QGIS/C2/Downloading-GIS-Datasets/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Downloading GIS Datasets పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేవి
00:09 GIS గురించి
00:11 Natural Earth Data వెబ్‌సైట్ నుండి vector dataset ను డౌన్‌లోడ్ చేయడం.
00:16 QGIS లో vector data ను చూడడం.
00:20 Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేయడం మరియు
00:25 QGIS లో raster data ను చూడడం.
00:29 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను
00:33 Ubuntu Linux OS వర్షన్ 16.04
00:38 QGIS వర్షన్ 2.18
00:42 Mozilla Firefox బ్రౌజర్ వర్షన్ 54.0 మరియు
00:47 ఒక పనిచేస్తున్న Internet కనెక్షన్
00:50 ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, GIS ను గురించిన జ్ఞానం కావాలి, కానీ తప్పనిసరి కాదు.
00:58 GIS ను గురించి మరింత సమాచారం కొరకు, దయచేసి ఇచ్చిన లింక్‌ను సందర్శించండి.
01:03 ఈ ట్యుటోరియల్‌ కొరకు అవసరమైన అన్ని datasets,Code files లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
01:10 GIS ను గురించి

GIS అనగా Geographic Information System.

01:17 geospatial data ను సంగ్రహించడం, నిల్వ చేయడం, ప్రశ్నించడం, విశ్లేషించడం మరియు ప్రదర్శించడం కొరకు ఇది ఒక వ్యవస్థ.
01:26 Spatial Data అనేది రెండు రకాలు, Vector Data మరియు Raster Data.
01:33 ఇంటర్నెట్ నుండి vector dataset ను మనం డౌన్‌లోడ్ చేద్దాం.
01:37 ఏదైనా వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
01:40 అడ్రస్ బార్ లో, www.naturalearthdata.com అని టైప్ చేయండి

Enter ను నొక్కండి.

01:49 Natural Earth data వెబ్‌సైట్ తెరుచుకుంటుంది.
01:53 Downloads లింక్‌పై క్లిక్ చేయండి.
01:56 Downloads పేజీ తెరుచుకుంటుంది.

పేజీని స్క్రోల్ చేయండి.

02:02 dataset యొక్క మూడు వేర్వేరు scales ను మీరు చూడవచ్చు.

Large, Medium మరియు Small.

02:12 ప్రదర్శన కొరకు మనం dataset ను డౌన్‌లోడ్ చేద్దాం.
02:16 Large scale data కిందన, Cultural బటన్ పై క్లిక్ చేయండి.
02:21 ఒక వెబ్‌పేజీ తెరుచుకుంటుంది.

ఆ పేజీని స్క్రోల్ చేయండి.

02:27 ఇక్కడ, మనం అందుబాటులో ఉన్న వివిధ datasets ను చూడవచ్చు.
02:32 మనం country administration boundary files ను డౌన్‌లోడ్ చేద్దాం.
02:37 Admin zero hyphen Countries హెడింగ్ కింద, Download countries బటన్ పై క్లిక్ చేయండి.
02:45 ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది ఫైల్‌ను సేవ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది.

Save ఫైల్ ఎంపికను ఎంచుకోండి.

02:53 OK బటన్ పై క్లిక్ చేయండి.
02:56 డౌన్‌లోడ్ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది.
02:59 నా సిస్టమ్‌లో, Downloads ఫోల్డర్‌కు ఒక zip file డౌన్‌లోడ్ అవుతుంది.
03:05 zip file యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.

రైట్-క్లిక్ చేసి, Extract Here ఎంపికను ఎంచుకోండి.

03:14 ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి.
03:18 ఇక్కడ మనం వేర్వేరు ఫైల్ ఎక్స్టెన్షన్ లతో చాలా ఫైళ్ళను చూస్తాము.
03:23 ఇది dataset యొక్క వెక్టర్ టైప్.
03:26 Vector data గురించి.
03:29 బావులు, రోడ్లు మరియు భూ వినియోగ రకాలు వంటి ప్రత్యేక లక్షణాలు అనేవి Vector Data.
03:36 Vector data అనేది పాయింట్, లైన్ లేదా పోలిగాన్ (బహుభుజి) ఫార్మట్ లో ఉంటుంది.
03:41 మనం QGIS ను తెరిచి, డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ లో ఒకదాని యొక్క వ్యూ ని చూద్దాం.
03:47 ఇక్కడ, నేను ఇప్పటికే QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను.
03:52 menu bar పైనున్నLayer menu పై క్లిక్ చేయండి.
03:56 menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి.
04:00 sub-menu నుండి, Add Vector Layer ఎంపికపై క్లిక్ చేయండి.
04:05 Add Vector Layer డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
04:09 File ను Source type గా, System ను Encoding గా ఎంచుకోండి.
04:16 Source హెడింగ్ కింద, Browse బటన్ పై క్లిక్ చేయండి.
04:20 Natural Earth data వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన admin countrie ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి.
04:27 ఫోల్డర్ యొక్క కంటెంట్స్ నుండి, .shp ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్ ను ఎంచుకోండి.

Open బటన్ పై క్లిక్ చేయండి.

04:37 Add vector layer డైలాగ్-బాక్స్‌లో, Open బటన్ పై క్లిక్ చేయండి.

canvas ‌పై ప్రపంచ పటం తెరుచుకుంటుంది.

04:46 మ్యాప్‌ను సేవ్ చేయండి.
04:48 menu bar లోని Project పై క్లిక్ చేయండి.
04:52 క్రిందికి స్క్రోల్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి.
04:57 డైలాగ్-బాక్స్‌లో, ఫైల్‌కు Map hyphen 1 గా పేరును పెట్టండి.
05:03 నేను దానిని డెస్క్‌టాప్‌ పైన సేవ్ చేస్తాను.
05:06 Save బటన్ పై క్లిక్ చేయండి.
05:09 ఈ మ్యాప్ Desktop పైన Map hyphen 1 dot qgs గా సేవ్ చేయబడుతుంది.
05:16 Raster Data గురించి.
05:19 పరిశీలనల మధ్య ప్రాదేశికంగా ఉన్న నిరంతర లక్షణాలు అనేవి Raster Data.
05:26 Raster data అనేది రో మరియు కాలమ్ ఫార్మాట్ లో ఉన్న సెల్స్ తో రూపొందించబడింది.
05:32 మనం Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేద్దాం.
05:37 Bhuvan Platform అనేది ISRO చేత సృష్టించబడింది.
05:41 భారతీయ remote sensing ఉపగ్రహాల చేత సేకరించబడిన విభిన్న డేటాను ఈ వెబ్‌సైట్ హోస్ట్ చేస్తుంది.
05:48 Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ ఇక్కడ ఉంది.
05:54 ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో Bhuvan వెబ్‌సైట్ లింక్‌ను తెరవండి.
05:59 Open Data Archive పేజీ తెరుచుకుంటుంది.
06:03 Select Category కిందన ఎడమవైపు ప్యానెల్‌ పైన, Satellite/Sensor ఎంపికను ఎంచుకోండి.
06:10 Select Subcategory డ్రాప్ డౌన్ కింద, Resourcesat-1: LISS-III ఎంపికను ఎంచుకోండి.
06:18 స్క్రోల్ చేసి, Select Area కింద, Bounding Box ను ఎంచుకోండి.
06:25 ఇక్కడ, మనం లొకేషన్ యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని ఎంటర్ చేయాలి.
06:31 మనం Mumbai రీజియన్ కొరకు data ను డౌన్‌లోడ్ చేద్దాం.
06:35 ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని కనుగొనడానికి google maps ను ఉపయోగించండి.
06:41 Mumbai రీజియన్ కొరకు, కింది data ను ఎంటర్ చేయండి.
06:45 Minimum Longitude 72.75
06:50 Maximum Longitude 73
06:54 Minimum Latitude 19
06:58 Maximum Latitude 19.25
07:02 Select బటన్ పై క్లిక్ చేయండి.
07:05 Mumbai పైనుండి ఒక tile అనేది హైలైట్ అవుతుంది.
07:09 పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNext బటన్ పై క్లిక్ చేయండి.

అందుబాటులో ఉన్న Tiles యొక్క ఒక లిస్ట్ తెరుచుకుంటుంది.

07:17 Date of Pass column లోకి చూడటం ద్వారా ఇటీవలి చిత్రాలను ఎంచుకోండి.
07:23 24 December 15 అనేది అందుబాటులో ఉన్న datasets లోనుండి ఇటీవలిది.
07:30 Selection for backlog కిందన ఈ రో పైనున్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి.

ఈ రో పైనున్న Download బటన్ పై క్లిక్ చేయండి.

07:39 Bhuvan మిమ్మల్ని login చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.

OK బటన్ పై క్లిక్ చేయండి.

07:45 ఓక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
07:48 ఒకవేళ మీరు Bhuvan ను ఉపయోగించడం మీకు మొదటిసారి అయితే, ఒక కొత్త account ను సృష్టించడానికి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNew User లింక్‌పై క్లిక్ చేయండి.
07:57 Account and Profile Information పేజీ తెరుచుకుంటుంది.
08:02 చూపిన విధంగా తగిన వివరాలను నింపండి.

Submit బటన్ పై క్లిక్ చేయండి.

08:09 మీరు Login Id మరియు Password తో ఉన్న ఒక ఇమెయిల్ ను Bhuvan టీమ్ నుండి అందుకుంటారు.
08:15 నేను ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసాను.

కనుక నేను Click here to login లింక్ పై క్లిక్ చేస్తాను.

08:24 నేను Username మరియు Password ను ఎంటర్ చేసి, Login బటన్ పై క్లిక్ చేస్తాను.
08:31 మళ్ళీ, tiles panel లో 24Dec15 row కొరకు, Download బటన్ పై క్లిక్ చేయండి.
08:38 zip file యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది.
08:43 ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది మిమ్మల్నిఫైల్‌ను సేవ్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.
08:48 Save File ఎంపికను ఎంచుకుని, OK బటన్ పై క్లిక్ చేయండి.
08:53 ఈ zip file, Downloads ఫోల్డర్‌లో సేవ్ చేయబడుతుంది.
08:57 జిప్ ఫైల్ యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.
09:01 ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి.
09:05 ఈ ఫోల్డర్‌ Mumbai రీజియన్ కొరకు raster dataset కలిగిఉంటుంది.
09:10 ఇప్పుడు QGIS లోని ఒక ఫైల్ ను తెరుద్దాం.

ఒక క్రొత్త విండోను తెరవండి.

09:17 tool bar పై ఎగువ ఎడమ మూలలో ఉన్నNew icon పై క్లిక్ చేయండి.
09:22 menu bar పైన Layer పై క్లిక్ చేయండి.
09:25 menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి.
09:29 sub-menu నుండి, Add Raster Layer option పై క్లిక్ చేయండి.
09:34 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:37 మనం Bhuvan వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి.
09:42 24December15 hyphen BAND2 dot tif ఫైల్‌ను ఎంచుకోండి.

Open బటన్ పై క్లిక్ చేయండి.

09:51 QGIS canvas పైన, మీరు Mumbai రీజియన్ యొక్క raster మ్యాప్ ను చూస్తారు.
09:58 సారాంశం చూద్దాం.
10:00 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటి గురించి నేర్చుకున్నాము,

GIS గురించి

10:05 Natural Earth Data వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన vector dataset గురించి.
10:10 QGIS లో వీక్షించిన vector dataset గురించి.
10:14 Bhuvan వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన raster dataset గురించి.
10:18 QGIS లో వీక్షించిన raster dataset గురించి.
10:22 అసైన్మెంట్ కొరకు-

Natural Earth Data వెబ్‌సైట్ నుండి, Rivers and Lakes (నదులు మరియు సరస్సులు) కొరకు Medium Scale, Physical data ను డౌన్‌లోడ్ చేయండి.

10:32 Openstreetmap data వెబ్‌సైట్ అనేది GIS data ను డౌన్‌లోడ్ చేయడానికి మరొక ప్రముఖమైన వెబ్‌సైట్.
10:39 Openstreetmap data వెబ్‌సైట్‌ను అన్వేషించండి
10:43 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.

10:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

11:01 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?

దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.

11:08 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి.

11:16 మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.
11:20 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించిన వివరాల కోసం, చూపిన లింక్‌ను సందర్శించండి.

11:32 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya