్టు ఉపయోగించి నీటి యొక్క ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి. |
02:32 | స్నానం చేయించేటప్పుడు, శుభ్రపరచడానికి మొదట సబ్బు నీటిని వాడండి. |
02:37 | సబ్బు నీరు తయారు చేయడానికి ఎల్లప్పుడూ తేలికపాటి, రంగులేని మరియు వాసన లేని సబ్బును లేదా బేబీ సబ్బును వాడండి. |
02:45 | తరువాత సబ్బును తొలగించడానికి శుభ్రమైన నీటిని వాడండి. |
02:50 | మృదువైన చిన్న వస్త్రాన్ని నీటిలో ముంచి, ఎక్కువగా ఉన్న నీటిని పిండి వేయండి. |
02:56 | ఇప్పుడు శిశువు యొక్క కన్నును లోపలి మూలలో నుండి బయటి అంచు వరకు తుడవండి. |
03:02 | శరీరంలోని మిగిలిన భాగాలను తుడవడానికి అదే వస్త్రాన్ని ఉపయోగించవద్దు. |
03:06 | శరీరంలోని మిగిలిన భాగాలను శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి. |
03:12 | అలాగే, ఈ మూలల్లో శుభ్రం చేయడం మర్చిపోవద్దు -
చేతులు కింద, చెవుల వెనుక, |
03:18 | మెడ చుట్టూ,
చేతి వేళ్ల మధ్య మరియు కాలి వేళ్ల మధ్య ఇంకా జననేంద్రియ ప్రాంతంలో. |
03:25 | ఇప్పటి వరకు మనం స్పాంజ్-స్నానం అంటే ఏమిటో చర్చించాము, ఇప్పుడు రెగ్యులర్ స్నానం గురించి తెలుసుకుందాం. |
03:31 | దయచేసి గుర్తించుకోండి; బొడ్డు తాడు పడిపోయిన తరువాత ఆరోగ్యకరమైన పిల్లలందరికీ రెగ్యులర్ గా స్నానం చేయించాలి. |
03:39 | సాధారణ స్నాన సమయంలో, మీరు స్నానపు తొట్టెను ఉపయోగిస్తుంటే - మొదట, బాత్టబ్‌ను 2 అంగుళాల వరకు సబ్బు నీటితో నింపండి. |
03:48 | సబ్బు నీరు తయారు చేయడానికి, ముందు వివరించిన విధంగా ఎల్లప్పుడూ తేలికపాటి రంగులేని మరియు వాసన లేని సబ్బు లేదా బేబీ సబ్బును వాడండి. |
03:58 | మంచినీటిని కలిగి ఉన్న మరొక టబ్‌ను సిద్ధంగా ఉంచండి. |
04:03 | తరువాత, మీ మోచేయితో రెండు తొట్టెలలోను నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. |
04:09 | మీరు నీటి ఉష్ణోగ్రత సరిగ్గా ఉందని అనుకున్న తరువాత, చాలా జాగ్రత్తగా శిశువును సబ్బు నీటిని కలిగి ఉన్న టబ్‌లో ఉంచండి, ఎల్లప్పుడూ తలకు ఆసరా ఉన్నట్టు నిర్ధారించుకోండి. |
04:22 | శిశువు ఇప్పటికే టబ్‌లో ఉంటే అదనంగా మళ్ళీ నీటిని జోడించవద్దు. |
04:27 | ప్రారంభించడానికి ముందుగా, వాసన లేని మరియు రంగులేని బేబీ షాంపూ లేదా సబ్బు ఉపయోగించి శిశువు తలను కడగాలి. |
04:35 | తరువాత మంచినీటితో సబ్బుపోయేలాగా సున్నితంగా కడగాలి. |
04:39 | తరువాత, చాలా కలుషితంగా ఉన్న మూలల్లో మరియు నాపీ ప్రాంతంతో పాటుగా మిగిలిన శరీరాన్ని శుభ్రం చేయండి. |
04:47 | చివరికి, శరీరంలోని మిగిలిన భాగాలను మంచినీటితో సున్నితంగా కడగాలి. |
04:53 | మరోవైపు - ఒకవేళ తల్లి లేదా సంరక్షకుడు సాంప్రదాయ భారతీయ పద్ధతిలో శిశువుకు స్నానం చేయించాలని అనుకుంటే, మీ కాళ్ళను ఒకదానికొకటి సమాంతరంగా చాపి నేలపై కూర్చోండి. |
05:06 | తరువాత, శిశువును మీ కాలు మీద ఉంచండి. |
05:09 | శిశువు యొక్క తల తల్లి లేదా సంరక్షకుని పాదాల దగ్గర ఉండాలి. |
05:14 | శిశువు యొక్క పాదాలు తల్లి లేదా సంరక్షకుని పొట్ట దగ్గర ఉండాలి. |
05:20 | ఇప్పుడు శిశువు స్నానం చేయడానికి సరైన స్థితిలో ఉంది. |
05:24 | స్నానం చేయించిన తరువాత, మృదువైన మరియు శుభ్రమైన తువ్వాళ్లను ఉపయోగించి శిశువును వెంటనే తుడవండి. |
05:30 | ముందు వివరించిన విధంగా మూలల్లో తుడవాలని గుర్తుంచుకోండి. |
05:35 | టాల్కమ్ పౌడర్ లేదా బేబీ పౌడర్ లను కూడా వాడకుండా ఉండండి. |
05:40 | బేబీ పౌడర్లు నవజాత శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. |
05:45 | కళ్ళలో ఎప్పుడూ (సుర్మా) నీలాంజనం లేదా (కాజల్) కాటుకను వాడకండి. |
05:49 | (సుర్మా) నీలాంజనం లేదా (కాజల్) కాటుక వాడటం వలన నవజాత శిశువులలో విషప్రభావంలా ఇంకా ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. |
05:56 | ఆసక్తికరంగా, కొండ ప్రాంతాలలో లేదా చల్లని ప్రాంతాల్లో నివసించే శిశువులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. |
06:04 | అటువంటి ప్రదేశాలలో ఉన్న శిశువులకు, బొడ్డు త్రాడు పడిపోక ముందు, రోజూ స్పాంజి స్నానాన్నితొందరగా చేయించవచ్చు. |
06:11 | ఏమైనప్పటికి, శిశువును తుడిచిన వెంటనే, తల్లి లేదా సంరక్షకుడు శిశువు చర్మంతో తమ చర్మాన్ని తాకిస్తూ శిశువుకు చర్మ స్పర్శను అందించాలి. |
06:20 | ఇది శిశువులలో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. |
06:25 | తలకి షాంపూ పెట్టడం అనేది వారానికి రెండుసార్లు చేయాలి అని దయచేసి గమనించండి. |
06:30 | ప్రతిరోజూ షాంపూ చేయవద్దు ఎందుకంటే ఇది తలమీద చర్మం పొడిబారిపోయేలా చేస్తుంది. |
06:35 | దీనివల్ల నవజాత శిశువుకు తలమీద చర్మంపై దళసరి పెచ్చుల్లా అవ్వడం లేదా పొరలుగా పొట్టులా రాలడం కూడా జరగవచ్చు.
దీనిని క్రేడిల్ కాప్ అని అంటారు. |
06:45 | ఈ పెచ్చులు లేదా పొరల చుట్టూ కొంచెం ఎర్రగా కూడా ఉండవచ్చు. |
06:50 | ఈ క్రెడిల్ క్యాప్ గురించి అంతగా భయపడాల్సింది ఏమీ లేదని గమనించండి. |
06:54 | ఇది దానంతట అదే వెళ్లిపోతుంది ఇంకా దీనికి ఎలాంటి చికిత్స చేయవలసిన అవసరం లేదు. |
06:59 | ఈ పొరలను మృదువుగా చేయడంలో బేబీ ఆయిల్ సహాయపడవచ్చు. |
07:04 | నూనెను రాసేటప్పుడు, కొంచం నూనె మాత్రమే తీసుకుని పెచ్చులలో రుద్దండి. |
07:09 | ఎక్కువ నూనెను రాస్తే అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. |
07:12 | తరువాత, గంట లేదా రెండు గంటల లోపల కన్నీళ్లు రాని తేలికపాటి బేబీ షాంపూతో బిడ్డ జుట్టును కడగాలి. |
07:20 | ఆ తరువాత, ఈ పొరలు మరింత పెరగకుండా నివారించడానికి, ఒక గంట తరువాత పెచ్చులను సున్నితంగా దువ్వండి. |
07:27 | తలమీది చర్మంపై పుండ్లు పుట్టడానికి, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావడానికి దారితీస్తుంది కనుక ఈ పొరలను ఎప్పుడూ లాగవద్దు. |
07:33 | ఇది మనలను నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనే దానిపై ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదములు . |