Health-and-Nutrition/C2/Basics-of-newborn-care/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 22:57, 5 November 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 (అప్పుడే పుట్టిన బిడ్డ) నవజాత శిశు సంరక్షణ యొక్క ప్రాథమిక విషయాలపై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి- నవజాత శిశువును (అప్పుడే పుట్టిన బిడ్డ) ఎలా సంభాళించాలి,
00:11 బొడ్డు తాడు సంరక్షణ,

నవజాత శిశువుకు (అప్పుడే పుట్టిన బిడ్డ) ఆహారం ఇవ్వడం మరియు బర్పింగ్(తేన్పు వచ్చేలా చేయడం) చేయడం,

00:15 డైపర్ వేయడం ఇంకా డైపర్ వల్ల వచ్చేదద్దుర్లు మరియు
00:19 నవజాత శిశువు (అప్పుడే పుట్టిన బిడ్డ) యొక్క నిద్రపుచ్చే విధానం.
00:23 నవజాత శిశువు పుట్టుక తరువాత కుటుంబం మొత్తం ఉత్సాహంగా ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ శిశువును చూడాలని మరియు బిడ్డను పట్టుకోవాలని కోరుకుంటారు.
00:34 అందువల్ల నవజాత శిశువును సంభాలించేటప్పుడు కొన్ని కీలక నియమాలను రూపొందించడం అవసరం.
00:40 నవజాత శిశువులకు బలమైన రోగనిరోధక శక్తి లేదు. దీనివల్ల వారు ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు.
00:48 శిశువును అంటువ్యాధుల నుండి రక్షించడానికి, శిశువును తాకేముందు లేదా పట్టుకునే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
00:57 చేతులను శుభ్రం చేయడానికి, సబ్బు మరియు నీటితో కడగాలి మరియు నవజాత శిశువును పట్టుకునే ముందు శుభ్రమైన పొడి వస్త్రాన్ని ఉపయోగించి చేతుల్ని బాగా ఆరేలా తుడవాలి.
01:07 శిశువును ఎలా పట్టుకోవాలి అనేదానిలో నేర్చుకోవలసిన మొదటి విషయానికి ఇప్పుడు వచ్చాము.
01:11 ఒక చేత్తో బిడ్డ తల మరియు మెడకు మరియు మరొక చేత్తో బిడ్డ కింది భాగానికి మద్దతు ఇవ్వడం ద్వారా బిడ్డను పట్టుకోండి.
01:19 బిడ్డను పడుకోపెట్టడానికి, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క తల మరియు మెడకు ఆసరా ఇవ్వండి అలాగే బిడ్డ యొక్క కిందిభాగాన్ని కూడా పట్టుకోండి.
01:26 మరోవైపు, నిద్రపోతున్న శిశువును మేల్కొలపడానికి, ఈ క్రింది వాటిని చేయండి-
01:31 శిశువు యొక్క పాదాల కు చక్కిలిగింత పెట్టండి లేదా శిశువును కూర్చున్నట్టు ఉండే స్థితిలో ఎత్తి పట్టుకుని ఆసరా ఇవ్వండి లేదా శిశువు చెవిని సున్నితంగా తాకండి.
01:42 నవజాత శిశువు సున్నితమైనదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
01:46 నవజాత శిశువును సంభాళించేటప్పుడు తీసుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలు -

నవజాత శిశువు కఠినమైన ఆటలకు సిద్ధంగా లేదు.

01:55 అందువల్ల, శిశువును మోకాళ్లపై పెట్టుకుని ఆడించడం లేదా బిడ్డను గాలిలోకి విసిరి పట్టుకోవడం చేయకండి.
02:01 నవజాత శిశువును ఆడిస్తూ లేదా నిరాశతో ఎప్పుడూ కుదిపేయవద్దు.
02:05 శిశువు యొక్క మెడకు అకస్మాత్తుగా జర్క్ ఇచ్చినట్టు కదపడం లాంటివి చేయకండి.

ఇవన్నీ శిశువుకు అంతర్గత గాయాలను కలిగిస్తాయి.

02:14 మనం ఇప్పుడు ఇంట్లో బొడ్డు తాడు సంరక్షణ గురించి నేర్చుకుంటాము.
02:18 శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, బొడ్డు తాడే శిశువు యొక్క జీవనాడి.

ఏమైనప్పటికి, శిశువు జన్మించిన తర్వాత ఇది ఉండాల్సిన అవసరం లేదు.

02:30 ప్రసవం జరిగిన కొద్దీ నిముషాల్లోనే బొడ్డు నాడి కొట్టుకోవడం ఆగిన వెంటనే అది బిగుసుకు పోతుంది.
02:37 శిశువు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళే సమయానికి త్రాడు ఎండిపోయి ముడుచుకుపోతుంది.
02:45 ఒకటి నుండి రెండు వారాల్లో త్రాడు అదే ఊడి పడిపోతుంది.
02:50 బొడ్డు తాడు అనేది శిశువు శరీరంలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించే ప్రదేశంగా ఉండవచ్చని దయచేసి గమనించండి.
02:57 అందువల్ల, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
03:02 దాని కోసం, శిశువు యొక్క బొడ్డుత్రాడు పొడిగా ఉండాలి ఇంకా గాలి తగిలేలా ఉండాలి అని దయచేసి గుర్తుంచుకోండి.
03:09 త్రాడు పడిపోయే వరకు బిడ్డకు స్పాంజ్‌ స్నానం మాత్రమే చేయాలి.
03:14 త్రాడును శిశువు యొక్క నాపీకి వెలుపల ఉంచాలి లేదా నాపీ యొక్క ఎగువ అంచును కిందికి మడిచి కూడా ఉంచవచ్చు.
03:24 దయచేసి శిశువు వైద్యుడిని సంప్రదించండి ఒకవేళ అక్కడ - త్రాడు చివర నుండి లేదా త్రాడు దగ్గర ప్రాంతంలోని చర్మం నుండి కానీ రక్తస్రావం అయితే,
03:32 చీము,

నాభి చుట్టూ వాపు లేదా ఎర్రగా ఉంటే,

03:36 నాభి ప్రాంతం వద్ద శిశువుకు బాధాకరంగా ఉందని చెప్పడానికి ఇవి సంకేతాలు.
03:41 ఇంకా ఒకవేళ త్రాడు ఒక నెల వయస్సులో ఊడి పడిపోకపోతే.
03:46 కొన్నిసార్లు ఇలాకూడా జరగవచ్చు త్రాడు ఊడిపడేటప్పుడు కొద్ది మొత్తంలో అక్కడ రక్తం రావొచ్చు.

ఇంకా త్రాడు పడిపోయిన తరువాత కూడా రావొచ్చు. కానీ దీన్ని త్వరగా ఆపాలి.

04:01 గుర్తుంచుకోండి, బొద్దుత్రాడును ఎప్పుడూ లాగవద్దు.
04:04 అలాగే, అక్కడ ఏ క్రీమ్ ను పౌడర్ ను రాయడం లేదా
04:08 త్రాడు పడిపోయిన తర్వాత శిశువు యొక్క బొడ్డుపై ఏదైనా బ్యాండేజ్ కట్టడం చేయవద్దు.
04:13 నవజాత సంరక్షణ యొక్క పోషక అంశాల కొరకు మనము శిశువుకు ఆహారం ఎలా ఇవ్వాలో చర్చిస్తాము.
04:20 ప్రసవించిన 1 గంటలోపు నవజాత శిశువుకు తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి.
04:25 ప్రత్యేకంగా తల్లి పాలు మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల కొరకు సిఫార్సు చేస్తారు.
04:30 అదనంగా, తల్లి తన చర్మంతో బిడ్డ చర్మాన్ని తాకిస్తూ బిడ్డకు తగినంత చర్మ స్పర్శను అందించాలి మరియు బిడ్డ యొక్క ఆకలి సంకేతాలను గమనించాలి.
04:40 ఈ అంశాలన్నీ ఇదే సిరీస్‌లోని ఇతర ట్యుటోరియల్‌లలో చర్చించబడ్డాయి.
04:46 కొన్ని సందర్భాల్లో, నవజాత శిశువులు తరచూ మేల్కొనవలసి ఉంటుంది, కాబట్టి వారికి తగినంత ఆహారం ఇవ్వబడుతుంది,

ముఖ్యంగా చిన్నగా పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు.

04:57 ఆరోగ్యవంతమైన బిడ్డయినా లేదా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డయినా తల్లి రొమ్మును చీకడానికి ఆసక్తి కనపర్చని సందర్భంలో

తల్లి డాక్టర్ లేదా ఆరోగ్య కార్యకర్తను తప్పనిసరిగా సంప్రదించాలి.

05:09 తల్లి పాలిస్తున్నప్పుడు, పిల్లలు తరచూ గాలిని మింగేస్తారు, ఇది వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
05:15 దీనిని నివారించడానికి, ప్రతిసారి బిడ్డకు పాలిచ్చిన తర్వాత బిడ్డను కూర్చోపెట్టి త్రేన్పు వచ్చేలా (బర్పింగ్) చేయండి.
05:20 ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది.
05:25 తరువాతది డైపర్ వేయడం. ప్రతిసారి బిడ్డ మలవిసర్జన చేసిన తర్వాత లేదా గుడ్డ నాపీ తడిగా ఉన్నట్టయితే- శిశువును వీపుభాగంపై ఉంచి మురికి నాపీని తీసివేయండి.
05:37 శిశువు యొక్క జననేంద్రియ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రపరచడానికి మరియు తుడవడానికి నీరు ఇంకా మెత్తని తడిపిన వస్త్రాన్ని ఉపయోగించండి.
05:44 శిశువు యొక్క జననేంద్రియ ప్రాంతంలో సబ్బు రాయవద్దు.

ఎప్పుడైనా ఒక ఆడబిడ్డని శుభ్రంచేస్తున్నట్టయితే, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఆమెను ముందు నుండి వెనుకకు తుడవండి.

05:55 తల్లి లేదా సంరక్షకుడు నాపీని మార్చడానికి ముందు మరియు మార్చిన తరువాత ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
06:03 కొన్నిసార్లు ఇలా జరగవచ్చు,శిశువు డైపర్ దద్దుర్లుతో బాధపడవచ్చు.
06:08 డైపర్ దద్దుర్లు అనేది ఒక సాధారణ సమస్య. సాధారణంగా దద్దుర్లు ఎర్రగా మరియు ఎగుడుదిగుడుగా ఉంటాయి ఇంకా వేడినీళ్ళతో స్నానంచేయిస్తూ ఉంటే కొద్దీ రోజుల్లో పోతాయి.
06:18 కొంచం డైపర్ క్రీమ్ రాసి ఉంచాలి, మరికొన్ని సార్లు జననేంద్రియ ప్రాంతంలో డైపర్ లేదా న్యాపీ లేకుండా వదిలేయాలి.
06:25 శిశువు యొక్క చర్మం సున్నితంగా ఉంటుంది కనుక ఎక్కువగా తడి నాపీ వలన చర్మం కమిలి దద్దుర్లు వస్తాయి.
06:33 డైపర్ దద్దుర్లను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి, ముఖ్యంగా మలవిసర్జన తర్వాత శిశువు యొక్క నాపీని తరచుగా మారుస్తూఉండండి.
06:41 మృదువైన వస్త్రం మరియు నీటితో ఆ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రం చేయండి.

తుడిచి పడేసే వాటిని వాడకండి కొన్నిసార్లు అవి బిడ్డకు చికాకు కలిగించవచ్చు.

06:50 డైపర్ రాష్ లేదా బారియర్ క్రీమ్ ను ఎక్కువగా తీసుకుని దళసరి పొరలాగా రాయండి.
06:55 జింక్ ఆక్సైడ్ కలిగిన క్రీములు తేమకు వ్యతిరేకంగా అవరోధంగా ఏర్పడతాయి కనుక వాటిని సిఫార్సు చేస్తారు.
07:03 రంగు మరియు సువాసన లేని డిటర్జెంట్లను ఉపయోగించి శిశువు యొక్క నాపీలను ఉతకాలి.
07:08 శిశువును రోజులో కొంత భాగం డైపర్ లేదా న్యాపీ లేకుండా ఉండనివ్వండి.

ఇది చర్మానికి గాలి తగలడానికి అవకాశం ఇస్తుంది.

07:18 ఒకవేళ, డైపర్ దద్దుర్లు 3 రోజులకు పైగా ఉంటే లేదా ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తే, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.
07:27 ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిఉండవచ్చు అలాంటివాటికి డాక్టర్ ఇచ్చే మందులు అవసరం.
07:33 చివర్లో, మనం శిశువును నిద్రపుచ్చే విధానం గురించి చర్చిద్దాం.
07:38 పిల్లలు ఒక రోజులో 14 నుండి 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోతారు.
07:43 నవజాత శిశువులు సాధారణంగా 2-4 గంటల సేపు నిద్రపోతారు.
07:48 చాలామంది నవజాత శిశువులకు వారి పగలు మరియు రాత్రులు కలిసిపోతాయి.
07:52 వారు రాత్రి మేల్కొని, అప్రమత్తంగా ఉంటారు మరియు పగటిపూట నిద్రపోతారు.
07:58 వారు రాత్రి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడానికి వారికి సహాయపడే ఒక మార్గం రాత్రిపూట కొద్దిసేపైనా పడుకొనేలా వారిని ప్రేరేపించాలి.

ఉదాహరణకు: నైట్ లాంప్ ను ఉపయోగించి తక్కువ వెలుతురు ఉండేలా ఉంచడం మరియు పగటిపూట ఆమెతో మాట్లాడటం ఇంకా ఆడుకోవడం ద్వారా ఆమెను కొంచెం ఎక్కువసేపు మేల్కొని ఉంచడానికి ప్రయత్నించడం.

08:17 ఒక బిడ్డ నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ తన వీపుపై ఉండాలని తల్లి లేదా సంరక్షకుడు గుర్తుంచుకోవాలి.
08:24 ఇది ఆకస్మిక శిశు మరణ లక్షణాల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
08:30 ఇతర సురక్షితమైన నిద్ర పద్ధతుల కోసం, ఈ క్రింది వాటిని వారి ఉయ్యాలలో ఉపయోగించకుండా ఉండండి -

దుప్పట్లు, పల్చని పరుపులు, గొర్రె చర్మాలు, దూది నింపిన బొమ్మలు మరియు దిండ్లు.

08:44 ఇవన్నీ శిశువుకు ఉపిరిఆడకుండా చేయవచ్చు.
08:47 అలాగే, ప్రతి రాత్రి శిశువు తల యొక్క స్థానాన్ని ప్రత్యామ్నాయంగా మార్చండి - మొదట కుడి, తరువాత ఎడమ ఇంకా మిగిలినవైపులకు.
08:58 ఇది శిశువు తలపై ఒక వైపు భాగం సమంగా అవ్వకుండా ఆపుతుంది.
09:04 ఇది మనల్ని నవజాత సంరక్షణ యొక్క ప్రాథమిక అంశాలపై ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya