Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-pregnant-women/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | గర్భిణీ స్త్రీల కొరకు శాఖాహార వంటకాలపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనము వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:10 | అధికంగా పుష్టిని ఇచ్చే ఆహారం యొక్క ప్రాముఖ్యత. |
00:13 | కొన్ని పౌష్టికమైన శాఖాహార వంటకాలు. |
00:17 | మొదట, మనం ఎక్కువగా పుష్టినిచ్చే ఆహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. |
00:23 | గర్భధారణ సమయంలో పోషక అవసరాలు పెరుగుతాయి. |
00:28 | ముఖ్యంగా ఇది కణాల యొక్క అభివృద్ధి కోసం. |
00:32 | పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం అనేది పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది. |
00:38 | అందువల్ల, అధికంగా పుష్టినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. |
00:43 | మంచి పుష్టికరమైన ఆహారం అనేది గర్భధారణ సమయంలోని సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. |
00:48 | ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండాలి, |
00:51 | మంచి కొవ్వులు,
వైటమిన్స్ |
00:53 | మరియు మినరల్స్ కూడా. |
00:55 | మంచి పౌష్టికమైన ఆహారాన్ని తినడం వల్ల వికారం మరియు మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. |
01:02 | అలాగే ఇది రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, |
01:05 | గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం |
01:07 | మరియు రక్తపోటును కూడా. |
01:09 | అలాగే ఇది శిశువు తక్కువ జనన బరువుతో పుట్టే అవకాశాన్ని |
01:13 | ఇంకా నెలలు నిండకుండా ప్రసవం అయ్యే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. |
01:16 | మంచి ఆహారం మాత్రమే కాకుండా, ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగేలా చూసుకోండి. |
01:22 | పోష్టికమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, దానిలో ఉండే పోషకాలను గ్రహించడం కూడా చాలా ముఖ్యం. |
01:29 | ఆహారంలో ఉండే ఫైటేట్లు, ఆక్సలేట్లు మరియు టానిన్లు అనేవి పోషకాల్ని గ్రహించటాన్ని ప్రభావితం చేస్తాయి. |
01:36 | వివిధ రకాల వంట పద్ధతులను ఉపయోగించడం ద్వారా పోషకాలను గ్రహించడాన్నిపెంచవచ్చు. |
01:42 | ఉదాహరణకు: నానబెట్టడం, |
01:45 | మొలకెత్తించడం,
వేయించడం |
01:47 | మరియు పులియబెట్టడం (కిణ్వ ప్రక్రియ). |
01:48 | నీటి ఆవిరిలో ఉడికించడం
లైట్ గా వేయించడం |
01:50 | మరియు ఉడికించడం అనేవి మరికొన్ని ఇతర ఉదాహరణలు. |
01:54 | పౌష్ఠిక విలువల్నిపెంచడానికి, మనం వివిధ పౌష్టికమైన పొడులను కూడా ఉపయోగించవచ్చు. |
02:01 | మునగాకులు, |
02:03 | కరివేపాకు లేదా
కాయలు మరియు విత్తనాల యొక్క ఏ పొడినైనా ఉపయోగించవచ్చు. |
02:07 | ఈ పొడులను తయారుచేసే పద్ధతి అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
02:12 | మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
02:15 | గర్భం దాల్చిన 9 నెలల్లో ఆరోగ్యకరమైన బరువు పెరగడం చాలా అవసరం. |
02:20 | వీటిని మానివేయమని సిఫార్సు చేయబడింది చక్కెర, |
02:23 | బెల్లం,
ప్రాసెస్ చేయబడినవి |
02:25 | మరియు తినడానికి సిద్ధంగా ఉండే ఆహారాలు. |
02:28 | వీటిని మానుకోండి కెఫిన్,
మద్యం |
02:30 | మరియు పొగాకు. |
02:32 | డాక్టర్ అనుమతి లేకుండా ఏ మందులను (ఔషధం) తీసుకోకండి. |
02:36 | దీని గురించి మరిన్ని వివరాలు మరొక ట్యుటోరియల్‌లో వివరించబడ్డాయి. |
02:40 | ఇప్పుడు మనం, మన మొదటి వంటకమైన అలసందల (బొబ్బర్ల) ఇడ్లీతో ప్రారంభిద్దాం. |
02:46 | ఈ వంటకాన్ని తయారు చేయడానికి మనకు ఇవి ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్లు కావాలి: |
02:50 | సజ్జలు |
02:52 | కొర్రబియ్యం |
02:54 | మనకు ఇవి కూడా ఒక్కోటి 1 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి |
02:57 | మొలకెత్తిన అలసందలు (బొబ్బర్లు) |
02:59 | మొలకెత్తిన కొమ్ము శనగలు |
03:01 | మెంతులు |
03:03 | వేయించిన పొద్దుతిరుగుడు విత్తనాలు |
03:05 | మనకు ఇవి కూడా ఒక్కోటి 1/4 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి |
03:10 | మునగాకుల పొడి
కరివేపాకు పొడి |
03:13 | గింజలు మరియు విత్తనాల పొడి |
03:15 | మరియు ఉప్పు |
03:17 | మొదట అలసందలు మరియు కొమ్ముశనగలను మొలకెత్తించడంతో ప్రారంభించండి. |
03:22 | మొలకెత్తించే విధానాన్ని నేను వివరిస్తాను. |
03:25 | అలసందలు మరియు కొమ్ముశనగలను విడివిడిగా రాత్రంతా నానబెట్టండి. |
03:31 | ఉదయం వాటిలో నీటినంతా వంపేసి విడివిడిగా వాటిని మస్లిన్ వస్త్రంలో మూట కట్టండి. |
03:36 | మొలకెత్తడం కోసం వాటిని వెచ్చని ప్రదేశంలో 2 రోజులు ఉంచండి. |
03:40 | వేర్వేరు రకాల బీన్స్ (గింజలు) మొలకెత్తడానికి వేర్వేరు సమయాలు తీసుకుంటాయని గుర్తుంచుకోండి. |
03:45 | మొలకలు సిద్ధంగా ఉన్నప్పుడు చిరుధాన్యాలు మరియు మెంతి గింజలను కలిపి నానబెట్టండి. |
03:50 | వాటిని 6 నుండి 8 గంటలసేపు లేదా రాత్రంతా నానబెట్టండి. |
03:55 | నీటిని వంపేసి చిరుధాన్యాలను, పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు మొలకలతో కలిపి గ్రైండ్ చేసి మెత్తని పిండిని తయారు చేయండి. |
04:01 | గ్రైండింగ్ కోసం మీరు రాతి రోలు లేదా మిక్సర్ ను ఉపయోగించవచ్చు. |
04:06 | గ్రైండ్ చేసిన తరువాత, పులియబెట్టడానికి ఆ పిండిని రాత్రంతా లేదా 6 నుండి 8 గంటలసేపు మూతపెట్టి ఉంచండి. |
04:13 | వంట చేయడానికి ముందు, ఆ పిండిలో ఉప్పు ఇంకా అన్ని ఇతర పొడులను వేసి బాగా కలపాలి. |
04:19 | ఇడ్లీ పాత్రకు నూనె రాసి, అందులో ఈ పిండిని వేయండి. |
04:24 | దాన్ని కుక్కర్ లో లేదా స్టీమర్‌లో ఉంచి 10-12 నిమిషాల సేపు ఉడికించాలి. |
04:29 | లేదా మీరు కుక్కర్లో 1/4 వ భాగాన్ని నీటితో నింపి, విజిల్ పెట్టకుండా ఆవిరితో ఉడికించవచ్చు. |
04:35 | 7 నుండి 8 నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసి వేడిగా వడ్డించండి. |
04:41 | ఈ వంటకంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ప్రోటీన్, |
04:45 | కాల్షియం
మరియు ఐరన్. |
04:47 | ఇందులో ఇవి కూడా సమృద్ధిగా ఉన్నాయి ఫోలేట్, |
04:50 | మెగ్నీషియం
మరియు పొటాషియం. |
04:53 | తరువాతి వంటకం చిరుధాన్యాలతో ఖిచ్డి. |
04:56 | దీన్ని తయారు చేయడానికి, మనకు కావాల్సినవి ఇవన్నీ ఒక్కోటి 1 టేబుల్ స్పూన్ చొప్పున |
05:01 | ఊదలు
మొలకెత్తిన సజ్జలు |
05:04 | మొలకెత్తిన సోయాబీన్ |
05:06 | 1 తరిగిన ఉల్లిపాయ
1 తరిగిన క్యారెట్ |
05:09 | 1 తరిగిన బీట్‌రూట్ |
05:11 | మనకు ఇవి కూడా ప్రతీదీ 1 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి |
05:15 | తురిమిన తాజా కొబ్బరి |
05:17 | మరియు గసగసాలు |
05:19 | మనకు ఇవి కూడా అవసరం |
05:21 | ½ కప్పు పెరుగు |
05:23 | వీటిలో ప్రతి పదార్ధం 1/4 టీస్పూన్ చొప్పున కావాలి |
05:26 | పసుపు పొడి,
ధనియాలు |
05:28 | మరియు జీలకర్ర పొడి. |
05:30 | జీలకర్ర, |
05:32 | మునగాకుల పొడి,
కరివేపాకు పొడి, |
05:35 | రుచికి సరిపడా ఉప్పు, మరియు |
05:37 | 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి. |
05:40 | గమనించండి, నేను మొలకెతించడానికి సజ్జలు మరియు సోయాబీన్లను విడివిడిగా నానబెట్టాను. |
05:46 | ఒక దానికి మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా రెండూ ఒకే సమయంలో మొలకెత్తవచ్చు. |
05:52 | నా విషయంలో, సోయాబీన్ లు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టింది. |
05:57 | ఊదలను 6 నుండి 8 గంటలసేపు నీటిలో నానబెట్టండి. |
06:01 | నీటిని వంపేసి వాటిని ఒక పక్కన ఉంచండి. |
06:04 | ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేసి వేడిచేసి అందులో జీలకర్ర వేయండి. |
06:09 | ఇప్పుడు, అన్ని కూరగాయలు, మొలకెత్తిన చిరుధాన్యాలు, మొలకెత్తిన సోయాబీన్ లు మరియు పెరుగు వేయండి. |
06:17 | తురిమిన కొబ్బరి, గసగసాలు, ఉప్పు, పొడులు మరియు అన్ని మసాలా దినుసులు అందులో వేయండి. |
06:23 | బాగా కలపండి. |
06:25 | తరువాత, అందులో 1 కప్పు నీరు వేయండి. |
06:28 | ఖిచ్డిని 2 విజిల్స్ వచ్చేవరకు ప్రెజర్ కుక్ చేయాలి. |
06:32 | తయారైన తరువాత, వేడిగా వడ్డించండి. |
06:35 | ఈ వంటకంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ప్రోటీన్లు, |
06:38 | మంచి కొవ్వులు,
వైటమిన్ -A |
06:40 | మరియు కాల్షియం. |
06:42 | ఇందులో ఇటువంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి ఐరన్, |
06:45 | ఫోలేట్,
మెగ్నీషియం |
06:47 | మరియు పాస్పరస్. |
06:49 | మన మూడవ వంటకం మూంగ్ ర్యాప్. |
06:53 | ఈ రెసిపీ కోసం మనకు అవసరమైనవి: |
06:55 | మాల్టెడ్ రాగి పిండి- ¼ కప్పు |
06:58 | శనగపిండి- 1 టేబుల్ స్పూన్ |
07:01 | మొలకెత్తిన పెసలు- ½ కప్పు |
07:04 | తురిమిన పన్నీర్- ¼ కప్పు |
07:06 | ఉల్లి తరుగు- 1 టేబుల్ స్పూన్ |
07:08 | తరిగిన టమోటా- 1 టేబుల్ స్పూన్ |
07:12 | మనకు ఇవన్నీ కూడా ప్రతిది 1/4 టీస్పూన్ చొప్పున అవసరం: |
07:15 | పసుపు పొడి |
07:17 | ధనియాలు
మరియు జీలకర్ర పొడి |
07:19 | జీలకర్ర
కరివేపాకు పొడి |
07:22 | మునగాకుల పొడి |
07:24 | 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి |
07:27 | మనకు సగం నిమ్మకాయ కూడా కావాలి |
07:29 | మరియు రుచికి సరిపడా ఉప్పు. |
07:32 | తయారీవిధానం
ఈ ట్యుటోరియల్‌లో ఇంతకు ముందు చెప్పినట్లుగా పెసలను మొలకలు చేయండి. |
07:37 | మాల్టెడ్ రాగి పిండిని తయారు చేయడానికి, రాగులను రాత్రంతా నానబెట్టండి. |
07:42 | ఇప్పుడు వాటిని మస్లిన్ వస్త్రంలో మూటకట్టి 6-8 గంటలసేపు లేదా రాత్రంతా ఉంచండి. |
07:48 | ఒకసారి అవి మొలకెత్తిన తర్వాత, రాగి మొలకలను ఇనుప చట్టి మీద వేయించుకోవాలి. |
07:54 | వేయించిన తరువాత, పిండిని తయారు చేయడానికి గ్రైండర్ ను ఉపయోగించి పిండి చేసి దానిని ఒక పక్కన ఉంచండి. |
08:01 | ఒక ఇనుప పాన్ మీద నూనె వేసి వేడి చేయండి. |
08:04 | జీలకర్ర, మసాలా దినుసులు మరియు పొడులు అందులో వేయండి. |
08:09 | అందులో తరిగిన ఉల్లిపాయ, టమోటా వేసి అవి మెత్తగా అయ్యే వరకు వేయించండి. |
08:14 | తరువాత, మొలకెత్తిన పెసలు వేసి వాటిని10 నిమిషాలు ఉడకనివ్వండి. |
08:19 | అందులో పన్నీర్ మరియు ఉప్పు వేసి 5 నుండి 10 నిమిషాల సేపు ఉడికించండి. |
08:24 | ¼ కప్పు నీరు పోసి మరో 5-10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. |
08:30 | మంటను ఆపివేసి దాన్ని చల్లారనివ్వండి. |
08:34 | ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచండి. |
08:38 | తరువాత, ఒక గిన్నెలో మాల్టెడ్ రాగి పిండి మరియు శనగపిండి వేసి కలపండి. |
08:44 | అందులో గోరువెచ్చని నీరు వేసి పిండిని ముద్దలా చేయండి. |
08:48 | ఇప్పుడు ఆ ముద్దతో గుండ్రని ఆకారంలో పరాటాలను వత్తండి. |
08:51 | ఇనుప పాన్ మీద వేసి పరాటాలను రెండు వైపులా కాల్చండి. |
08:56 | ఈ పరాటాను ఒక ప్లేట్ లో పెట్టి, పరాటా మధ్యలో పెసలు మిశ్రమాన్ని ఉంచండి. |
09:02 | ఇప్పుడు వాటిని ఒక ర్యాప్ లాగ రోల్ చేసి సర్వ్ చేయాలి. |
09:05 | ఈ రెసిపీలో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్ |
09:07 | మరియు మంచి కొవ్వులు. |
09:10 | ఇది వీటికి కూడా ఒక మంచి వనరు క్యాల్షియం, |
09:12 | ఐరన్,
ఫోలేట్, |
09:14 | మెగ్నీషియం
మరియు జింక్. |
09:16 | ఇక్కడ పేర్కొన్న చిరుధాన్యాలు మాత్రమే కాకుండా, మీరు ఇతర చిరుధాన్యాలు మరియు గింజలను ఉపయోగించవచ్చు. |
09:22 | ఉదాహరణకు: జొన్నలు, |
09:24 | అరికెలు,
గోధుమ రవ్వ |
09:26 | లేదా పూర్తి గోధుమలు. |
09:28 | అదేవిధంగా, మీరు ఇతర మొలకలను కూడా ఉపయోగించవచ్చు. |
09:32 | ఉదాహరణకి:
మొలకెత్తిన శనగలు, |
09:35 | మొలకెత్తిన పచ్చ బఠానీలు లేదా |
09:37 | మొలకెత్తిన మోటు పెసలు. |
09:39 | పేర్కొన్న విత్తనాలతో పాటు, మీరు స్థానికంగా లభించే ఇతర విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు. |
09:46 | ఉదాహరణకి:
నువ్వు గింజలు, |
09:48 | గుమ్మడికాయ గింజలు, |
09:50 | అవిసె గింజలు
మరియు గార్డెన్ క్రెస్ విత్తనాలు(అదిత్యాలు). |
09:53 | ఆరోగ్యకరమైన గర్భానికి మరియు శిశువు యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ వంటకాలను చేర్చండి. |
10:00 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |