Synfig/C2/Draw-a-Toy-train/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Synfig ను ఉపయోగించి Draw aToy train అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము:
00:09 ప్రాథమిక ఆకారాలను (షేప్స్) ను గీయడం, ఆకారాలకు (షేప్స్) రంగు వేయడం, ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & నకిలీ (డూప్లికేట్) చేయడం మరియు
00:14 Guideline ను ఉపయోగించి ఆకృతులను (షేప్స్) సమలేఖనం (అలైన్) చేయడం
00:17 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
00:20 ఉబుంటు లైనక్స్ 14.04 OS,
00:24 Synfig వర్షన్ 1.0.2
00:27 మనం Synfig ను తెరుద్దాం.
00:29 మొదట, మనం టాయ్ ట్రైన్ యొక్క కంపార్ట్మెంట్ ను గీస్తాము.
00:33 దీని కొరకు, Rectangle tool ను ఎంచుకోండి.
00:36 Tool options లో, Create a region layer అనేది ఎంచుకోబడిందో లేదో అని తనిఖీ చేయండి.
00:42 ఇప్పుడు, canvas ‌పై ఒక దీర్ఘచతురస్రాన్ని (రెక్టేంగిల్) గీయండి.
00:46 layer పేరును Part-1కు మార్చండి.
00:50 Parameters panel కు వెళ్లి కలర్ ను ఆకుపచ్చకు మార్చండి.
00:56 ఇప్పుడు Transform tool పై క్లిక్ చెయ్యండి.
00:58 తరువాత షేప్ ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి.
01:02 canvas ‌పైన ఏదైనా షేప్ ను గీసిన తర్వాత ఈ దశను చేయాలని గుర్తుంచుకోండి.
01:07 మనం మన ఫైల్ ను save చేద్దాం.
01:09 File కు వెళ్ళండి. Save as పై క్లిక్ చెయ్యండి.
01:13 ఫైల్ పేరును Toy-Train-animation గా మార్చండి.
01:18 దీన్ని మీ Desktop ‌లో సేవ్ చెయ్యండి.
01:21 ఇప్పుడు, Rectangle tool ని మరొకసారి ఎంచుకోండి.
01:26 చూపిన విధంగా మునుపటి దీర్ఘచతురస్రం (రెక్టేంగిల్) మధ్యలో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
01:32 ఇది ట్రైన్ యొక్క విండో (కిటికీ) అవుతుంది.
01:35 ఈ లేయర్ కు Window గా rename చేద్దాం.
01:41 తరువాత, Polygon tool పై క్లిక్ చేయండి.
01:43 Tool options లో, Create a region layer అనేది ఎంపిక ఎంచుకోబడిందో లేదో తనిఖీ చేయండి.
01:50 చూపిన విధంగా దీర్ఘచతురస్రం (రెక్టేంగిల్) పైన సమలంబ చతుర్భుజాన్ని (ట్రాపెజియం) గీయండి.
01:54 సమలంబ చతుర్భుజాన్ని (ట్రాపెజియం) మూసివేయడానికి ప్రారంభ బిందువుపైన క్లిక్ చెయ్యండి.
01:59 ఈ layer కు Part-2 గా పేరును మార్చండి.
02:03 నేను రంగును ఎరుపుకు మారుస్తాను.
02:07 ఇప్పుడు, Transform tool ని ఎంచుకోండి.
02:10 Layers panel వెళ్లండి.
02:12 అన్ని లేయర్స్ ను ఎంచుకొని వాటిని గ్రూప్ చెయ్యండి.
02:15 ఈ గ్రూప్ లేయర్ కు Compartment-3 గా పేరును మార్చండి.
02:20 handle యొక్క నారింజరంగు బిందువును ఉపయోగించి లేయర్ ను పునః పరిమాణం (రీ సైజ్) చెయ్యండి.
02:24 handle యొక్క ఆకుపచ్చరంగు బిందువును ఉపయోగించి దీనిని canvas యొక్క కుడి వైపుకు తరలించండి.
02:30 Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి.
02:35 తరువాత, మనం ట్రైన్ యొక్క వీల్ ని గీద్దాం.
02:38 ఏదైనా షేప్ ను గీసిన తర్వాత షేప్ యొక్క ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చెయ్యాలని గుర్తుంచుకోండి.
02:44 Circle tool ను ఎంచుకోండి.
02:46 Tool options లో, Create a region layer అనేది తప్పకుండా ఎంచుకోవాలి.
02:50 చూపిన విధంగా వృత్తాన్ని గీయండి మరియు దాని రంగును ముదురు నీలం రంగులోకి మార్చండి.
02:56 ఇప్పుడు Star tool ని ఎంచుకోండి.
02:59 Tool options లో, Create a star layer అనేది ఎంచుకోవాలి.
03:05 కర్సర్‌ను వృత్తం యొక్క మధ్యభాగంలో ఉంచి ఒక నక్షత్రాన్ని గీయండి.
03:09 ఇప్పుడు, Transform tool ని ఎంచుకోండి.
03:12 ఇక్కడ 1 handle మరియు 2 చుక్కలు ఉన్నాయని గమనించండి.
03:16 ఆకారం యొక్క స్థానాన్ని మార్చడానికి హ్యాండిల్ యొక్క ఆకుపచ్చరంగు బిందువును క్లిక్ చేసి లాగండి.
03:22 రొటేషన్ కొరకు handle లోని నీలంరంగు బిందువును ఉపయోగించండి.
03:26 మధ్యలోని ఆకుపచ్చరంగు బిందువు అనేది నక్షత్రం ఆకారం యొక్క బయటి అంచుని సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది.
03:31 చివరి బిందువు అనేది పరిమాణాన్ని మార్చడానికి ఉపయోగించబడుతుంది.
03:34 నక్షత్రం మరియు వృత్తం రెండు లేయర్స్ నీ ఎంచుకోండి.
03:37 వాటిని గ్రూప్ చేసి ఆపై Wheel-1గా పేరును మార్చండి.
03:41 ఈ గ్రూప్ లేయర్ ను రీసైజ్ చేసి, దాన్నికంపార్ట్మెంట్ క్రిందన ఉంచండి.
03:47 ఇప్పుడు Wheel-1 group layer ను డూప్లికేట్ చెయ్యండి.
03:50 దానికి Wheel-2 గా పేరును మార్చి కంపార్ట్మెంట్ యొక్క మరొక చివరకి వెళ్ళండి.
03:56 ఇప్పుడు అన్ని గ్రూప్ లేయర్స్ నీ ఎంచుకోండి.
03:59 వాటిని మళ్లీ గ్రూప్ చేసి Compartment-3 గా పేరును మార్చండి.
04:04 ఇప్పుడు Duplicate ఐకాన్ పై రెండుసార్లు క్లిక్ చెయ్యండి.
04:08 గ్రూప్ చేసిన డూప్లికేట్ లేయర్స్ కు వరుసగా Compartment-2 & Compartment-1 అని పేరు మార్చండి.
04:17 Compartment-2 గ్రూప్ లేయర్ ని ఎంచుకోండి.
04:20 Shift key ని ఉపయోగించి handle యొక్క మధ్య ఆకుపచ్చరంగు బిందువును లాగండి.
04:24 Compartment-1 గ్రూప్ లేయర్ కొరకు కూడా ఇదేవిధంగా చెయ్యండి.
04:30 Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి.
04:34 తరువాత, మనం ఇంజిన్ ను గీద్దాం.
04:36 Canvas బయట క్లిక్ చెయ్యండి.
04:39 Circle tool ని ఎంచుకుని, చూపిన విధంగా ఒక వృత్తాన్ని గీయండి.
04:43 లేయర్ కు Engine-part-1 గా పేరును మార్చండి.
04:47 రంగును పింక్‌ కు మార్చండి.
04:50 తరువాత Rectangle tool పై క్లిక్ చేసి, వృత్తం యొక్క పైభాగంలో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
04:59 ఈ లేయర్ కు Engine-part-2 గా పేరును మార్చి రంగును పసుపురంగుకి మార్చండి.
05:06 ప్రస్తుతమున్న దీర్ఘచతురస్రం పైన మరో దీర్ఘచతురస్రాన్ని గీయండి.
05:10 ఈ లేయర్ కు Engine-part-3 గా పేరును మార్చి రంగును ఆకుపచ్చ రంగుకి మార్చండి.
05:17 అదే rectangle tool ని ఉపయోగించి, చూపిన విధంగా విండో ను గీయండి.
05:22 ఈ లేయర్ కు Engine-window గా పేరును మార్చండి.
05:26 ఇంజిన్ యొక్క లేయర్స్ ని ఎంచుకొని వాటిని గ్రూప్ చెయ్యండి.
05:29 తరువాత Engine గా పేరు మార్చండి.
05:32 Ctrl మరియు S కీలను నొక్కడం ద్వారా ఫైల్‌ను save చేయండి.
05:37 కంపార్ట్మెంట్ల యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏదైనా ఒకదాని పై క్లిక్ చేయండి.
05:40 Wheel-1 మరియు Wheel-2 గ్రూప్ లేయర్స్ రెండింటినీ ఎంచుకొని వాటిని copy చెయ్యండి.
05:45 Engine group layer లో వాటిని Paste చెయ్యండి.
05:49 Shift key ని ఉపయోగించి ఈ వీల్స్ ను ఇంజిన్ యొక్క దిగువభాగానికి లాగండి.
05:54 ఇప్పుడు, ఎగువన ఉన్న ruler నుండి ఒక guideline ను లాగి దాన్ని కంపార్ట్మెంట్ల యొక్క దిగువభాగం వద్ద ఉంచండి.
06:03 ఈ guideline, కంపార్ట్మెంట్లు & ఇంజిన్‌ లను ఒక సరళ రేఖలో సమలేఖనం (అలైన్) చేయడానికి మనకు సహాయపడుతుంది.
06:10 తరువాత, Compartment-1 కు పక్కన ఉన్న Engine ను తరలించి & సమలేఖనం చేయండి.
06:16 తరువాత అన్ని కంపార్ట్మెంట్లను లింక్ చేయడానికి ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
06:20 ఈ లేయర్ కు Belt అని పేరును మార్చి దాని రంగును నలుపుకు మార్చండి.
06:27 ఈ Belt layer ను Layers లిస్ట్ యొక్క దిగువభాగానికి తరలించండి.
06:31 చివరగా, మనం ట్రైన్ ను గీద్దాం.
06:33 Rectangle tool పై క్లిక్ చెయ్యండి.
06:36 ఇక్కడ ప్రదర్శించిన విధంగా, వీల్ కి క్రిందన ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
06:40 లేయర్ పేరును Rail గా మార్చి దాని రంగును black కు మార్చండి.
06:47 ఇప్పుడు ట్రైన్ డ్రాయింగ్ పూర్తయింది.
06:50 చివరగా, మన ఫైల్‌ను మరొకసారి సేవ్ చేయడానికి Ctrl + S ను నొక్కండి.
06:56 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:00 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము:
07:04 ప్రాథమిక ఆకారాలను (షేప్స్) ను గీయడం,
07:06 ఆకారాలకు (షేప్స్) రంగు వేయడం,
07:08 ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & నకిలీ (డూప్లికేట్) చేయడం మరియు
07:10 Guideline ను ఉపయోగించి ఆకృతులను (షేప్స్) సమలేఖనం (అలైన్) చేయడం
07:13 మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్ -
07:15 ఈ ట్యుటోరియల్‌లో వివరించిన విధంగా Synfig లో ఒక బస్సును గీయండి.
07:20 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
07:24 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
07:28 దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
07:30 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది.
07:36 మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి.
07:39 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
07:43 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
07:48 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
07:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya