COVID19/C2/Making-a-protective-face-cover-at-home/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:26, 7 May 2020 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | ఇంట్లోనే సురక్షితమైన ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ను తయారు చేసుకోవడంపై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:10 | ఒక రక్షిత ఫేస్ కవర్ ను మనం ధరించాల్సిన అవసరం ఎందుకు ఉంది. |
00:14 | .ఆరోగ్య కార్యకర్తలు మరియు COVID-19 రోగుల కొరకు ముఖ్యమైన హెచ్చరికలు. |
00:20 | రక్షిత ఫేస్ కవర్లకు సంబంధించి భద్రతాపరమైన జాగ్రత్తలు. |
00:25 | కుట్టు మెషిన్ తో మరియు కుట్టు మెషిన్ లేకుండా రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేసే విధానం. |
00:32 | రక్షిత ఫేస్ కవర్ ను ధరించే ముందు మరియు తొలగించేటప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు. |
00:38 | రక్షిత ఫేస్ కవర్ ను శుభ్రపరచడానికి మరియు భద్రపరచడానికి సరైన పద్దతి. |
00:44 | మొదట మనం రక్షిత ఫేస్ కవర్ ను ధరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి. |
00:50 | కరోనావైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, ఫేస్ కవర్ ను ధరించడం అనేది ముఖ్యం. |
00:56 | భారతదేశం జనసాంద్రతతో ఉన్నందున, ఫేస్ కవర్ ను ధరించడం అనేది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది. |
01:03 | కరోనావైరస్ ను నివారించడానికి మరియు నియంత్రించడానికి అనేక రకాల ఫేస్ కవర్లు ఉపయోగించబడుతున్నాయి. |
01:10 | వాటిలో ఇంట్లో తయారుచేసే రక్షిత ఫేస్ కవర్ ను తయారు చేయడం చాలా సులభం మరియు దానిని తిరిగి ఉపయోగించుకోవచ్చు కూడా. |
01:18 | ముందుకు వెళ్ళే ముందు, ముఖ్యమైన హెచ్చరికలను దయచేసి గుర్తుంచుకోండి. |
01:23 | ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ అనేది ఆరోగ్య కార్యకర్తల కొరకు కాదు. |
01:28 | ఇది COVID-19 రోగులతో పనిచేసే వారికి లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం కాదు. |
01:37 | COVID-19 రోగులు ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్లను ఉపయోగించకూడదు. |
01:42 | అలాంటి వారందరూ తప్పనిసరిగా పేర్కొన్న రక్షణ పరికరాలను మాత్రమే ధరించాలి. |
01:48 | మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ఇతర భద్రతా జాగ్రత్తలు ఉన్నాయి. |
01:53 | ఇంట్లోతయారుచేసిన ఫేస్ కవర్లు పూర్తి రక్షణను ఇవ్వవు |
01:58 | అవి వ్యాధి సోకిన వ్యక్తి నుండి వచ్చి గాలిలో ఉన్న బిందువులను మనం పీల్చే అవకాశాలను మాత్రమే తగ్గిస్తాయి. |
02:06 | ఫేస్ కవర్ ను తడపకుండా అసలు వాడకండి. |
02:10 | మీ ఫేస్ కవర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. |
02:14 | ప్రతిఒక్కరితో కనీసం 2 మీటర్ల సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి. |
02:21 | సబ్బుతో 40 సెకన్ల పాటు మీ చేతులను తరచుగా కడుక్కోవాలి. |
02:26 | తిరిగిఉపయోగించగల ఫేస్ కవర్ ను ఇంట్లోనే తయారుచేసుకోవడానికి ఒక సాధారణ పద్ధతిని ఇప్పుడు మనం చూస్తాము. |
02:33 | ఇంట్లో సులభంగా లభించే కాటన్ వస్త్రాన్నిఉపయోగించి దీనిని తయారు చేయవచ్చు. |
02:38 | దీన్ని తయారుచేసేటప్పుడు అది నోటిని మరియు ముక్కును పూర్తిగా కప్పి ఉంచేలా ఉందని నిర్దారించుకోండి. |
02:44 | ఇది ఎవరైనా ముఖం మీద సులభంగా కట్టుకోగలిగేలా ఉండాలి. |
02:49 | ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ కవర్లను కుట్టు మెషీన్ తో మరియు కుట్టు మెషీన్ లేకుండా కూడా సులభంగా తయారు చేయవచ్చు. |
02:55 | మొదట మనం కుట్టు మెషిన్ తో ఒక రక్షిత ఫేస్ కవర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. |
03:02 | మీకు ఒక 100% కాటన్ వస్త్రం అవసరం. |
03:06 | వస్త్రం యొక్క రంగుతో మీకు పట్టింపు లేదు. |
03:10 | తయారుచేసే ముందు, వస్త్రాన్ని శుభ్రంగా తడపాలి. |
03:13 | ఉప్పు వేసిన నీటిలో దాన్ని 5 నిమిషాలు ఉడకబెట్టండి. |
03:17 | వస్త్రాన్ని బాగా ఆరనిచ్చి అప్పుడు దాన్ని ఉపయోగించండి. |
03:21 | అవసరమైన ఇతర వస్తువులు: |
03:23 | వస్త్రం యొక్క పీలికలు నాలుగు ముక్కలు |
03:26 | కత్తెర
మరియు ఒక కుట్టు మెషిన్ |
03:29 | ఒక రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేయడానికి పద్దతిని నేను వివరిస్తాను. |
03:34 | ఫేస్ కవర్ కోసం వస్త్రాన్ని కత్తిరించడంతో ప్రారంభించండి. |
03:39 | పెద్దవారి కొరకు ఇది 9 ఇంచీలు x 7 ఇంచీలు ఉండాలి. |
03:44 | పిల్లల కొరకు ఇది 7 ఇంచీలు x 5 ఇంచీలు ఉండాలి. |
03:39 | ఇప్పుడు మనం పీలికలను (స్ట్రిప్స్ ను) కత్తిరిస్తాము. |
03:53 | పెద్దల సైజ్ ఫేస్ కవర్ కోసం, కట్టుకోవడానికి మరియు పైపింగ్ చేయడానికి 4 పీలికలను (స్ట్రిప్స్ ను) కత్తిరించండి. |
03:59 | 1.5 ఇంచీలు x 5 ఇంచీలు చొప్పున రెండు ముక్కలు. |
04:05 | అలాగే 1.5 ఇంచీలు x 40 ఇంచీలు చొప్పున రెండు ముక్కలు. |
04:11 | పైపింగ్గా ఉపయోగించడానికి బట్టకు ఒక చివరన 1.5 ఇంచీలు x 5 ఇంచీల (పీలికను) స్ట్రిప్‌ను అతకండి. |
04:19 | ప్రతీ మడత సుమారు 1.5 ఇంచీలు ఉండేలా బట్టను మడుస్తూ కిందివైపుకి వచ్చేలాగా మూడు కుచ్చులను (ప్లీట్స్) కుట్టండి. |
04:28 | కుచ్చులు కుట్టిన బట్టను మరొక వైపుకు తిప్పండి ఆవైపు కుచ్చులు కుట్టడానికి అవే దశలను పునరావృతం చేయండి. |
04:34 | ఇప్పుడు, వస్త్రం యొక్క ఎత్తు 9 ఇంచీల నుండి 5 ఇంచీలకు తగ్గించబడుతుంది. |
04:42 | .కుచ్చులకు రెండువైపులా పైపింగ్ తో గట్టికుట్టు వేయండి. |
04:46 | అన్ని కుచ్చులు క్రింది వైపుకి వచ్చేలాగా అదనపు జాగ్రత్తలు తీసుకోండి. |
04:51 | తరువాత, ఫేస్ కవర్ పైభాగానికి మరియు కిందిభాగానికి 40 ఇంచీల పొడవైన పీలికను అతకండి. |
04:59 | మరోసారి ఈ రెండు స్ట్రిప్స్‌ను (పీలికలను) మూడుసార్లు మడిచి కుట్టండి. |
05:05 | మీ ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. |
05:09 | మీరు ఫేస్ కవర్ ను ధరించేటప్పుడు మీ ముఖం మరియు ఫేస్ కవర్ ల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. |
05:15 | కుచ్చులు మీ వైపున ఉన్న భాగానికి కిందివైపుకు ఉండేటట్టు చూపించాలి. |
05:21 | తిరిగి ఉపయోగించడం కోసం మీరు ఫేస్ కవర్ ను ఎప్పుడూ రివర్స్ చేయకూడదు. |
05:24 | ప్రతీసారి ఉపయోగించిన తర్వాత దాన్నిబాగా తడపాలి. |
05:28 | మీరు మీ ముఖాన్ని లేదా కళ్ళను తాకకూడదు. |
05:31 | మీరు ఇంటికి చేరుకోగానే మీ చేతులను బాగా కడుక్కోవాలి. |
05:35 | ఇప్పుడు మనం కుట్టు మెషిన్ లేకుండా ఫేస్ కవర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. |
05:41 | మీకు అవసరమైనవి:
100% కాటన్ వస్త్రం లేదా పురుషుల యొక్క కాటన్ చేతి రుమాలు ఒకటి |
05:47 | మరియు రెండు రబ్బరు బ్యాండ్లు. |
05:50 | రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేసే విధానాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను. |
05:55 | చేతిరుమాలు ను ఒక వైపు నుండి గుడ్డ యొక్క మధ్యభాగానికి కొంచెం పైకి మడవండి. |
06:01 | ఇప్పుడు మొదటి మడత పైనుండి వెళ్ళడానికి మరొక అంచుపై నుండి మడవండి. |
06:07 | మధ్యభాగం నుండి మళ్ళీ దీన్ని సమానంగా మడవండి. |
06:11 | ఒక రబ్బరు బ్యాండ్ తీసుకొని వస్త్రం యొక్క ఎడమ వైపున కట్టండి. |
06:15 | ఇప్పుడు మరొక రబ్బరు బ్యాండ్‌తో మరొక వైపున కట్టండి. |
06:20 | రెండు రబ్బరు బ్యాండ్ల మధ్యలో ఉన్న ప్రాంతం తగినంత పెద్దదిగా ఉందని నిర్దారించుకోండి. |
06:25 | ఇది మీ నోటిని మరియు ముక్కును కప్పడానికి సహాయపడుతుంది. |
06:30 | రబ్బరు బ్యాండ్ యొక్క ఒక వైపు ఉన్న వస్త్రం యొక్క ఒక అంచుని తీసుకొని దానిపైకి మడవండి. |
06:36 | రెండు వైపులా ఇలా చేయండి. |
06:38 | ఇప్పుడు ఒక మడతను తీసుకొని మరొక మడతలోనికి దూర్చండి. |
06:43 | మీ ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. |
06:47 | ఈ ఫేస్ కవర్ ను ధరించడానికి ప్రతి రబ్బరు బ్యాండ్‌ను మీ చెవుల చుట్టూ పెట్టుకోండి. |
06:53 | ముందు చెప్పినట్లుగా, ఫేస్ కవర్ మీ నోరు మరియు ముక్కు చుట్టూ సరిపోయేలా ఉందని నిర్దారించుకోండి. |
07:00 | వాటి మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు. |
07:04 | ఇంట్లో తయారుచేసిన రక్షిత ఫేస్ కవర్ ను ధరించే ముందు మీరు భద్రతా జాగ్రత్తలను పాటించండి. |
07:10 | ఫేస్ కవర్ ను ధరించే ముందు మీ చేతులను బాగా కడుగుకోవాలి. |
07:14 | ఫేస్ కవర్ తడిగా లేదా తేమగాఅయిన వెంటనే, మరొక ఫేస్ కవర్ ను ధరించండి. |
07:21 | ప్రతీసారి ఫేస్ కవర్ ను ఉపయోగించిన తరువాత, మరలా ఉపయోగించడం కోసం దాన్ని తడపాలి. |
07:27 | ఒక కుటుంబంలోని ప్రతి ఒక్కరికి విడివిడిగా ఫేస్ కవర్ లు ఉండాలి. |
07:32 | ఫేస్ కవర్ ను తీసేసేటపుడు, ఫేస్ కవర్ యొక్క ముందు భాగాన్ని లేదా ఏ ఇతర ఉపరితలాన్ని తాకవద్దు. |
07:38 | వెనుకన ఉన్న తాళ్లతో లేదా రబ్బర్ బాండ్స్ తో మాత్రమే దాన్ని తీసివేయండి. |
07:43 | (తాళ్లు) స్ట్రింగ్స్ ఫేస్ కవర్ కొరకు, ఎల్లపుడు కింది తాడును ముందు విప్పాలి ఆ తర్వాత పైన తాడుని విప్పాలి. |
07:51 | తీసేసిన తరువాత, వెంటనే మీ చేతులను సబ్బు మరియు నీటితో 40 సెకన్ల పాటు శుభ్రం చేయండి. |
07:58 | మీరు 65 % ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ను కూడా ఉపయోగించవచ్చు. |
08:04 | ఇప్పుడు నేను ఫేస్ కవర్‌ను ఎలా సానిటైజ్ చేయాలో మీకు చెప్తాను. |
08:09 | దయచేసి ఈ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించండి. |
08:12 | ఫేస్ కవర్ ను సబ్బు మరియు వేడి నీటితో బాగా తడపాలి. |
08:17 | దానిని కనీసం 5 గంటలసేపు ఎండవేడిలో ఆరబెట్టండి. |
08:21 | ప్రత్యామ్నాయంగా, శుభ్రపరచడానికి మీరు ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించవచ్చు. |
08:25 | ఫేస్ కవర్ ను ప్రెజర్ కుక్కర్లో నీటిలో ఉంచండి. |
08:29 | ఉప్పువేసి దానిని కనీసం 10 నిముషాలసేపు ఉడికించండి. |
08:33 | తరువాత, దాన్ని బయటకు తీసి శుభ్రమైన ప్రదేశంలో ఆరనివ్వండి. |
08:38 | మీరు ఫేస్ కవర్‌ను వేడి నీటిలో కూడా 15 నిమిషాలు సేపు ఉడకబెట్టవచ్చు. |
08:44 | ఒకవేళ మీకు ప్రెజర్ కుక్కర్ లేదా వేడినీటిలో ఉడకపెట్టే అవకాశం కూడా లేకపోతే, సబ్బుని ఉపయోగించండి. |
08:51 | సబ్బుతో ఉతికి శుభ్రం చేయండి. |
08:54 | ఐదు నిమిషాల సేపు ఫేస్ కవర్ కు వేడిని ఇవ్వండి. |
08:59 | .వేడిని ఇవ్వడానికి మీరు ఇస్త్రీ పెట్టెను (ఐరన్ బాక్స్) ఉపయోగించవచ్చు. |
09:04 | మీరు కనీసం రెండు ఫేస్ కవర్ లను తయారు చేసుకోవాలని సిఫార్సు చేయబడింది. |
09:09 | ఒకదాన్ని తడిపి ఆరబెట్టి ఉంచినప్పుడు మీరు మరొకదాన్నిధరించవచ్చు. |
09:13 | ఇప్పుడు, మనం శుభ్రంచేసిన ఫేస్ కవర్లను ఎలా భద్రపరచాలో నేర్చుకుందాం. |
09:18 | ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్ (సంచి) ను తీసుకోండి.
దాన్నిసబ్బు మరియు నీటితో బాగా కడిగి శుభ్రం చేయండి. |
09:23 | దాన్ని రెండు పక్కలా బాగా ఆరనివ్వండి. |
09:27 | మీ అదనపు ఫేస్ కవర్ ను ఈ శుభ్రమైన సంచిలో పెట్టి దానిని బాగా సీలు చేసి ఉంచండి. |
09:32 | ఇప్పుడు మీరు మీ రోజువారీ ఉపయోగం కోసం మీ ఫేస్ కవర్ లను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించవచ్చు. |
09:38 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. |
09:41 | సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకున్నవి. |
09:45 | కరోనావైరస్ కారణంగా రక్షిత ఫేస్ కవర్ ను ధరించాల్సిన అవసరాన్ని మనము తెలుసుకున్నాము. |
09:51 | మనం ముఖ్యమైన హెచ్చరికల గురించి కూడా తెలుసుకున్నాము. |
09:54 | ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ ను వాడకూడదు. |
09:59 | COVID-19 రోగులతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా దీనిని ఉపయోగించకూడదు. |
10:05 | COVID-19 రోగులు కూడా ఈ ఫేస్ కవర్లను ఉపయోగించకూడదు. |
10:10 | ఆదేశికంగా, వీరంతా నిర్దేశిత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలి. |
10:15 | మనం భద్రతా జాగ్రత్తల గురించి కూడా తెలుసుకున్నాము. |
10:19 | ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ లు అనేవి పూర్తి రక్షణను ఇవ్వవు. |
10:23 | ఒక ఫేస్ కవర్ ను తడపకుండా వాడకూడదు అలాగే దాన్నిఎవరితోనూ పంచుకోకూడదు. |
10:29 | తప్పనిసరిగా, కనీసం 2 మీటర్ల సామాజిక దూరాన్ని పాటించండి. |
10:34 | తరచుగా చేతులను 40 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి. |
10:39 | మనం వీటిని కూడా నేర్చుకున్నాము, కుట్టు మెషిన్ తో మరియు కుట్టు మెషిన్ లేకుండా ఫేస్ కవర్ ను తయారు చేసే విధానాన్ని. |
10:45 | రక్షిత ఫేస్ కవర్ ను ధరించడానికి ముందు మరియు తీసేసేటపుడు పాటించాల్సిన జాగ్రత్తలు. |
10:51 | మరియు రక్షిత ఫేస్ కవర్లను శుభ్రపరచడానికి మరియు భద్రపరచడానికి సరైన పద్దతిని నేర్చుకున్నాము. |