Linux/C2/Ubuntu-Desktop-16.04/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 హెల్లో, ఉబంటులినక్స్ డెస్క్ టాప్ 16.04 అనే ఈ స్పొకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం gnome ఎన్విరాన్మెంట్ లో ఉబంటులినక్స్ డెస్క్ టాప్ గురించి
00:17 ఇంకా ఉబంటులినక్స్ డెస్క్ టాప్ లోని కొన్ని సాధారణ అప్ప్లికేశన్ లను గురించి తెలుసుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్16.04 అపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను.
00:29 ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ చూడటానికి ఇలా కనిపిస్తుంది.
00:33 మీరు స్క్రీన్ యొక్క ఎడమవైపున launcher (లాంచర్) ని చూస్తారు
00:37 మనం launcher (లాంచర్) ని ఎలా దాచగలము.
00:40 దాన్ని చేయడానికి ఎడమవైపున ఉన్న launcher(లాంచర్) కి వెళ్ళండి. System Settings అయికన్ పై క్లిక్ చేయండి.
00:47 System Settings విండో లో Appearance పై క్లిక్ చేయండి.
00:51 Appearance విండో లో Behavior ట్యాబ్ పై క్లిక్ చేయండి.
00:56 ఇక్కడ, Auto-hide the Launcher ని ON స్థితికి మార్చండి.
01:01 ఇప్పుడు, launcher (లాంచర్) దాచబడుతుంది.
01:04 ఒకవేళ లాంచర్ దాచబడి ఉంటే,ఇక్కడ చూపినవిధంగా దానిని మరలా కనిపించేటట్టు చేయవచ్చు.
01:10 అలా చేయడానికి, కర్సర్‌ను స్క్రీన్ యొక్క ఎడమవైపు చివరకి తరలించండి.
01:15 లాంచర్ ఇప్పుడు కనిపిస్తుంది.
01:18 కర్సర్‌ను దూరంగా తరలిస్తే launcher మళ్లీ దాచబడుతుంది.
01:23 Appearance విండో కి తిరిగి వెళ్ళి Auto-hide the Launcher స్థితిని OFF కు మార్చండి.
01:30 విండో యొక్క ఎగువ ఎడమ ములలో ఉన్న చిన్న X అయికన్ ని క్లిక్ చేసి విండో ని మూసివేయండి.
01:37 గమనించండి ఇక్కడ లాంచర్ లో అప్రమేయంగా కొన్ని అయికన్ లు ఉన్నాయి.
01:42 లాంచర్ యొక్క ఎగువభాగం వద్ద మీరు Dash home icon ని చూడవచ్చు.
01:47 Dash home అనేది ఒక స్క్రీన్ లోపల ఉబంటు లినక్స్ లోని అన్ని అప్ప్లికేశన్లకు అక్కెస్స్ ఇచ్చే ఒక ఇంటర్ఫేస్.
01:55 Dash home ని తెరవడానికి దానిపై క్లిక్ చేయండి.
01:59 ఎగువభాగం వద్ద ప్రధానంగా మీరు search bar ఫీల్డ్ ను చూస్తారు.
02:04 ఇప్పుడు, మనము ఒక నిర్దిష్ట అప్లికేషన్ ని ఎలా గుర్తించగలం? మీరు వెతుకుతున్న అప్లికేషన్ పేరును టైప్ చేస్తే చాలు మీరు తక్షణమే దానిని కనుగొంటారు,

ఇది చాలా సులభం!

02:16 ఇప్పుడు Calculator అప్ప్లికేశన్ ని కనుగొనడానికి ప్రయత్నిద్దాం.
02:20 దానికి, search bar ఫీల్డ్ లో C a l c అని టైప్ చేయండి.
02:26 వారి పేరులో c a l c లో కలిగిఉన్న ఉన్న అన్ని applications జాబితా చేయబడతాయి.
02:32 గమనించండి ఇక్కడ LibreOffice Calc మరియు Calculator రెండూ జాబితా చేయబడ్డాయి.
02:37 Calculator అయికన్ పై క్లిక్ చేయండి.

Calculator application ఇప్పుడు స్క్రీన్ పైన తెరుచుకుంటుంది.

02:45 Calculator గణిత, వైజ్గానిక లేదా ఆర్ధిక గణనలను చేయటానికి సహాయం చేస్తుంది.
02:52 మనం కొన్ని సాధారణ గణనలను ప్రయత్నిద్దాం.
02:55 5 asterix 8 అని టైప్ చేసి equal to గుర్తు పై క్లిక్ చేయండి.
03:02 equal to గుర్తు పై క్లిక్ చేయడానికి బదులు మీరు కీ బోర్డ్ పైన ఎంటర్ ని కూడా నొక్కవచ్చు.
03:09 జవాబు Calculator లో ప్రదర్శించబడుతుంది.
03:13 ఇదే విధంగా మనం Calculator అప్ప్లికేశన్ ఉపయోగించి అన్ని రకాల గణనలను చేయవచ్చు.
03:20 ఇప్పుడు Calculator నుండి నిష్క్రమించడానికి విండో యొక్క ఎగువ ఎడమవైపు ఉన్నచిన్న X icon పై క్లిక్ చేయండి.
03:28 ఇప్పుడు మనం Ubuntu Linux OS లో కొన్ని ఇతర ముఖ్యమైన అప్ప్లికేశన్ లతో పరిచయమవుదాం.
03:34 దానికోసం మనం తిరిగి Dash home కి వెళదాం.
03:38 Search bar లో gedit అని టైప్ చేద్దాం. gedit అనేది Ubuntu Linux OS లో డీఫౌల్ట్ టెక్స్ట్ ఎడిటర్.
03:48 Text Editor అనే అయికాన్ కింద కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి తెరుద్దాం.
03:55 మీరు ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నది, gedit Text Editor విండో.
04:00 ఇక్కడ నన్ను కొంత టెక్స్ట్ ను టైప్ చేయనివ్వండి. ఉదాహరణకి Hello World అని టైప్ చేద్దాం.
04:07 ఫైల్ ని సేవ్ చేయడానికి కీ బోర్డ్ లో Ctrl మరియు S ని ఏకకాలం లో నొక్కండి.
04:14 లేదంటే, మనం File పై క్లిక్ చేసి తర్వాత Save పై క్లిక్ చేయవచ్చు.
04:20 ఇప్పుడు, Save as అనే ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది. అది ఫైల్ నేమ్ మరియు ఫైల్ ని సేవ్ చేయాల్సిన లొకేషన్ అడుగుతుంది.
04:31 ఫైల్ పేరుని Hello.txt గా టైప్ చేద్దాం.
04:36 txt అనేది text file యొక్క డీఫాల్ట్ ఎక్స్టెన్షన్.
04:41 లొకేశన్ కొరకు డెస్క్ టాప్ ని ఎంపిక చేసుకుందాం. దిగువభాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయాలి.
04:49 ఇప్పుడు విండో యొక్క ఎగువ ఎడమవైపున ఉన్న చిన్న X icon పై క్లిక్ చేయడం ద్వారా ఈ gedit విండోని మూసివేయండి.
04:57 డెస్క్ టాప్ పై మనం file Hello.txt ని చూడవచ్చు. మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా సేవ్ చేయబడింది అని దీని అర్ధం.
05:05 ఆ ఫైల్ పై డబల్ క్లిక్ చేసి దాన్ని తెరుస్తాను.
05:09 మన text file మనం రాసిన టెక్స్ట్ తో తెరచుకోవడం మనం చూడవచ్చు.
05:14 gedit Text Editor గురించి ఇంటర్నెట్ లో చాలా సమాచారం ఉంది.
05:19 ఇక్కడ ఈ వెబ్ సైట్ లో కొన్ని స్పోకెన్ ట్యుటోరియల్స్ ఈ టాపిక్ పై కూడా అందుబాటులో ఉన్నాయి.
05:25 ఈ text editor ను మూసివేసి Terminal అనే మరొక application ను చూద్దాం.
05:32 దానికి మరోసారి Dash home కి వెళదాం. ఇప్పుడు search bar field లో terminal అని టైప్ చేయండి.
05:41 కింద కనిపిస్తున్న టర్మినల్ (Terminal) అయికాన్ పై క్లిక్ చేయండి.
05:45 తెరపైన terminal విండో తెరచుకుంటుంది.

Ctrl+Alt+T కీస్ అనేవి Terminal ను తెరవడానికి షార్ట్కట్ అని గమనించండి.

05:55 terminal ని command line అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ నుండి కంప్యుటర్ కి కమాండ్ లను ఇవ్వవచ్చు.
06:02 వాస్తవానికి ఇది GUI కంటే శక్తివంతమైనది.
06:06 ఇప్పుడు నన్ను Terminal విండో కి తిరిగి మారనివ్వండి.
06:09 ఇప్పుడు terminal యొక్క అనుభూతిని పొందడానికి ఒక సరళమైన కమాండ్ ను టైప్ చేద్దాం. ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:18 మీరు కరెంట్ directory లో అన్ని ఫైల్ లు మరియు ఫొల్డర్ ల యొక్క జాబితాను చూడవచ్చు.
06:23 ఇక్కడ, ఇది హోమ్ ఫోల్డర్ నుండి ఫైల్స్ మరియు ఫోల్డర్ల ను ప్రదర్శిస్తోంది.
06:28 మనం హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటి అనేది ఈ ట్యుటోరియల్‌లో తరువాత చూద్దాం.
06:33 మనం ఇప్పుడు terminal తో ఎక్కువ సమయం గడపము.
06:37 విండో యొక్క ఎగువ ఎడమవైపున ఉన్న చిన్న X icon పై క్లిక్ చేసి terminal ను మూసివేయండి.
06:43 ఈ వెబ్ సైట్ లో Linux స్పొకెన్ ట్యుటోరియల్ సంచికలో Terminal కమాండ్ లు బాగా వివరించబడ్డాయి.
06:49 ఇప్పుడు, మరో అప్ప్లికేశన్ Firefox Web Browser (ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్) కి వెళదాం.
06:55 మరోసారి Dash home ని తెరవండి. Search bar లో Firefox అని టైప్ చేయండి.
07:01 Firefox Web Browser అయికాన్ పై క్లిక్ చేయండి.
07:05 Firefox Web Browser అనేది World Wide Web ని యాక్కెస్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

ఇప్పుడు Firefox Web Browser విండో తెరచుకోవడం మనం చూడవచ్చు.

07:15 దానికోసం స్పొకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ కి వెళదాం. దానికొసం address bar పై క్లిక్ చేయండి లేదా F6 ని నొక్కండి.
07:24 ఇప్పుడు spoken-tutorial.org అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
07:31 ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే, అప్పుడు Firefox మిమ్మలిని ఇవ్వబడిన వెబ్ సైట్ కి కనెక్ట్ చేస్తుంది.
07:37 బ్రౌజర్ పై Spoken Tutorial Homepage ని తెరుస్తుంది.
07:41 ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం దీనిని మూసివేసి తరువాతి అప్ప్లికేశన్ కి వెళదాం.
07:47 అందుకు, Dash home కి మళ్ళీ వెళ్ళి సర్చ్ బార్ లో office అని టైప్ చేయండి.
07:53 మీరు LibreOffice వివిధ భాగాలైన Calc, Impress, Writer మరియు Draw వంటి వాటిని చూస్తారు.
08:01 LibreOffice అనేది Ubuntu Linux OS లోని డీఫౌల్ట్ office application.
08:07 ఈ భాగాలన్నింటిపైన చాలా మంచి ట్యుటోరియల్ లు స్పొకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
08:13 ఇప్పుడు Video అప్శన్ ని అన్వేశిద్దాం.
08:17 సర్చ్ బార్ లో video అని టైప్ చేయండి.
08:20 ప్రదర్శనజాబితాలో మనకు Videos అనే పేరుగల ఒక అప్ప్లికేశన్ ఉంది.
08:25 Videos అనేది వీడియోలు మరియు పాటలు ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. డీఫాల్ట్ గా ఇది ఓపెన్ ఫార్మాట్ లో ఉండే వీడియోలను మాత్రమే ప్లే చేస్తుంది.
08:34 కనుక ఉదాహరణకి నా పెన్ డ్రైవ్ నుండి ఒక నమూనా ఫైల్ ను ప్లేచేస్తాను.
08:38 ఇప్పుడు నా మెశీన్ లో యు ఎస్ బి స్లాట్ లో నేను పెన్ డ్రైవ్ ని పెడుతున్నాను. పెన్-డ్రైవ్ ఫోల్డర్ స్వయంచాలకంగా తెరవబడింది.
08:47 ఒకవేళ అది తెరచుకోకపోతే మనం లాంచర్ నుండి దానిని యాక్కెస్స్ చేయవచ్చు.
08:52 లాంచర్ లో పెన్ డ్రైవ్ అయికన్ ని లొకేట్ చేయండి.
08:56 మనం దాని పైన క్లిక్ చేస్తే అది పెన్ డ్రైవ్ లో అందుబాటులో ఉన్న ఫైల్ లు మరియు ఫోల్డర్ లను చూపిస్తుంది.
09:02 ఇప్పుడు నేను ప్లే చేయడానికి ఒక సినిమా ఫైల్ big buck bunny.ogv ని ఎంచుకుంటాను.
09:08 ఇక్కడ నా ఫైల్ ఉంది. దానిని తెరవడానికి నేను దానిపై డబుల్ క్లిక్ చేస్తాను.
09:14 అది డీఫాల్ట్ గా Videos లో తెరచుకుంటుంది.
09:17 సినిమా ప్లే అవడాన్ని మనం ఆపుదాం.
09:20 ఇప్పుడు డెస్క్ టాప్ కి వెళ్ళడానికి Ctrl, Windows మరియు D కీలని నొక్కండి.
09:26 ఇప్పుడు ఈ డెస్క్ టాప్ లో కొన్నిఇతర ముఖ్యమైన విశయాలను చూద్దాం.
09:31 ప్రస్తుతం లాంచర్ లో ఉన్న folder అయికన్ ని గమనించండి దానిపై క్లిక్ చేద్దాం.
09:37 Home folder తెరచుకుంటుంది.
09:39 ఉబంటు లినక్స్ లో ప్రతి యూజర్ కి ఒక ప్రత్యేకమైన Home folder ఉంటుంది.
09:44 Home folder ను మనం our house అని చెప్పవచ్చు, ఇక్కడ మనం మన ఫైల్ లు మరియు ఫోల్డర్ లను నిల్వచేసుకోవచ్చు. మన అనుమతిలేనిదే ఇతరులు వాటిని చూడలేరు.
09:56 file permissions పైన మరింతసమాచారం లినక్స్ స్పొకెన్ ట్యుటొరియల్ సంచిక లో అందుబాటులో ఉంది.
10:03 మనం తిరిగి మారుదాం.

మన Home folder లో మనం ఇతర ఫొల్డర్ లు డెస్క్ టాప్, డాక్యుమెన్ట్స్, డౌన్ లోడ్ మొదలైనటువంటి వాటిని చూడవచ్చు.

10:14 లినక్స్ లో ప్రతిఒక్కటి ఒక ఫైల్. మనం Desktop folder ను తెరుద్దాం దానిపై డబల్ క్లిక్ చేయడం ద్వారా దానిని తెరవండి.
10:21 ఇక్కడ మనం text editor నుండి సేవ్ చేసిన అదే hello.txt ఫైల్ ని చూడవచ్చు.
10:28 అందువల్ల ఈ ఫొల్డర్ మరియు డెస్క్ టాప్ రెండూ ఒకటే.
10:32 ఇప్పుడు ఈ ఫొల్డర్ ని మూస్తాను. ఇంతటితో ఈ ట్యుటోరియల్ ను ముగిద్దాం. సారాంశం చూద్దాం.
10:39 ఈ ట్యుటొరియల్ లో మనం ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో లాంచర్ మరియు దానిలో అందుబాటులోఉన్న కొన్ని అయికన్ ల గురించి తెలుసుకున్నాం
10:49 కొన్ని సామాన్య అప్ప్లికేశన్ లైన Calculator, Text Editor, Terminal, Firefox Web Browser, Videos మరియు LibreOffice Suite భాగాలు మరియు Home folder లను తెలుసుకున్నాం.
11:04 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
11:12 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరింత సమాచారం కోసం మాకు రాయండి.
11:25 మీకు ఈ స్పొకెన్ ట్యుటొరియల్ లో ఏవైనా సందేహాలున్నాయా?

ఈ సైట్ ని సందర్శించండి.

11:30 మీకు సందేహంగా ఉన్న నిమిశం లేదా సెకండ్ ని ఎంచుకుని సందేహాన్ని క్లుప్తంగా రాయండి. మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు.
11:40 స్పొకెన్ ట్యుటొరియల్ ఫోరం అనేది ప్రత్యేకమైనసందేహాల కొరకు. దయచేసి అనుచిత మరియు అసంధర్భ ప్రశ్నలు పోస్ట్ చేయకండి.
11:50 దీనివల్ల ఫోరం అస్తవ్యస్తం కాకుండా ఉంటుంది. సంధర్భానుసారంగా తక్కువగా చర్చలుంటె అవి సూచనలుగా కుడా ఉపయోగపడతాయి.
11:59 స్పొకన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
12:11 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya