Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ File Browser మరియు Info Panel in Blender 2.59ల గురించి ఉంటుంది. |
00:15 | ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది. |
00:24 | ఈ ట్యుటోరియల్ లో మనం File Browser మరియు Info Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం. |
00:40 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:45 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్, Basic Description of the Blender Interface ను చూడండి. |
00:55 | 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న, Editor type మెనూకు వెళ్ళండి. |
01:02 | Menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది. |
01:14 | File Browser పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:18 | ఇది File Browser. |
01:21 | ఇక్కడ, మనము మన సిస్టమ్ లో blend filesను సేవ్ చేసిన స్థానమును పొందగలము. |
01:29 | ఈ నాలుగు బాణం బటన్లు, మన డైరెక్టరీ లోపల చుట్టూ కదులుటకు మనకు సహాయం చేస్తాయి. |
01:37 | Back arrow మనల్ని, మునుపటి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది. |
01:41 | కీబోర్డ్ shortcut కొరకు, back spaceను నొక్కండి. |
01:48 | Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది. |
01:52 | కీబోర్డ్ shortcut కొరకు shift & backspace ను నొక్కండి. |
01:59 | Up arrow బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది. |
02:05 | కీబోర్డ్ shortcut కొరకు P నొక్కండి. |
02:10 | Refresh బటన్, మీ ప్రస్తుత డైరెక్టరీలోని ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది. |
02:19 | Create new directory, మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ ను సృష్టిస్తుంది. |
02:29 | ఈ బటన్లు మీ ఫైళ్ళు లేదా ఫోల్డర్లను వరుస క్రమంలో ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి. |
02:39 | Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ళ వడపోతని అందుబాటులోనికి తెస్తుంది. |
02:46 | డైరెక్టరీ లోపల filter tab పక్కన ఉండే, active చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి. |
02:57 | కాబట్టి, ఇది బ్లెండర్లోని File browser విండో గురించి. |
03:03 | File browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి. |
03:10 | Menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:15 | 3D view పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:19 | మనము default బ్లెండర్ workspaceకు తిరిగి వచ్చాము. |
03:24 | ఇప్పుడు Info panel గురించి చూద్దాం. |
03:30 | బ్లెండర్ ఇంటర్ఫేస్ లో, పైభాగాన ఉండే ప్యానెల్ Info ప్యానెల్- అది main మెనూ ప్యానెల్. |
03:40 | File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:42 | ఇక్కడ, మనకు- Open a New or an existing file, save the file, user preferences window, మరియు Import and Export ఎంపికలు కలవు. |
03:58 | Open పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:02 | ఇది ఫైల్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్ ను తెరుస్తుంది. |
04:07 | మీరు ఇక్కడి నుండి, ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు. |
04:14 | ఒక ఫైల్ ను తెరవడానికి ముందు, Load UIను యాక్టీవేట్ చేస్తే, User Interface లేదా UIతో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది. |
04:26 | open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:35 | Add, మీ sceneకు జోడించడానికి, విభిన్న objects యొక్క repository ను కలిగి ఉంటుంది. |
04:42 | Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:46 | object repository ఇక్కడ ఉంది. |
04:50 | మనము ఈ మెనూ ని ఉపయోగించి, కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D viewకు జోడించవచ్చు. |
04:56 | కీబోర్డ్ shortcut కొరకు Shift & A నొక్కండి. |
05:04 | ఇప్పుడు, 3D view కు planeను జోడిద్దాం. |
05:09 | 3D cursorను కదుపుటకు screen పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:15 | నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను. |
05:20 | Add మెనూని తీసుకురావడానికి Shift & A నొక్కండి. |
05:25 | Mesh, తరువాత Plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:30 | ఒక కొత్త Plane, 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద జోడించబడింది. |
05:37 | 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి. |
05:46 | అదేవిధంగా, మీరు 3D viewకు మరికొన్ని ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి. |
05:53 | ఇప్పుడు Info పానెల్ కు తిరిగి వెళ్దాం. |
05:56 | Render menu తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:00 | Render, Render Image, Render Animation, Show or Hide Render View లాంటి చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది. |
06:14 | Render settingsల గురించి తరువాత ట్యుటోరియల్లో వివరంగా నేర్పబడతాయి. |
06:19 | Info ప్యానెల్లో Help ప్రక్కన ఉన్న square ఐకాన్ కు వెళ్ళండి. |
06:26 | ఇది Choose Screen layout. |
06:31 | ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూపుతుంది. |
06:37 | Choose Screen Layout పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:41 | ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది- అవి |
06:48 | Animation, Compositing, Game logic, మరియు Video Editing. |
06:55 | మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు. |
07:04 | Choose Screen Layout ను నిష్క్రమించడానికి, బ్లెండర్ స్క్రీన్ పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి, లేదా మీ కీబోర్డ్ పై Escను నొక్కండి. |
07:15 | Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత sceneను చూపిస్తుంది. |
07:22 | ఇది Info ప్యానెల్ గురించి. |
07:25 | ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి. |
07:32 | తరువాత Screen Layoutను Default నుండి Animation కు మార్చండి. |
07:39 | దానితో File Browser మరియు Info panel పై ఈ ట్యుటోరియల్ పూర్తవుతుంది. |
07:47 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది |
07:55 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- |
08:00 | oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
08:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - |
08:16 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
08:20 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
08:25 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org |
08:32 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |