Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:43, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ File Browser మరియు Info Panel in Blender 2.59 ల గురించి ఉంటుంది.
00:15 ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
00:24 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, File Browser మరియుInfo Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
00:40 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:45 లేకపోతే, దయచేసి మా మునుపటి Basic Description of the Blender Interface ట్యుటోరియల్ ను చూడండి
00:55 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనుకు వెళ్ళండి.
01:02 menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది.
01:14 File Browser పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:18 ఇది File Browser.
01:21 ఇక్కడ, మనము మన సిస్టమ్లో blend files ను సేవ్ చేసిన స్థానమును పొందగలము.
01:29 ఈ నాలుగు బాణం బటన్లు మన డైరెక్టరీ లోపల చుట్టూ కదులుటకు మనకు సహాయం చేస్తాయి.
01:37 Back arrow మనల్ని మునుపటి ఫోల్డర్కు తీసుకువెళుతుంది.
01:41 కీబోర్డ్ shortcut కొరకు back space నొక్కండి.
01:48 Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్కు తీసుకువెళుతుంది.
01:52 కీబోర్డ్ shortcut కొరకు shift & backspace నొక్కండి.
01:59 ‘Up arrow’ బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది.
02:05 కీబోర్డ్ shortcut కొరకు P నొక్కండి.
02:10 Refresh బటన్ మీ ప్రస్తుత డైరెక్టరీలోని ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది.
02:19 Create new directory మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ను సృష్టిస్తుంది.
02:29 ఈ బటన్లు వరుస క్రమంలో మీ ఫైల్లు లేదా ఫోల్డర్లను ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి.
02:39 Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ల వడపోతని ప్రారంభిస్తుంది.
02:46 filter tab పక్కన ఉండే active చిహ్నాలు మాత్రమే డైరెక్టరీ లోపల కనిపిస్తాయి.
02:57 కాబట్టి, ఇది బ్లెండర్లోని File browser విండో గురించి.
03:03 file browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనుకు వెళ్ళండి.
03:10 menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:15 3D view పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:19 మనము default బ్లెండర్ workspace కు తిరిగి వచ్చాము.
03:24 ఇప్పుడు Info panel చూద్దాం.
03:30 బ్లెండర్ ఇంటర్ఫేస్లో అగ్ర పానెల్ ప్యానెల్ Info ప్యానెల్- ప్రధాన మెనూ ప్యానెల్.
03:40 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:42 ఇక్కడ, మనకు- Open ఒక New లేదా ఇప్పటికే వున్న ఫైల్, save ఫైలు,user preferencesవిండో, మరియు Import మరియు Export ఎంపికలు కలవు.
03:58 Open పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 ఇది ఫైల్ బ్రౌజర్ కు సమాంతరమైన బ్రౌజర్ ను తెరుస్తుంది.
04:07 మీరు ఇక్కడి నుండి ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు.
04:14 ఒక ఫైల్ ను తెరవడానికి ముందు Load UI ను యాక్టీవేట్ చేస్తే User Interface లేదా' 'UI' 'తో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది.
04:26 Left click Back to Previous to exit the open file window. open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousకు లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:35 మీ పనిలో జోడించడానికి repository యొక్క విభిన్న objects ను Add కలిగి ఉంటుంది
04:42 Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:46 ఇక్కడ object repository.
04:50 మనము కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D view కు ఈ మెనూ ని ఉపయోగించి జోడించవచ్చు.
04:56 కీబోర్డ్ shortcut కొరకు Shift & A నొక్కండి.
05:04 ఇప్పుడు, 3D view కు plane ను జోడిద్దాం.
05:09 3D cursor ను కదుపుటకు screen పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:15 నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను.
05:20 Add మెనూ ని తీసుకురావడానికి Shift & A నొక్కండి.
05:25 Mesh. Plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:30 ఒక కొత్త Plane 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద జోడించబడింది.
05:37 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Navigation – 3D cursor చూడండి.
05:46 అదేవిధంగా, మీరు 3D view కు మరికొంత ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి.
05:53 ఇప్పుడు Info పానెల్కు వెళ్దాం.
05:56 Render menu తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:00 Render చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది- Render Image, Render Animation, Show or Hide Render View మొదలైనవి.
06:14 Render settingsల గురించి తరువాతి ట్యుటోరియల్లో వివరంగా కవర్ చేయబడతాయి.
06:19 Info ప్యానెల్లో Help ప్రక్కన ఉన్న square ఐకాన్కు వెళ్ళండి.
06:26 ఇది Choose Screen layout.
06:31 ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ను చూపుతుంది.
06:37 Choose Screen Layout పై ఎడమ క్లిక్ చేయండి.
06:41 ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది -
06:48 Animation, Compositing, Game logic, Video Editing.
06:55 మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
07:04 Choose Screen Layout ను నిష్క్రమించడానికి బ్లెండర్ స్క్రీన్ పై ఎక్కడైనా ఎడమవైపు క్లిక్ చేయండి లేదా మీ కీబోర్డ్ పై Esc నొక్కండి.
07:15 Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత సన్నివేశాన్ని చూపిస్తుంది.
07:22 ఇది Info ప్యానెల్ గురించి.
07:25 ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి.
07:32 తరువాత Default నుండి Animation కు Screen Layout ను మార్చండి.
07:39 మరియు దానితో File Browser మరియు Info panel పై ఈ ట్యుటోరియల్ పూర్తవుతుంది.
07:47 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
07:55 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
08:00 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
08:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:16 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
08:25 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
08:32 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india