COVID19/C2/Breastfeeding-during-COVID-19/Telugu
From Script | Spoken-Tutorial
| |
|
| 00:02 | COVID-19 సమయంలో తల్లిపాలు ఇవ్వడంపై స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
| 00:09 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి |
| 00:12 | COVID-19 అంటే ఏమిటి, మరియు |
| 00:14 | COVID-19 సమయంలో తల్లి పాలివ్వడం కొరకు మార్గదర్శకాలు. |
| 00:19 | మొదట మనం COVID-19? అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. |
| 00:24 | COVID-19 అనేది కరోనావైరస్ అనే వైరస్ వలన కలిగే అంటు వ్యాధి. |
| 00:33 | ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. |
| 00:37 | వ్యాధిసోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, వారు బిందువులను ఉత్పత్తి చేస్తారు. |
| 00:44 | ఈ బిందువులు కరోనా వైరస్ ను కలిగిఉంటాయి. |
| 00:49 | ఈ వ్యాధిని కలిగిన బిందువులను, ఇతర వ్యక్తులు పీల్చినప్పుడు వ్యాధి వ్యాపిస్తుంది. |
| 00:56 | ఈ బిందువులు 1 నుండి 2 మీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి మరియు ఉపరితలాలపై స్థిరపడతాయి. |
| 01:04 | అక్కడ అవి గంటలు లేదా రోజుల వరకు సజీవంగా ఉంటాయి. |
| 01:09 | ఇతర వ్యక్తులు, ఇటువంటి వ్యాధిసోకిన ఉపరితలాలను తమ చేతులతో తాకుతారు. |
| 01:15 | తరువాత, వారు వారి కళ్ళను, |
| 01:18 | ముక్కు
లేదా నోటిని వారి చేతులను కడుక్కోకుండానే తాకుతారు. |
| 01:23 | .వ్యాధి సంక్రమణ అనేది వ్యాప్తి చెందడానికి ఇది ఇంకొక మార్గం. |
| 01:28 | వ్యాధి సోకిన వ్యక్తులు, వారిలోవ్యాధి లక్షణాలు ప్రారంభం కాకముందే వైరస్ ను వ్యాప్తి చేయవచ్చు. |
| 01:35 | ఈ వైరస్ గర్భాశయంలోకి ప్రసరిస్తుంది అనడానికి ఈరోజు వరకు స్పష్టమైన ఆధారాలు లేవు. |
| 01:43 | ఈ వ్యాధి సోకిన తల్లుల యొక్క తల్లిపాలలో ఈ వైరస్ ఉన్నట్టు ఇంకా కనుగొనబడలేదు. |
| 01:51 | తల్లి పాలివ్వడం ద్వారా ఇది సంక్రమించినట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. |
| 01:57 | కరోనావైరస్ వ్యాధి సంక్రమణ యొక్క వివిధ రోగ లక్షణాలు. |
| 02:03 | జ్వరం,
దగ్గు, |
| 02:05 | శ్వాస ఆడకపోవటం,
అలసట, |
| 02:07 | తలనొప్పి,
గొంతు నొప్పి అనేవి సాధారణం. |
| 02:12 | వాంతులు,
అతిసారం, |
| 02:14 | తుమ్ములు
మరియు కండ్లకలక అనేవి అసాధారణమైనవి. |
| 02:19 | వ్యాధిసోకిన వ్యక్తుల్లో కూడా ఎటువంటి రోగ లక్షణాలు కనిపించకపోవచ్చు. |
| 02:25 | నవజాత శిశువులు మరియు శిశువులలో COVID-19 యొక్క ప్రమాదం తక్కువ. |
| 02:30 | చిన్నపిల్లలలో COVID-19 ధృవీకరించబడిన కేసులు కొన్ని మాత్రమే ఉన్నాయి. |
| 02:37 | వ్యాధిసోకిన శిశువులలో చాలా మంది తేలికపాటి లక్షణాలు లేదా లక్షణాలు లేకుండా ఉన్నారు. |
| 02:44 | ఇప్పుడు, మనం COVID-19 సమయంలో తల్లి పాలివ్వడం కొరకు మార్గదర్శకాలను చర్చిద్దాం. |
| 02:51 | పిల్లలందరికీ తల్లి పాలు అనేవి చాలా ప్రధానమైనవి. |
| 02:56 | అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన పిల్లలూ ఇందులో ఉన్నారు. |
| 03:03 | అనుమానిత లేదా ధృవీకరించబడిన COVID-19 ఉన్న పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. |
| 03:10 | శిశువులందరికీ ప్రామాణిక శిశుపోషణా మార్గదర్శకాల ప్రకారం ఆహారం ఇవ్వాలి. |
| 03:17 | బిడ్డ పుట్టిన 1 గంట లోపలే తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి. |
| 03:22 | ప్రత్యేకంగా తల్లి పాలివ్వడాన్ని 6 నెలల వరకు కొనసాగించాలి. |
| 03:28 | ఒకవేళ అవసరమైతే, తల్లి తనపాలను పిండితీసి, ఆ పాలను ఇవ్వవచ్చు. |
| 03:34 | 6 నెలల వయస్సు వచ్చాక పరిపూరక ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాలి. |
| 03:40 | తల్లి పాలను కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి. |
| 03:46 | తల్లి పాలివ్వడం, పాలను పిండితీయడం మరియు పరిపూరకరమైన ఆహారం అనేవి ముఖ్యంగా అవసరమైన నైపుణ్యాలు. |
| 03:54 | అవి ఇతర ట్యుటోరియల్స్ లో చర్చించబడ్డాయి. |
| 03:59 | దయచేసి ముందస్తు అవసరాల పై హెల్త్ అండ్ న్యూట్రిషన్ సిరీస్‌ను మా వెబ్‌సైట్‌లో చూడండి. |
| 04:06 | COVID-19 సమయంలో, శిశువుకు పరిశుభ్రంగా ఆహారాన్ని ఇవ్వడానికి ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. |
| 04:13 | బిడ్డను తాకడానికి ముందు మరియు తరువాత, తల్లి తన చేతులను 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. |
| 04:21 | ఆమె పాలివ్వడానికి లేదా పాలను పిండి తీయడానికి ముందు మరియు తరువాత కూడా తన చేతులను కడుక్కోవాలి. |
| 04:28 | చేతులను శుభ్రం చేసుకోడానికి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ కూడా ఉపయోగపడుతుంది. |
| 04:34 | ఒకవేళ ఆమె COVID-19 యొక్క అనుమానిత లేదా ధృవీకరించబడిన కేసు అయితే, వైద్య సంబంధ మాస్కులు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అనేవి తప్పనిసరి. |
| 04:43 | తల్లిపాలను ఇచ్చేటపుడు మరియు తల్లిపాలను పిండి తీసే |
| 04:46 | సమయంలో ఆమె తప్పనిసరిగా మాస్కును (ముఖానికి కప్పుకునే తొడుగును) ధరించాలి. |
| 04:49 | మాస్కు (ముఖానికి కప్పుకునే తొడుగు) తడిగా మారిన వెంటనే దాన్నిమార్చేయాలి. |
| 04:55 | ఉపయోగించిన మాస్కును (ముఖానికి కప్పుకునే తొడుగును) వెంటనే పారవేయాలి. |
| 05:01 | దాన్ని తిరిగి ఉపయోగించకూడదు. |
| 05:04 | తల్లి, మాస్కు (ముఖానికి కప్పుకునే తొడుగున) యొక్క ముందువైపు ఉపరితలాన్ని తాకకూడదు. |
| 05:09 | ఆమె దానిని వెనుక నుండి తీసివేయాలి. |
| 05:13 | కొన్నిసార్లు, వైద్య సంబంధ మాస్కులు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అందుబాటులో ఉండకపోవచ్చు. |
| 05:19 | అటువంటి సందర్భాలలో, తల్లి ఒక టిష్యూ ని |
| 05:22 | లేదా ఒక శుభ్రమైన వస్త్రాన్ని
లేదా ఒక చేతి రుమాలును ఉపయోగించాలి. |
| 05:27 | ఆమె ఎల్లపుడు తుమ్మడం లేదా దగ్గడం లాంటివి వాటిలోకే చేయాలి. |
| 05:31 | ఆమె వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లోకి విసిరేసి తన చేతులు కడుక్కోవాలి. |
| 05:38 | ఒక మాసిపోయిన టిష్యూ
లేదా వస్త్రం |
| 05:40 | లేదా చేతి రుమాలును అవసరమైనంత తరచుగా మారుస్తూఉండాలి. |
| 05:46 | వైద్యసంబంధ మాస్క్‌లు (ముఖానికి కప్పుకునే తొడుగులు) అందుబాటులో లేకపోతే వస్త్రంతో చేసిన మాస్క్‌లు (ముఖానికి కప్పుకునే తొడుగులు) కూడా వాడవచ్చు. |
| 05:53 | ప్రతీసారి ఆహారాన్నిఇచ్చే ముందు తల్లి తన రొమ్మును కడగాల్సిన అవసరం లేదు. |
| 05:58 | ఒకవేళ ఆమె ఛాతీపై దగ్గివుంటే అప్పుడు ఆమె వాటిని కడగాలి. |
| 06:04 | ఆమె సబ్బు మరియు వేడి నీటిని ఉపయోగించి, కనీసం 20 సెకన్లపాటు సున్నితంగా వాటిని కడగాలి. |
| 06:12 | శిశువును తాకే ముందు మరియు తరువాత శిశువు యొక్క సంరక్షకులు వారి చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి. |
| 06:19 | గదిలోని అన్ని ఉపరితలాలను మామూలుగా శుభ్రం చేయాలి మరియు క్రిమిసంహారం చేయాలి. |
| 06:26 | తల్లిపాలు ఇవ్వడానికి, కొంతమంది వ్యాధి సోకిన తల్లులు చాలా అనారోగ్యంగా ఉండవచ్చు. |
| 06:32 | అటువంటి సందర్భాలలో, తల్లి యొక్క రొమ్ము నుండి పిండితీసిన పాలను బిడ్డకు పట్టించాలి. |
| 06:39 | నర్సు లేదా కుటుంబ సభ్యులెవరైనా ఈ పాలను శిశువుకు పట్టించవచ్చు. |
| 06:45 | శిశువుకు ఆహారాన్ని ఇచ్చేవారు వ్యాధిసోకిన వారితో సంబంధం కలిగి ఉండకూడదు. |
| 06:51 | శిశువును లేదా పాలను తాకే ముందు, వారు 20 సెకన్ల పాటు వారి చేతులను కడుక్కోవాలి. |
| 06:59 | వారి చేతులను కడుక్కున్న తరువాత, వారు మాస్కును( ముఖానికి కప్పుకునే తొడుగు) కూడా తప్పనిసరిగా ధరించాలి. |
| 07:05 | పిండితీసిన తల్లిపాలను పాశ్చరైజేషన్ లేకుండా శిశువుకు పట్టించవచ్చు. |
| 07:11 | పిండితీసిన తల్లిపాలను సేకరించడం మరియు తీసుకువెళ్లడం చాలా జాగ్రత్తగా చేయాలి. |
| 07:18 | తల్లి కోలుకున్నప్పుడు మళ్ళీ తాను పాలివ్వడాన్ని ప్రారంభించాలి. |
| 07:24 | కొంతమంది వ్యాధి సోకిన తల్లులు పాలను పిండితీయడానికి కూడా చాలా అనారోగ్యంగా ఉండవచ్చు. |
| 07:29 | అలాంటి సందర్భాల్లో, శిశువుకు ఆహారాన్నిఇవ్వడానికి ఇతర ఎంపికలను ప్రయత్నించండి. |
| 07:35 | ఒకవేళ మానవ పాల బ్యాంకు దాత నుండి మానవ పాలు అందుబాటులో ఉన్నాయేమో తనిఖీ చేయండి. |
| 07:41 | తల్లి కోలుకునే వరకు దాత యొక్క మానవ పాలను బిడ్డకు ఇవ్వండి. |
| 07:47 | ఒకవేళ మానవ పాల దాత అందుబాటులో లేకపోతే, తల్లి కోలుకునే వరకు వెట్ -నర్సింగ్ (పాలిచ్చేదాది) ను ప్రయత్నించండి. |
| 07:55 | వెట్-నర్సింగ్ అంటే బిడ్డ తల్లి కాకుండా వేరే స్త్రీకి బిడ్డకు పాలివ్వటానికి వీలును కల్పించడం. |
| 08:03 | ఒకవేళ వెట్ -నర్సింగ్ (పాలిచ్చేదాది) సాధ్యం కాకపోతే, శిశువుకు జంతువుల పాలను ఇవ్వండి. |
| 08:10 | జంతువుల పాలను శిశువుకు ఇచ్చే ముందు ఎల్లప్పుడూ వాటిని మరగబెట్టండి. |
| 08:16 | దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను, ఈ ఎంపికలపై వారి అభిప్రాయాన్ని అడగండి. |
| 08:23 | ఫార్ములా పాలు (పాలపొడితో చేసే పాలు), |
| 08:25 | పాలుపట్టే సీసాలు |
| 08:27 | మరియు ప్లాస్టిక్, రబ్బర్ లేదా సిలికాన్ పాలపీకలను (ఉరుగుజ్జులు) ఉపయోగించవద్దు. |
| 08:32 | ఆమె కోలుకున్నప్పుడు తల్లిపాలు ఇవ్వడాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఆమెకు సహాయం చేయండి. |
| 08:38 | మరో ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే, తల్లి మరియు బిడ్డల మధ్య ఒకరి చర్మం మరొకరి చర్మానికి తాకేలా ఉంచడం. |
| 08:46 | ఒకవేళ తల్లికి COVID-19 ఉన్నప్పటికీ దాన్ని బిడ్డ పుట్టిన వెంటనే తప్పనిసరిగా ప్రారంభించాలి. |
| 08:53 | ఇది తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది. |
| 08:58 | కెంగరు మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అనేది పగలు మరియు రాత్రి అంతా తప్పకుండా చేయాలి. |
| 09:04 | తల్లిపాలను ఇవ్వడం మరియు ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకినట్లు ఉంచడం శిశువులలో మరణం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి. |
| 09:12 | అవి తక్షణ మరియు జీవితకాల ఆరోగ్యం మరియు అభివృద్ధి ప్రయోజనాలను అందిస్తాయి. |
| 09:20 | తల్లి పాలుఇవ్వడం వల్ల తల్లులకు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. |
| 09:27 | వ్యాధి సంక్రమించే ప్రమాదం కంటే ఈ ప్రయోజనాలు అనేవి గణనీయంగా చాలా ఎక్కువ. |
| 09:34 | చివరగా, తల్లి మరియు కుటుంబ సభ్యులకు, హెచ్చరిక సంకేతాలకు సంబంధించి సలహా అనేది తప్పకుండా ఇవ్వాలి. |
| 09:42 | శిశువులో హెచ్చరిక సంకేతాలను చూడటానికి, వారికి తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. |
| 09:48 | ఒకవేళ వారు ఏవైనా సంకేతాలను చూసినట్లయితే, వారు తిరిగి వాటిని వైద్యుడికి నివేదించాలి. |
| 09:53 | ఈ ట్యుటోరియల్‌లోని మార్గదర్శకాలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిమిత ఆధారాలపై ఆధారపడి ఉంటాయి. |
| 10:01 | క్రొత్త ఆధారాలను సమీకరించినప్పుడు, కొన్ని సిఫార్సులు అనేవి మారవచ్చు. |
| 10:08 | దయచేసి తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఉపయోగించండి. |
| 10:14 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |