Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:06, 25 November 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ File Browser మరియు Info Panel in Blender 2.59ల గురించి ఉంటుంది.
00:15 ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
00:24 ఈ ట్యుటోరియల్ లో మనం File Browser మరియు Info Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
00:40 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:45 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్, Basic Description of the Blender Interface ను చూడండి.
00:55 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న, Editor type మెనూకు వెళ్ళండి.
01:02 Menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది.
01:14 File Browser పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:18 ఇది File Browser.
01:21 ఇక్కడ, మనము మన సిస్టమ్ లో blend filesను సేవ్ చేసిన స్థానమును పొందగలము.
01:29 ఈ నాలుగు బాణం బటన్లు, మన డైరెక్టరీ లోపల చుట్టూ కదులుటకు మనకు సహాయం చేస్తాయి.
01:37 Back arrow మనల్ని, మునుపటి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
01:41 కీబోర్డ్ shortcut కొరకు, back spaceను నొక్కండి.
01:48 Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
01:52 కీబోర్డ్ shortcut కొరకు shift & backspace ను నొక్కండి.
01:59 Up arrow బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది.
02:05 కీబోర్డ్ shortcut కొరకు P నొక్కండి.
02:10 Refresh బటన్, మీ ప్రస్తుత డైరెక్టరీలోని ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది.
02:19 Create new directory, మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ ను సృష్టిస్తుంది.
02:29 ఈ బటన్లు మీ ఫైళ్ళు లేదా ఫోల్డర్లను వరుస క్రమంలో ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి.
02:39 Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ళ వడపోతని అందుబాటులోనికి తెస్తుంది.
02:46 డైరెక్టరీ లోపల filter tab పక్కన ఉండే, active చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి.
02:57 కాబట్టి, ఇది బ్లెండర్లోని File browser విండో గురించి.
03:03 File browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి.
03:10 Menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:15 3D view పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:19 మనము default బ్లెండర్ workspaceకు తిరిగి వచ్చాము.
03:24 ఇప్పుడు Info panel గురించి చూద్దాం.
03:30 బ్లెండర్ ఇంటర్ఫేస్ లో, పైభాగాన ఉండే ప్యానెల్ Info ప్యానెల్- అది main మెనూ ప్యానెల్.
03:40 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:42 ఇక్కడ, మనకు- Open a New or an existing file, save the file, user preferences window, మరియు Import and Export ఎంపికలు కలవు.
03:58 Open పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 ఇది ఫైల్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్ ను తెరుస్తుంది.
04:07 మీరు ఇక్కడి నుండి, ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు.
04:14 ఒక ఫైల్ ను తెరవడానికి ముందు, Load UIను యాక్టీవేట్ చేస్తే, User Interface లేదా UIతో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది.
04:26 open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:35 Add, మీ sceneకు జోడించడానికి, విభిన్న objects యొక్క repository ను కలిగి ఉంటుంది.
04:42 Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:46 object repository ఇక్కడ ఉంది.
04:50 మనము ఈ మెనూ ని ఉపయోగించి, కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D viewకు జోడించవచ్చు.
04:56 కీబోర్డ్ shortcut కొరకు Shift & A నొక్కండి.
05:04 ఇప్పుడు, 3D view కు planeను జోడిద్దాం.
05:09 3D cursorను కదుపుటకు screen పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:15 నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను.
05:20 Add మెనూని తీసుకురావడానికి Shift & A నొక్కండి.
05:25 Mesh, తరువాత Plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:30 ఒక కొత్త Plane, 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద జోడించబడింది.
05:37 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి.
05:46 అదేవిధంగా, మీరు 3D viewకు మరికొన్ని ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి.
05:53 ఇప్పుడు Info పానెల్ కు తిరిగి వెళ్దాం.
05:56 Render menu తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:00 Render, Render Image, Render Animation, Show or Hide Render View లాంటి చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది.
06:14 Render settingsల గురించి తరువాత ట్యుటోరియల్లో వివరంగా నేర్పబడతాయి.
06:19 Info ప్యానెల్లో Help ప్రక్కన ఉన్న square ఐకాన్ కు వెళ్ళండి.
06:26 ఇది Choose Screen layout.
06:31 ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూపుతుంది.
06:37 Choose Screen Layout పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:41 ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది- అవి
06:48 Animation, Compositing, Game logic, మరియు Video Editing.
06:55 మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
07:04 Choose Screen Layout ను నిష్క్రమించడానికి, బ్లెండర్ స్క్రీన్ పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి, లేదా మీ కీబోర్డ్ పై Escను నొక్కండి.
07:15 Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత sceneను చూపిస్తుంది.
07:22 ఇది Info ప్యానెల్ గురించి.
07:25 ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి.
07:32 తరువాత Screen Layoutను Default నుండి Animation కు మార్చండి.
07:39 దానితో File Browser మరియు Info panel పై ఈ ట్యుటోరియల్ పూర్తవుతుంది.
07:47 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
07:55 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
08:00 oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
08:16 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
08:25 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
08:32 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india