Advance-C/C2/Union-and-Typedef/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకన్ ట్యుటోరియల్ లో typedef మరియు union ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం typedef కీవర్డ్ మరియు union కీవర్డ్ గురించి కొన్ని ఉదాహరణల యొక్క సహాయంతో నేర్చుకొంటాము.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది, Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1.
00:29 ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి.
00:36 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, చూపిన మా వెబ్-సైట్ ను చూడండి.
00:43 నేను typedef యొక్క పరిచయంతో మొదలు పెడతాను.
00:49 typedef కీవర్డ్ అనేది ఇప్పటికే ఉన్న టైప్ లకు లేదా యూసర్-డిఫైన్డ్ డేటా-టైప్స్ కు సింబాలిక్ నేమ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
00:58 కమాండ్స్ కు alias ఇవ్వడానికి అదొక పద్దతి.
01:03 అది మన కోడ్ యొక్క స్పష్ఠత పెంచుటకు ఉపయోగపడును.
01:07 అది కోడ్ ను త్వరగా అర్థంచేసుకొనుటకు మరియు మార్చుటకు ఉపయోగపడును.
01:12 సింటాక్స్: typedef existing_name alias_name ఉదాహరణకు typedef unsigned int uint;
01:24 మనము ఒక ఉదాహరణ తో ప్రోగ్రాంను చూద్దాం.
01:28 మన ఫైల్ పేరు(పాలిండ్రోమ్) pallindrome.c అని గమనించండి.
01:34 ఈ ప్రోగ్రాం నందు ఇచ్చిన సంఖ్య ఒక pallindrome అవునా కాదా అని మనం తనిఖీ చేస్తున్నాం.
01:41 మనం typedefను ఉపయోగించుకొని unsigned int డేటా టైప్ కు అలియాస్ నేమ్ ను uintగా ఇచ్చాము.
01:52 ఇక్కడ మనం వేరియబుల్స్ ను డిక్లేర్ చేయుటకు uintను ఉపయోగిస్తున్నాము.
01:59 ఇది pallindrome కు logic.
02:03 ఇప్పుడు ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
02:06 Ctrl, Alt మరియు Tలను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరవండి.
02:16 కంపైల్ చేయుటకు gcc space pallindrome dot c space hyphen o space pallindrome అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
02:29 dot slash pallindrome అని టైప్ చెయ్యండి.
02:34 Enter any three digit number: అని చూస్తాము.
02:38 నేను 121 అని ఇస్తాను.
02:42 ఔట్పుట్ ఇలా ఉండును. Given number is a palindrome number.
02:47 ఇప్పుడు మనం union డేటా టైప్ గురించి చూద్దాం.
02:52 union అనేది వేరువేరు రకాలైన డేటా టైప్స్ కలిగిన ఒక సమూహము.
02:57 union మెంబర్స్ అందరికి కలిపి ఒకే డేటా స్టోరేజ్ ను ఇస్తుంది.
03:03 మనం ఒక సమయంలో యూనియన్ యొక్క ఒక మెంబర్ ని మాత్రమే ఉపయోగించగలము.
03:08 syntax1: union union_name కర్లీ బ్రాకెట్స్ లోపల, మెంబర్స్, కర్లీ బ్రాకెట్ తరువాత union_variable మరియు సెమీకోలన్.
03:21 మనం వేరొక సింటాక్స్ ను కూడా ఉపయోగించవచ్చు.

Syntax 2: union union_name కర్లీ బ్రాకెట్స్ లోపల, మెంబర్స్, కర్లీ బ్రాకెట్ తరువాత సెమీకోలన్ union union_name union_variable;

03:39 ఒక ఉదాహరణ చూద్దాం.
03:41 నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
03:47 మన ఫైల్ పేరు union dot c అనిగమనించండి.
03:52 student అనే పేరుగల ఒక union ను డిక్లేర్ చేశాము.
03:56 ఇక్కడ మనకు english, maths మరియు science అను మూడు వేరియబుల్స్ ఉన్నవి.
04:02 main() ఫంక్షన్ నందు మనం ఒక union వేరియబుల్ studను సృష్టించాము.
04:09 ఇక్కడ మనం union వేరియబుల్ ను ఉపయోగించుకొని union మెంబర్స్ ను యాక్సిస్ చేయగలము.

stud dot english;

stud dot maths;

stud dot science;

04:21 తరువాత మనం టోటల్ మార్క్స్ గణించి దానిని డిస్ప్లే చేస్తాము.
04:26 టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి.

gcc space union dot c space hyphen o space union అని టైప్ చెయ్యండి.

dot slash union అని టైప్ చెయ్యండి.

04:44 ఔట్పుట్ ఇలా డిస్ప్లే అగును. Total is 228
04:50 structure మరియు union మధ్య తేడాలు చూద్దాం.
04:55 union అన్ని మెంబర్స్ కు ఒకే మెమొరీ సృష్టిస్తుంది.
05:01 structure అన్ని మెంబర్స్ కు వేరువేరు గా మెమరీ సృష్టిస్తుంది.
05:07 union తక్కువ మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది.
05:11 structure ఎక్కువ మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది.
05:14 union కు ఉదాహరణ, union student{int marks;char name[6];double average;};
05:27 double డేటా-టైప్ అనేది గరిష్ట మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది కనుక, union వేరియబుల్ కొరకు మెమొరీ(Memory) కేటాయింపు 8bytesగా ఉంటుంది.
05:39 Structureకు ఉదాహరణ, struct student{int mark;char name[6];double average;};
05:48 structure వేరియబుల్ కు కేటాయించే మెమొరీ,

2bytes+6bytes+8bytes =16bytes.

06:00 ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:04 సంగ్రహంగా,
06:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి, typedef మరియు union, union మరియు structure ల మధ్య బేధాలు.
06:14 అసైన్మెంట్ గా,
06:17 ఒక employee యొక్క records డిస్ప్లే చేయుటకు,
06:21 name, address, salary వంటి వాటితో ఒక ప్రోగ్రాం వ్రాయండి.
06:25 ఒక employee union ను డిఫైన్ చేయుము.
06:29 typedefను ఉపయోగించి aliasకు empఅను పేరును ఇవ్వండి.
06:35 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
06:39 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:42 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:47 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:53 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
07:04 స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:08 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:16 ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
07:22 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india