Linux/C2/Ubuntu-Desktop-16.04/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | హెల్లో, ఉబంటులినక్స్ డెస్క్ టాప్ 16.04 అనే ఈ స్పొకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం gnome ఎన్విరాన్మెంట్ లో ఉబంటులినక్స్ డెస్క్ టాప్ గురించి |
00:17 | ఇంకా ఉబంటులినక్స్ డెస్క్ టాప్ లోని కొన్ని సాధారణ అప్ప్లికేశన్ లను గురించి తెలుసుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్16.04 అపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను. |
00:29 | ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ చూడటానికి ఇలా కనిపిస్తుంది. |
00:33 | మీరు స్క్రీన్ యొక్క ఎడమవైపున launcher (లాంచర్) ని చూస్తారు |
00:37 | మనం launcher (లాంచర్) ని ఎలా దాచగలము. |
00:40 | దాన్ని చేయడానికి ఎడమవైపున ఉన్న launcher(లాంచర్) కి వెళ్ళండి. System Settings అయికన్ పై క్లిక్ చేయండి. |
00:47 | System Settings విండో లో Appearance పై క్లిక్ చేయండి. |
00:51 | Appearance విండో లో Behavior ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
00:56 | ఇక్కడ, Auto-hide the Launcher ని ON స్థితికి మార్చండి. |
01:01 | ఇప్పుడు, launcher (లాంచర్) దాచబడుతుంది. |
01:04 | ఒకవేళ లాంచర్ దాచబడి ఉంటే,ఇక్కడ చూపినవిధంగా దానిని మరలా కనిపించేటట్టు చేయవచ్చు. |
01:10 | అలా చేయడానికి, కర్సర్‌ను స్క్రీన్ యొక్క ఎడమవైపు చివరకి తరలించండి. |
01:15 | లాంచర్ ఇప్పుడు కనిపిస్తుంది. |
01:18 | కర్సర్‌ను దూరంగా తరలిస్తే launcher మళ్లీ దాచబడుతుంది. |
01:23 | Appearance విండో కి తిరిగి వెళ్ళి Auto-hide the Launcher స్థితిని OFF కు మార్చండి. |
01:30 | విండో యొక్క ఎగువ ఎడమ ములలో ఉన్న చిన్న X అయికన్ ని క్లిక్ చేసి విండో ని మూసివేయండి. |
01:37 | గమనించండి ఇక్కడ లాంచర్ లో అప్రమేయంగా కొన్ని అయికన్ లు ఉన్నాయి. |
01:42 | లాంచర్ యొక్క ఎగువభాగం వద్ద మీరు Dash home icon ని చూడవచ్చు. |
01:47 | Dash home అనేది ఒక స్క్రీన్ లోపల ఉబంటు లినక్స్ లోని అన్ని అప్ప్లికేశన్లకు అక్కెస్స్ ఇచ్చే ఒక ఇంటర్ఫేస్. |
01:55 | Dash home ని తెరవడానికి దానిపై క్లిక్ చేయండి. |
01:59 | ఎగువభాగం వద్ద ప్రధానంగా మీరు search bar ఫీల్డ్ ను చూస్తారు. |
02:04 | ఇప్పుడు, మనము ఒక నిర్దిష్ట అప్లికేషన్ ని ఎలా గుర్తించగలం? మీరు వెతుకుతున్న అప్లికేషన్ పేరును టైప్ చేస్తే చాలు మీరు తక్షణమే దానిని కనుగొంటారు,
ఇది చాలా సులభం! |
02:16 | ఇప్పుడు Calculator అప్ప్లికేశన్ ని కనుగొనడానికి ప్రయత్నిద్దాం. |
02:20 | దానికి, search bar ఫీల్డ్ లో C a l c అని టైప్ చేయండి. |
02:26 | వారి పేరులో c a l c లో కలిగిఉన్న ఉన్న అన్ని applications జాబితా చేయబడతాయి. |
02:32 | గమనించండి ఇక్కడ LibreOffice Calc మరియు Calculator రెండూ జాబితా చేయబడ్డాయి. |
02:37 | Calculator అయికన్ పై క్లిక్ చేయండి.
Calculator application ఇప్పుడు స్క్రీన్ పైన తెరుచుకుంటుంది. |
02:45 | Calculator గణిత, వైజ్గానిక లేదా ఆర్ధిక గణనలను చేయటానికి సహాయం చేస్తుంది. |
02:52 | మనం కొన్ని సాధారణ గణనలను ప్రయత్నిద్దాం. |
02:55 | 5 asterix 8 అని టైప్ చేసి equal to గుర్తు పై క్లిక్ చేయండి. |
03:02 | equal to గుర్తు పై క్లిక్ చేయడానికి బదులు మీరు కీ బోర్డ్ పైన ఎంటర్ ని కూడా నొక్కవచ్చు. |
03:09 | జవాబు Calculator లో ప్రదర్శించబడుతుంది. |
03:13 | ఇదే విధంగా మనం Calculator అప్ప్లికేశన్ ఉపయోగించి అన్ని రకాల గణనలను చేయవచ్చు. |
03:20 | ఇప్పుడు Calculator నుండి నిష్క్రమించడానికి విండో యొక్క ఎగువ ఎడమవైపు ఉన్నచిన్న X icon పై క్లిక్ చేయండి. |
03:28 | ఇప్పుడు మనం Ubuntu Linux OS లో కొన్ని ఇతర ముఖ్యమైన అప్ప్లికేశన్ లతో పరిచయమవుదాం. |
03:34 | దానికోసం మనం తిరిగి Dash home కి వెళదాం. |
03:38 | Search bar లో gedit అని టైప్ చేద్దాం. gedit అనేది Ubuntu Linux OS లో డీఫౌల్ట్ టెక్స్ట్ ఎడిటర్. |
03:48 | Text Editor అనే అయికాన్ కింద కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి తెరుద్దాం. |
03:55 | మీరు ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నది, gedit Text Editor విండో. |
04:00 | ఇక్కడ నన్ను కొంత టెక్స్ట్ ను టైప్ చేయనివ్వండి. ఉదాహరణకి Hello World అని టైప్ చేద్దాం. |
04:07 | ఫైల్ ని సేవ్ చేయడానికి కీ బోర్డ్ లో Ctrl మరియు S ని ఏకకాలం లో నొక్కండి. |
04:14 | లేదంటే, మనం File పై క్లిక్ చేసి తర్వాత Save పై క్లిక్ చేయవచ్చు. |
04:20 | ఇప్పుడు, Save as అనే ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది. అది ఫైల్ నేమ్ మరియు ఫైల్ ని సేవ్ చేయాల్సిన లొకేషన్ అడుగుతుంది. |
04:31 | ఫైల్ పేరుని Hello.txt గా టైప్ చేద్దాం. |
04:36 | txt అనేది text file యొక్క డీఫాల్ట్ ఎక్స్టెన్షన్. |
04:41 | లొకేశన్ కొరకు డెస్క్ టాప్ ని ఎంపిక చేసుకుందాం. దిగువభాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయాలి. |
04:49 | ఇప్పుడు విండో యొక్క ఎగువ ఎడమవైపున ఉన్న చిన్న X icon పై క్లిక్ చేయడం ద్వారా ఈ gedit విండోని మూసివేయండి. |
04:57 | డెస్క్ టాప్ పై మనం file Hello.txt ని చూడవచ్చు. మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా సేవ్ చేయబడింది అని దీని అర్ధం. |
05:05 | ఆ ఫైల్ పై డబల్ క్లిక్ చేసి దాన్ని తెరుస్తాను. |
05:09 | మన text file మనం రాసిన టెక్స్ట్ తో తెరచుకోవడం మనం చూడవచ్చు. |
05:14 | gedit Text Editor గురించి ఇంటర్నెట్ లో చాలా సమాచారం ఉంది. |
05:19 | ఇక్కడ ఈ వెబ్ సైట్ లో కొన్ని స్పోకెన్ ట్యుటోరియల్స్ ఈ టాపిక్ పై కూడా అందుబాటులో ఉన్నాయి. |
05:25 | ఈ text editor ను మూసివేసి Terminal అనే మరొక application ను చూద్దాం. |
05:32 | దానికి మరోసారి Dash home కి వెళదాం. ఇప్పుడు search bar field లో terminal అని టైప్ చేయండి. |
05:41 | కింద కనిపిస్తున్న టర్మినల్ (Terminal) అయికాన్ పై క్లిక్ చేయండి. |
05:45 | తెరపైన terminal విండో తెరచుకుంటుంది.
Ctrl+Alt+T కీస్ అనేవి Terminal ను తెరవడానికి షార్ట్కట్ అని గమనించండి. |
05:55 | terminal ని command line అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ నుండి కంప్యుటర్ కి కమాండ్ లను ఇవ్వవచ్చు. |
06:02 | వాస్తవానికి ఇది GUI కంటే శక్తివంతమైనది. |
06:06 | ఇప్పుడు నన్ను Terminal విండో కి తిరిగి మారనివ్వండి. |
06:09 | ఇప్పుడు terminal యొక్క అనుభూతిని పొందడానికి ఒక సరళమైన కమాండ్ ను టైప్ చేద్దాం. ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:18 | మీరు కరెంట్ directory లో అన్ని ఫైల్ లు మరియు ఫొల్డర్ ల యొక్క జాబితాను చూడవచ్చు. |
06:23 | ఇక్కడ, ఇది హోమ్ ఫోల్డర్ నుండి ఫైల్స్ మరియు ఫోల్డర్ల ను ప్రదర్శిస్తోంది. |
06:28 | మనం హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటి అనేది ఈ ట్యుటోరియల్‌లో తరువాత చూద్దాం. |
06:33 | మనం ఇప్పుడు terminal తో ఎక్కువ సమయం గడపము. |
06:37 | విండో యొక్క ఎగువ ఎడమవైపున ఉన్న చిన్న X icon పై క్లిక్ చేసి terminal ను మూసివేయండి. |
06:43 | ఈ వెబ్ సైట్ లో Linux స్పొకెన్ ట్యుటోరియల్ సంచికలో Terminal కమాండ్ లు బాగా వివరించబడ్డాయి. |
06:49 | ఇప్పుడు, మరో అప్ప్లికేశన్ Firefox Web Browser (ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్) కి వెళదాం. |
06:55 | మరోసారి Dash home ని తెరవండి. Search bar లో Firefox అని టైప్ చేయండి. |
07:01 | Firefox Web Browser అయికాన్ పై క్లిక్ చేయండి. |
07:05 | Firefox Web Browser అనేది World Wide Web ని యాక్కెస్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
ఇప్పుడు Firefox Web Browser విండో తెరచుకోవడం మనం చూడవచ్చు. |
07:15 | దానికోసం స్పొకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ కి వెళదాం. దానికొసం address bar పై క్లిక్ చేయండి లేదా F6 ని నొక్కండి. |
07:24 | ఇప్పుడు spoken-tutorial.org అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
07:31 | ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే, అప్పుడు Firefox మిమ్మలిని ఇవ్వబడిన వెబ్ సైట్ కి కనెక్ట్ చేస్తుంది. |
07:37 | బ్రౌజర్ పై Spoken Tutorial Homepage ని తెరుస్తుంది. |
07:41 | ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం దీనిని మూసివేసి తరువాతి అప్ప్లికేశన్ కి వెళదాం. |
07:47 | అందుకు, Dash home కి మళ్ళీ వెళ్ళి సర్చ్ బార్ లో office అని టైప్ చేయండి. |
07:53 | మీరు LibreOffice వివిధ భాగాలైన Calc, Impress, Writer మరియు Draw వంటి వాటిని చూస్తారు. |
08:01 | LibreOffice అనేది Ubuntu Linux OS లోని డీఫౌల్ట్ office application. |
08:07 | ఈ భాగాలన్నింటిపైన చాలా మంచి ట్యుటోరియల్ లు స్పొకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. |
08:13 | ఇప్పుడు Video అప్శన్ ని అన్వేశిద్దాం. |
08:17 | సర్చ్ బార్ లో video అని టైప్ చేయండి. |
08:20 | ప్రదర్శనజాబితాలో మనకు Videos అనే పేరుగల ఒక అప్ప్లికేశన్ ఉంది. |
08:25 | Videos అనేది వీడియోలు మరియు పాటలు ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. డీఫాల్ట్ గా ఇది ఓపెన్ ఫార్మాట్ లో ఉండే వీడియోలను మాత్రమే ప్లే చేస్తుంది. |
08:34 | కనుక ఉదాహరణకి నా పెన్ డ్రైవ్ నుండి ఒక నమూనా ఫైల్ ను ప్లేచేస్తాను. |
08:38 | ఇప్పుడు నా మెశీన్ లో యు ఎస్ బి స్లాట్ లో నేను పెన్ డ్రైవ్ ని పెడుతున్నాను. పెన్-డ్రైవ్ ఫోల్డర్ స్వయంచాలకంగా తెరవబడింది. |
08:47 | ఒకవేళ అది తెరచుకోకపోతే మనం లాంచర్ నుండి దానిని యాక్కెస్స్ చేయవచ్చు. |
08:52 | లాంచర్ లో పెన్ డ్రైవ్ అయికన్ ని లొకేట్ చేయండి. |
08:56 | మనం దాని పైన క్లిక్ చేస్తే అది పెన్ డ్రైవ్ లో అందుబాటులో ఉన్న ఫైల్ లు మరియు ఫోల్డర్ లను చూపిస్తుంది. |
09:02 | ఇప్పుడు నేను ప్లే చేయడానికి ఒక సినిమా ఫైల్ big buck bunny.ogv ని ఎంచుకుంటాను. |
09:08 | ఇక్కడ నా ఫైల్ ఉంది. దానిని తెరవడానికి నేను దానిపై డబుల్ క్లిక్ చేస్తాను. |
09:14 | అది డీఫాల్ట్ గా Videos లో తెరచుకుంటుంది. |
09:17 | సినిమా ప్లే అవడాన్ని మనం ఆపుదాం. |
09:20 | ఇప్పుడు డెస్క్ టాప్ కి వెళ్ళడానికి Ctrl, Windows మరియు D కీలని నొక్కండి. |
09:26 | ఇప్పుడు ఈ డెస్క్ టాప్ లో కొన్నిఇతర ముఖ్యమైన విశయాలను చూద్దాం. |
09:31 | ప్రస్తుతం లాంచర్ లో ఉన్న folder అయికన్ ని గమనించండి దానిపై క్లిక్ చేద్దాం. |
09:37 | Home folder తెరచుకుంటుంది. |
09:39 | ఉబంటు లినక్స్ లో ప్రతి యూజర్ కి ఒక ప్రత్యేకమైన Home folder ఉంటుంది. |
09:44 | Home folder ను మనం our house అని చెప్పవచ్చు, ఇక్కడ మనం మన ఫైల్ లు మరియు ఫోల్డర్ లను నిల్వచేసుకోవచ్చు. మన అనుమతిలేనిదే ఇతరులు వాటిని చూడలేరు. |
09:56 | file permissions పైన మరింతసమాచారం లినక్స్ స్పొకెన్ ట్యుటొరియల్ సంచిక లో అందుబాటులో ఉంది. |
10:03 | మనం తిరిగి మారుదాం.
మన Home folder లో మనం ఇతర ఫొల్డర్ లు డెస్క్ టాప్, డాక్యుమెన్ట్స్, డౌన్ లోడ్ మొదలైనటువంటి వాటిని చూడవచ్చు. |
10:14 | లినక్స్ లో ప్రతిఒక్కటి ఒక ఫైల్. మనం Desktop folder ను తెరుద్దాం దానిపై డబల్ క్లిక్ చేయడం ద్వారా దానిని తెరవండి. |
10:21 | ఇక్కడ మనం text editor నుండి సేవ్ చేసిన అదే hello.txt ఫైల్ ని చూడవచ్చు. |
10:28 | అందువల్ల ఈ ఫొల్డర్ మరియు డెస్క్ టాప్ రెండూ ఒకటే. |
10:32 | ఇప్పుడు ఈ ఫొల్డర్ ని మూస్తాను. ఇంతటితో ఈ ట్యుటోరియల్ ను ముగిద్దాం. సారాంశం చూద్దాం. |
10:39 | ఈ ట్యుటొరియల్ లో మనం ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో లాంచర్ మరియు దానిలో అందుబాటులోఉన్న కొన్ని అయికన్ ల గురించి తెలుసుకున్నాం |
10:49 | కొన్ని సామాన్య అప్ప్లికేశన్ లైన Calculator, Text Editor, Terminal, Firefox Web Browser, Videos మరియు LibreOffice Suite భాగాలు మరియు Home folder లను తెలుసుకున్నాం. |
11:04 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
11:12 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
11:25 | మీకు ఈ స్పొకెన్ ట్యుటొరియల్ లో ఏవైనా సందేహాలున్నాయా?
ఈ సైట్ ని సందర్శించండి. |
11:30 | మీకు సందేహంగా ఉన్న నిమిశం లేదా సెకండ్ ని ఎంచుకుని సందేహాన్ని క్లుప్తంగా రాయండి. మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు. |
11:40 | స్పొకెన్ ట్యుటొరియల్ ఫోరం అనేది ప్రత్యేకమైనసందేహాల కొరకు. దయచేసి అనుచిత మరియు అసంధర్భ ప్రశ్నలు పోస్ట్ చేయకండి. |
11:50 | దీనివల్ల ఫోరం అస్తవ్యస్తం కాకుండా ఉంటుంది. సంధర్భానుసారంగా తక్కువగా చర్చలుంటె అవి సూచనలుగా కుడా ఉపయోగపడతాయి. |
11:59 | స్పొకన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
12:11 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |