FrontAccounting-2.4.7/C2/Place-Sales-Order-in-FrontAccounting/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:17, 29 May 2020 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ప్లేస్ సేల్స్ ఆర్డర్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము.
Sales Quotation Entry |
00:13 | Sales Order Entry |
00:15 | Make Delivery మరియు
Sales Order Inquiry |
00:20 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:28 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:32 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా
ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ |
00:42 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:54 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
01:00 | ఇప్పుడు, మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:04 | బ్రౌజర్‌ను ను తెరవండి.localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:13 | login పేజీ కనిపిస్తుంది. |
01:16 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి. |
01:21 | తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:24 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది. |
01:27 | సేల్స్ కొరకు అవసరమైన అన్ని దశలను మనము పూర్తి చేసాము. |
01:31 | ఇప్పుడు మనం ఒక Sales Quotation Entry ను చేయడానికి సిద్ధంగా ఉన్నాము. |
01:35 | Sales టాబ్ పై క్లిక్ చేయండి.
Transactions ప్యానెల్‌లో, Sales Quotation Entry లింక్‌పై క్లిక్ చేయండి. |
01:43 | మనం కస్టమర్ పేరు మరియు ఇతర సంబంధిత సమాచారంతో డ్రాప్-డౌన్ బాక్స్‌ను చూడవచ్చు. |
01:50 | ఇది ఎందుకంటే మనం ఇప్పటికే Add and Manage Customers లో వివరాలను అప్ డేట్ చేసాము కనుక. |
01:57 | మనం మన కస్టమర్ Amit కొరకు ఒక కొత్త sales quotation entry ను తయారుచేద్దాం. |
02:03 | రిఫరెన్స్ సంఖ్య అనేది ఆటో జనరేటెడ్ అని గమనించండి. |
02:07 | మిగతా ఫీల్డ్ ఎంట్రీల నన్నింటినీ అలాగే ఉంచండి. |
02:11 | Sales Quotation Items ప్యానెల్‌లో, Item Description డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేయండి.
Dell laptop ను Item గా ఎంచుకోండి. |
02:22 | Dell laptop కొరకు Item Code మరియు sales price అనేవి ఇక్కడ కనిపిస్తాయి. |
02:28 | దీనికి కారణం ఏంటంటే మునుపటి ట్యుటోరియల్‌లో మనం దీనిని సృష్టించాము. |
02:33 | Quantity ఫీల్డ్‌లో, నేను quantity గా 1 ని టైప్ చేస్తాను. |
02:38 | ఒకవేళ మీరు customer కు discount ఇవ్వాలి అని అనుకుంటే, Discount ఫీల్డ్‌లో పర్శంటేజ్ ను టైప్ చేయండి. |
02:45 | నేను నా కస్టమర్ కు 0.10% డిస్కౌంట్ ఇస్తాను. |
02:51 | ఇప్పుడు, entry ను సేవ్ చేయడానికి, అడ్డు వరుస యొక్క కుడి చివరన ఉన్న Add Item బటన్ పై క్లిక్ చేయండి. |
02:58 | ఈ Sales Order కొరకు Amount Total అనేది 12% వద్ద GST ను కలుపుకొని ఉందని గమనించండి. |
03:06 | Shipping Charge ఫీల్డ్ అనేది customer కు items యొక్క shipment (రవాణా) కొరకు ఛార్జీలను జోడించడానికి. |
03:13 | కనుక, Shipping Charge ఫీల్డ్ లో, నేను 200 రూపాయలు అని టైప్ చేస్తాను. |
03:19 | ప్యానెల్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి. |
03:23 | Subtotal మరియు Amount Total లలో మార్పులను మనం చూడవచ్చు. |
03:28 | స్క్రోల్ చేయండి.
విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Place Quotation బటన్ పై క్లిక్ చేయండి. |
03:35 | విజయ సందేశం quotation ఇప్పుడు ప్లేస్ చేయబడింది అని చూపిస్తుంది. |
03:40 | తరువాత, మనం ఈ కొటేషన్ పైన ఒక order ను place చేయాలి. |
03:46 | కనుక, Make Sales OrderAgainst This Quotation అనే లింక్‌పై క్లిక్ చేయండి. |
03:52 | Sales Order Entry కొరకు ఒక విండో తెరుచుకుంటుంది. |
03:56 | ఆ item ను వివరించే వివరాలను ఇక్కడ చూడవచ్చు. |
04:00 | స్క్రోల్ చేయండి.
విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Place Order బటన్ పై క్లిక్ చేయండి. |
04:06 | నిర్ధారణ సందేశం మనము విజయవంతంగా ఆర్డర్ ని ప్లేస్ చేశామని చెప్తుంది. |
04:12 | తదుపరి దశ అనేది డెలివరీ చేయడం. |
04:15 | కనుక, Make DeliveryAgainst This Order లింక్ పై క్లిక్ చేయండి. |
04:21 | Deliver Items for a Sales Order అనే పేరుగల విండో తెరుచుకుంటుంది. |
04:27 | డెలివరీ చేయవల్సిన items యొక్క వివరాలను ఇది మనకు చూపిస్తుంది. |
04:32 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Dispatch బటన్ పై క్లిక్ చేయండి. |
04:37 | డెలివరీ కొరకు ఎంట్రీని నిర్ధారించే ఒక నిర్ధారణ సందేశాన్ని మనం చూడవచ్చు. |
04:43 | ఈ క్రింది అన్ని ఎంపికలను మీ స్వంతంగా అన్వేషించండి. |
04:47 | Sales టాబ్ పై క్లిక్ చేయండి. |
04:50 | ఇప్పుడు, తయారు చేసిన Sales Entry యొక్క status ను మనం తనిఖీ చేద్దాం. |
04:55 | Inquiries and Reports ప్యానెల్ కింద, Sales Order Inquiry లింక్‌పై క్లిక్ చేయండి. |
05:01 | ఈ entry యొక్క వివరాలను ఇక్కడ ఇచ్చిన టేబుల్ లో మనం చూడవచ్చు. |
05:06 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Back లింక్ పై క్లిక్ చేయండి. |
05:10 | తరువాత, మనం customer payment గురించి తెలుసుకుందాం. |
05:14 | Transactions ప్యానెల్ యొక్క కుడి వైపు భాగం పైన, Customer Payments లింక్‌పై క్లిక్ చేయండి. |
05:20 | కస్టమర్ అమిత్ 53147 రూపాయలు చెల్లించాలి.
ఈ మొత్తాన్ని Amount ఫీల్డ్‌లో ఎంటర్ చేయండి. |
05:31 | Amount of Discount ఫీల్డ్‌లో, మనం రూ .2000 ను ఎంటర్ చేద్దాం. |
05:37 | Amount ఫీల్డ్‌పై మరోసారి క్లిక్ చేయండి. |
05:40 | డిస్కౌంట్ తర్వాత మొత్తంలో మార్పులను మనం చూడవచ్చు. |
05:44 | Memo ఫీల్డ్‌లో, ఒక వివరణను ఎంటర్ చేయండి. |
05:47 | నేను: Amount received from Amit for sale of Dell laptop అని టైప్ చేస్తాను. |
05:53 | తరువాత, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add payment బటన్ పై క్లిక్ చేయండి. |
05:58 | Customer payment has been successfully entered అనే సందేశాన్ని మనం చూడవచ్చు. |
06:04 | దీని క్రింద, మనం వివిధ transactions కొరకు వేర్వేరు links ను చూడవచ్చు |
06:09 | payment వివరాలను చూడటానికి View this customer payment లింక్‌పై క్లిక్ చేయండి. |
06:15 | చివరగా, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Close లింక్ పై క్లిక్ చేయండి. |
06:20 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
06:26 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని చేయడం నేర్చుకున్నాము:
Sales Quotation Entry Sales Order Entry |
06:33 | Make Delivery మరియు Sales Order Inquiry |
06:38 | ఒక అసైన్మెంట్ గా, ఒక కొత్త Sales Quotation Entry ను సృష్టించండి. |
06:42 | వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింక్‌ను చూడండి. |
06:47 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
06:55 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:05 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్.  లో పోస్ట్ చేయండి. |
07:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
07:15 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |