Synfig/C2/Draw-a-Toy-train/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:23, 8 November 2020 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Synfig ను ఉపయోగించి Draw aToy train అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము: |
00:09 | ప్రాథమిక ఆకారాలను (షేప్స్) ను గీయడం, ఆకారాలకు (షేప్స్) రంగు వేయడం, ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & నకిలీ (డూప్లికేట్) చేయడం మరియు |
00:14 | Guideline ను ఉపయోగించి ఆకృతులను (షేప్స్) సమలేఖనం (అలైన్) చేయడం |
00:17 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: |
00:20 | ఉబుంటు లైనక్స్ 14.04 OS, |
00:24 | Synfig వర్షన్ 1.0.2 |
00:27 | మనం Synfig ను తెరుద్దాం. |
00:29 | మొదట, మనం టాయ్ ట్రైన్ యొక్క కంపార్ట్మెంట్ ను గీస్తాము. |
00:33 | దీని కొరకు, Rectangle tool ను ఎంచుకోండి. |
00:36 | Tool options లో, Create a region layer అనేది ఎంచుకోబడిందో లేదో అని తనిఖీ చేయండి. |
00:42 | ఇప్పుడు, canvas పై ఒక దీర్ఘచతురస్రాన్ని (రెక్టేంగిల్) గీయండి. |
00:46 | layer పేరును Part-1కు మార్చండి. |
00:50 | Parameters panel కు వెళ్లి కలర్ ను ఆకుపచ్చకు మార్చండి. |
00:56 | ఇప్పుడు Transform tool పై క్లిక్ చెయ్యండి. |
00:58 | తరువాత షేప్ ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి. |
01:02 | canvas పైన ఏదైనా షేప్ ను గీసిన తర్వాత ఈ దశను చేయాలని గుర్తుంచుకోండి. |
01:07 | మనం మన ఫైల్ ను save చేద్దాం. |
01:09 | File కు వెళ్ళండి. Save as పై క్లిక్ చెయ్యండి. |
01:13 | ఫైల్ పేరును Toy-Train-animation గా మార్చండి. |
01:18 | దీన్ని మీ Desktop లో సేవ్ చెయ్యండి. |
01:21 | ఇప్పుడు, Rectangle tool ని మరొకసారి ఎంచుకోండి. |
01:26 | చూపిన విధంగా మునుపటి దీర్ఘచతురస్రం (రెక్టేంగిల్) మధ్యలో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
01:32 | ఇది ట్రైన్ యొక్క విండో (కిటికీ) అవుతుంది. |
01:35 | ఈ లేయర్ కు Window గా rename చేద్దాం. |
01:41 | తరువాత, Polygon tool పై క్లిక్ చేయండి. |
01:43 | Tool options లో, Create a region layer అనేది ఎంపిక ఎంచుకోబడిందో లేదో తనిఖీ చేయండి. |
01:50 | చూపిన విధంగా దీర్ఘచతురస్రం (రెక్టేంగిల్) పైన సమలంబ చతుర్భుజాన్ని (ట్రాపెజియం) గీయండి. |
01:54 | సమలంబ చతుర్భుజాన్ని (ట్రాపెజియం) మూసివేయడానికి ప్రారంభ బిందువుపైన క్లిక్ చెయ్యండి. |
01:59 | ఈ layer కు Part-2 గా పేరును మార్చండి. |
02:03 | నేను రంగును ఎరుపుకు మారుస్తాను. |
02:07 | ఇప్పుడు, Transform tool ని ఎంచుకోండి. |
02:10 | Layers panel వెళ్లండి. |
02:12 | అన్ని లేయర్స్ ను ఎంచుకొని వాటిని గ్రూప్ చెయ్యండి. |
02:15 | ఈ గ్రూప్ లేయర్ కు Compartment-3 గా పేరును మార్చండి. |
02:20 | handle యొక్క నారింజరంగు బిందువును ఉపయోగించి లేయర్ ను పునః పరిమాణం (రీ సైజ్) చెయ్యండి. |
02:24 | handle యొక్క ఆకుపచ్చరంగు బిందువును ఉపయోగించి దీనిని canvas యొక్క కుడి వైపుకు తరలించండి. |
02:30 | Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి. |
02:35 | తరువాత, మనం ట్రైన్ యొక్క వీల్ ని గీద్దాం. |
02:38 | ఏదైనా షేప్ ను గీసిన తర్వాత షేప్ యొక్క ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చెయ్యాలని గుర్తుంచుకోండి. |
02:44 | Circle tool ను ఎంచుకోండి. |
02:46 | Tool options లో, Create a region layer అనేది తప్పకుండా ఎంచుకోవాలి. |
02:50 | చూపిన విధంగా వృత్తాన్ని గీయండి మరియు దాని రంగును ముదురు నీలం రంగులోకి మార్చండి. |
02:56 | ఇప్పుడు Star tool ని ఎంచుకోండి. |
02:59 | Tool options లో, Create a star layer అనేది ఎంచుకోవాలి. |
03:05 | కర్సర్‌ను వృత్తం యొక్క మధ్యభాగంలో ఉంచి ఒక నక్షత్రాన్ని గీయండి. |
03:09 | ఇప్పుడు, Transform tool ని ఎంచుకోండి. |
03:12 | ఇక్కడ 1 handle మరియు 2 చుక్కలు ఉన్నాయని గమనించండి. |
03:16 | ఆకారం యొక్క స్థానాన్ని మార్చడానికి హ్యాండిల్ యొక్క ఆకుపచ్చరంగు బిందువును క్లిక్ చేసి లాగండి. |
03:22 | రొటేషన్ కొరకు handle లోని నీలంరంగు బిందువును ఉపయోగించండి. |
03:26 | మధ్యలోని ఆకుపచ్చరంగు బిందువు అనేది నక్షత్రం ఆకారం యొక్క బయటి అంచుని సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. |
03:31 | చివరి బిందువు అనేది పరిమాణాన్ని మార్చడానికి ఉపయోగించబడుతుంది. |
03:34 | నక్షత్రం మరియు వృత్తం రెండు లేయర్స్ నీ ఎంచుకోండి. |
03:37 | వాటిని గ్రూప్ చేసి ఆపై Wheel-1గా పేరును మార్చండి. |
03:41 | ఈ గ్రూప్ లేయర్ ను రీసైజ్ చేసి, దాన్నికంపార్ట్మెంట్ క్రిందన ఉంచండి. |
03:47 | ఇప్పుడు Wheel-1 group layer ను డూప్లికేట్ చెయ్యండి. |
03:50 | దానికి Wheel-2 గా పేరును మార్చి కంపార్ట్మెంట్ యొక్క మరొక చివరకి వెళ్ళండి. |
03:56 | ఇప్పుడు అన్ని గ్రూప్ లేయర్స్ నీ ఎంచుకోండి. |
03:59 | వాటిని మళ్లీ గ్రూప్ చేసి Compartment-3 గా పేరును మార్చండి. |
04:04 | ఇప్పుడు Duplicate ఐకాన్ పై రెండుసార్లు క్లిక్ చెయ్యండి. |
04:08 | గ్రూప్ చేసిన డూప్లికేట్ లేయర్స్ కు వరుసగా Compartment-2 & Compartment-1 అని పేరు మార్చండి. |
04:17 | Compartment-2 గ్రూప్ లేయర్ ని ఎంచుకోండి. |
04:20 | Shift key ని ఉపయోగించి handle యొక్క మధ్య ఆకుపచ్చరంగు బిందువును లాగండి. |
04:24 | Compartment-1 గ్రూప్ లేయర్ కొరకు కూడా ఇదేవిధంగా చెయ్యండి. |
04:30 | Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి. |
04:34 | తరువాత, మనం ఇంజిన్ ను గీద్దాం. |
04:36 | Canvas బయట క్లిక్ చెయ్యండి. |
04:39 | Circle tool ని ఎంచుకుని, చూపిన విధంగా ఒక వృత్తాన్ని గీయండి. |
04:43 | లేయర్ కు Engine-part-1 గా పేరును మార్చండి. |
04:47 | రంగును పింక్ కు మార్చండి. |
04:50 | తరువాత Rectangle tool పై క్లిక్ చేసి, వృత్తం యొక్క పైభాగంలో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
04:59 | ఈ లేయర్ కు Engine-part-2 గా పేరును మార్చి రంగును పసుపురంగుకి మార్చండి. |
05:06 | ప్రస్తుతమున్న దీర్ఘచతురస్రం పైన మరో దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
05:10 | ఈ లేయర్ కు Engine-part-3 గా పేరును మార్చి రంగును ఆకుపచ్చ రంగుకి మార్చండి. |
05:17 | అదే rectangle tool ని ఉపయోగించి, చూపిన విధంగా విండో ను గీయండి. |
05:22 | ఈ లేయర్ కు Engine-window గా పేరును మార్చండి. |
05:26 | ఇంజిన్ యొక్క లేయర్స్ ని ఎంచుకొని వాటిని గ్రూప్ చెయ్యండి. |
05:29 | తరువాత Engine గా పేరు మార్చండి. |
05:32 | Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి. |
05:37 | కంపార్ట్మెంట్ల యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏదైనా ఒకదాని పై క్లిక్ చేయండి. |
05:40 | Wheel-1 మరియు Wheel-2 గ్రూప్ లేయర్స్ రెండింటినీ ఎంచుకొని వాటిని copy చెయ్యండి. |
05:45 | Engine group layer లో వాటిని Paste చెయ్యండి. |
05:49 | Shift key ని ఉపయోగించి ఈ వీల్స్ ను ఇంజిన్ యొక్క దిగువభాగానికి లాగండి. |
05:54 | ఇప్పుడు, ఎగువన ఉన్న ruler నుండి ఒక guideline ను లాగి దాన్ని కంపార్ట్మెంట్ల యొక్క దిగువభాగం వద్ద ఉంచండి. |
06:03 | ఈ guideline, కంపార్ట్మెంట్లు & ఇంజిన్ లను ఒక సరళ రేఖలో సమలేఖనం (అలైన్) చేయడానికి మనకు సహాయపడుతుంది. |
06:10 | తరువాత, Compartment-1 కు పక్కన ఉన్న Engine ను తరలించి & సమలేఖనం చేయండి. |
06:16 | తరువాత అన్ని కంపార్ట్మెంట్లను లింక్ చేయడానికి ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
06:20 | ఈ లేయర్ కు Belt అని పేరును మార్చి దాని రంగును నలుపుకు మార్చండి. |
06:27 | ఈ Belt layer ను Layers లిస్ట్ యొక్క దిగువభాగానికి తరలించండి. |
06:31 | చివరగా, మనం ట్రైన్ ను గీద్దాం. |
06:33 | Rectangle tool పై క్లిక్ చెయ్యండి. |
06:36 | ఇక్కడ ప్రదర్శించిన విధంగా, వీల్ కి క్రిందన ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
06:40 | లేయర్ పేరును Rail గా మార్చి దాని రంగును black కు మార్చండి. |
06:47 | ఇప్పుడు ట్రైన్ డ్రాయింగ్ పూర్తయింది. |
06:50 | చివరగా, మన ఫైల్‌ను మరొకసారి సేవ్ చేయడానికి Ctrl + S ను నొక్కండి. |
06:56 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:00 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము: |
07:04 | ప్రాథమిక ఆకారాలను (షేప్స్) ను గీయడం, |
07:06 | ఆకారాలకు (షేప్స్) రంగు వేయడం, |
07:08 | ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & నకిలీ (డూప్లికేట్) చేయడం మరియు |
07:10 | Guideline ను ఉపయోగించి ఆకృతులను (షేప్స్) సమలేఖనం (అలైన్) చేయడం |
07:13 | మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్ - |
07:15 | ఈ ట్యుటోరియల్‌లో వివరించిన విధంగా Synfig లో ఒక బస్సును గీయండి. |
07:20 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
07:24 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
07:28 | దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
07:30 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
07:36 | మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి. |
07:39 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
07:43 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
07:48 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
07:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |