FrontAccounting-2.4.7/C2/Place-Sales-Order-in-FrontAccounting/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ప్లేస్ సేల్స్ ఆర్డర్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము.

Sales Quotation Entry

00:13 Sales Order Entry
00:15 Make Delivery మరియు

Sales Order Inquiry

00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:28 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:32 ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా

ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్

00:42 మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి.
00:48 ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:54 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
01:00 ఇప్పుడు, మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:04 బ్రౌజర్‌ను ను తెరవండి.localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:13 login పేజీ కనిపిస్తుంది.
01:16 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
01:21 తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.
01:24 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
01:27 సేల్స్ కొరకు అవసరమైన అన్ని దశలను మనము పూర్తి చేసాము.
01:31 ఇప్పుడు మనం ఒక Sales Quotation Entry ను చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
01:35 Sales టాబ్ పై క్లిక్ చేయండి.

Transactions ప్యానెల్‌లో, Sales Quotation Entry లింక్‌పై క్లిక్ చేయండి.

01:43 మనం కస్టమర్ పేరు మరియు ఇతర సంబంధిత సమాచారంతో డ్రాప్-డౌన్ బాక్స్‌ను చూడవచ్చు.
01:50 ఇది ఎందుకంటే మనం ఇప్పటికే Add and Manage Customers లో వివరాలను అప్ డేట్ చేసాము కనుక.
01:57 మనం మన కస్టమర్ Amit కొరకు ఒక కొత్త sales quotation entry ను తయారుచేద్దాం.
02:03 రిఫరెన్స్ సంఖ్య అనేది ఆటో జనరేటెడ్ అని గమనించండి.
02:07 మిగతా ఫీల్డ్ ఎంట్రీల నన్నింటినీ అలాగే ఉంచండి.
02:11 Sales Quotation Items ప్యానెల్‌లో, Item Description డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేయండి.

Dell laptop ను Item గా ఎంచుకోండి.

02:22 Dell laptop కొరకు Item Code మరియు sales price అనేవి ఇక్కడ కనిపిస్తాయి.
02:28 దీనికి కారణం ఏంటంటే మునుపటి ట్యుటోరియల్‌లో మనం దీనిని సృష్టించాము.
02:33 Quantity ఫీల్డ్‌లో, నేను quantity గా 1 ని టైప్ చేస్తాను.
02:38 ఒకవేళ మీరు customer కు discount ఇవ్వాలి అని అనుకుంటే, Discount ఫీల్డ్‌లో పర్శంటేజ్ ను టైప్ చేయండి.
02:45 నేను నా కస్టమర్ కు 0.10% డిస్కౌంట్ ఇస్తాను.
02:51 ఇప్పుడు, entry ను సేవ్ చేయడానికి, అడ్డు వరుస యొక్క కుడి చివరన ఉన్న Add Item బటన్ పై క్లిక్ చేయండి.
02:58 ఈ Sales Order కొరకు Amount Total అనేది 12% వద్ద GST ను కలుపుకొని ఉందని గమనించండి.
03:06 Shipping Charge ఫీల్డ్ అనేది customer కు items యొక్క shipment (రవాణా) కొరకు ఛార్జీలను జోడించడానికి.
03:13 కనుక, Shipping Charge ఫీల్డ్ లో, నేను 200 రూపాయలు అని టైప్ చేస్తాను.
03:19 ప్యానెల్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి.
03:23 Subtotal మరియు Amount Total లలో మార్పులను మనం చూడవచ్చు.
03:28 స్క్రోల్ చేయండి.

విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Place Quotation బటన్ పై క్లిక్ చేయండి.

03:35 విజయ సందేశం quotation ఇప్పుడు ప్లేస్ చేయబడింది అని చూపిస్తుంది.
03:40 తరువాత, మనం ఈ కొటేషన్‌ పైన ఒక order ను place చేయాలి.
03:46 కనుక, Make Sales OrderAgainst This Quotation అనే లింక్‌పై క్లిక్ చేయండి.
03:52 Sales Order Entry కొరకు ఒక విండో తెరుచుకుంటుంది.
03:56 ఆ item ను వివరించే వివరాలను ఇక్కడ చూడవచ్చు.
04:00 స్క్రోల్ చేయండి.

విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Place Order బటన్ పై క్లిక్ చేయండి.

04:06 నిర్ధారణ సందేశం మనము విజయవంతంగా ఆర్డర్ ని ప్లేస్ చేశామని చెప్తుంది.
04:12 తదుపరి దశ అనేది డెలివరీ చేయడం.
04:15 కనుక, Make DeliveryAgainst This Order లింక్ పై క్లిక్ చేయండి.
04:21 Deliver Items for a Sales Order అనే పేరుగల విండో తెరుచుకుంటుంది.
04:27 డెలివరీ చేయవల్సిన items యొక్క వివరాలను ఇది మనకు చూపిస్తుంది.
04:32 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Dispatch బటన్ పై క్లిక్ చేయండి.
04:37 డెలివరీ కొరకు ఎంట్రీని నిర్ధారించే ఒక నిర్ధారణ సందేశాన్ని మనం చూడవచ్చు.
04:43 ఈ క్రింది అన్ని ఎంపికలను మీ స్వంతంగా అన్వేషించండి.
04:47 Sales టాబ్ పై క్లిక్ చేయండి.
04:50 ఇప్పుడు, తయారు చేసిన Sales Entry యొక్క status ను మనం తనిఖీ చేద్దాం.
04:55 Inquiries and Reports ప్యానెల్ కింద, Sales Order Inquiry లింక్‌పై క్లిక్ చేయండి.
05:01 ఈ entry యొక్క వివరాలను ఇక్కడ ఇచ్చిన టేబుల్ లో మనం చూడవచ్చు.
05:06 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Back లింక్ పై క్లిక్ చేయండి.
05:10 తరువాత, మనం customer payment గురించి తెలుసుకుందాం.
05:14 Transactions ప్యానెల్ యొక్క కుడి వైపు భాగం పైన, Customer Payments లింక్‌పై క్లిక్ చేయండి.
05:20 కస్టమర్ అమిత్ 53147 రూపాయలు చెల్లించాలి.

ఈ మొత్తాన్ని Amount ఫీల్డ్‌లో ఎంటర్ చేయండి.

05:31 Amount of Discount ఫీల్డ్‌లో, మనం రూ .2000 ను ఎంటర్ చేద్దాం.
05:37 Amount ఫీల్డ్‌పై మరోసారి క్లిక్ చేయండి.
05:40 డిస్కౌంట్ తర్వాత మొత్తంలో మార్పులను మనం చూడవచ్చు.
05:44 Memo ఫీల్డ్‌లో, ఒక వివరణను ఎంటర్ చేయండి.
05:47 నేను: Amount received from Amit for sale of Dell laptop అని టైప్ చేస్తాను.
05:53 తరువాత, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add payment బటన్ పై క్లిక్ చేయండి.
05:58 Customer payment has been successfully entered అనే సందేశాన్ని మనం చూడవచ్చు.
06:04 దీని క్రింద, మనం వివిధ transactions కొరకు వేర్వేరు links ను చూడవచ్చు
06:09 payment వివరాలను చూడటానికి View this customer payment లింక్‌పై క్లిక్ చేయండి.
06:15 చివరగా, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Close లింక్ పై క్లిక్ చేయండి.
06:20 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

సారాంశం చూద్దాం.

06:26 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని చేయడం నేర్చుకున్నాము:

Sales Quotation Entry Sales Order Entry

06:33 Make Delivery మరియు Sales Order Inquiry
06:38 ఒక అసైన్మెంట్ గా, ఒక కొత్త Sales Quotation Entry ను సృష్టించండి.
06:42 వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింక్‌ను చూడండి.
06:47 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

06:55 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:05 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌.&nbsp లో పోస్ట్ చేయండి.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
07:15 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya