Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-pregnant-women/Telugu
|
|
00:01 | గర్భిణీ స్త్రీల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం -
గర్భిణీ స్త్రీల కొరకు మాంసాహారం యొక్క ప్రాముఖ్యత మరియు వివిధ మాంసాహార వంటకాలను గురించి నేర్చుకుంటాము. |
00:15 | మొదట మనం వివిధ మాంసాహార ఆహారాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. |
00:20 | చికెన్, మాంసం, చేపలు, రొయ్యలు, అవయవ మాంసం వంటి మాంసాహార ఆహారాల్లో ప్రోటీన్, జింక్, కోలిన్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. |
00:30 | పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ పోషకాలు అనేవి అవసరం. |
00:35 | అవి శిశువు యొక్క మెదడు అభివృద్ధికి సహాయపడతాయి ఇంకా తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోను సహాయపడతాయి. |
00:41 | ఈ పోషకాలను పొందడానికి, గర్భధారణ సమయంలో తప్పకుండా మాంసాహారం తినాలి. |
00:46 | ఇప్పుడు, మనం కొన్ని మాంసాహార వంటకాలను చూస్తాము. |
00:50 | మనం కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అనే మన మొదటి వంటకంతో ప్రారంభిద్దాం. |
00:55 | ఈ వంటకం కొరకు, మనకు కావాల్సినవి -
2 ఉడికించిన గుడ్లు, తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, |
01:02 | తరిగిన టమోటా 1,
వెల్లుల్లి రెబ్బలు 2, |
01:06 | ½ అంగుళం అల్లం ముక్క,
సగం కరివేపాకు రెమ్మ, |
01:11 | ఇవన్నీ ¼ టీస్పూన్ చొప్పున -
గరం మసాలా పొడి, |
01:14 | మిరియాల పొడి,
కాశ్మీరీ ఎర్ర కారం పొడి, |
01:18 | పసుపు పొడి,
1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర, |
01:22 | 1 టేబుల్ స్పూన్ నూనె ఇంకా రుచికి సరిపడా ఉప్పు. |
01:26 | మొదట, మనం ఉడికించిన గుడ్లను ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. |
01:29 | 1 అంగుళం ఎత్తు వరకు చల్లటి నీటితో ఒక గిన్నెను నింపండి.
అందులో గుడ్లు ఉంచి మూతపెట్టండి. |
01:36 | నీటిని ఎక్కువ మంట మీద మరగనివ్వండి.
తరువాత, గుడ్లు పూర్తిగా బాగా ఉడకడం కోసం మీడియం మంట మీద 6 నుండి 7 నిమిషాలు ఉడికించండి. |
01:44 | ఇప్పుడు గుడ్లు పైన ఉన్న గట్టి పెంకును తీసేసి వాటిని పక్కన ఉంచండి. |
01:48 | తరువాత, ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయండి.
అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేయండి. |
01:54 | మంటను మీడియంకు మార్చి ఉల్లిపాయ ముక్కలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వాటిని వేయించండి. |
01:59 | ఆ తరువాత, అన్ని పొడి మసాలాలను వేయండి, మీకు మంచి వేగిన వాసన వచ్చే వరకు వేయించండి. |
02:04 | తరువాత, తరిగిన టమోటా ముక్కలు ఇంకా ఉప్పు వేయండి. |
02:07 | ఇప్పుడు 1 కప్పు నీరు పోసి ఆ మిశ్రమాన్ని ఉడికించండి. |
02:12 | టమోట ముక్కలు మగ్గటం ప్రారంభమయ్యే వరకు కొన్ని నిమిషాలు మంటను తగ్గించి పెట్టండి.
ఆ తరువాత, ఉడికించిన గుడ్లను అందులో వేయండి. |
02:18 | కళాయికి మూతపెట్టి, గుడ్లను తక్కువ మంట మీద 10 నుండి 15 నిమిషాలు సేపు ఉంచండి. |
02:23 | మంటను ఆపివేసి, తరిగిన కొత్తిమీర ను వేయండి. |
02:26 | గుడ్లు విరిగిపోకుండా గ్రేవీని మెల్లగా కలపండి.
దాన్ని ఒక సర్వింగ్ బౌల్ లో వేయండి. |
02:32 | ముందుకు వెళుతూ, మన రెండవ వంటకం - చికెన్ చెట్టినాడ్ గురించి నేర్చుకుందాం. |
02:37 | దీని కోసం, మనకు కావాల్సినవి -
100 గ్రాముల చికెన్ బ్రెస్ట్, |
02:42 | 1 టేబుల్ స్పూన్ నూనె,
సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, |
02:46 | 1 మీడియం టమోటా, |
02:48 | 1 నుండి 2 రెమ్మల కరివేపాకు మరియు
1 జాపత్రి ఆకు. |
02:52 | మెరినేషన్ కొరకు, మనకు అవసరమైనవి -
¼ టీస్పూన్ పసుపు పొడి, |
02:56 | ¼ టీస్పూన్ కారం పొడి, |
02:58 | 1 టేబుల్ స్పూన్ అల్లం- వెల్లుల్లి పేస్ట్ మరియు
రుచికి సరిపడా ఉప్పు. |
03:03 | గ్రేవీ కోసం, మనకు అవసరమైనవి - ½ టేబుల్ స్పూన్ ధనియాలు,
½ టీస్పూన్ సోపు గింజలు, |
03:10 | 1 టీస్పూన్ మిరియాలు,
1 టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
03:14 | 2 ఏలకులు,
2 లవంగాలు, |
03:17 | ½ అంగుళం దాల్చిన చెక్క ముక్క మరియు
2 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి. |
03:22 | చికెన్‌ను మ్యారినేట్ చేయడంతో ప్రారంభిద్దాం-
ఒక గిన్నెలో చికెన్, పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి కలపాలి. |
03:31 | దాన్ని గది ఉష్ణోగ్రత వద్ద 30 నుండి 45 నిమిషాలు సేపు ఉంచండి |
03:34 | తక్కువ మంట మీద, ధనియాలను నూనె లేకుండా వేయించండి. |
03:38 | 2 నుండి 3 నిమిషాల తరువాత, మిగిలిన మసాలా దినుసులను వేయండి. |
03:42 | మీకు మసాలాల నుండి మంచి వాసన వచ్చేవరకు వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. |
03:47 | తరువాత కొబ్బరితురుమును కొన్ని నిమిషాలు వేయించుకోవాలి. |
03:50 | వేయించిన మసాలాలు ఇంకా కొబ్బరితురుమును చల్లారనివ్వండి. |
03:53 | రాతి రోలు లేదా మిక్సర్ గ్రైండర్ ను ఉపయోగించి 1 టేబుల్ స్పూన్ నీరు పోసి వాటిని చక్కటి పేస్ట్‌గా రుబ్బండి. |
04:00 | ఈ పేస్ట్ ని ఒక పక్కన ఉంచండి.ప్యూరీ చేయడానికి బ్లెండర్లో టమోటాలు వేయండి. |
04:06 | ఇప్పుడు ఒక కళాయి (పాన్) లో, నూనె వేసి వేడి చేయండి.
అందులో ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. |
04:12 | దాంట్లో చికెన్ వేసి మీడియం మంట మీద 4 నుండి 5 నిమిషాలు మళ్ళీ వేయించాలి. |
04:16 | టమోటా ప్యూరీ, పసుపు, ఉప్పు ఇంకా కారం పొడి వేయండి. |
04:21 | బాగా కలిపి నూనె వేరు అయ్యే వరకు దానిని ఉడికించండి.
ఆ తరువాత,రుబ్బి పెట్టుకున్నపేస్ట్ మరియు కరివేపాకు వేయండి. |
04:27 | ఈ మిశ్రమాన్ని 2 నుండి 3 నిమిషాలు వేయించండి. |
04:30 | ¼ కప్పు నీరు పోసి, చికెన్ మెత్తగా ఇంకా మృదువుగా అయ్యేవరకు మూతపెట్టి ఉడికించండి. |
04:37 | గ్రేవీ చిక్కబడేవరకు మంటను తగ్గించి ఉంచండి.
కరివేపాకుతో అలంకరించి సర్వ్ చేయాలి. |
04:42 | దయచేసి గుర్తుంచుకోండి: కిందివాటిలో దేనినైనా ఉపయోగించడం ద్వారా ఈ వంటకాన్ని తయారు చేయవచ్చు -
మటన్, ఆర్గాన్ మాంసం, రొయ్యలు మరియు చేపలు. |
04:52 | ఇప్పుడు, మనం మూడవ వంటకం -చికెన్ లివర్ సుక్కా చూద్దాం |
04:56 | ఈ వంటకం కొరకు అవసరమైన పదార్థాలు -
100 గ్రాముల చికెన్ (కాలేయం)లివర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, |
05:03 | తరిగిన టమోటా,
వెల్లుల్లి 6 రెబ్బలు, |
05:07 | ¼ అంగుళం అల్లం,
2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర, |
05:12 | 1 టేబుల్ స్పూన్ నూనె,
రుచికి సరిపడా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. |
05:18 | ప్రారంభించడానికి -
ఒక బ్లెండర్లో ఉల్లిపాయముక్కలు, టమోటాముక్కలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వేయండి. |
05:25 | ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేయండి.
ఈ పేస్ట్‌ను చికెన్ లివర్‌పై అప్ప్లైచేసి గది ఉష్ణోగ్రత వద్ద 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. |
05:34 | ఇప్పుడు, ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, అందులో మెరినేషన్ పేస్ట్ తో పాటు లివర్ ను వేయండి.
దీన్ని బాగా కలపండి. |
05:40 | అందులో 1/4 కప్పు నీరు పోసి తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
ఆ తరువాత, మంటను పెంచి బాగా ఉడికించండి |
05:49 | బాగా ఉడికిన తర్వాత, మంటను ఆపివేయండి.
చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కడిగి తరిగిన కొత్తిమీరతో అలంకరించండి(గార్నిష్ చేయండి). |
05:57 | ఈ రెసిపీ కోసం మీరు మటన్ లివర్ ని కూడా ఉపయోగించవచ్చు. |
06:00 | తరువాతి రెసిపీ-పాలకూర కూరలో ఫిష్ (చేప). |
06:04 | దీని కోసం, మనకు అవసరమైనవి - మాకేరెల్ చేప 2 చిన్న ముక్కలు, |
06:08 | 1 కప్పు పాలకూర ఆకులు,
1 తరిగిన ఉల్లిపాయ, |
06:12 | 1 తరిగిన టమోటా,
1 టీస్పూన్ జీలకర్ర, |
06:16 | 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు, |
06:18 | ¼ టీస్పూన్ పసుపు పొడి,
1 టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
06:23 | 1 టీస్పూన్ జీలకర్ర పొడి,
¼ టీస్పూన్ నల్ల మిరియాలు పొడి, |
06:28 | ½ టీస్పూన్ ధనియాల పొడి,
1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, |
06:33 | 1 టీస్పూన్ నూనె,
మరియు రుచికి సరిపడా ఉప్పు. |
06:37 | ప్రారంభించడానికి -
మాకేరెల్ చేపను కడిగి శుభ్రంచేసి రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. |
06:43 | ఒక కళాయి లో, నూనె వేసి వేడి చేసి జీలకర్ర వేయండి. |
06:46 | ఒకసారి అవి చిటపటలాడిన తర్వాత, పచ్చి పాలకూర ఆకులను వేసి ఒక నిమిషం ఉడికించాలి. |
06:51 | ఇప్పుడు, దాన్ని చల్లారనివ్వండి. |
06:53 | తరువాత, గ్రైండర్లో ఉడికించిన పాలకూర, టమోట ముక్కలు మరియు నువ్వులు వేసి ప్యూరీ తయారు చేయండి. |
06:59 | ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేయండి. |
07:03 | ఉల్లిపాయముక్కలు గులాబీ రంగులోకి మారిన తర్వాత, తరిగిన వెల్లుల్లి వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. |
07:09 | మసాలాలన్నీ వేసి మీకు మసాలాలు నుండి మంచి వాసన వచ్చేవరకు వేయించండి. |
07:14 | ఇప్పుడు పాలకూర ప్యూరీ వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. |
07:17 | తరువాత, చేప ముక్కలు వేసి బాగా ఉడికించాలి. |
07:20 | ఇప్పుడు, ¼ కప్పు నీరు పోసి ఉప్పు వేయండి.
మూతపెట్టి దాన్ని 5 నుండి 7 నిమిషాలు సేపు ఉడకనివ్వండి. |
07:28 | మూత తీసేసి 15 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వండి.
అయిపోయాక, వేడిగా వడ్డించండి. |
07:35 | దయచేసి గుర్తుంచుకోండి, స్థానికంగా లభించే ఏ చేపలనైనా ఈ రెసిపీ కోసం ఉపయోగించవచ్చు. |
07:40 | చివరగా, మనం మీట్‌బాల్ కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాము. |
07:44 | ఈ వంటకం కొరకు, మనకు అవసరమైనవి -
100 గ్రాముల గుండగా తరిగిన మాంసం, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, |
07:51 | 1 తరిగిన టమోటా,
½ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, |
07:55 | 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్,
1 టేబుల్ స్పూన్ గరం మసాలా, |
07:59 | ¼ కప్పు తాజా కొత్తిమీర మరియు
రుచికి సరిపడా ఉప్పు. |
08:04 | గ్రేవీ కోసం -
1 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, |
08:10 | 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్,
½ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, |
08:14 | ½ టీస్పూన్ జీలకర్ర పొడి, |
08:16 | ¼ టీస్పూన్ పసుపు పొడి, |
08:19 | ఇంకా ఇవన్నీ ½ టీస్పూన్ చొప్పున -
కారం పొడి, గరం మసాలా మరియు ధనియాల పొడి, |
08:25 | తరిగిన పెద్ద టమోటా 1 ఇంకా రుచికి సరిపడా ఉప్పు. |
08:29 | ప్రారంభించడానికి, మస్లిన్ వస్త్రాన్ని ఉపయోగించి గుండగా తరిగిన మాంసాన్ని బాగా కకడిగి శుభ్రం చేయండి. |
08:34 | ఇప్పుడు, ఒక గిన్నెలో గుండగా తరిగిన మాంసం మరియు తరిగిన ఉల్లిపాయముక్కలు వేయండి. |
08:38 | అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర ఇంకా ఉప్పు వేయండి. |
08:44 | ఈ మిశ్రమాన్ని ఆరు సమాన భాగాలుగా విభజించి వాటిని బాల్ ఆకారంలో చేయండి. |
08:48 | ఒక కళాయి లో నూనె వేసి వేడి చేసి, మిగిలిన తరిగిన ఉల్లిపాయముక్కలను వేయండి. |
08:52 | లేత గోధుమ రంగు వచ్చేవరకు వాటిని వేయించండి. |
08:56 | అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొన్ని నిమిషాలు వేయించాలి. |
08:59 | అన్ని మసాలా పొడులు -ధనియాలపొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం పొడి, గరం మసాలా, ఇంకా పసుపు వేయండి. |
09:08 | ఇప్పుడు, దీనిని 2 నుండి 3 నిమిషాలు సేపు వేయించండి. |
09:11 | అందులో టమోటాముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.
తరువాత, ఆ మసాలాకు ½ కప్పు నీళ్లు ఇంకా ఉప్పు వేయండి. |
09:18 | ఇలా ఉన్నపుడు, అందులో మీట్‌బాల్స్ ను నెమ్మదిగా వేసి మంట తగ్గించి ఉంచండి. |
09:23 | 5 నిమిషాల తర్వాత మెల్లగా కలపండి, మీట్‌బాల్స్ ఉడికే వరకు ఉడికించండి.
సర్వింగ్ బౌల్ లో వేడిగా వడ్డించండి. |
09:30 | అలాగే, ఈ రెసిపీని తయారు చేయడానికి మీరు గుండగా ముక్కలు చేసిన చికెన్‌ను ఉపయోగించవచ్చు. |
09:34 | ఈ వంటకాలన్నిటిలో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం -
ప్రోటీన్, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ A, విటమిన్ B12, |
09:45 | ఫోలిక్ ఆసిడ్ మరియు ఇనుము, జింక్, మెగ్నీషియం, సల్ఫర్ ఇంకా కోలిన్. |
09:52 | గర్భిణీ స్త్రీలకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి ఇది మనలను తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |