Health-and-Nutrition/C2/Importance-of-Folate/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 ఫోలేట్ యొక్క ప్రాముఖ్యత ను తెలిపే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
00:09 శరీరంలో ఫోలేట్ యొక్క పాత్ర.
00:12 ఫోలేట్ లోపం యొక్క ప్రభావాలు.
00:15 వివిధ వయసుల వారి కొరకు ఫోలేట్ యొక్క అవసరాలు.
00:20 విటమిన్ B9 అనేది నీటిలో కరిగే ఒక ముఖ్యమైన B విటమిన్.
00:25 ఇది రెండు రూపాల్లో ఉంటుంది: ఫోలేట్ మరియు ఫోలిక్ యాసిడ్.
00:30 ఫోలేట్ అనేది సహజసిద్దమైన రూపం అలాగే ఇది ఆహారాలలో సహజంగా కనిపిస్తుంది.
00:35 ఫోలేట్ అనేది మన ప్రేగులలోని బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది.
00:41 అయితే, ఫోలిక్ యాసిడ్ అనేది సింథటిక్ ఫార్మ్ లో ఉంటుంది.
00:45 ఇది రసాయనికంగా సుసంపన్నమైన ఆహారాలు లేదా సప్లిమెంట్లలో లభిస్తుంది.
00:51 ఫోలిక్ యాసిడ్ తో పోలిస్తే మన శరీరంలో ఫోలేట్ సులభంగా గ్రహించబడుతుంది.
00:58 ఇప్పుడు మనం, మన శరీరంలో ఫోలేట్ యొక్క పాత్రను చూస్తాము. ఇంకా
01:02 దాని లోపం యొక్క ప్రభావం.
01:05 మన శరీరంలో అనేకమైన పనుల కొరకు ఫోలేట్ అనేది అవసరం.
01:09 కొత్త కణాల యొక్క పెరుగుదల, మరమ్మత్తు, విభజన మరియు ఉత్పత్తి కోసం మన శరీరానికి ఇది అవసరం.
01:18 హోమోసెస్టీన్ స్థాయిలను తగ్గించడంలో ఫోలేట్ సహాయపడుతుంది.
01:23 హోమోసెస్టీన్ అనేది ప్రోటీన్ తయారీకి ఉపయోగించే ఒక రకమైన అమినో యాసిడ్.
01:29 అధిక హోమోసెస్టీన్ స్థాయిలు అనేవి అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తాయి.
01:34 ఇది గుండె యొక్క రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది.
01:39 ఇది గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది.
01:43 అందువలన, ఫోలేట్ గుండె మరియు అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
01:48 ఆరోగ్యకరమైన గర్భధారణకు కూడా ఇది అవసరం,
01:51 ఇంకా న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేత కొరకు కూడా.
01:55 శిశువు యొక్క మెదడు మరియు వెన్నుపాములోపల న్యూరల్ ట్యూబ్ అనేది అభివృద్ధి చెందుతుంది.
02:01 న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేతలో వైఫల్యం వలన అది న్యూరల్ ట్యూబ్ లోపాలకు దారితీయవచ్చు.
02:07 న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి మెదడు మరియు వెన్నుపాము యొక్క పుట్టుకతో వచ్చే లోపాలు.
02:13 రెండు అత్యంత సాధారణ న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి anencephaly మరియు spina bifida.
02:20 anencephaly లో, శిశువు యొక్క మెదడు మరియు పుర్రె యొక్క భాగాలు అనేవి సరిగ్గా ఏర్పడవు.
02:27 spina bifida లో, శిశువు యొక్క వెన్నెముక సరిగా అభివృద్ధి చెందదు.
02:33 అందువలన, శిశువు శారీరక వైకల్యాలను కలిగి ఉండవచ్చు.
02:38 అవి కాళ్ళ యొక్క కండరాల బలహీనతను మరియు పక్షవాతాన్ని అభివృద్ధి చేయవచ్చు.
02:43 వంగిన వెన్నెముక మరియు మూత్రాశయం నియంత్రణను కోల్పోవడం అనేవి ఇతర లక్షణాలు.
02:49 తినడానికి మరియు మింగడానికి ఇబ్బందిపడటం అనేది కూడా సాధారణం.
02:55 వారికి నేర్చుకోవడంలో మరియు శ్రద్ధ పెట్టడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు.
03:00 న్యూరల్ ట్యూబ్ యొక్క మూసివేత అనేది గర్భం దాల్చిన 28 రోజుల్లో జరుగుతుంది.
03:06 ఈ సమయం వరకు, స్త్రీకి తాను గర్భవతి అని కూడా తనకు తెలియకపోవచ్చు.
03:12 ఆమె తెలుసుకునే సమయానికి, ఈ లోపాలను నివారించడానికి చాలా ఆలస్యం అయిపోవచ్చు.
03:18 మహిళలందరూ, ముఖ్యంగా పునరుత్పత్తి వయస్సులో ఫోలేట్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తగినంత తీసుకోవాలి.
03:25 ఫోలేట్ తో పాటు, ఇతర పోషకాలు అనేవి కూడా న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ముఖ్యమైనవి.
03:32 ఉదాహరణకు: విటమిన్ B12 మరియు కోలిన్.
03:39 గర్భధారణ సమయంలో, ఫోలేట్ యొక్క అవసరాలు పెరుగుతాయి.
03:45 ఈ సమయంలో తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఫోలేట్ లోపం ఏర్పడుతుంది.
03:51 శరీరం ఫోలేట్ ను సరిగా గ్రహించుకోకపోవడం వల్ల లోపం వస్తుంది.
03:58 ఆల్కహాల్ ను అధికంగా తీసుకోవడం అనేది కూడా ఇదే ఫలితాన్నిఇస్తుంది.
04:03 విటమిన్ B12 యొక్క లోపం అనేది పరోక్షంగా ఫోలేట్ లోపానికి దారితీయవచ్చు.
04:09 ప్రస్తుతం మన శరీరంలో ఫోలేట్ అనేది ఉన్నప్పటికినీ, దానియొక్క విధిని అది చేయలేకపోతుంది.
04:16 ఇది ఎందుకంటే, ఫోలేట్ ను దాని క్రియాశీల రూపంలోనికి మార్చడానికి విటమిన్ B12 అనేది అవసరం.
04:24 అందువలన, తగినంత విటమిన్ B12 ను ఫోలేట్ తో పాటు గా తీసుకోవడం అనేది ముఖ్యం.
04:31 గుడ్లు, చికెన్, మాంసం మరియు పాల ఉత్పత్తులు అనేవి విటమిన్ B12 యొక్క మంచి వనరులు.
04:39 గుల్ల చేప, కాలేయం, గుండె, మూత్రపిండాలు, మెదడు అనేవి ఇతర ఉదాహరణలు.
04:47 జన్యుసంబంధ రక్తహీనత తో ఉన్న వ్యక్తులకు ఫోలేట్ యొక్క లోపం వచ్చే ప్రమాదం ఉంది.
04:54 జన్యుసంబంధ రక్తహీనతకు ఉదాహరణలు అనేవి sickle cell అనీమియా
04:58 మరియు thalassemia.
05:01 ఇలాంటి పరిస్థితులలో, ఎర్ర రక్త కణాలు అనేవి అవి సృష్టించబడే దానికంటే వేగంగా నాశనం అవుతాయి.
05:08 అందువలన, ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడు ఫోలేట్ ను తగినంత తీసుకోవాలి అని సిఫార్సు చేయబడింది.
05:14 ఏదైనా సప్లిమెంట్ ను తీసుకోవడానికి ముందు దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
05:19 తరువాత, మనం ఫోలేట్ లోపం యొక్క లక్షణాలను చూద్దాం.
05:24 ఈ లక్షణాలను పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోనూ చూడవచ్చు.
05:29 పుండ్లు పడటం ఇంకా నాలుక మరియు పెదవుల యొక్క ఎరుపు అనేవి వీటియొక్క కొన్ని ప్రారంభ సంకేతాలు.
05:35 ఇతర లక్షణాలు అనేవి అలసట,
05:38 చిరాకు,

నిద్రా భంగం

05:41 మరియు నిరాశ.
05:43 నోటిలో లేదా కడుపులో అల్సర్ లు కూడా రావొచ్చు.
05:47 దీర్ఘకాలిక లోపం అనేది జ్ఞాపకశక్తిని మరియు శ్రద్ధను తగ్గించవచ్చు.
05:53 గర్భిణీ స్త్రీలలో ఫోలేట్ లోపం అనేది శిశువులపై చెడు ప్రభావాన్నిచూపించవచ్చు.
05:59 ఉదాహరణకు: న్యూరల్ ట్యూబ్ లోపాలు మరియు
06:03 పిల్లలలో చీలిన పెదవులు మరియు అంగిలి.
06:07 చీలిక అనేది పై పెదవి లేదా నోటి యొక్క పైభాగంలో ఒక అంతరం లేదా చీలడం.
06:13 గర్భంలో పెరుగుదల సమయంలో కణజాలాలు కలిసిపోనప్పుడు ఇది సంభవిస్తుంది.
06:20 ఫోలేట్ లేదా విటమిన్ B12 లోపం వల్ల మేక్రోసైటిక్ అనీమియా వస్తుంది.
06:27 ఇది ఎలా జరుగుతుందో నేను మీకు వివరిస్తాను.
06:30 ఈ రెండు పోషకాలు అనేవి సాధారణ కణాల పెరుగుదల మరియు విభజన కొరకు అవసరం.
06:36 ఒకవేళ వాటి లోపం వచ్చినట్లయితే, ఎర్ర రక్త కణాలు పరిపక్వం చెందవు లేదా సరిగా విభజించబడవు.
06:43 దాని ఫలితంగా, పెద్దపెద్ద అపరిపక్వ ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడతాయి, ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
06:51 ఇవి వాటిల్లో హిమోగ్లోబిన్ ను చాలా తక్కువగా కలిగిఉంటాయి మరియు సరిగా పనిచేయలేవు.
06:59 హిమోగ్లోబిన్ అనేది ఇతర కణజాలాలకు మరియు కణాలకు ఆక్సిజన్ ను రవాణా చేయడానికి సహాయపడుతుంది.
07:06 అందువల్ల, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు అనేవి రక్తహీనతకు కారణమవుతాయి.
07:11 వివిధ వయసుల వారి కొరకు ఫోలేట్ యొక్క రోజువారీ సిఫార్సులను మనం చూద్దాం.
07:18 1 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలకు 90 మైక్రోగ్రాములు అవసరం.
07:24 4 నుండి 9 సంవత్సరాల వయసు పిల్లలకు ఇది 110 నుండి 142 మైక్రోగ్రాములు.
07:32 10 నుండి 15 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ వారి కొరకు ఇది 180 నుండి 204 మైక్రోగ్రాములు.
07:42 16 ఏళ్లు పైబడిన కౌమారదశ వారి కొరకు రోజుకు 200 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది.
07:50 వయోజనులైన ఆడ మరియు మగవారి కొరకు అయితే ఇది 200 నుండి 250 మైక్రోగ్రాములు.
07:58 గర్భిణీ స్త్రీలకు అయితే సుమారుగా 500 మైక్రోగ్రాములు ఉండాలి.
08:02 తల్లి పాలిస్తున్న తల్లుల కొరకు ఇది 300 మైక్రోగ్రాములు.
08:07 జనన లోపాల యొక్క చరిత్ర ఉన్నమహిళలకు ఫోలేట్ యొక్క అవసరాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.
08:15 వారు అయితే గర్భధారణకు ముందు మరియు గర్భంతో ఉన్న సమయంలో 500 మైక్రోగ్రాములు తీసుకోవాలి.
08:22 గర్భం కోసం ప్లాన్ చేస్తున్న మహిళలకు కూడా తగినంత ఫోలేట్ తీసుకోవాలి అని సిఫార్సు చేయబడింది.
08:29 ఫోలేట్ యొక్క అవసరాలను ఆహారం ద్వారా తీర్చవచ్చు.
08:33 బీన్స్ అనేవి ఫోలేట్ యొక్క అద్భుతమైన వనరులు.
08:36 30 గ్రాములు లేదా ½ కప్పు ఉడికించని బీన్స్ సుమారుగా 80 నుండి 120 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తాయి.
08:46 అలసందలు, రాజ్ మా, మోటుపెసలు, సోయాబీన్స్ అనేవి కొన్ని ఉదాహరణలు.
08:53 కొమ్ముశనగలు, చిక్కుడు పిక్కలు, ఉలవలు, ఎండు బఠానీలు అనేవి కూడా మంచి వనరులే.
09:00 పచ్చని ఆకుకూరలు అనేవి కూడా ఫోలేట్ ను సమృద్ధిగా కలిగిఉంటాయి.
09:04 ఉదాహరణకు: పాలకూర, తోటకూర ఆకులు, చామ ఆకులు, అగిస్తి ఆకులు.
09:11 50 గ్రాములు లేదా 1 కప్పు వండని పాలకూర సుమారుగా 70 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది.
09:19 1 టీస్పూన్ మునగ ఆకుల పొడి సుమారుగా 10 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది.
09:27 ఫోలేట్ అధికంగా ఉండే ఇతర కూరగాయలు అనేవి పందిరి చిక్కుడుకాయలు, ఫ్రెంచ్ బీన్స్ మరియు బీట్‌రూట్.
09:35 క్యాబేజ్ పువ్వు, బెండకాయలు మరియు మునక్కాడలు కూడా మితమైన మొత్తంలో ఫోలేట్ ను కలిగిఉంటాయి.
09:43 పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆవాలు మరియు ఓడిసలు/వెర్రి నువ్వులు అనేవి తక్కువ మొత్తంలో ఫోలేట్ ను కలిగి ఉంటాయి.
09:50 1 టేబుల్ స్పూన్ ఈ విత్తనాల యొక్క పొడి సుమారుగా 15 నుండి 20 మైక్రోగ్రాముల ఫోలేట్ కలిగి ఉంటుంది.
09:59 మాంసాహార ఆహారాలలో చికెన్ కాలేయం మరియు అన్ని సముద్ర ఆహారాలు అనేవి అద్భుతమైన వనరులు.
10:06 60 గ్రాముల 1 కోడి యొక్క కాలేయం అనేది సుమారుగా 600 మైక్రోగ్రాముల ఫోలేట్ ను ఇస్తుంది.
10:13 ఏదైనా సముద్రపు ఆహారం యొక్క100 గ్రాములు అనేది 700 కంటే ఎక్కువ మైక్రోగ్రాములు ఇస్తుంది.
10:20 అధిక వేడి మరియు నీరు అనేవి ఫోలేట్ కంటెంట్‌ను తగ్గిస్తాయని దయచేసి గమనించండి.
10:26 అందువలన, ఎక్కువగా ఉడికించడం మరియు ఆహారాన్ని మళ్లీమళ్లీ వేడిచేయడాన్ని మానుకోండి.
10:33 కూరగాయలను ఉడకబెట్టడానికి బదులుగా దోరగా వేయించవచ్చు లేదా ఆవిరితో చేయవచ్చు.
10:38 వంట చేసే ముందు పప్పుధాన్యాలను ఎల్లప్పుడూ రాత్రిపూట నానబెట్టాలి.
10:43 పూర్తి బీన్స్ ను మొలకెత్తించడం మరియు వండటం వలన వాటియొక్క పోషక విలువలు పెరుగుతాయి.
10:49 పులియబెట్టడం మరియు వేయించడం కూడా ఫోలేట్ యొక్క శోషణను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
10:56 మన మంచి ఆరోగ్యం కొరకు ఫోలేట్ ను తగినంతగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
11:01 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya