COVID19/C2/Making-a-protective-face-cover-at-home/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 ఇంట్లోనే సురక్షితమైన ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ను తయారు చేసుకోవడంపై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
00:10 ఒక రక్షిత ఫేస్ కవర్ ను మనం ధరించాల్సిన అవసరం ఎందుకు ఉంది.
00:14 .ఆరోగ్య కార్యకర్తలు మరియు COVID-19 రోగుల కొరకు ముఖ్యమైన హెచ్చరికలు.
00:20 రక్షిత ఫేస్ కవర్లకు సంబంధించి భద్రతాపరమైన జాగ్రత్తలు.
00:25 కుట్టు మెషిన్ తో మరియు కుట్టు మెషిన్ లేకుండా రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేసే విధానం.
00:32 రక్షిత ఫేస్ కవర్ ను ధరించే ముందు మరియు తొలగించేటప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు.
00:38 రక్షిత ఫేస్ కవర్ ను శుభ్రపరచడానికి మరియు భద్రపరచడానికి సరైన పద్దతి.
00:44 మొదట మనం రక్షిత ఫేస్ కవర్ ను ధరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి.
00:50 కరోనావైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, ఫేస్ కవర్ ను ధరించడం అనేది ముఖ్యం.
00:56 భారతదేశం జనసాంద్రతతో ఉన్నందున, ఫేస్ కవర్ ను ధరించడం అనేది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది.
01:03 కరోనావైరస్ ను నివారించడానికి మరియు నియంత్రించడానికి అనేక రకాల ఫేస్ కవర్లు ఉపయోగించబడుతున్నాయి.
01:10 వాటిలో ఇంట్లో తయారుచేసే రక్షిత ఫేస్ కవర్ ను తయారు చేయడం చాలా సులభం మరియు దానిని తిరిగి ఉపయోగించుకోవచ్చు కూడా.
01:18 ముందుకు వెళ్ళే ముందు, ముఖ్యమైన హెచ్చరికలను దయచేసి గుర్తుంచుకోండి.
01:23 ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ అనేది ఆరోగ్య కార్యకర్తల కొరకు కాదు.
01:28 ఇది COVID-19 రోగులతో పనిచేసే వారికి లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం కాదు.
01:37 COVID-19 రోగులు ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్లను ఉపయోగించకూడదు.
01:42 అలాంటి వారందరూ తప్పనిసరిగా పేర్కొన్న రక్షణ పరికరాలను మాత్రమే ధరించాలి.
01:48 మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ఇతర భద్రతా జాగ్రత్తలు ఉన్నాయి.
01:53 ఇంట్లోతయారుచేసిన ఫేస్ కవర్లు పూర్తి రక్షణను ఇవ్వవు
01:58 అవి వ్యాధి సోకిన వ్యక్తి నుండి వచ్చి గాలిలో ఉన్న బిందువులను మనం పీల్చే అవకాశాలను మాత్రమే తగ్గిస్తాయి.
02:06 ఫేస్ కవర్ ను తడపకుండా అసలు వాడకండి.
02:10 మీ ఫేస్ కవర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.
02:14 ప్రతిఒక్కరితో కనీసం 2 మీటర్ల సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి.
02:21 సబ్బుతో 40 సెకన్ల పాటు మీ చేతులను తరచుగా కడుక్కోవాలి.
02:26 తిరిగిఉపయోగించగల ఫేస్ కవర్ ను ఇంట్లోనే తయారుచేసుకోవడానికి ఒక సాధారణ పద్ధతిని ఇప్పుడు మనం చూస్తాము.
02:33 ఇంట్లో సులభంగా లభించే కాటన్ వస్త్రాన్నిఉపయోగించి దీనిని తయారు చేయవచ్చు.
02:38 దీన్ని తయారుచేసేటప్పుడు అది నోటిని మరియు ముక్కును పూర్తిగా కప్పి ఉంచేలా ఉందని నిర్దారించుకోండి.
02:44 ఇది ఎవరైనా ముఖం మీద సులభంగా కట్టుకోగలిగేలా ఉండాలి.
02:49 ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ కవర్లను కుట్టు మెషీన్ తో మరియు కుట్టు మెషీన్ లేకుండా కూడా సులభంగా తయారు చేయవచ్చు.
02:55 మొదట మనం కుట్టు మెషిన్ తో ఒక రక్షిత ఫేస్ కవర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
03:02 మీకు ఒక 100% కాటన్ వస్త్రం అవసరం.
03:06 వస్త్రం యొక్క రంగుతో మీకు పట్టింపు లేదు.
03:10 తయారుచేసే ముందు, వస్త్రాన్ని శుభ్రంగా తడపాలి.
03:13 ఉప్పు వేసిన నీటిలో దాన్ని 5 నిమిషాలు ఉడకబెట్టండి.
03:17 వస్త్రాన్ని బాగా ఆరనిచ్చి అప్పుడు దాన్ని ఉపయోగించండి.
03:21 అవసరమైన ఇతర వస్తువులు:
03:23 వస్త్రం యొక్క పీలికలు నాలుగు ముక్కలు
03:26 కత్తెర

మరియు ఒక కుట్టు మెషిన్

03:29 ఒక రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేయడానికి పద్దతిని నేను వివరిస్తాను.
03:34 ఫేస్ కవర్ కోసం వస్త్రాన్ని కత్తిరించడంతో ప్రారంభించండి.
03:39 పెద్దవారి కొరకు ఇది 9 ఇంచీలు x 7 ఇంచీలు ఉండాలి.
03:44 పిల్లల కొరకు ఇది 7 ఇంచీలు x 5 ఇంచీలు ఉండాలి.
03:39 ఇప్పుడు మనం పీలికలను (స్ట్రిప్స్ ను) కత్తిరిస్తాము.
03:53 పెద్దల సైజ్ ఫేస్ కవర్ కోసం, కట్టుకోవడానికి మరియు పైపింగ్ చేయడానికి 4 పీలికలను (స్ట్రిప్స్ ను) కత్తిరించండి.
03:59 1.5 ఇంచీలు x 5 ఇంచీలు చొప్పున రెండు ముక్కలు.
04:05 అలాగే 1.5 ఇంచీలు x 40 ఇంచీలు చొప్పున రెండు ముక్కలు.
04:11 పైపింగ్‌గా ఉపయోగించడానికి బట్టకు ఒక చివరన 1.5 ఇంచీలు x 5 ఇంచీల (పీలికను) స్ట్రిప్‌ను అతకండి.
04:19 ప్రతీ మడత సుమారు 1.5 ఇంచీలు ఉండేలా బట్టను మడుస్తూ కిందివైపుకి వచ్చేలాగా మూడు కుచ్చులను (ప్లీట్స్) కుట్టండి.
04:28 కుచ్చులు కుట్టిన బట్టను మరొక వైపుకు తిప్పండి ఆవైపు కుచ్చులు కుట్టడానికి అవే దశలను పునరావృతం చేయండి.
04:34 ఇప్పుడు, వస్త్రం యొక్క ఎత్తు 9 ఇంచీల నుండి 5 ఇంచీలకు తగ్గించబడుతుంది.
04:42 .కుచ్చులకు రెండువైపులా పైపింగ్ తో గట్టికుట్టు వేయండి.
04:46 అన్ని కుచ్చులు క్రింది వైపుకి వచ్చేలాగా అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
04:51 తరువాత, ఫేస్ కవర్ పైభాగానికి మరియు కిందిభాగానికి 40 ఇంచీల పొడవైన పీలికను అతకండి.
04:59 మరోసారి ఈ రెండు స్ట్రిప్స్‌ను (పీలికలను) మూడుసార్లు మడిచి కుట్టండి.
05:05 మీ ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
05:09 మీరు ఫేస్ కవర్ ను ధరించేటప్పుడు మీ ముఖం మరియు ఫేస్ కవర్ ల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు.
05:15 కుచ్చులు మీ వైపున ఉన్న భాగానికి కిందివైపుకు ఉండేటట్టు చూపించాలి.
05:21 తిరిగి ఉపయోగించడం కోసం మీరు ఫేస్ కవర్ ను ఎప్పుడూ రివర్స్ చేయకూడదు.
05:24 ప్రతీసారి ఉపయోగించిన తర్వాత దాన్నిబాగా తడపాలి.
05:28 మీరు మీ ముఖాన్ని లేదా కళ్ళను తాకకూడదు.
05:31 మీరు ఇంటికి చేరుకోగానే మీ చేతులను బాగా కడుక్కోవాలి.
05:35 ఇప్పుడు మనం కుట్టు మెషిన్ లేకుండా ఫేస్ కవర్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
05:41 మీకు అవసరమైనవి:

100% కాటన్ వస్త్రం లేదా పురుషుల యొక్క కాటన్ చేతి రుమాలు ఒకటి

05:47 మరియు రెండు రబ్బరు బ్యాండ్లు.
05:50 రక్షిత ఫేస్ కవర్ ను తయారుచేసే విధానాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను.
05:55 చేతిరుమాలు ను ఒక వైపు నుండి గుడ్డ యొక్క మధ్యభాగానికి కొంచెం పైకి మడవండి.
06:01 ఇప్పుడు మొదటి మడత పైనుండి వెళ్ళడానికి మరొక అంచుపై నుండి మడవండి.
06:07 మధ్యభాగం నుండి మళ్ళీ దీన్ని సమానంగా మడవండి.
06:11 ఒక రబ్బరు బ్యాండ్ తీసుకొని వస్త్రం యొక్క ఎడమ వైపున కట్టండి.
06:15 ఇప్పుడు మరొక రబ్బరు బ్యాండ్‌తో మరొక వైపున కట్టండి.
06:20 రెండు రబ్బరు బ్యాండ్ల మధ్యలో ఉన్న ప్రాంతం తగినంత పెద్దదిగా ఉందని నిర్దారించుకోండి.
06:25 ఇది మీ నోటిని మరియు ముక్కును కప్పడానికి సహాయపడుతుంది.
06:30 రబ్బరు బ్యాండ్ యొక్క ఒక వైపు ఉన్న వస్త్రం యొక్క ఒక అంచుని తీసుకొని దానిపైకి మడవండి.
06:36 రెండు వైపులా ఇలా చేయండి.
06:38 ఇప్పుడు ఒక మడతను తీసుకొని మరొక మడతలోనికి దూర్చండి.
06:43 మీ ఫేస్ కవర్ (ముఖానికి కప్పుకునే తొడుగు) ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
06:47 ఈ ఫేస్ కవర్ ను ధరించడానికి ప్రతి రబ్బరు బ్యాండ్‌ను మీ చెవుల చుట్టూ పెట్టుకోండి.
06:53 ముందు చెప్పినట్లుగా, ఫేస్ కవర్ మీ నోరు మరియు ముక్కు చుట్టూ సరిపోయేలా ఉందని నిర్దారించుకోండి.
07:00 వాటి మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు.
07:04 ఇంట్లో తయారుచేసిన రక్షిత ఫేస్ కవర్ ను ధరించే ముందు మీరు భద్రతా జాగ్రత్తలను పాటించండి.
07:10 ఫేస్ కవర్ ను ధరించే ముందు మీ చేతులను బాగా కడుగుకోవాలి.
07:14 ఫేస్ కవర్ తడిగా లేదా తేమగాఅయిన వెంటనే, మరొక ఫేస్ కవర్ ను ధరించండి.
07:21 ప్రతీసారి ఫేస్ కవర్ ను ఉపయోగించిన తరువాత, మరలా ఉపయోగించడం కోసం దాన్ని తడపాలి.
07:27 ఒక కుటుంబంలోని ప్రతి ఒక్కరికి విడివిడిగా ఫేస్ కవర్ లు ఉండాలి.
07:32 ఫేస్ కవర్ ను తీసేసేటపుడు, ఫేస్ కవర్ యొక్క ముందు భాగాన్ని లేదా ఏ ఇతర ఉపరితలాన్ని తాకవద్దు.
07:38 వెనుకన ఉన్న తాళ్లతో లేదా రబ్బర్ బాండ్స్ తో మాత్రమే దాన్ని తీసివేయండి.
07:43 (తాళ్లు) స్ట్రింగ్స్ ఫేస్ కవర్ కొరకు, ఎల్లపుడు కింది తాడును ముందు విప్పాలి ఆ తర్వాత పైన తాడుని విప్పాలి.
07:51 తీసేసిన తరువాత, వెంటనే మీ చేతులను సబ్బు మరియు నీటితో 40 సెకన్ల పాటు శుభ్రం చేయండి.
07:58 మీరు 65 % ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ను కూడా ఉపయోగించవచ్చు.
08:04 ఇప్పుడు నేను ఫేస్ కవర్‌ను ఎలా సానిటైజ్ చేయాలో మీకు చెప్తాను.
08:09 దయచేసి ఈ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించండి.
08:12 ఫేస్ కవర్ ను సబ్బు మరియు వేడి నీటితో బాగా తడపాలి.
08:17 దానిని కనీసం 5 గంటలసేపు ఎండవేడిలో ఆరబెట్టండి.
08:21 ప్రత్యామ్నాయంగా, శుభ్రపరచడానికి మీరు ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించవచ్చు.
08:25 ఫేస్ కవర్ ను ప్రెజర్ కుక్కర్‌లో నీటిలో ఉంచండి.
08:29 ఉప్పువేసి దానిని కనీసం 10 నిముషాలసేపు ఉడికించండి.
08:33 తరువాత, దాన్ని బయటకు తీసి శుభ్రమైన ప్రదేశంలో ఆరనివ్వండి.
08:38 మీరు ఫేస్ కవర్‌ను వేడి నీటిలో కూడా 15 నిమిషాలు సేపు ఉడకబెట్టవచ్చు.
08:44 ఒకవేళ మీకు ప్రెజర్ కుక్కర్ లేదా వేడినీటిలో ఉడకపెట్టే అవకాశం కూడా లేకపోతే, సబ్బుని ఉపయోగించండి.
08:51 సబ్బుతో ఉతికి శుభ్రం చేయండి.
08:54 ఐదు నిమిషాల సేపు ఫేస్ కవర్ కు వేడిని ఇవ్వండి.
08:59 .వేడిని ఇవ్వడానికి మీరు ఇస్త్రీ పెట్టెను (ఐరన్ బాక్స్) ఉపయోగించవచ్చు.
09:04 మీరు కనీసం రెండు ఫేస్ కవర్ లను తయారు చేసుకోవాలని సిఫార్సు చేయబడింది.
09:09 ఒకదాన్ని తడిపి ఆరబెట్టి ఉంచినప్పుడు మీరు మరొకదాన్నిధరించవచ్చు.
09:13 ఇప్పుడు, మనం శుభ్రంచేసిన ఫేస్ కవర్లను ఎలా భద్రపరచాలో నేర్చుకుందాం.
09:18 ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్ (సంచి) ను తీసుకోండి.

దాన్నిసబ్బు మరియు నీటితో బాగా కడిగి శుభ్రం చేయండి.

09:23 దాన్ని రెండు పక్కలా బాగా ఆరనివ్వండి.
09:27 మీ అదనపు ఫేస్ కవర్ ను ఈ శుభ్రమైన సంచిలో పెట్టి దానిని బాగా సీలు చేసి ఉంచండి.
09:32 ఇప్పుడు మీరు మీ రోజువారీ ఉపయోగం కోసం మీ ఫేస్ కవర్ లను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించవచ్చు.
09:38 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
09:41 సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకున్నవి.
09:45 కరోనావైరస్ కారణంగా రక్షిత ఫేస్ కవర్ ను ధరించాల్సిన అవసరాన్ని మనము తెలుసుకున్నాము.
09:51 మనం ముఖ్యమైన హెచ్చరికల గురించి కూడా తెలుసుకున్నాము.
09:54 ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ ను వాడకూడదు.
09:59 COVID-19 రోగులతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా దీనిని ఉపయోగించకూడదు.
10:05 COVID-19 రోగులు కూడా ఈ ఫేస్ కవర్లను ఉపయోగించకూడదు.
10:10 ఆదేశికంగా, వీరంతా నిర్దేశిత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలి.
10:15 మనం భద్రతా జాగ్రత్తల గురించి కూడా తెలుసుకున్నాము.
10:19 ఇంట్లో తయారుచేసిన ఫేస్ కవర్ లు అనేవి పూర్తి రక్షణను ఇవ్వవు.
10:23 ఒక ఫేస్ కవర్ ను తడపకుండా వాడకూడదు అలాగే దాన్నిఎవరితోనూ పంచుకోకూడదు.
10:29 తప్పనిసరిగా, కనీసం 2 మీటర్ల సామాజిక దూరాన్ని పాటించండి.
10:34 తరచుగా చేతులను 40 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి.
10:39 మనం వీటిని కూడా నేర్చుకున్నాము, కుట్టు మెషిన్ తో మరియు కుట్టు మెషిన్ లేకుండా ఫేస్ కవర్ ను తయారు చేసే విధానాన్ని.
10:45 రక్షిత ఫేస్ కవర్ ను ధరించడానికి ముందు మరియు తీసేసేటపుడు పాటించాల్సిన జాగ్రత్తలు.
10:51 మరియు రక్షిత ఫేస్ కవర్లను శుభ్రపరచడానికి మరియు భద్రపరచడానికి సరైన పద్దతిని నేర్చుకున్నాము.

Contributors and Content Editors

Simhadriudaya