FrontAccounting-2.4.7/C2/Items-and-Inventory-in-FrontAccounting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ఐటమ్స్ అండ్ ఇన్వెంటరీ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం ఈ క్రింది వాటిని ఫ్రంట్ అకౌంటింగ్ లో చేర్చడం నేర్చుకుంటాము:

Units of Measure

00:14 Items
00:16 Item Category మరియు Sales Pricing
00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:28 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:32 ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం)
00:42 మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి.
00:48 ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:54 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
01:00 మనం ప్రారంభించడానికి ముందు, ఫ్రంట్ అకౌంటింగ్ లో ఐటమ్స్ అనేవి ఏమిటో మనం అర్థం చేసుకుందాం.
01:06 ఐటమ్స్ అనేవి వస్తువులు, వ్యాపారంలో వాటిని మనం కొనవచ్చు లేదా అమ్మవచ్చు.
01:11 inventory item గురించిన కీలక సమాచారాన్ని జాబితా చేసే ఒక రికార్డును మనం ఉంచాలి.
01:18 ఇన్వెంటరీ అనేది వీటి యొక్క ఒక పూర్తి జాబితా

Stock in hand (చేతిలో ఉన్న స్టాక్),

01:23 Work in progress ( జరుగుచున్న పని),

Raw materials ( ముడి సరుకులు) మరియు Finished goods in hand ( చేతిలో ఉన్న తయారీ పూర్తయిన వస్తువులు.).

01:30 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:34 బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:43 login పేజీ కనిపిస్తుంది.
01:46 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.

తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.

01:54 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
01:57 Items and Inventory టాబ్‌పై క్లిక్ చేయండి.
02:01 Maintenance ప్యానెల్ అనేది ఐటమ్స్ మరియు ఇన్వెంటరీ వివరాలను సెట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
02:06 సెటప్ ను చేయడానికి, మనం ఈ క్రింది ఎంపికలను ఉపయోగించుకోవాలి:

Units of Measure

02:13 Items మరియు Item Categories
02:18 Units of Measure ఎలా సెట్ చేయాలో మనం చూద్దాం.
02:22 ప్రతీ ఐటం కొరకు Units of Measure ఎంపికను పేర్కొనాలి.
02:27 Maintenance ప్యానెల్‌లో, Units of Measure లింక్‌పై క్లిక్ చేయండి.
02:32 డిఫాల్ట్ గా మీరు units of measure గా each మరియు hour ను చూస్తారు.
02:38 kilograms కొరకు ఒక కొత్త Units of Measure ను ఎలా జోడించాలోమనం చూద్దాం.
02:43 kilograms యూనిట్ కొరకు వివరాలను ఇక్కడ చూపిన విధంగా టైప్ చేయండి.
02:48 Decimal places డ్రాప్-డౌన్ బాక్స్‌లో, zero ను ఎంచుకోండి.
02:53 ఈ unit ను జోడించడానికి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నAdd new బటన్ పై క్లిక్ చేయండి.
02:59 పాప్-అప్ మెసేజ్ మనం ఒక కొత్త unit ను విజయవంతంగా జోడించినట్లు చూపిస్తుంది.
03:04 అప్ డేట్ అయిన ఎంట్రీతో మనం టేబుల్ (పట్టిక) ను కూడా చూడవచ్చు.
03:08 అదేవిధంగా మీరు మీ కంపెనీ యొక్క items కు అవసరమైన Units of measure ను జోడించాలి.
03:15 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
03:22 ఇప్పుడు మనం Item Categories ను ఆ item చెందిన వర్గానికి సెట్ చేద్దాం.
03:28 Item Categories అనేవి మనము కొనుగోలు చేసేవి మరియు విక్రయించే items ను గ్రూప్ చేయడానికి మనకు సహాయపడతాయి.
03:33 Item Categories లింక్‌పై క్లిక్ చేయండి.
03:35 మనము ఇక్కడ కొన్ని డిఫాల్ట్ Item categories ను చూడవచ్చు - Charges, Components, Services మరియు Systems.
03:48 మనం మన స్వంత Item category ను సృష్టించాలి, ఇది వీటిని నిర్వచిస్తుంది.

Item tax type,

03:54 Item Type మరియు Units of Measure
03:58 ఉదాహరణకు, మన company పూర్తయిన వస్తువులతో అంటే Laptops తో క్రయవిక్రయాలు చేస్తుంది అందుకుందాం.
04:04 కనుక మనం Finished Goodsపేరుతో ఒక కొత్త Item category ను జోడిస్తాము.
04:09 ఇక్కడ చూపిన విధంగా వివరాలను నింపండి.

Category Name – Finished Goods

04:15 Item Tax Type - Regular

Item Type - Purchased

04:21 Units of Measure - Each
04:24 మిగిలిన అన్ని ఫీల్డ్‌లను డిఫాల్ట్ విలువలతో ఉంచండి.
04:28 ఎంట్రీని సేవ్ చేయడానికి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add New బటన్ పై క్లిక్ చేయండి.
04:34 పైన టేబుల్ లో కొత్తగా జోడించిన వివరాలు అప్ డేట్ చేయబడినట్లు మనం చూడవచ్చు.
04:40 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
04:47 తరువాత మనం ఈ Item category కొరకు ఒక కొత్త Item ను సృష్టిద్దాం.
04:52 Maintenance ప్యానెల్‌లో, Items లింక్‌పై క్లిక్ చేయండి.
04:57 ఇక్కడ, మనం item కొరకు అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపమని ప్రాంప్ట్ చేయబడ్డాము.

ఇక్కడ చూపిన విధంగా వివరాలను నింపండి.

05:06 మీరు నింపే ప్రతి item కొరకు మీరు ఒక ప్రత్యేకమైన కోడ్‌ను ఇచ్చారని నిర్ధారించుకోండి.

ఇది తప్పనిసరి.

05:13 Category అనేది Item category ఆ item ఆ వర్గానికి చెందినది.

మనం Finished Goods ను ఎంచుకున్నాము.

05:21 Item type అంటే ఆ item దేనికొరకు ఉపయోగించబడుతుందో తెలుసుకోవడానికి:

తయారుచేయడానికి ఉద్దేశించినది

05:28 ఒక సప్లయర్ దగ్గరనుండి కొనుగోలు చేయబడింది లేదా ఒక సర్వీస్ కొరకు
05:33 స్క్రోల్ చేయండి

ఆపై విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Insert New Item బటన్ పై క్లిక్ చేయండి.

05:41 పాప్-అప్ మెసేజ్ మనం ఒక కొత్త ఐటెమ్ ను విజయవంతంగా జోడించినట్లు చూపిస్తుంది.
05:47 విండో యొక్క ఎగువ భాగం వద్ద ఉన్న డ్రాప్-డౌన్ బాక్స్‌పై క్లిక్ చేయండి.
05:51 క్రొత్త item జోడించబడిందని మనం చూడవచ్చు.
05:56 ఒక అసైన్మెంట్ గా:

Item category- Finished goods కింద రెండు కొత్త items ను జోడించండి

06:02 Item category- Components కింద రెండు కొత్త items ను జోడించండి
06:07 వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్‌మెంట్ లింక్‌ను చూడండి
06:12 అసైన్‌మెంట్ పూర్తయిన తర్వాత, విండో యొక్క ఎగువ భాగం వద్ద ఉన్న డ్రాప్-డౌన్ బాక్స్‌పై క్లిక్ చేయండి.
06:18 ఇప్పుడు మీరు Components కింద 2 items ను మరియు Finished goods క్రింద 3 items ను చూడాలి.
06:26 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
06:33 Pricing and Costs ప్యానెల్ అనేది items లేదా inventory యొక్క ధరల స్థాయిని ఎంచుకోవడానికి ఉపయోగించబడుతుంది.
06:40 ఈ ఎంపిక అనేది ప్రత్యేక Sales item కు sales prices ను కేటాయించడానికి ఉపయోగించబడుతుంది.

Sales Pricing లింక్‌పై క్లిక్ చేయండి.

06:49 Item డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.

Dell Laptop ఐటమ్ ను ఎంచుకోండి, దీని కొరకు మనం Sales Price ను కేటాయించాలనుకుంటున్నాము.

06:58 ఇప్పుడు, Currency డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:02 కరెన్సీ గా Indian Rupees ని ఎంచుకోండి.
07:06 Sales Type డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:10 అక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి: Retail మరియు Wholesale
07:15 ఇక్కడ Retail ఎంపికను ఎంచుకోండి.
07:19 తరువాత, Price ఫీల్డ్ పై క్లిక్ చేయండి.

Item కు ఎదురుగా Price ను 53,000 per each గా టైప్ చేయండి.

07:28 తరువాత విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add New బటన్ పై క్లిక్ చేయండి.
07:33 పాప్-అప్ మెసేజ్ item Dell Laptop కొరకు మనం విజయవంతంగా Sales price ను జోడించామని చూపిస్తుంది.
07:41 టేబుల్ లో అప్ డేట్ అయిన విలువలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
07:45 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
07:52 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
07:56 సారాంశం చూద్దాం.
07:58 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము,

Units of Measure, Items

08:06 Item Category మరియు Pricing
08:10 ఒక అసైన్మెంట్ గా, క్రింద చూపిన items కొరకు sales price ను జోడించండి:

Sales Type ను Retail గా ఉంచండి.

08:20 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

08:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

08:35 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌.&nbsp లో పోస్ట్ చేయండి.
08:39 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya