Health-and-Nutrition/C2/Importance-of-Folate/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:54, 1 June 2021 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | ఫోలేట్ యొక్క ప్రాముఖ్యత ను తెలిపే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:09 | శరీరంలో ఫోలేట్ యొక్క పాత్ర. |
00:12 | ఫోలేట్ లోపం యొక్క ప్రభావాలు. |
00:15 | వివిధ వయసుల వారి కొరకు ఫోలేట్ యొక్క అవసరాలు. |
00:20 | విటమిన్ B9 అనేది నీటిలో కరిగే ఒక ముఖ్యమైన B విటమిన్. |
00:25 | ఇది రెండు రూపాల్లో ఉంటుంది: ఫోలేట్ మరియు ఫోలిక్ యాసిడ్. |
00:30 | ఫోలేట్ అనేది సహజసిద్దమైన రూపం అలాగే ఇది ఆహారాలలో సహజంగా కనిపిస్తుంది. |
00:35 | ఫోలేట్ అనేది మన ప్రేగులలోని బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది. |
00:41 | అయితే, ఫోలిక్ యాసిడ్ అనేది సింథటిక్ ఫార్మ్ లో ఉంటుంది. |
00:45 | ఇది రసాయనికంగా సుసంపన్నమైన ఆహారాలు లేదా సప్లిమెంట్లలో లభిస్తుంది. |
00:51 | ఫోలిక్ యాసిడ్ తో పోలిస్తే మన శరీరంలో ఫోలేట్ సులభంగా గ్రహించబడుతుంది. |
00:58 | ఇప్పుడు మనం, మన శరీరంలో ఫోలేట్ యొక్క పాత్రను చూస్తాము. ఇంకా |
01:02 | దాని లోపం యొక్క ప్రభావం. |
01:05 | మన శరీరంలో అనేకమైన పనుల కొరకు ఫోలేట్ అనేది అవసరం. |
01:09 | కొత్త కణాల యొక్క పెరుగుదల, మరమ్మత్తు, విభజన మరియు ఉత్పత్తి కోసం మన శరీరానికి ఇది అవసరం. |
01:18 | హోమోసెస్టీన్ స్థాయిలను తగ్గించడంలో ఫోలేట్ సహాయపడుతుంది. |
01:23 | హోమోసెస్టీన్ అనేది ప్రోటీన్ తయారీకి ఉపయోగించే ఒక రకమైన అమినో యాసిడ్. |
01:29 | అధిక హోమోసెస్టీన్ స్థాయిలు అనేవి అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తాయి. |
01:34 | ఇది గుండె యొక్క రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది. |
01:39 | ఇది గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. |
01:43 | అందువలన, ఫోలేట్ గుండె మరియు అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. |
01:48 | ఆరోగ్యకరమైన గర్భధారణకు కూడా ఇది అవసరం, |
01:51 | ఇంకా న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేత కొరకు కూడా. |
01:55 | శిశువు యొక్క మెదడు మరియు వెన్నుపాములోపల న్యూరల్ ట్యూబ్ అనేది అభివృద్ధి చెందుతుంది. |
02:01 | న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేతలో వైఫల్యం వలన అది న్యూరల్ ట్యూబ్ లోపాలకు దారితీయవచ్చు. |
02:07 | న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి మెదడు మరియు వెన్నుపాము యొక్క పుట్టుకతో వచ్చే లోపాలు. |
02:13 | రెండు అత్యంత సాధారణ న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి anencephaly మరియు spina bifida. |
02:20 | anencephaly లో, శిశువు యొక్క మెదడు మరియు పుర్రె యొక్క భాగాలు అనేవి సరిగ్గా ఏర్పడవు. |
02:27 | spina bifida లో, శిశువు యొక్క వెన్నెముక సరిగా అభివృద్ధి చెందదు. |
02:33 | అందువలన, శిశువు శారీరక వైకల్యాలను కలిగి ఉండవచ్చు. |
02:38 | అవి కాళ్ళ యొక్క కండరాల బలహీనతను మరియు పక్షవాతాన్ని అభివృద్ధి చేయవచ్చు. |
02:43 | వంగిన వెన్నెముక మరియు మూత్రాశయం నియంత్రణను కోల్పోవడం అనేవి ఇతర లక్షణాలు. |
02:49 | తినడానికి మరియు మింగడానికి ఇబ్బందిపడటం అనేది కూడా సాధారణం. |
02:55 | వారికి నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు. |
03:00 | న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేత అనేది గర్భం దాల్చిన 28 రోజుల్లో జరుగుతుంది. |
03:06 | ఈ సమయం వరకు, స్త్రీకి తాను గర్భవతి అని కూడా తనకు తెలియకపోవచ్చు. |
03:12 | ఆమె తెలుసుకునే సమయానికి, ఈ లోపాలను నివారించడానికి చాలా ఆలస్యం అయిపోవచ్చు. |
03:18 | మహిళలందరూ, ముఖ్యంగా పునరుత్పత్తి వయస్సులో ఫోలేట్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తగినంత తీసుకోవాలి. |
03:25 | ఫోలేట్ తో పాటు, ఇతర పోషకాలు అనేవి కూడా న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ముఖ్యమైనవి. |
03:32 | ఉదాహరణకు: విటమిన్ B12 మరియు కోలిన్. |
03:39 | గర్భధారణ సమయంలో, ఫోలేట్ యొక్క అవసరాలు పెరుగుతాయి. |
03:45 | ఈ సమయంలో తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఫోలేట్ లోపం ఏర్పడుతుంది. |
03:51 | శరీరం ఫోలేట్ ను సరిగా గ్రహించుకోకపోవడం వల్ల లోపం వస్తుంది. |
03:58 | ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం అనేది కూడా ఇదే ఫలితాన్నిఇస్తుంది. |
04:03 | విటమిన్ B12 యొక్క లోపం అనేది పరోక్షంగా ఫోలేట్ లోపానికి దారితీయవచ్చు. |
04:09 | ప్రస్తుతం మన శరీరంలో ఫోలేట్ అనేది ఉన్నప్పటికినీ, దానియొక్క విధిని అది చేయలేకపోతుంది. |
04:16 | ఇది ఎందుకంటే, ఫోలేట్ ను దాని క్రియాశీల రూపంలోనికి మార్చడానికి విటమిన్ B12 అనేది అవసరం. |
04:24 | అందువలన, తగినంత విటమిన్ B12 ను ఫోలేట్ తో పాటు గా తీసుకోవడం అనేది ముఖ్యం. |
04:31 | గుడ్లు, చికెన్, మాంసం మరియు పాల ఉత్పత్తులు అనేవి విటమిన్ B12 యొక్క మంచి వనరులు. |
04:39 | గుల్ల చేప, కాలేయం, గుండె, మూత్రపిండాలు, మెదడు అనేవి ఇతర ఉదాహరణలు. |
04:47 | జన్యుసంబంధ రక్తహీనత తో ఉన్న వ్యక్తులకు ఫోలేట్ యొక్క లోపం వచ్చే ప్రమాదం ఉంది. |
04:54 | జన్యుసంబంధ రక్తహీనతకు ఉదాహరణలు అనేవి sickle cell అనీమియా |
04:58 | మరియు thalassemia. |
05:01 | ఇలాంటి పరిస్థితులలో, ఎర్ర రక్త కణాలు అనేవి అవి సృష్టించబడే దానికంటే వేగంగా నాశనం అవుతాయి. |
05:08 | అందువలన, ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడు ఫోలేట్ ను తగినంత తీసుకోవాలి అని సిఫార్సు చేయబడింది. |
05:14 | ఏదైనా సప్లిమెంట్ ను తీసుకోవడానికి ముందు దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. |
05:19 | తరువాత, మనం ఫోలేట్ లోపం యొక్క లక్షణాలను చూద్దాం. |
05:24 | ఈ లక్షణాలను పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోనూ చూడవచ్చు. |
05:29 | పుండ్లు పడటం ఇంకా నాలుక మరియు పెదవుల యొక్క ఎరుపు అనేవి వీటియొక్క కొన్ని ప్రారంభ సంకేతాలు. |
05:35 | ఇతర లక్షణాలు అనేవి అలసట, |
05:38 | చిరాకు,
నిద్రా భంగం |
05:41 | మరియు నిరాశ. |
05:43 | నోటిలో లేదా కడుపులో అల్సర్ లు కూడా రావొచ్చు. |
05:47 | దీర్ఘకాలిక లోపం అనేది జ్ఞాపకశక్తిని మరియు శ్రద్ధను తగ్గించవచ్చు. |
05:53 | గర్భిణీ స్త్రీలలో ఫోలేట్ లోపం అనేది శిశువులపై చెడు ప్రభావాన్నిచూపించవచ్చు. |
05:59 | ఉదాహరణకు: న్యూరల్ ట్యూబ్ లోపాలు మరియు |
06:03 | పిల్లలలో చీలిన పెదవులు మరియు అంగిలి. |
06:07 | చీలిక అనేది పై పెదవి లేదా నోటి యొక్క పైభాగంలో ఒక అంతరం లేదా చీలడం. |
06:13 | గర్భంలో పెరుగుదల సమయంలో కణజాలాలు కలిసిపోనప్పుడు ఇది సంభవిస్తుంది. |
06:20 | ఫోలేట్ లేదా విటమిన్ B12 లోపం వల్ల మేక్రోసైటిక్ అనీమియా వస్తుంది. |
06:27 | ఇది ఎలా జరుగుతుందో నేను మీకు వివరిస్తాను. |
06:30 | ఈ రెండు పోషకాలు అనేవి సాధారణ కణాల పెరుగుదల మరియు విభజన కొరకు అవసరం. |
06:36 | ఒకవేళ వాటి లోపం వచ్చినట్లయితే, ఎర్ర రక్త కణాలు పరిపక్వం చెందవు లేదా సరిగా విభజించబడవు. |
06:43 | దాని ఫలితంగా, పెద్దపెద్ద అపరిపక్వ ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడతాయి, ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. |
06:51 | ఇవి వాటిల్లో హిమోగ్లోబిన్ ను చాలా తక్కువగా కలిగిఉంటాయి మరియు సరిగా పనిచేయలేవు. |
06:59 | హిమోగ్లోబిన్ అనేది ఇతర కణజాలాలకు మరియు కణాలకు ఆక్సిజన్ ను రవాణా చేయడానికి సహాయపడుతుంది. |
07:06 | అందువల్ల, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు అనేవి రక్తహీనతకు కారణమవుతాయి. |
07:11 | వివిధ వయసుల వారి కొరకు ఫోలేట్ యొక్క రోజువారీ సిఫార్సులను మనం చూద్దాం. |
07:18 | 1 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలకు 90 మైక్రోగ్రాములు అవసరం. |
07:24 | 4 నుండి 9 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది 110 నుండి 142 మైక్రోగ్రాములు. |
07:32 | 10 నుండి 15 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ వారి కొరకు ఇది 180 నుండి 204 మైక్రోగ్రాములు. |
07:42 | 16 ఏళ్లు పైబడిన కౌమారదశ వారి కొరకు రోజుకు 200 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది. |
07:50 | వయోజనులైన ఆడ మరియు మగవారి కొరకు అయితే ఇది 200 నుండి 250 మైక్రోగ్రాములు. |
07:58 | గర్భిణీ స్త్రీలకు అయితే సుమారుగా 500 మైక్రోగ్రాములు ఉండాలి. |
08:02 | తల్లి పాలిస్తున్న తల్లుల కొరకు ఇది 300 మైక్రోగ్రాములు. |
08:07 | జనన లోపాల యొక్క చరిత్ర ఉన్నమహిళలకు ఫోలేట్ యొక్క అవసరాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. |
08:15 | వారు అయితే గర్భధారణకు ముందు మరియు గర్భంతో ఉన్న సమయంలో 500 మైక్రోగ్రాములు తీసుకోవాలి. |
08:22 | గర్భం కోసం ప్లాన్ చేస్తున్న మహిళలకు కూడా తగినంత ఫోలేట్ తీసుకోవాలి అని సిఫార్సు చేయబడింది. |
08:29 | ఫోలేట్ యొక్క అవసరాలను ఆహారం ద్వారా తీర్చవచ్చు. |
08:33 | బీన్స్ అనేవి ఫోలేట్ యొక్క అద్భుతమైన వనరులు. |
08:36 | 30 గ్రాములు లేదా ½ కప్పు ఉడికించని బీన్స్ సుమారుగా 80 నుండి 120 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తాయి. |
08:46 | అలసందలు, రాజ్ మా, మోటుపెసలు, సోయాబీన్స్ అనేవి కొన్ని ఉదాహరణలు. |
08:53 | కొమ్ముశనగలు, చిక్కుడు పిక్కలు, ఉలవలు, ఎండు బఠానీలు అనేవి కూడా మంచి వనరులే. |
09:00 | పచ్చని ఆకుకూరలు అనేవి కూడా ఫోలేట్ ను సమృద్ధిగా కలిగిఉంటాయి. |
09:04 | ఉదాహరణకు: పాలకూర, తోటకూర ఆకులు, చామ ఆకులు, అగిస్తి ఆకులు. |
09:11 | 50 గ్రాములు లేదా 1 కప్పు వండని పాలకూర సుమారుగా 70 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది. |
09:19 | 1 టీస్పూన్ మునగ ఆకుల పొడి సుమారుగా 10 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది. |
09:27 | ఫోలేట్ అధికంగా ఉండే ఇతర కూరగాయలు అనేవి పందిరి చిక్కుడుకాయలు, ఫ్రెంచ్ బీన్స్ మరియు బీట్రూట్. |
09:35 | క్యాబేజ్ పువ్వు, బెండకాయలు మరియు మునక్కాడలు కూడా మితమైన మొత్తంలో ఫోలేట్ ను కలిగిఉంటాయి. |
09:43 | పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆవాలు మరియు ఓడిసలు/వెర్రి నువ్వులు అనేవి తక్కువ మొత్తంలో ఫోలేట్ ను కలిగి ఉంటాయి. |
09:50 | 1 టేబుల్ స్పూన్ ఈ విత్తనాల యొక్క పొడి సుమారుగా 15 నుండి 20 మైక్రోగ్రాముల ఫోలేట్ కలిగి ఉంటుంది. |
09:59 | మాంసాహార ఆహారాలలో చికెన్ కాలేయం మరియు అన్ని సముద్ర ఆహారాలు అనేవి అద్భుతమైన వనరులు. |
10:06 | 60 గ్రాముల 1 కోడి యొక్క కాలేయం అనేది సుమారుగా 600 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది. |
10:13 | ఏదైనా సముద్రపు ఆహారం యొక్క100 గ్రాములు అనేది 700 కంటే ఎక్కువ మైక్రోగ్రాములు ఇస్తుంది. |
10:20 | అధిక వేడి మరియు నీరు అనేవి ఫోలేట్ కంటెంట్‌ను తగ్గిస్తాయని దయచేసి గమనించండి. |
10:26 | అందువలన, ఎక్కువగా ఉడికించడం మరియు ఆహారాన్ని మళ్లీమళ్లీ వేడిచేయడాన్ని మానుకోండి. |
10:33 | కూరగాయలను ఉడకబెట్టడానికి బదులుగా దోరగా వేయించవచ్చు లేదా ఆవిరితో చేయవచ్చు. |
10:38 | వంట చేసే ముందు పప్పుధాన్యాలను ఎల్లప్పుడూ రాత్రిపూట నానబెట్టాలి. |
10:43 | పూర్తి బీన్స్ ను మొలకెత్తించడం మరియు వండటం వలన వాటియొక్క పోషక విలువలు పెరుగుతాయి. |
10:49 | పులియబెట్టడం మరియు వేయించడం కూడా ఫోలేట్ యొక్క శోషణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. |
10:56 | మన మంచి ఆరోగ్యం కొరకు ఫోలేట్ ను తగినంతగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. |
11:01 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |