QGIS/C2/Downloading-GIS-Datasets/Telugu
Time | Narration |
00:01 | Downloading GIS Datasets పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేవి |
00:09 | GIS గురించి |
00:11 | Natural Earth Data వెబ్సైట్ నుండి vector dataset ను డౌన్లోడ్ చేయడం. |
00:16 | QGIS లో vector data ను చూడడం. |
00:20 | Bhuvan వెబ్సైట్ నుండి raster dataset ను డౌన్లోడ్ చేయడం మరియు |
00:25 | QGIS లో raster data ను చూడడం. |
00:29 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను |
00:33 | Ubuntu Linux OS వర్షన్ 16.04 |
00:38 | QGIS వర్షన్ 2.18 |
00:42 | Mozilla Firefox బ్రౌజర్ వర్షన్ 54.0 మరియు |
00:47 | ఒక పనిచేస్తున్న Internet కనెక్షన్ |
00:50 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, GIS ను గురించిన జ్ఞానం కావాలి, కానీ తప్పనిసరి కాదు. |
00:58 | GIS ను గురించి మరింత సమాచారం కొరకు, దయచేసి ఇచ్చిన లింక్‌ను సందర్శించండి. |
01:03 | ఈ ట్యుటోరియల్ కొరకు అవసరమైన అన్ని datasets,Code files లింక్‌లో అందుబాటులో ఉన్నాయి. |
01:10 | GIS ను గురించి
GIS అనగా Geographic Information System. |
01:17 | geospatial data ను సంగ్రహించడం, నిల్వ చేయడం, ప్రశ్నించడం, విశ్లేషించడం మరియు ప్రదర్శించడం కొరకు ఇది ఒక వ్యవస్థ. |
01:26 | Spatial Data అనేది రెండు రకాలు, Vector Data మరియు Raster Data. |
01:33 | ఇంటర్నెట్ నుండి vector dataset ను మనం డౌన్లోడ్ చేద్దాం. |
01:37 | ఏదైనా వెబ్ బ్రౌజర్‌ను తెరవండి. |
01:40 | అడ్రస్ బార్ లో, www.naturalearthdata.com అని టైప్ చేయండి
Enter ను నొక్కండి. |
01:49 | Natural Earth data వెబ్సైట్ తెరుచుకుంటుంది. |
01:53 | Downloads లింక్‌పై క్లిక్ చేయండి. |
01:56 | Downloads పేజీ తెరుచుకుంటుంది.
పేజీని స్క్రోల్ చేయండి. |
02:02 | dataset యొక్క మూడు వేర్వేరు scales ను మీరు చూడవచ్చు.
Large, Medium మరియు Small. |
02:12 | ప్రదర్శన కొరకు మనం dataset ను డౌన్లోడ్ చేద్దాం. |
02:16 | Large scale data కిందన, Cultural బటన్ పై క్లిక్ చేయండి. |
02:21 | ఒక వెబ్‌పేజీ తెరుచుకుంటుంది.
ఆ పేజీని స్క్రోల్ చేయండి. |
02:27 | ఇక్కడ, మనం అందుబాటులో ఉన్న వివిధ datasets ను చూడవచ్చు. |
02:32 | మనం country administration boundary files ను డౌన్లోడ్ చేద్దాం. |
02:37 | Admin zero hyphen Countries హెడింగ్ కింద, Download countries బటన్ పై క్లిక్ చేయండి. |
02:45 | ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది ఫైల్‌ను సేవ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది.
Save ఫైల్ ఎంపికను ఎంచుకోండి. |
02:53 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
02:56 | డౌన్లోడ్ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. |
02:59 | నా సిస్టమ్‌లో, Downloads ఫోల్డర్‌కు ఒక zip file డౌన్లోడ్ అవుతుంది. |
03:05 | zip file యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.
రైట్-క్లిక్ చేసి, Extract Here ఎంపికను ఎంచుకోండి. |
03:14 | ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి. |
03:18 | ఇక్కడ మనం వేర్వేరు ఫైల్ ఎక్స్టెన్షన్ లతో చాలా ఫైళ్ళను చూస్తాము. |
03:23 | ఇది dataset యొక్క వెక్టర్ టైప్. |
03:26 | Vector data గురించి. |
03:29 | బావులు, రోడ్లు మరియు భూ వినియోగ రకాలు వంటి ప్రత్యేక లక్షణాలు అనేవి Vector Data. |
03:36 | Vector data అనేది పాయింట్, లైన్ లేదా పోలిగాన్ (బహుభుజి) ఫార్మట్ లో ఉంటుంది. |
03:41 | మనం QGIS ను తెరిచి, డౌన్లోడ్ చేసిన ఫైల్స్ లో ఒకదాని యొక్క వ్యూ ని చూద్దాం. |
03:47 | ఇక్కడ, నేను ఇప్పటికే QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను. |
03:52 | menu bar పైనున్నLayer menu పై క్లిక్ చేయండి. |
03:56 | menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి. |
04:00 | sub-menu నుండి, Add Vector Layer ఎంపికపై క్లిక్ చేయండి. |
04:05 | Add Vector Layer డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
04:09 | File ను Source type గా, System ను Encoding గా ఎంచుకోండి. |
04:16 | Source హెడింగ్ కింద, Browse బటన్ పై క్లిక్ చేయండి. |
04:20 | Natural Earth data వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన admin countrie ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి. |
04:27 | ఫోల్డర్ యొక్క కంటెంట్స్ నుండి, .shp ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్ ను ఎంచుకోండి.
Open బటన్ పై క్లిక్ చేయండి. |
04:37 | Add vector layer డైలాగ్-బాక్స్‌లో, Open బటన్ పై క్లిక్ చేయండి.
canvas పై ప్రపంచ పటం తెరుచుకుంటుంది. |
04:46 | మ్యాప్‌ను సేవ్ చేయండి. |
04:48 | menu bar లోని Project పై క్లిక్ చేయండి. |
04:52 | క్రిందికి స్క్రోల్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి. |
04:57 | డైలాగ్-బాక్స్‌లో, ఫైల్‌కు Map hyphen 1 గా పేరును పెట్టండి. |
05:03 | నేను దానిని డెస్క్‌టాప్ పైన సేవ్ చేస్తాను. |
05:06 | Save బటన్ పై క్లిక్ చేయండి. |
05:09 | ఈ మ్యాప్ Desktop పైన Map hyphen 1 dot qgs గా సేవ్ చేయబడుతుంది. |
05:16 | Raster Data గురించి. |
05:19 | పరిశీలనల మధ్య ప్రాదేశికంగా ఉన్న నిరంతర లక్షణాలు అనేవి Raster Data. |
05:26 | Raster data అనేది రో మరియు కాలమ్ ఫార్మాట్ లో ఉన్న సెల్స్ తో రూపొందించబడింది. |
05:32 | మనం Bhuvan వెబ్సైట్ నుండి raster dataset ను డౌన్లోడ్ చేద్దాం. |
05:37 | Bhuvan Platform అనేది ISRO చేత సృష్టించబడింది. |
05:41 | భారతీయ remote sensing ఉపగ్రహాల చేత సేకరించబడిన విభిన్న డేటాను ఈ వెబ్సైట్ హోస్ట్ చేస్తుంది. |
05:48 | Bhuvan వెబ్సైట్ నుండి raster dataset ను డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇక్కడ ఉంది. |
05:54 | ఏదైనా వెబ్ బ్రౌజర్లో Bhuvan వెబ్సైట్ లింక్‌ను తెరవండి. |
05:59 | Open Data Archive పేజీ తెరుచుకుంటుంది. |
06:03 | Select Category కిందన ఎడమవైపు ప్యానెల్ పైన, Satellite/Sensor ఎంపికను ఎంచుకోండి. |
06:10 | Select Subcategory డ్రాప్ డౌన్ కింద, Resourcesat-1: LISS-III ఎంపికను ఎంచుకోండి. |
06:18 | స్క్రోల్ చేసి, Select Area కింద, Bounding Box ను ఎంచుకోండి. |
06:25 | ఇక్కడ, మనం లొకేషన్ యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని ఎంటర్ చేయాలి. |
06:31 | మనం Mumbai రీజియన్ కొరకు data ను డౌన్లోడ్ చేద్దాం. |
06:35 | ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని కనుగొనడానికి google maps ను ఉపయోగించండి. |
06:41 | Mumbai రీజియన్ కొరకు, కింది data ను ఎంటర్ చేయండి. |
06:45 | Minimum Longitude 72.75 |
06:50 | Maximum Longitude 73 |
06:54 | Minimum Latitude 19 |
06:58 | Maximum Latitude 19.25 |
07:02 | Select బటన్ పై క్లిక్ చేయండి. |
07:05 | Mumbai పైనుండి ఒక tile అనేది హైలైట్ అవుతుంది. |
07:09 | పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNext బటన్ పై క్లిక్ చేయండి.
అందుబాటులో ఉన్న Tiles యొక్క ఒక లిస్ట్ తెరుచుకుంటుంది. |
07:17 | Date of Pass column లోకి చూడటం ద్వారా ఇటీవలి చిత్రాలను ఎంచుకోండి. |
07:23 | 24 December 15 అనేది అందుబాటులో ఉన్న datasets లోనుండి ఇటీవలిది. |
07:30 | Selection for backlog కిందన ఈ రో పైనున్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి.
ఈ రో పైనున్న Download బటన్ పై క్లిక్ చేయండి. |
07:39 | Bhuvan మిమ్మల్ని login చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.
OK బటన్ పై క్లిక్ చేయండి. |
07:45 | ఓక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
07:48 | ఒకవేళ మీరు Bhuvan ను ఉపయోగించడం మీకు మొదటిసారి అయితే, ఒక కొత్త account ను సృష్టించడానికి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNew User లింక్‌పై క్లిక్ చేయండి. |
07:57 | Account and Profile Information పేజీ తెరుచుకుంటుంది. |
08:02 | చూపిన విధంగా తగిన వివరాలను నింపండి.
Submit బటన్ పై క్లిక్ చేయండి. |
08:09 | మీరు Login Id మరియు Password తో ఉన్న ఒక ఇమెయిల్ ను Bhuvan టీమ్ నుండి అందుకుంటారు. |
08:15 | నేను ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసాను.
కనుక నేను Click here to login లింక్ పై క్లిక్ చేస్తాను. |
08:24 | నేను Username మరియు Password ను ఎంటర్ చేసి, Login బటన్ పై క్లిక్ చేస్తాను. |
08:31 | మళ్ళీ, tiles panel లో 24Dec15 row కొరకు, Download బటన్ పై క్లిక్ చేయండి. |
08:38 | zip file యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. |
08:43 | ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది మిమ్మల్నిఫైల్ను సేవ్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. |
08:48 | Save File ఎంపికను ఎంచుకుని, OK బటన్ పై క్లిక్ చేయండి. |
08:53 | ఈ zip file, Downloads ఫోల్డర్లో సేవ్ చేయబడుతుంది. |
08:57 | జిప్ ఫైల్ యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి. |
09:01 | ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి. |
09:05 | ఈ ఫోల్డర్ Mumbai రీజియన్ కొరకు raster dataset కలిగిఉంటుంది. |
09:10 | ఇప్పుడు QGIS లోని ఒక ఫైల్ ను తెరుద్దాం.
ఒక క్రొత్త విండోను తెరవండి. |
09:17 | tool bar పై ఎగువ ఎడమ మూలలో ఉన్నNew icon పై క్లిక్ చేయండి. |
09:22 | menu bar పైన Layer పై క్లిక్ చేయండి. |
09:25 | menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి. |
09:29 | sub-menu నుండి, Add Raster Layer option పై క్లిక్ చేయండి. |
09:34 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:37 | మనం Bhuvan వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి. |
09:42 | 24December15 hyphen BAND2 dot tif ఫైల్‌ను ఎంచుకోండి.
Open బటన్ పై క్లిక్ చేయండి. |
09:51 | QGIS canvas పైన, మీరు Mumbai రీజియన్ యొక్క raster మ్యాప్ ను చూస్తారు. |
09:58 | సారాంశం చూద్దాం. |
10:00 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటి గురించి నేర్చుకున్నాము,
GIS గురించి |
10:05 | Natural Earth Data వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన vector dataset గురించి. |
10:10 | QGIS లో వీక్షించిన vector dataset గురించి. |
10:14 | Bhuvan వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన raster dataset గురించి. |
10:18 | QGIS లో వీక్షించిన raster dataset గురించి. |
10:22 | అసైన్మెంట్ కొరకు-
Natural Earth Data వెబ్సైట్ నుండి, Rivers and Lakes (నదులు మరియు సరస్సులు) కొరకు Medium Scale, Physical data ను డౌన్లోడ్ చేయండి. |
10:32 | Openstreetmap data వెబ్సైట్ అనేది GIS data ను డౌన్లోడ్ చేయడానికి మరొక ప్రముఖమైన వెబ్సైట్. |
10:39 | Openstreetmap data వెబ్‌సైట్‌ను అన్వేషించండి |
10:43 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దీనిని డౌన్లోడ్ చేసి చూడండి. |
10:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
11:01 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి. |
11:08 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. |
11:16 | మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
11:20 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించిన వివరాల కోసం, చూపిన లింక్‌ను సందర్శించండి. |
11:32 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |