Synfig/C3/Logo-animation/Telugu
From Script | Spoken-Tutorial
| |
|
| 00:01 | Synfig ను ఉపయోగించి Logo animation పై ఈ Spoken Tutoria కు స్వాగతం. |
| 00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము: ఒక మిర్రర్ ఆబ్జెక్ట్‌ని సృష్టించడం, |
| 00:10 | ఒక లోగోను యానిమేట్ చేయడం, |
| 00:12 | Spherize effect ను సృష్టించడం. |
| 00:15 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ 14.04 OS, Synfig వర్షన్ 1.0.2 |
| 00:26 | మనం Synfig ను తెరుద్దాం. |
| 00:28 | canvas కు వెళ్లండి. ప్రాపర్టీస్‌పై క్లిక్ చెయ్యండి. |
| 00:31 | Image కింద, Width ను 1920 కి మరియు Height ను 1080 కి మార్చండి. |
| 00:40 | Otherపై క్లిక్ చేయండి. Locks and Links క్రింద, అన్ని చెక్‌బాక్స్‌లపైన టిక్ చెయ్యండి. |
| 00:47 | Apply పైన మరియు OK పైన క్లిక్ చెయ్యండి. |
| 00:49 | మొదట, మనం ఒక బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం. |
| 00:52 | Spline tool ను ఎంచుకోండి. |
| 00:55 | Tool options కింద, లేయర్ టైప్‌లోని, Create a region layer ఎంపికను తప్పక ఎంచుకోవాలి. |
| 01:01 | చూపిన విధంగా canvas యొక్క సగభాగం కవర్ అయ్యేలాగా ఒక లంబ కోణ త్రిభుజాన్ని గీయండి. |
| 01:07 | రైట్ క్లిక్ చేసి, మొదటి node పై పట్టుకోండి. context menu తెరుచుకుంటుంది. |
| 01:12 | మళ్ళీ రైట్ క్లిక్ చేసి, Loop Spline ను ఎంచుకోండి. ఇప్పుడు లూప్ పూర్తయింది. |
| 01:20 | తరువాత, Transform tool పై క్లిక్ చేయండి. |
| 01:23 | మనం default కలర్ తో నిండిన ఒక త్రిభుజాన్ని పొందుతాము. |
| 01:27 | ఇప్పుడు మనం Ctrl + S కీలను నొక్కడం ద్వారా ఫైల్ ను save చేద్దాం. |
| 01:32 | నేను డిఫాల్ట్ పేరును Logo-animation కు మారుస్తాను. |
| 01:37 | ఇంకా ఈ ఫైల్‌ను Desktop పైన సేవ్ చెయ్యండి. |
| 01:40 | మీరు మీకు కావలసిన పేరును ఇవ్వవచ్చు. |
| 01:44 | తరువాత, మనం ఈ త్రిభుజం యొక్క రంగును మారుస్తాము. |
| 01:47 | అలా చేయడానికి, Parameters panel లో, Color parameter పై క్లిక్ చెయ్యండి. |
| 01:52 | ఇప్పుడు, రంగును ఆకుపచ్చ కు మరియు layer పేరును Triangle-1 కు మార్చండి. |
| 02:01 | లేయర్ ను డూప్లికేట్ చేసి, పేరును Triangle-2 కుమార్చండి. |
| 02:06 | తరువాత రంగును పసుపు కు మార్చండి. |
| 02:10 | ఇప్పుడు Tool box కు వెళ్లి, Mirror tool ను ఎంచుకోండి. |
| 02:14 | mouse ను క్లిక్ చేసి లాగడం ద్వారా Triangle-2 యొక్క అన్ని నోడ్‌లను ఎంచుకోండి. |
| 02:19 | Tool options లో, Vertical axis ఎంచుకోబడిందని గమనించండి. |
| 02:25 | ఇప్పుడు త్రిభుజం యొక్క ఎగువ ఎడమ నోడ్ పై క్లిక్ చేయండి. |
| 02:29 | ప్రదర్శించినట్లుగా దానిని వర్టికల్ డైరెక్షన్ (నిలువు దిశలో) ఫ్లిప్ చెయ్యండి. |
| 02:33 | Tool options లో మరొకసారి, అక్షాన్ని Horizontal (క్షితిజసమాంతరం) కి మార్చండి. |
| 02:38 | ఇప్పుడు, త్రిభుజం యొక్క దిగువ ఎడమ నోడ్ పై క్లిక్ చేయండి. |
| 02:41 | ప్రదర్శించి విధంగా దానిని హారిజాంటల్ డైరెక్షన్ (క్షితిజ సమాంతర) ఫ్లిప్ చెయ్యండి. |
| 02:46 | Ctrl + S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చెయ్యండి. |
| 02:50 | మనం ముందుకు వెళ్ళేటప్పుడు, నేను దీన్ని వివరంగా చెప్పను. కానీ క్రమంగా వచ్చే విరామాల వద్ద తప్పకుండా అలా చెయ్యండి. |
| 02:57 | తరువాత, ఈ 2 త్రిభుజాలను యానిమేట్ చేద్దాం. |
| 03:00 | Transform tool ని ఎంచుకోండి. |
| 03:02 | Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 03:06 | current frame బాక్స్‌లో20 అని టైప్ చేసి, Enter నొక్కండి. |
| 03:11 | Keyframes panel లో, ఒక keyframe ను జోడించండి. |
| 03:15 | సున్నా ఫ్రేమ్‌కు తిరిగి రండి. |
| 03:17 | ప్రదర్శించినట్లుగా పసుపు రంగు త్రిభుజం యొక్క ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి,దానిని canvas బయటకు తరలించండి. |
| 03:25 | ఆకుపచ్చ త్రిభుజానికి కూడా అలాగే చెయ్యండి. |
| 03:28 | Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 03:32 | యానిమేషన్‌ను చెక్ చేయడానికి Time cursor సున్నామరియు 20th ఫ్రేమ్‌ల మధ్యలో కదపండి. |
| 03:39 | తరువాత, మనం Spoken Tutorial logo ను ఇంపోర్ట్ చేద్దాం. |
| 03:42 | నేను నా Documents ఫోల్డర్‌లో లోగోను కలిగియున్నాను. |
| 03:46 | ఈ ట్యుటోరియల్‌తో పాటు అందించబడిన Code files లింక్‌లో మీరు ఈ లోగో ఫైల్‌ను కనుగొనవచ్చు.
దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి. |
| 03:55 | File కు వెళ్లి, Import పై క్లిక్ చెయ్యండి. |
| 03:59 | నేను లేయర్ కు Rotate effect ను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, మనం మొదట logo layer ను గ్రూప్ చేస్తాము. |
| 04:05 | Group layer పేరును ST-Logo కు మార్చండి. |
| 04:09 | handle లోని నారింజ రంగు బిందువును ఉపయోగించి లోగో యొక్క సైజ్ ను తగ్గించండి. |
| 04:14 | ఇప్పుడు Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 04:18 | సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి. |
| 04:20 | తరువాత ST-Logo group layer యొక్క డ్రాప్-డౌన్ లిస్ట్ పై క్లిక్ చేసి, logo.png layer ను ఎంచుకోండి. |
| 04:27 | Parameters panel లో, Alpha amount ను సున్నాకి మార్చండి. |
| 04:33 | తరువాత, logo కు రొటేషన్ ఎఫెక్ట్ ను ఇద్దాం. |
| 04:37 | దాని కొరకు, మొదట logo.png layer పై రైట్ క్లిక్ చెయ్యండి. |
| 04:41 | తరువాత New layer, Transform లపై క్లిక్ చేయండి, మరియు చివరగా Rotate పై. |
| 04:47 | ఇప్పుడు 50th ఫ్రేమ్ కు వెళ్ళండి. |
| 04:50 | Keyframes panel లో, ఒక keyframe ను జోడించండి. |
| 04:54 | Parameters panel లో, రొటేషన్ అమౌంట్ ను (భ్రమణ మొత్తాన్ని) 360 కి మార్చండి. |
| 05:00 | మళ్ళీ, logo.png layeను ఎంచుకోండి. |
| 05:04 | ఇప్పుడు 60th ఫ్రేమ్ కు వెళ్ళండి. |
| 05:06 | ప్రదర్శించినట్లుగా logo ను కొద్దిగా పైకి తరలించండి. |
| 05:10 | Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 05:14 | logo ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి. |
| 05:18 | తరువాత, మనంకొంత టెక్స్ట్ ను టైప్ చేద్దాం. |
| 05:21 | కనుక, Text tool ను ఎంచుకుని, canvas పై క్లిక్ చెయ్యండి. |
| 05:25 | ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ నేను Spoken Tutorial అని టైప్ చేస్తాను. Ok పై క్లిక్ చెయ్యండి. |
| 05:34 | Parameters panel లో, టెక్స్ట్ యొక్క రంగును నలుపుకు మరియు టెక్స్ట్ యొక్క సైజ్ ను 100 కు మార్చండి. |
| 05:43 | నేను layer పేరును Spoken Tutorial కు మారుస్తాను. |
| 05:47 | Transform tool పై క్లిక్ చేసి, టెక్స్ట్ యొక్క గ్రీన్ డాట్ ఎంచుకోండి. |
| 05:53 | ప్రదర్శించిన విధంగా టెక్స్ట్ ను canvas కు బయట కింది దిశలో కదిలించండి. |
| 05:59 | Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 06:02 | ఇప్పుడు, 70th ఫ్రేమ్‌కు వెళ్లి టెక్స్ట్ ను పైకి కదిలించి దాన్ని లోగో క్రింద ఉంచండి. |
| 06:09 | మరొకసారి, Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 06:14 | ఇప్పుడు, Spoken tutorial layer ను గ్రూప్ చేసి, గ్రూప్ పేరును ST-Text కు మార్చండి. |
| 06:21 | ST-Text group layer యొక్క డ్రాప్-డౌన్ లిస్ట్ పై క్లిక్ చెయ్యండి. |
| 06:25 | Spoken Tutorial layer పై రైట్ క్లిక్ చేసి, ఆపై న్యూ లేయర్ పై క్లిక్ చెయ్యండి. |
| 06:30 | ఇప్పుడు Distortions పై క్లిక్ చేసి, ఆపై Spherize పై క్లిక్ చేయండి. |
| 06:35 | Spherize effect యొక్క మధ్య ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి, టెక్స్ట్ యొక్క ప్రారంభం దగ్గరకి లాగండి. |
| 06:42 | ఎఫెక్ట్ ను పెద్దదిగా చేయడానికి ఎడమ ఆకుపచ్చ బిందువుపై క్లిక్ చేసి లాగండి. |
| 06:47 | మరొకసారి Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
| 06:51 | ఈసారి 100th ఫ్రేమ్‌కు వెళ్లి, canvas కు బయట ఎఫెక్ట్ ను కదిలించండి. |
| 06:57 | ఇప్పుడు Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
| 07:02 | చివరగా, మనం మన logo animation ను రెండర్ చేస్తాము. దానికంటే ముందు,ఫైల్ ని save చెయ్యండి. |
| 07:08 | ఇప్పుడు File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. |
| 07:11 | extension ను avi కు మార్చండి మరియు Target ను ffmpeg కు మార్చండి. |
| 07:18 | Quality ను 9 కు పెంచండి మరియు Render బటన్ పై క్లిక్ చేయండి. |
| 07:25 | ఇప్పుడు మనం మన ఫైల్ ని చెక్ చేద్దాం.Desktop కు వెళ్లండి. |
| 07:28 | output పై రైట్ క్లిక్ చేసి, Firefox web browser ని ఉపయోగించి ప్లే చెయ్యండి. |
| 07:34 | మన లోగో యానిమేషన్ చూడటానికి ఇలా ఉంది. |
| 07:38 | మీరు మీ స్వంత క్రియేటివిటీ ని (సృజనాత్మకతను) ఉపయోగించుకొని వేరే పద్ధతిలో కూడా సృష్టించుకోవచ్చు. |
| 07:43 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
| 07:47 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము:
ఒక మిర్రర్ ఆబ్జెక్ట్‌ని సృష్టించడం, |
| 07:53 | ఒక లోగోను యానిమేట్ చేయడం,
Spherize effect ను సృష్టించడం. |
| 07:57 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. Synfig logo ను ఉపయోగించి ఒక లోగో యానిమేషన్ ను సృష్టించండి. |
| 08:03 | ఈ లోగో మీకు Code files లింక్‌లో ఇవ్వబడింది. |
| 08:08 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
| 08:12 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
| 08:18 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
| 08:21 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
| 08:26 | మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి. |
| 08:30 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
| 08:36 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
| 08:41 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |