Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-pregnant-women/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 గర్భిణీ స్త్రీల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం -

గర్భిణీ స్త్రీల కొరకు మాంసాహారం యొక్క ప్రాముఖ్యత మరియు వివిధ మాంసాహార వంటకాలను గురించి నేర్చుకుంటాము.

00:15 మొదట మనం వివిధ మాంసాహార ఆహారాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
00:20 చికెన్, మాంసం, చేపలు, రొయ్యలు, అవయవ మాంసం వంటి మాంసాహార ఆహారాల్లో ప్రోటీన్, జింక్, కోలిన్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.
00:30 పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ పోషకాలు అనేవి అవసరం.
00:35 అవి శిశువు యొక్క మెదడు అభివృద్ధికి సహాయపడతాయి ఇంకా తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోను సహాయపడతాయి.
00:41 ఈ పోషకాలను పొందడానికి, గర్భధారణ సమయంలో తప్పకుండా మాంసాహారం తినాలి.
00:46 ఇప్పుడు, మనం కొన్ని మాంసాహార వంటకాలను చూస్తాము.
00:50 మనం కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అనే మన మొదటి వంటకంతో ప్రారంభిద్దాం.
00:55 ఈ వంటకం కొరకు, మనకు కావాల్సినవి -

2 ఉడికించిన గుడ్లు, తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ,

01:02 తరిగిన టమోటా 1,

వెల్లుల్లి రెబ్బలు 2,

01:06 ½ అంగుళం అల్లం ముక్క,

సగం కరివేపాకు రెమ్మ,

01:11 ఇవన్నీ ¼ టీస్పూన్ చొప్పున -

గరం మసాలా పొడి,

01:14 మిరియాల పొడి,

కాశ్మీరీ ఎర్ర కారం పొడి,

01:18 పసుపు పొడి,

1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర,

01:22 1 టేబుల్ స్పూన్ నూనె ఇంకా రుచికి సరిపడా ఉప్పు.
01:26 మొదట, మనం ఉడికించిన గుడ్లను ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.
01:29 1 అంగుళం ఎత్తు వరకు చల్లటి నీటితో ఒక గిన్నెను నింపండి.

అందులో గుడ్లు ఉంచి మూతపెట్టండి.

01:36 నీటిని ఎక్కువ మంట మీద మరగనివ్వండి.

తరువాత, గుడ్లు పూర్తిగా బాగా ఉడకడం కోసం మీడియం మంట మీద 6 నుండి 7 నిమిషాలు ఉడికించండి.

01:44 ఇప్పుడు గుడ్లు పైన ఉన్న గట్టి పెంకును తీసేసి వాటిని పక్కన ఉంచండి.
01:48 తరువాత, ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయండి.

అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేయండి.

01:54 మంటను మీడియంకు మార్చి ఉల్లిపాయ ముక్కలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వాటిని వేయించండి.
01:59 ఆ తరువాత, అన్ని పొడి మసాలాలను వేయండి, మీకు మంచి వేగిన వాసన వచ్చే వరకు వేయించండి.
02:04 తరువాత, తరిగిన టమోటా ముక్కలు ఇంకా ఉప్పు వేయండి.
02:07 ఇప్పుడు 1 కప్పు నీరు పోసి ఆ మిశ్రమాన్ని ఉడికించండి.
02:12 టమోట ముక్కలు మగ్గటం ప్రారంభమయ్యే వరకు కొన్ని నిమిషాలు మంటను తగ్గించి పెట్టండి.

ఆ తరువాత, ఉడికించిన గుడ్లను అందులో వేయండి.

02:18 కళాయికి మూతపెట్టి, గుడ్లను తక్కువ మంట మీద 10 నుండి 15 నిమిషాలు సేపు ఉంచండి.
02:23 మంటను ఆపివేసి, తరిగిన కొత్తిమీర ను వేయండి.
02:26 గుడ్లు విరిగిపోకుండా గ్రేవీని మెల్లగా కలపండి.

దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లో వేయండి.

02:32 ముందుకు వెళుతూ, మన రెండవ వంటకం - చికెన్ చెట్టినాడ్ గురించి నేర్చుకుందాం.
02:37 దీని కోసం, మనకు కావాల్సినవి -

100 గ్రాముల చికెన్ బ్రెస్ట్,

02:42 1 టేబుల్ స్పూన్ నూనె,

సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ,

02:46 1 మీడియం టమోటా,
02:48 1 నుండి 2 రెమ్మల కరివేపాకు మరియు

1 జాపత్రి ఆకు.

02:52 మెరినేషన్ (ఊరపెట్టటం) కొరకు, మనకు అవసరమైనవి -

¼ టీస్పూన్ పసుపు పొడి,

02:56 ¼ టీస్పూన్ కారం పొడి,
02:58 1 టేబుల్ స్పూన్ అల్లం- వెల్లుల్లి పేస్ట్ మరియు

రుచికి సరిపడా ఉప్పు.

03:03 గ్రేవీ కోసం, మనకు అవసరమైనవి - ½ టేబుల్ స్పూన్ ధనియాలు,

½ టీస్పూన్ సోపు గింజలు,

03:10 1 టీస్పూన్ మిరియాలు,

1 టీస్పూన్ ఎర్ర కారం పొడి,

03:14 2 ఏలకులు,

2 లవంగాలు,

03:17 ½ అంగుళం దాల్చిన చెక్క ముక్క మరియు

2 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి.

03:22 చికెన్‌ను మ్యారినేట్ చేయడంతో (ఊరపెట్టటం తో) ప్రారంభిద్దాం-

ఒక గిన్నెలో చికెన్, పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి కలపాలి.

03:31 దాన్ని గది ఉష్ణోగ్రత వద్ద 30 నుండి 45 నిమిషాలు సేపు ఉంచండి
03:34 తక్కువ మంట మీద, ధనియాలను నూనె లేకుండా వేయించండి.
03:38 2 నుండి 3 నిమిషాల తరువాత, మిగిలిన మసాలా దినుసులను వేయండి.
03:42 మీకు మసాలాల నుండి మంచి వాసన వచ్చేవరకు వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి.
03:47 తరువాత కొబ్బరితురుమును కొన్ని నిమిషాలు వేయించుకోవాలి.
03:50 వేయించిన మసాలాలు ఇంకా కొబ్బరితురుమును చల్లారనివ్వండి.
03:53 రాతి రోలు లేదా మిక్సర్ గ్రైండర్ ను ఉపయోగించి 1 టేబుల్ స్పూన్ నీరు పోసి వాటిని చక్కటి పేస్ట్‌గా రుబ్బండి.
04:00 ఈ పేస్ట్ ని ఒక పక్కన ఉంచండి.ప్యూరీ చేయడానికి బ్లెండర్లో టమోటాలు వేయండి.
04:06 ఇప్పుడు ఒక కళాయి (పాన్) లో, నూనె వేసి వేడి చేయండి.

అందులో ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.

04:12 దాంట్లో చికెన్ వేసి మీడియం మంట మీద 4 నుండి 5 నిమిషాలు మళ్ళీ వేయించాలి.
04:16 టమోటా ప్యూరీ, పసుపు, ఉప్పు ఇంకా కారం పొడి వేయండి.
04:21 బాగా కలిపి నూనె వేరు అయ్యే వరకు దానిని ఉడికించండి.

ఆ తరువాత,రుబ్బి పెట్టుకున్నపేస్ట్ మరియు కరివేపాకు వేయండి.

04:27 ఈ మిశ్రమాన్ని 2 నుండి 3 నిమిషాలు వేయించండి.
04:30 ¼ కప్పు నీరు పోసి, చికెన్ మెత్తగా ఇంకా మృదువుగా అయ్యేవరకు మూతపెట్టి ఉడికించండి.
04:37 గ్రేవీ చిక్కబడేవరకు మంటను తగ్గించి ఉంచండి.

కరివేపాకుతో అలంకరించి సర్వ్ చేయాలి.

04:42 దయచేసి గుర్తుంచుకోండి: కిందివాటిలో దేనినైనా ఉపయోగించడం ద్వారా ఈ వంటకాన్ని తయారు చేయవచ్చు -

మటన్, ఆర్గాన్ మాంసం, రొయ్యలు మరియు చేపలు.

04:52 ఇప్పుడు, మనం మూడవ వంటకం -చికెన్ లివర్ సుక్కా చూద్దాం
04:56 ఈ వంటకం కొరకు అవసరమైన పదార్థాలు -

100 గ్రాముల చికెన్ (కాలేయం)లివర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1,

05:03 తరిగిన టమోటా,

వెల్లుల్లి 6 రెబ్బలు,

05:07 ¼ అంగుళం అల్లం,

2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర,

05:12 1 టేబుల్ స్పూన్ నూనె,

రుచికి సరిపడా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం.

05:18 ప్రారంభించడానికి -

ఒక బ్లెండర్లో ఉల్లిపాయముక్కలు, టమోటాముక్కలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వేయండి.

05:25 ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేయండి.

ఈ పేస్ట్‌ను చికెన్ లివర్‌పై అప్ప్లైచేసి గది ఉష్ణోగ్రత వద్ద 10 నుండి 15 నిమిషాలు ఉంచండి.

05:34 ఇప్పుడు, ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, అందులో (ఊరపెట్టిన పేస్ట్ తో పాటు)మెరినేషన్ పేస్ట్ తో పాటు లివర్ ను వేయండి.

దీన్ని బాగా కలపండి.

05:40 అందులో 1/4 కప్పు నీరు పోసి తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.

ఆ తరువాత, మంటను పెంచి బాగా ఉడికించండి

05:49 బాగా ఉడికిన తర్వాత, మంటను ఆపివేయండి.

చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కడిగి తరిగిన కొత్తిమీరతో అలంకరించండి(గార్నిష్ చేయండి).

05:57 ఈ రెసిపీ కోసం మీరు మటన్ లివర్ ని కూడా ఉపయోగించవచ్చు.
06:00 తరువాతి రెసిపీ-పాలకూర కూరలో ఫిష్ (చేప).
06:04 దీని కోసం, మనకు అవసరమైనవి - మాకేరెల్ చేప 2 చిన్న ముక్కలు,
06:08 1 కప్పు పాలకూర ఆకులు,

1 తరిగిన ఉల్లిపాయ,

06:12 1 తరిగిన టమోటా,

1 టీస్పూన్ జీలకర్ర,

06:16 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు,
06:18 ¼ టీస్పూన్ పసుపు పొడి,

1 టీస్పూన్ ఎర్ర కారం పొడి,

06:23 1 టీస్పూన్ జీలకర్ర పొడి,

¼ టీస్పూన్ నల్ల మిరియాలు పొడి,

06:28 ½ టీస్పూన్ ధనియాల పొడి,

1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు,

06:33 1 టీస్పూన్ నూనె,

మరియు రుచికి సరిపడా ఉప్పు.

06:37 ప్రారంభించడానికి -

మాకేరెల్‌ చేపను కడిగి శుభ్రంచేసి రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

06:43 ఒక కళాయి లో, నూనె వేసి వేడి చేసి జీలకర్ర వేయండి.
06:46 ఒకసారి అవి చిటపటలాడిన తర్వాత, పచ్చి పాలకూర ఆకులను వేసి ఒక నిమిషం ఉడికించాలి.
06:51 ఇప్పుడు, దాన్ని చల్లారనివ్వండి.
06:53 తరువాత, గ్రైండర్లో ఉడికించిన పాలకూర, టమోట ముక్కలు మరియు నువ్వులు వేసి ప్యూరీ తయారు చేయండి.
06:59 ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేయండి.
07:03 ఉల్లిపాయముక్కలు గులాబీ రంగులోకి మారిన తర్వాత, తరిగిన వెల్లుల్లి వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
07:09 మసాలాలన్నీ వేసి మీకు మసాలాలు నుండి మంచి వాసన వచ్చేవరకు వేయించండి.
07:14 ఇప్పుడు పాలకూర ప్యూరీ వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
07:17 తరువాత, చేప ముక్కలు వేసి బాగా ఉడికించాలి.
07:20 ఇప్పుడు, ¼ కప్పు నీరు పోసి ఉప్పు వేయండి.

మూతపెట్టి దాన్ని 5 నుండి 7 నిమిషాలు సేపు ఉడకనివ్వండి.

07:28 మూత తీసేసి 15 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వండి.

అయిపోయాక, వేడిగా వడ్డించండి.

07:35 దయచేసి గుర్తుంచుకోండి, స్థానికంగా లభించే ఏ చేపలనైనా ఈ రెసిపీ కోసం ఉపయోగించవచ్చు.
07:40 చివరగా, మనం మీట్‌బాల్ కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాము.
07:44 ఈ వంటకం కొరకు, మనకు అవసరమైనవి -

100 గ్రాముల గుండగా తరిగిన మాంసం, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1,

07:51 1 తరిగిన టమోటా,

½ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్,

07:55 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్,

1 టేబుల్ స్పూన్ గరం మసాలా,

07:59 ¼ కప్పు తాజా కొత్తిమీర మరియు

రుచికి సరిపడా ఉప్పు.

08:04 గ్రేవీ కోసం -

1 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1,

08:10 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్,

½ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్,

08:14 ½ టీస్పూన్ జీలకర్ర పొడి,
08:16 ¼ టీస్పూన్ పసుపు పొడి,
08:19 ఇంకా ఇవన్నీ ½ టీస్పూన్ చొప్పున -

కారం పొడి, గరం మసాలా మరియు ధనియాల పొడి,

08:25 తరిగిన పెద్ద టమోటా 1 ఇంకా రుచికి సరిపడా ఉప్పు.
08:29 ప్రారంభించడానికి, మస్లిన్ వస్త్రాన్ని ఉపయోగించి గుండగా తరిగిన మాంసాన్ని బాగా కకడిగి శుభ్రం చేయండి.
08:34 ఇప్పుడు, ఒక గిన్నెలో గుండగా తరిగిన మాంసం మరియు తరిగిన ఉల్లిపాయముక్కలు వేయండి.
08:38 అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర ఇంకా ఉప్పు వేయండి.
08:44 ఈ మిశ్రమాన్ని ఆరు సమాన భాగాలుగా విభజించి వాటిని బాల్ ఆకారంలో చేయండి.
08:48 ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, మిగిలిన తరిగిన ఉల్లిపాయముక్కలను వేయండి.
08:52 లేత గోధుమ రంగు వచ్చేవరకు వాటిని వేయించండి.
08:56 అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొన్ని నిమిషాలు వేయించాలి.
08:59 అన్ని మసాలా పొడులు -ధనియాలపొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం పొడి, గరం మసాలా, ఇంకా పసుపు వేయండి.
09:08 ఇప్పుడు, దీనిని 2 నుండి 3 నిమిషాలు సేపు వేయించండి.
09:11 అందులో టమోటాముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.

తరువాత, ఆ మసాలాకు ½ కప్పు నీళ్లు ఇంకా ఉప్పు వేయండి.

09:18 ఇలా ఉన్నపుడు, అందులో మీట్‌బాల్స్ ను నెమ్మదిగా వేసి మంట తగ్గించి ఉంచండి.
09:23 5 నిమిషాల తర్వాత మెల్లగా కలపండి, మీట్‌బాల్స్ ఉడికే వరకు ఉడికించండి.

సర్వింగ్ బౌల్ లో వేడిగా వడ్డించండి.

09:30 అలాగే, ఈ రెసిపీని తయారు చేయడానికి మీరు గుండగా ముక్కలు చేసిన చికెన్‌ను ఉపయోగించవచ్చు.
09:34 ఈ వంటకాలన్నిటిలో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం -

ప్రోటీన్, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ A, విటమిన్ B12,

09:45 ఫోలిక్ ఆసిడ్ మరియు ఇనుము, జింక్, మెగ్నీషియం, సల్ఫర్ ఇంకా కోలిన్.
09:52 గర్భిణీ స్త్రీలకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి ఇది మనలను తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya