Synfig/C3/Logo-animation/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Synfig ను ఉపయోగించి Logo animation పై ఈ Spoken Tutoria కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము: ఒక మిర్రర్ ఆబ్జెక్ట్‌ని సృష్టించడం,
00:10 ఒక లోగోను యానిమేట్ చేయడం,
00:12 Spherize effect ను సృష్టించడం.
00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ 14.04 OS, Synfig వర్షన్ 1.0.2

00:26 మనం Synfig ను తెరుద్దాం.
00:28 canvas ‌కు వెళ్లండి. ప్రాపర్టీస్‌పై క్లిక్ చెయ్యండి.
00:31 Image కింద, Width ను 1920 కి మరియు Height ను 1080 కి మార్చండి.
00:40 Otherపై క్లిక్ చేయండి. Locks and Links క్రింద, అన్ని చెక్‌బాక్స్‌లపైన టిక్ చెయ్యండి.
00:47 Apply పైన మరియు OK పైన క్లిక్ చెయ్యండి.
00:49 మొదట, మనం ఒక బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.
00:52 Spline tool ను ఎంచుకోండి.
00:55 Tool options కింద, లేయర్ టైప్‌లోని, Create a region layer ఎంపికను తప్పక ఎంచుకోవాలి.
01:01 చూపిన విధంగా canvas యొక్క సగభాగం కవర్ అయ్యేలాగా ఒక లంబ కోణ త్రిభుజాన్ని గీయండి.
01:07 రైట్ క్లిక్ చేసి, మొదటి node పై పట్టుకోండి. context menu తెరుచుకుంటుంది.
01:12 మళ్ళీ రైట్ క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి. ఇప్పుడు లూప్ పూర్తయింది.
01:20 తరువాత, Transform tool పై క్లిక్ చేయండి.
01:23 మనం default కలర్ తో నిండిన ఒక త్రిభుజాన్ని పొందుతాము.
01:27 ఇప్పుడు మనం Ctrl + S కీలను నొక్కడం ద్వారా ఫైల్ ను save చేద్దాం.
01:32 నేను డిఫాల్ట్ పేరును Logo-animation కు మారుస్తాను.
01:37 ఇంకా ఈ ఫైల్‌ను Desktop పైన సేవ్ చెయ్యండి.
01:40 మీరు మీకు కావలసిన పేరును ఇవ్వవచ్చు.
01:44 తరువాత, మనం ఈ త్రిభుజం యొక్క రంగును మారుస్తాము.
01:47 అలా చేయడానికి, Parameters panel ‌లో, Color parameter పై క్లిక్ చెయ్యండి.
01:52 ఇప్పుడు, రంగును ఆకుపచ్చ కు మరియు layer పేరును Triangle-1 కు మార్చండి.
02:01 లేయర్ ను డూప్లికేట్ చేసి, పేరును Triangle-2 కుమార్చండి.
02:06 తరువాత రంగును పసుపు కు మార్చండి.
02:10 ఇప్పుడు Tool box కు వెళ్లి, Mirror tool ను ఎంచుకోండి.
02:14 mouse ను క్లిక్ చేసి లాగడం ద్వారా Triangle-2 యొక్క అన్ని నోడ్‌లను ఎంచుకోండి.
02:19 Tool options లో, Vertical axis ఎంచుకోబడిందని గమనించండి.
02:25 ఇప్పుడు త్రిభుజం యొక్క ఎగువ ఎడమ నోడ్ పై క్లిక్ చేయండి.
02:29 ప్రదర్శించినట్లుగా దానిని వర్టికల్ డైరెక్షన్ (నిలువు దిశలో) ఫ్లిప్ చెయ్యండి.
02:33 Tool options లో మరొకసారి, అక్షాన్ని Horizontal (క్షితిజసమాంతరం) కి మార్చండి.
02:38 ఇప్పుడు, త్రిభుజం యొక్క దిగువ ఎడమ నోడ్ పై క్లిక్ చేయండి.
02:41 ప్రదర్శించి విధంగా దానిని హారిజాంటల్ డైరెక్షన్ (క్షితిజ సమాంతర) ఫ్లిప్ చెయ్యండి.
02:46 Ctrl + S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చెయ్యండి.
02:50 మనం ముందుకు వెళ్ళేటప్పుడు, నేను దీన్ని వివరంగా చెప్పను. కానీ క్రమంగా వచ్చే విరామాల వద్ద తప్పకుండా అలా చెయ్యండి.
02:57 తరువాత, ఈ 2 త్రిభుజాలను యానిమేట్ చేద్దాం.
03:00 Transform tool ని ఎంచుకోండి.
03:02 Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
03:06 current frame బాక్స్‌లో20 అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:11 Keyframes panel లో, ఒక keyframe ను జోడించండి.
03:15 సున్నా ఫ్రేమ్‌కు తిరిగి రండి.
03:17 ప్రదర్శించినట్లుగా పసుపు రంగు త్రిభుజం యొక్క ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి,దానిని canvas బయటకు తరలించండి.
03:25 ఆకుపచ్చ త్రిభుజానికి కూడా అలాగే చెయ్యండి.
03:28 Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
03:32 యానిమేషన్‌ను చెక్ చేయడానికి Time cursor సున్నామరియు 20th ఫ్రేమ్‌ల మధ్యలో కదపండి.
03:39 తరువాత, మనం Spoken Tutorial logo ను ఇంపోర్ట్ చేద్దాం.
03:42 నేను నా Documents ఫోల్డర్‌లో లోగోను కలిగియున్నాను.
03:46 ఈ ట్యుటోరియల్‌తో పాటు అందించబడిన Code files లింక్‌లో మీరు ఈ లోగో ఫైల్‌ను కనుగొనవచ్చు.

దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.

03:55 File కు వెళ్లి, Import పై క్లిక్ చెయ్యండి.
03:59 నేను లేయర్ కు Rotate effect ను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, మనం మొదట logo layer ను గ్రూప్ చేస్తాము.
04:05 Group layer పేరును ST-Logo కు మార్చండి.
04:09 handle ‌లోని నారింజ రంగు బిందువును ఉపయోగించి లోగో యొక్క సైజ్ ను తగ్గించండి.
04:14 ఇప్పుడు Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
04:18 సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి.
04:20 తరువాత ST-Logo group layer యొక్క డ్రాప్-డౌన్ లిస్ట్ పై క్లిక్ చేసి, logo.png layer ను ఎంచుకోండి.
04:27 Parameters panel ‌లో, Alpha amount ను సున్నాకి మార్చండి.
04:33 తరువాత, logo కు రొటేషన్ ఎఫెక్ట్ ను ఇద్దాం.
04:37 దాని కొరకు, మొదట logo.png layer పై రైట్ క్లిక్ చెయ్యండి.
04:41 తరువాత New layer, Transform లపై క్లిక్ చేయండి, మరియు చివరగా Rotate పై.
04:47 ఇప్పుడు 50th ఫ్రేమ్ కు వెళ్ళండి.
04:50 Keyframes panel లో, ఒక keyframe ను జోడించండి.
04:54 Parameters panel ‌లో, రొటేషన్ అమౌంట్ ను (భ్రమణ మొత్తాన్ని) 360 కి మార్చండి.
05:00 మళ్ళీ, logo.png layeను ఎంచుకోండి.
05:04 ఇప్పుడు 60th ఫ్రేమ్ కు వెళ్ళండి.
05:06 ప్రదర్శించినట్లుగా logo ను కొద్దిగా పైకి తరలించండి.
05:10 Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
05:14 logo ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి.
05:18 తరువాత, మనంకొంత టెక్స్ట్ ను టైప్ చేద్దాం.
05:21 కనుక, Text tool ను ఎంచుకుని, canvas ‌పై క్లిక్ చెయ్యండి.
05:25 ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ నేను Spoken Tutorial అని టైప్ చేస్తాను. Ok పై క్లిక్ చెయ్యండి.
05:34 Parameters panel ‌లో, టెక్స్ట్ యొక్క రంగును నలుపుకు మరియు టెక్స్ట్ యొక్క సైజ్ ను 100 కు మార్చండి.
05:43 నేను layer పేరును Spoken Tutorial కు మారుస్తాను.
05:47 Transform tool పై క్లిక్ చేసి, టెక్స్ట్ యొక్క గ్రీన్ డాట్ ఎంచుకోండి.
05:53 ప్రదర్శించిన విధంగా టెక్స్ట్ ను canvas కు బయట కింది దిశలో కదిలించండి.
05:59 Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
06:02 ఇప్పుడు, 70th ఫ్రేమ్‌కు వెళ్లి టెక్స్ట్ ను పైకి కదిలించి దాన్ని లోగో క్రింద ఉంచండి.
06:09 మరొకసారి, Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
06:14 ఇప్పుడు, Spoken tutorial layer ను గ్రూప్ చేసి, గ్రూప్ పేరును ST-Text కు మార్చండి.
06:21 ST-Text group layer యొక్క డ్రాప్-డౌన్ లిస్ట్ పై క్లిక్ చెయ్యండి.
06:25 Spoken Tutorial layer పై రైట్ క్లిక్ చేసి, ఆపై న్యూ లేయర్ పై క్లిక్ చెయ్యండి.
06:30 ఇప్పుడు Distortions పై క్లిక్ చేసి, ఆపై Spherize పై క్లిక్ చేయండి.
06:35 Spherize effect యొక్క మధ్య ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి, టెక్స్ట్ యొక్క ప్రారంభం దగ్గరకి లాగండి.
06:42 ఎఫెక్ట్ ను పెద్దదిగా చేయడానికి ఎడమ ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి లాగండి.
06:47 మరొకసారి Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:51 ఈసారి 100th ఫ్రేమ్‌కు వెళ్లి, canvas కు బయట ఎఫెక్ట్ ను కదిలించండి.
06:57 ఇప్పుడు Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
07:02 చివరగా, మనం మన logo animation ను రెండర్ చేస్తాము. దానికంటే ముందు,ఫైల్ ని save చెయ్యండి.
07:08 ఇప్పుడు File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి.
07:11 extension ను avi కు మార్చండి మరియు Target ను ffmpeg కు మార్చండి.
07:18 Quality ను 9 కు పెంచండి మరియు Render బటన్ పై క్లిక్ చేయండి.
07:25 ఇప్పుడు మనం మన ఫైల్ ని చెక్ చేద్దాం.Desktop ‌కు వెళ్లండి.
07:28 output పై రైట్ క్లిక్ చేసి, Firefox web browser ని ఉపయోగించి ప్లే చెయ్యండి.
07:34 మన లోగో యానిమేషన్ చూడటానికి ఇలా ఉంది.
07:38 మీరు మీ స్వంత క్రియేటివిటీ ని (సృజనాత్మకతను) ఉపయోగించుకొని వేరే పద్ధతిలో కూడా సృష్టించుకోవచ్చు.
07:43 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:47 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము:

ఒక మిర్రర్ ఆబ్జెక్ట్‌ని సృష్టించడం,

07:53 ఒక లోగోను యానిమేట్ చేయడం,

Spherize effect ను సృష్టించడం.

07:57 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. Synfig logo ను ఉపయోగించి ఒక లోగో యానిమేషన్ ను సృష్టించండి.
08:03 ఈ లోగో మీకు Code files లింక్‌లో ఇవ్వబడింది.
08:08 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
08:12 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
08:18 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
08:21 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
08:26 మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి.
08:30 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
08:36 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
08:41 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya