FrontAccounting-2.4.7/C2/Items-and-Inventory-in-FrontAccounting/Telugu
Time | Narration |
00:01 | ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ఐటమ్స్ అండ్ ఇన్వెంటరీ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం ఈ క్రింది వాటిని ఫ్రంట్ అకౌంటింగ్ లో చేర్చడం నేర్చుకుంటాము:
Units of Measure |
00:14 | Items |
00:16 | Item Category మరియు Sales Pricing |
00:20 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:28 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:32 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం) |
00:42 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:54 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
01:00 | మనం ప్రారంభించడానికి ముందు, ఫ్రంట్ అకౌంటింగ్ లో ఐటమ్స్ అనేవి ఏమిటో మనం అర్థం చేసుకుందాం. |
01:06 | ఐటమ్స్ అనేవి వస్తువులు, వ్యాపారంలో వాటిని మనం కొనవచ్చు లేదా అమ్మవచ్చు. |
01:11 | inventory item గురించిన కీలక సమాచారాన్ని జాబితా చేసే ఒక రికార్డును మనం ఉంచాలి. |
01:18 | ఇన్వెంటరీ అనేది వీటి యొక్క ఒక పూర్తి జాబితా
Stock in hand (చేతిలో ఉన్న స్టాక్), |
01:23 | Work in progress ( జరుగుచున్న పని),
Raw materials ( ముడి సరుకులు) మరియు Finished goods in hand ( చేతిలో ఉన్న తయారీ పూర్తయిన వస్తువులు.). |
01:30 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:34 | బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:43 | login పేజీ కనిపిస్తుంది. |
01:46 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:54 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది. |
01:57 | Items and Inventory టాబ్‌పై క్లిక్ చేయండి. |
02:01 | Maintenance ప్యానెల్ అనేది ఐటమ్స్ మరియు ఇన్వెంటరీ వివరాలను సెట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
02:06 | సెటప్ ను చేయడానికి, మనం ఈ క్రింది ఎంపికలను ఉపయోగించుకోవాలి:
Units of Measure |
02:13 | Items మరియు Item Categories |
02:18 | Units of Measure ఎలా సెట్ చేయాలో మనం చూద్దాం. |
02:22 | ప్రతీ ఐటం కొరకు Units of Measure ఎంపికను పేర్కొనాలి. |
02:27 | Maintenance ప్యానెల్‌లో, Units of Measure లింక్‌పై క్లిక్ చేయండి. |
02:32 | డిఫాల్ట్ గా మీరు units of measure గా each మరియు hour ను చూస్తారు. |
02:38 | kilograms కొరకు ఒక కొత్త Units of Measure ను ఎలా జోడించాలోమనం చూద్దాం. |
02:43 | kilograms యూనిట్ కొరకు వివరాలను ఇక్కడ చూపిన విధంగా టైప్ చేయండి. |
02:48 | Decimal places డ్రాప్-డౌన్ బాక్స్‌లో, zero ను ఎంచుకోండి. |
02:53 | ఈ unit ను జోడించడానికి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నAdd new బటన్ పై క్లిక్ చేయండి. |
02:59 | పాప్-అప్ మెసేజ్ మనం ఒక కొత్త unit ను విజయవంతంగా జోడించినట్లు చూపిస్తుంది. |
03:04 | అప్ డేట్ అయిన ఎంట్రీతో మనం టేబుల్ (పట్టిక) ను కూడా చూడవచ్చు. |
03:08 | అదేవిధంగా మీరు మీ కంపెనీ యొక్క items కు అవసరమైన Units of measure ను జోడించాలి. |
03:15 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
03:22 | ఇప్పుడు మనం Item Categories ను ఆ item చెందిన వర్గానికి సెట్ చేద్దాం. |
03:28 | Item Categories అనేవి మనము కొనుగోలు చేసేవి మరియు విక్రయించే items ను గ్రూప్ చేయడానికి మనకు సహాయపడతాయి. |
03:33 | Item Categories లింక్‌పై క్లిక్ చేయండి. |
03:35 | మనము ఇక్కడ కొన్ని డిఫాల్ట్ Item categories ను చూడవచ్చు - Charges, Components, Services మరియు Systems. |
03:48 | మనం మన స్వంత Item category ను సృష్టించాలి, ఇది వీటిని నిర్వచిస్తుంది.
Item tax type, |
03:54 | Item Type మరియు Units of Measure |
03:58 | ఉదాహరణకు, మన company పూర్తయిన వస్తువులతో అంటే Laptops తో క్రయవిక్రయాలు చేస్తుంది అందుకుందాం. |
04:04 | కనుక మనం Finished Goodsపేరుతో ఒక కొత్త Item category ను జోడిస్తాము. |
04:09 | ఇక్కడ చూపిన విధంగా వివరాలను నింపండి.
Category Name – Finished Goods |
04:15 | Item Tax Type - Regular
Item Type - Purchased |
04:21 | Units of Measure - Each |
04:24 | మిగిలిన అన్ని ఫీల్డ్‌లను డిఫాల్ట్ విలువలతో ఉంచండి. |
04:28 | ఎంట్రీని సేవ్ చేయడానికి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add New బటన్ పై క్లిక్ చేయండి. |
04:34 | పైన టేబుల్ లో కొత్తగా జోడించిన వివరాలు అప్ డేట్ చేయబడినట్లు మనం చూడవచ్చు. |
04:40 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
04:47 | తరువాత మనం ఈ Item category కొరకు ఒక కొత్త Item ను సృష్టిద్దాం. |
04:52 | Maintenance ప్యానెల్‌లో, Items లింక్‌పై క్లిక్ చేయండి. |
04:57 | ఇక్కడ, మనం item కొరకు అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపమని ప్రాంప్ట్ చేయబడ్డాము.
ఇక్కడ చూపిన విధంగా వివరాలను నింపండి. |
05:06 | మీరు నింపే ప్రతి item కొరకు మీరు ఒక ప్రత్యేకమైన కోడ్‌ను ఇచ్చారని నిర్ధారించుకోండి.
ఇది తప్పనిసరి. |
05:13 | Category అనేది Item category ఆ item ఆ వర్గానికి చెందినది.
మనం Finished Goods ను ఎంచుకున్నాము. |
05:21 | Item type అంటే ఆ item దేనికొరకు ఉపయోగించబడుతుందో తెలుసుకోవడానికి:
తయారుచేయడానికి ఉద్దేశించినది |
05:28 | ఒక సప్లయర్ దగ్గరనుండి కొనుగోలు చేయబడింది లేదా ఒక సర్వీస్ కొరకు |
05:33 | స్క్రోల్ చేయండి
ఆపై విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Insert New Item బటన్ పై క్లిక్ చేయండి. |
05:41 | పాప్-అప్ మెసేజ్ మనం ఒక కొత్త ఐటెమ్ ను విజయవంతంగా జోడించినట్లు చూపిస్తుంది. |
05:47 | విండో యొక్క ఎగువ భాగం వద్ద ఉన్న డ్రాప్-డౌన్ బాక్స్‌పై క్లిక్ చేయండి. |
05:51 | క్రొత్త item జోడించబడిందని మనం చూడవచ్చు. |
05:56 | ఒక అసైన్మెంట్ గా:
Item category- Finished goods కింద రెండు కొత్త items ను జోడించండి |
06:02 | Item category- Components కింద రెండు కొత్త items ను జోడించండి |
06:07 | వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్‌మెంట్ లింక్‌ను చూడండి |
06:12 | అసైన్‌మెంట్ పూర్తయిన తర్వాత, విండో యొక్క ఎగువ భాగం వద్ద ఉన్న డ్రాప్-డౌన్ బాక్స్‌పై క్లిక్ చేయండి. |
06:18 | ఇప్పుడు మీరు Components కింద 2 items ను మరియు Finished goods క్రింద 3 items ను చూడాలి. |
06:26 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
06:33 | Pricing and Costs ప్యానెల్ అనేది items లేదా inventory యొక్క ధరల స్థాయిని ఎంచుకోవడానికి ఉపయోగించబడుతుంది. |
06:40 | ఈ ఎంపిక అనేది ప్రత్యేక Sales item కు sales prices ను కేటాయించడానికి ఉపయోగించబడుతుంది.
Sales Pricing లింక్‌పై క్లిక్ చేయండి. |
06:49 | Item డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
Dell Laptop ఐటమ్ ను ఎంచుకోండి, దీని కొరకు మనం Sales Price ను కేటాయించాలనుకుంటున్నాము. |
06:58 | ఇప్పుడు, Currency డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
07:02 | కరెన్సీ గా Indian Rupees ని ఎంచుకోండి. |
07:06 | Sales Type డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
07:10 | అక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి: Retail మరియు Wholesale |
07:15 | ఇక్కడ Retail ఎంపికను ఎంచుకోండి. |
07:19 | తరువాత, Price ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
Item కు ఎదురుగా Price ను 53,000 per each గా టైప్ చేయండి. |
07:28 | తరువాత విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add New బటన్ పై క్లిక్ చేయండి. |
07:33 | పాప్-అప్ మెసేజ్ item Dell Laptop కొరకు మనం విజయవంతంగా Sales price ను జోడించామని చూపిస్తుంది. |
07:41 | టేబుల్ లో అప్ డేట్ అయిన విలువలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. |
07:45 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
07:52 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. |
07:56 | సారాంశం చూద్దాం. |
07:58 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము,
Units of Measure, Items |
08:06 | Item Category మరియు Pricing |
08:10 | ఒక అసైన్మెంట్ గా, క్రింద చూపిన items కొరకు sales price ను జోడించండి:
Sales Type ను Retail గా ఉంచండి. |
08:20 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
08:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
08:35 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్.  లో పోస్ట్ చేయండి. |
08:39 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |