COVID19/C2/Breastfeeding-during-COVID-19/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:39, 27 July 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:02 COVID-19 సమయంలో తల్లిపాలు ఇవ్వడంపై స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి
00:12 COVID-19 అంటే ఏమిటి, మరియు
00:14 COVID-19 సమయంలో తల్లి పాలివ్వడం కొరకు మార్గదర్శకాలు.
00:19 మొదట మనం COVID-19? అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
00:24 COVID-19 అనేది కరోనావైరస్ అనే వైరస్ వలన కలిగే అంటు వ్యాధి.
00:33 ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
00:37 వ్యాధిసోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, వారు బిందువులను ఉత్పత్తి చేస్తారు.
00:44 ఈ బిందువులు కరోనా వైరస్ ను కలిగిఉంటాయి.
00:49 ఈ వ్యాధిని కలిగిన బిందువులను, ఇతర వ్యక్తులు పీల్చినప్పుడు వ్యాధి వ్యాపిస్తుంది.
00:56 ఈ బిందువులు 1 నుండి 2 మీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి మరియు ఉపరితలాలపై స్థిరపడతాయి.
01:04 అక్కడ అవి గంటలు లేదా రోజుల వరకు సజీవంగా ఉంటాయి.
01:09 ఇతర వ్యక్తులు, ఇటువంటి వ్యాధిసోకిన ఉపరితలాలను తమ చేతులతో తాకుతారు.
01:15 తరువాత, వారు వారి కళ్ళను,
01:18 ముక్కు

లేదా నోటిని వారి చేతులను కడుక్కోకుండానే తాకుతారు.

01:23 .వ్యాధి సంక్రమణ అనేది వ్యాప్తి చెందడానికి ఇది ఇంకొక మార్గం.
01:28 వ్యాధి సోకిన వ్యక్తులు, వారిలోవ్యాధి లక్షణాలు ప్రారంభం కాకముందే వైరస్ ను వ్యాప్తి చేయవచ్చు.
01:35 ఈ వైరస్ గర్భాశయంలోకి ప్రసరిస్తుంది అనడానికి ఈరోజు వరకు స్పష్టమైన ఆధారాలు లేవు.
01:43 ఈ వ్యాధి సోకిన తల్లుల యొక్క తల్లిపాలలో ఈ వైరస్ ఉన్నట్టు ఇంకా కనుగొనబడలేదు.
01:51 తల్లి పాలివ్వడం ద్వారా ఇది సంక్రమించినట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు.
01:57 కరోనావైరస్ వ్యాధి సంక్రమణ యొక్క వివిధ రోగ లక్షణాలు.
02:03 జ్వరం,

దగ్గు,

02:05 శ్వాస ఆడకపోవటం,

అలసట,

02:07 తలనొప్పి,

గొంతు నొప్పి అనేవి సాధారణం.

02:12 వాంతులు,

అతిసారం,

02:14 తుమ్ములు

మరియు కండ్లకలక అనేవి అసాధారణమైనవి.

02:19 వ్యాధిసోకిన వ్యక్తుల్లో కూడా ఎటువంటి రోగ లక్షణాలు కనిపించకపోవచ్చు.
02:25 నవజాత శిశువులు మరియు శిశువులలో COVID-19 యొక్క ప్రమాదం తక్కువ.
02:30 చిన్నపిల్లలలో COVID-19 ధృవీకరించబడిన కేసులు కొన్ని మాత్రమే ఉన్నాయి.
02:37 వ్యాధిసోకిన శిశువులలో చాలా మంది తేలికపాటి లక్షణాలు లేదా లక్షణాలు లేకుండా ఉన్నారు.
02:44 ఇప్పుడు, మనం COVID-19 సమయంలో తల్లి పాలివ్వడం కొరకు మార్గదర్శకాలను చర్చిద్దాం.
02:51 పిల్లలందరికీ తల్లి పాలు అనేవి చాలా ప్రధానమైనవి.
02:56 అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన పిల్లలూ ఇందులో ఉన్నారు.
03:03 అనుమానిత లేదా ధృవీకరించబడిన COVID-19 ఉన్న పిల్లలు కూడా ఇందులో ఉన్నారు.
03:10 శిశువులందరికీ ప్రామాణిక శిశుపోషణా మార్గదర్శకాల ప్రకారం ఆహారం ఇవ్వాలి.
03:17 బిడ్డ పుట్టిన 1 గంట లోపలే తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి.
03:22 ప్రత్యేకంగా తల్లి పాలివ్వడాన్ని 6 నెలల వరకు కొనసాగించాలి.
03:28 ఒకవేళ అవసరమైతే, తల్లి తనపాలను పిండితీసి, ఆ పాలను ఇవ్వవచ్చు.
03:34 6 నెలల వయస్సు వచ్చాక పరిపూరక ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాలి.
03:40 తల్లి పాలను కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.
03:46 తల్లి పాలివ్వడం, పాలను పిండితీయడం మరియు పరిపూరకరమైన ఆహారం అనేవి ముఖ్యంగా అవసరమైన నైపుణ్యాలు.
03:54 అవి ఇతర ట్యుటోరియల్స్ లో చర్చించబడ్డాయి.
03:59 దయచేసి ముందస్తు అవసరాల పై హెల్త్ అండ్ న్యూట్రిషన్ సిరీస్‌ను మా వెబ్‌సైట్‌లో చూడండి.
04:06 COVID-19 సమయంలో, శిశువుకు పరిశుభ్రంగా ఆహారాన్ని ఇవ్వడానికి ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి.
04:13 బిడ్డను తాకడానికి ముందు మరియు తరువాత, తల్లి తన చేతులను 20 సెకన్ల పాటు కడుక్కోవాలి.
04:21 ఆమె పాలివ్వడానికి లేదా పాలను పిండి తీయడానికి ముందు మరియు తరువాత కూడా తన చేతులను కడుక్కోవాలి.
04:28 చేతులను శుభ్రం చేసుకోడానికి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ కూడా ఉపయోగపడుతుంది.
04:34 ఒకవేళ ఆమె COVID-19 యొక్క అనుమానిత లేదా ధృవీకరించబడిన కేసు అయితే, వైద్య సంబంధ మాస్కులు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అనేవి తప్పనిసరి.
04:43 తల్లిపాలను ఇచ్చేటపుడు మరియు తల్లిపాలను పిండి తీసే
04:46 సమయంలో ఆమె తప్పనిసరిగా మాస్కును (ముఖానికి కప్పుకునే తొడుగును) ధరించాలి.
04:49 మాస్కు (ముఖానికి కప్పుకునే తొడుగు) తడిగా మారిన వెంటనే దాన్నిమార్చేయాలి.
04:55 ఉపయోగించిన మాస్కును (ముఖానికి కప్పుకునే తొడుగును) వెంటనే పారవేయాలి.
05:01 దాన్ని తిరిగి ఉపయోగించకూడదు.
05:04 తల్లి, మాస్కు (ముఖానికి కప్పుకునే తొడుగున) యొక్క ముందువైపు ఉపరితలాన్ని తాకకూడదు.
05:09 ఆమె దానిని వెనుక నుండి తీసివేయాలి.
05:13 కొన్నిసార్లు, వైద్య సంబంధ మాస్కులు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అందుబాటులో ఉండకపోవచ్చు.
05:19 అటువంటి సందర్భాలలో, తల్లి ఒక టిష్యూ ని
05:22 లేదా ఒక శుభ్రమైన వస్త్రాన్ని

లేదా ఒక చేతి రుమాలును ఉపయోగించాలి.

05:27 ఆమె ఎల్లపుడు తుమ్మడం లేదా దగ్గడం లాంటివి వాటిలోకే చేయాలి.
05:31 ఆమె వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లోకి విసిరేసి తన చేతులు కడుక్కోవాలి.
05:38 ఒక మాసిపోయిన టిష్యూ

లేదా వస్త్రం

05:40 లేదా చేతి రుమాలును అవసరమైనంత తరచుగా మారుస్తూఉండాలి.
05:46 వైద్యసంబంధ మాస్క్‌లు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అందుబాటులో లేకపోతే వస్త్రంతో చేసిన మాస్క్‌లు (ముఖానికి కప్పుకునే తొడుగులు) కూడా వాడవచ్చు.
05:53 ప్రతీసారి ఆహారాన్నిఇచ్చే ముందు తల్లి తన రొమ్మును కడగాల్సిన అవసరం లేదు.
05:58 ఒకవేళ ఆమె ఛాతీపై దగ్గివుంటే అప్పుడు ఆమె వాటిని కడగాలి.
06:04 ఆమె సబ్బు మరియు వేడి నీటిని ఉపయోగించి, కనీసం 20 సెకన్లపాటు సున్నితంగా వాటిని కడగాలి.
06:12 శిశువును తాకే ముందు మరియు తరువాత శిశువు యొక్క సంరక్షకులు వారి చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి.
06:19 గదిలోని అన్ని ఉపరితలాలను మామూలుగా శుభ్రం చేయాలి మరియు క్రిమిసంహారం చేయాలి.
06:26 తల్లిపాలు ఇవ్వడానికి, కొంతమంది వ్యాధి సోకిన తల్లులు చాలా అనారోగ్యంగా ఉండవచ్చు.
06:32 అటువంటి సందర్భాలలో, తల్లి యొక్క రొమ్ము నుండి పిండితీసిన పాలను బిడ్డకు పట్టించాలి.
06:39 నర్సు లేదా కుటుంబ సభ్యులెవరైనా ఈ పాలను శిశువుకు పట్టించవచ్చు.
06:45 శిశువుకు ఆహారాన్ని ఇచ్చేవారు వ్యాధిసోకిన వారితో సంబంధం కలిగి ఉండకూడదు.
06:51 శిశువును లేదా పాలను తాకే ముందు, వారు 20 సెకన్ల పాటు వారి చేతులను కడుక్కోవాలి.
06:59 వారి చేతులను కడుక్కున్న తరువాత, వారు మాస్కును( ముఖానికి కప్పుకునే తొడుగు) కూడా తప్పనిసరిగా ధరించాలి.
07:05 పిండితీసిన తల్లిపాలను పాశ్చరైజేషన్ లేకుండా శిశువుకు పట్టించవచ్చు.
07:11 పిండితీసిన తల్లిపాలను సేకరించడం మరియు తీసుకువెళ్లడం చాలా జాగ్రత్తగా చేయాలి.
07:18 తల్లి కోలుకున్నప్పుడు మళ్ళీ తాను పాలివ్వడాన్ని ప్రారంభించాలి.
07:24 కొంతమంది వ్యాధి సోకిన తల్లులు పాలను పిండితీయడానికి కూడా చాలా అనారోగ్యంగా ఉండవచ్చు.
07:29 అలాంటి సందర్భాల్లో, శిశువుకు ఆహారాన్నిఇవ్వడానికి ఇతర ఎంపికలను ప్రయత్నించండి.
07:35 ఒకవేళ మానవ పాల బ్యాంకు దాత నుండి మానవ పాలు అందుబాటులో ఉన్నాయేమో తనిఖీ చేయండి.
07:41 తల్లి కోలుకునే వరకు దాత యొక్క మానవ పాలను బిడ్డకు ఇవ్వండి.
07:47 ఒకవేళ మానవ పాల దాత అందుబాటులో లేకపోతే, తల్లి కోలుకునే వరకు వెట్ -నర్సింగ్ (పాలిచ్చేదాది) ను ప్రయత్నించండి.
07:55 వెట్-నర్సింగ్ అంటే బిడ్డ తల్లి కాకుండా వేరే స్త్రీకి బిడ్డకు పాలివ్వటానికి వీలును కల్పించడం.
08:03 ఒకవేళ వెట్ -నర్సింగ్ (పాలిచ్చేదాది) సాధ్యం కాకపోతే, శిశువుకు జంతువుల పాలను ఇవ్వండి.
08:10 జంతువుల పాలను శిశువుకు ఇచ్చే ముందు ఎల్లప్పుడూ వాటిని మరగబెట్టండి.
08:16 దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను, ఈ ఎంపికలపై వారి అభిప్రాయాన్ని అడగండి.
08:23 ఫార్ములా పాలు (పాలపొడితో చేసే పాలు),
08:25 పాలుపట్టే సీసాలు
08:27 మరియు ప్లాస్టిక్, రబ్బర్ లేదా సిలికాన్ పాలపీకలను (ఉరుగుజ్జులు) ఉపయోగించవద్దు.
08:32 ఆమె కోలుకున్నప్పుడు తల్లిపాలు ఇవ్వడాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఆమెకు సహాయం చేయండి.
08:38 మరో ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే, తల్లి మరియు బిడ్డల మధ్య ఒకరి చర్మం మరొకరి చర్మానికి తాకేలా ఉంచడం.
08:46 ఒకవేళ తల్లికి COVID-19 ఉన్నప్పటికీ దాన్ని బిడ్డ పుట్టిన వెంటనే తప్పనిసరిగా ప్రారంభించాలి.
08:53 ఇది తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది.
08:58 కెంగరు మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అనేది పగలు మరియు రాత్రి అంతా తప్పకుండా చేయాలి.
09:04 తల్లిపాలను ఇవ్వడం మరియు ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకినట్లు ఉంచడం శిశువులలో మరణం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
09:12 అవి తక్షణ మరియు జీవితకాల ఆరోగ్యం మరియు అభివృద్ధి ప్రయోజనాలను అందిస్తాయి.
09:20 తల్లి పాలుఇవ్వడం వల్ల తల్లులకు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
09:27 వ్యాధి సంక్రమించే ప్రమాదం కంటే ఈ ప్రయోజనాలు అనేవి గణనీయంగా చాలా ఎక్కువ.
09:34 చివరగా, తల్లి మరియు కుటుంబ సభ్యులకు, హెచ్చరిక సంకేతాలకు సంబంధించి సలహా అనేది తప్పకుండా ఇవ్వాలి.
09:42 శిశువులో హెచ్చరిక సంకేతాలను చూడటానికి, వారికి తప్పకుండా శిక్షణ ఇవ్వాలి.
09:48 ఒకవేళ వారు ఏవైనా సంకేతాలను చూసినట్లయితే, వారు తిరిగి వాటిని వైద్యుడికి నివేదించాలి.
09:53 ఈ ట్యుటోరియల్‌లోని మార్గదర్శకాలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిమిత ఆధారాలపై ఆధారపడి ఉంటాయి.
10:01 క్రొత్త ఆధారాలను సమీకరించినప్పుడు, కొన్ని సిఫార్సులు అనేవి మారవచ్చు.
10:08 దయచేసి తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఉపయోగించండి.
10:14 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya