Advance-C/C2/Union-and-Typedef/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | స్పోకన్ ట్యుటోరియల్ లో typedef మరియు union ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం typedef కీవర్డ్ మరియు union కీవర్డ్ గురించి కొన్ని ఉదాహరణల యొక్క సహాయంతో నేర్చుకొంటాము. |
00:17 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది, Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి. |
00:36 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, చూపిన మా వెబ్-సైట్ ను చూడండి. |
00:43 | నేను typedef యొక్క పరిచయంతో మొదలు పెడతాను. |
00:49 | typedef కీవర్డ్ అనేది ఇప్పటికే ఉన్న టైప్ లకు లేదా యూసర్-డిఫైన్డ్ డేటా-టైప్స్ కు సింబాలిక్ నేమ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. |
00:58 | కమాండ్స్ కు alias ఇవ్వడానికి అదొక పద్దతి. |
01:03 | అది మన కోడ్ యొక్క స్పష్ఠత పెంచుటకు ఉపయోగపడును. |
01:07 | అది కోడ్ ను త్వరగా అర్థంచేసుకొనుటకు మరియు మార్చుటకు ఉపయోగపడును. |
01:12 | సింటాక్స్: typedef existing_name alias_name ఉదాహరణకు typedef unsigned int uint; |
01:24 | మనము ఒక ఉదాహరణ తో ప్రోగ్రాంను చూద్దాం. |
01:28 | మన ఫైల్ పేరు(పాలిండ్రోమ్) pallindrome.c అని గమనించండి. |
01:34 | ఈ ప్రోగ్రాం నందు ఇచ్చిన సంఖ్య ఒక pallindrome అవునా కాదా అని మనం తనిఖీ చేస్తున్నాం. |
01:41 | మనం typedefను ఉపయోగించుకొని unsigned int డేటా టైప్ కు అలియాస్ నేమ్ ను uintగా ఇచ్చాము. |
01:52 | ఇక్కడ మనం వేరియబుల్స్ ను డిక్లేర్ చేయుటకు uintను ఉపయోగిస్తున్నాము. |
01:59 | ఇది pallindrome కు logic. |
02:03 | ఇప్పుడు ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
02:06 | Ctrl, Alt మరియు Tలను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరవండి. |
02:16 | కంపైల్ చేయుటకు gcc space pallindrome dot c space hyphen o space pallindrome అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
02:29 | dot slash pallindrome అని టైప్ చెయ్యండి. |
02:34 | Enter any three digit number: అని చూస్తాము. |
02:38 | నేను 121 అని ఇస్తాను. |
02:42 | ఔట్పుట్ ఇలా ఉండును. Given number is a palindrome number. |
02:47 | ఇప్పుడు మనం union డేటా టైప్ గురించి చూద్దాం. |
02:52 | union అనేది వేరువేరు రకాలైన డేటా టైప్స్ కలిగిన ఒక సమూహము. |
02:57 | union మెంబర్స్ అందరికి కలిపి ఒకే డేటా స్టోరేజ్ ను ఇస్తుంది. |
03:03 | మనం ఒక సమయంలో యూనియన్ యొక్క ఒక మెంబర్ ని మాత్రమే ఉపయోగించగలము. |
03:08 | syntax1: union union_name కర్లీ బ్రాకెట్స్ లోపల, మెంబర్స్, కర్లీ బ్రాకెట్ తరువాత union_variable మరియు సెమీకోలన్. |
03:21 | మనం వేరొక సింటాక్స్ ను కూడా ఉపయోగించవచ్చు.
Syntax 2: union union_name కర్లీ బ్రాకెట్స్ లోపల, మెంబర్స్, కర్లీ బ్రాకెట్ తరువాత సెమీకోలన్ union union_name union_variable; |
03:39 | ఒక ఉదాహరణ చూద్దాం. |
03:41 | నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. |
03:47 | మన ఫైల్ పేరు union dot c అనిగమనించండి. |
03:52 | student అనే పేరుగల ఒక union ను డిక్లేర్ చేశాము. |
03:56 | ఇక్కడ మనకు english, maths మరియు science అను మూడు వేరియబుల్స్ ఉన్నవి. |
04:02 | main() ఫంక్షన్ నందు మనం ఒక union వేరియబుల్ studను సృష్టించాము. |
04:09 | ఇక్కడ మనం union వేరియబుల్ ను ఉపయోగించుకొని union మెంబర్స్ ను యాక్సిస్ చేయగలము.
stud dot english; stud dot maths; stud dot science; |
04:21 | తరువాత మనం టోటల్ మార్క్స్ గణించి దానిని డిస్ప్లే చేస్తాము. |
04:26 | టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి.
gcc space union dot c space hyphen o space union అని టైప్ చెయ్యండి. dot slash union అని టైప్ చెయ్యండి. |
04:44 | ఔట్పుట్ ఇలా డిస్ప్లే అగును. Total is 228 |
04:50 | structure మరియు union మధ్య తేడాలు చూద్దాం. |
04:55 | union అన్ని మెంబర్స్ కు ఒకే మెమొరీ సృష్టిస్తుంది. |
05:01 | structure అన్ని మెంబర్స్ కు వేరువేరు గా మెమరీ సృష్టిస్తుంది. |
05:07 | union తక్కువ మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది. |
05:11 | structure ఎక్కువ మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది. |
05:14 | union కు ఉదాహరణ, union student{int marks;char name[6];double average;}; |
05:27 | double డేటా-టైప్ అనేది గరిష్ట మెమొరీ స్పేస్ ను ఆక్రమిస్తుంది కనుక, union వేరియబుల్ కొరకు మెమొరీ(Memory) కేటాయింపు 8bytesగా ఉంటుంది. |
05:39 | Structureకు ఉదాహరణ, struct student{int mark;char name[6];double average;}; |
05:48 | structure వేరియబుల్ కు కేటాయించే మెమొరీ,
2bytes+6bytes+8bytes =16bytes. |
06:00 | ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:04 | సంగ్రహంగా, |
06:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి, typedef మరియు union, union మరియు structure ల మధ్య బేధాలు. |
06:14 | అసైన్మెంట్ గా, |
06:17 | ఒక employee యొక్క records డిస్ప్లే చేయుటకు, |
06:21 | name, address, salary వంటి వాటితో ఒక ప్రోగ్రాం వ్రాయండి. |
06:25 | ఒక employee union ను డిఫైన్ చేయుము. |
06:29 | typedefను ఉపయోగించి aliasకు empఅను పేరును ఇవ్వండి. |
06:35 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
06:39 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
06:42 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:47 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
06:53 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
07:04 | స్పోకన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:08 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:16 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:22 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |