Health-and-Nutrition/C2/Basics-of-newborn-care/Telugu
|
|
00:00 | (అప్పుడే పుట్టిన బిడ్డ) నవజాత శిశు సంరక్షణ యొక్క ప్రాథమిక విషయాలపై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి- నవజాత శిశువును (అప్పుడే పుట్టిన బిడ్డ) ఎలా సంభాళించాలి, |
00:11 | బొడ్డు తాడు సంరక్షణ,
నవజాత శిశువుకు (అప్పుడే పుట్టిన బిడ్డ) ఆహారం ఇవ్వడం మరియు బర్పింగ్(తేన్పు వచ్చేలా చేయడం) చేయడం, |
00:15 | డైపర్ వేయడం ఇంకా డైపర్ వల్ల వచ్చేదద్దుర్లు మరియు |
00:19 | నవజాత శిశువు (అప్పుడే పుట్టిన బిడ్డ) యొక్క నిద్రపుచ్చే విధానం. |
00:23 | నవజాత శిశువు పుట్టుక తరువాత కుటుంబం మొత్తం ఉత్సాహంగా ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ శిశువును చూడాలని మరియు బిడ్డను పట్టుకోవాలని కోరుకుంటారు. |
00:34 | అందువల్ల నవజాత శిశువును సంభాలించేటప్పుడు కొన్ని కీలక నియమాలను రూపొందించడం అవసరం. |
00:40 | నవజాత శిశువులకు బలమైన రోగనిరోధక శక్తి లేదు. దీనివల్ల వారు ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. |
00:48 | శిశువును అంటువ్యాధుల నుండి రక్షించడానికి, శిశువును తాకేముందు లేదా పట్టుకునే ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. |
00:57 | చేతులను శుభ్రం చేయడానికి, సబ్బు మరియు నీటితో కడగాలి మరియు నవజాత శిశువును పట్టుకునే ముందు శుభ్రమైన పొడి వస్త్రాన్ని ఉపయోగించి చేతుల్ని బాగా ఆరేలా తుడవాలి. |
01:07 | శిశువును ఎలా పట్టుకోవాలి అనేదానిలో నేర్చుకోవలసిన మొదటి విషయానికి ఇప్పుడు వచ్చాము. |
01:11 | ఒక చేత్తో బిడ్డ తల మరియు మెడకు మరియు మరొక చేత్తో బిడ్డ కింది భాగానికి మద్దతు ఇవ్వడం ద్వారా బిడ్డను పట్టుకోండి. |
01:19 | బిడ్డను పడుకోపెట్టడానికి, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క తల మరియు మెడకు ఆసరా ఇవ్వండి అలాగే బిడ్డ యొక్క కిందిభాగాన్ని కూడా పట్టుకోండి. |
01:26 | మరోవైపు, నిద్రపోతున్న శిశువును మేల్కొలపడానికి, ఈ క్రింది వాటిని చేయండి- |
01:31 | శిశువు యొక్క పాదాల కు చక్కిలిగింత పెట్టండి లేదా శిశువును కూర్చున్నట్టు ఉండే స్థితిలో ఎత్తి పట్టుకుని ఆసరా ఇవ్వండి లేదా శిశువు చెవిని సున్నితంగా తాకండి. |
01:42 | నవజాత శిశువు సున్నితమైనదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. |
01:46 | నవజాత శిశువును సంభాళించేటప్పుడు తీసుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలు -
నవజాత శిశువు కఠినమైన ఆటలకు సిద్ధంగా లేదు. |
01:55 | అందువల్ల, శిశువును మోకాళ్లపై పెట్టుకుని ఆడించడం లేదా బిడ్డను గాలిలోకి విసిరి పట్టుకోవడం చేయకండి. |
02:01 | నవజాత శిశువును ఆడిస్తూ లేదా నిరాశతో ఎప్పుడూ కుదిపేయవద్దు. |
02:05 | శిశువు యొక్క మెడకు అకస్మాత్తుగా జర్క్ ఇచ్చినట్టు కదపడం లాంటివి చేయకండి.
ఇవన్నీ శిశువుకు అంతర్గత గాయాలను కలిగిస్తాయి. |
02:14 | మనం ఇప్పుడు ఇంట్లో బొడ్డు తాడు సంరక్షణ గురించి నేర్చుకుంటాము. |
02:18 | శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, బొడ్డు తాడే శిశువు యొక్క జీవనాడి.
ఏమైనప్పటికి, శిశువు జన్మించిన తర్వాత ఇది ఉండాల్సిన అవసరం లేదు. |
02:30 | ప్రసవం జరిగిన కొద్దీ నిముషాల్లోనే బొడ్డు నాడి కొట్టుకోవడం ఆగిన వెంటనే అది బిగుసుకు పోతుంది. |
02:37 | శిశువు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళే సమయానికి త్రాడు ఎండిపోయి ముడుచుకుపోతుంది. |
02:45 | ఒకటి నుండి రెండు వారాల్లో త్రాడు అదే ఊడి పడిపోతుంది. |
02:50 | బొడ్డు తాడు అనేది శిశువు శరీరంలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించే ప్రదేశంగా ఉండవచ్చని దయచేసి గమనించండి. |
02:57 | అందువల్ల, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. |
03:02 | దాని కోసం, శిశువు యొక్క బొడ్డుత్రాడు పొడిగా ఉండాలి ఇంకా గాలి తగిలేలా ఉండాలి అని దయచేసి గుర్తుంచుకోండి. |
03:09 | త్రాడు పడిపోయే వరకు బిడ్డకు స్పాంజ్ స్నానం మాత్రమే చేయాలి. |
03:14 | త్రాడును శిశువు యొక్క నాపీకి వెలుపల ఉంచాలి లేదా నాపీ యొక్క ఎగువ అంచును కిందికి మడిచి కూడా ఉంచవచ్చు. |
03:24 | దయచేసి శిశువు వైద్యుడిని సంప్రదించండి ఒకవేళ అక్కడ - త్రాడు చివర నుండి లేదా త్రాడు దగ్గర ప్రాంతంలోని చర్మం నుండి కానీ రక్తస్రావం అయితే, |
03:32 | చీము,
నాభి చుట్టూ వాపు లేదా ఎర్రగా ఉంటే, |
03:36 | నాభి ప్రాంతం వద్ద శిశువుకు బాధాకరంగా ఉందని చెప్పడానికి ఇవి సంకేతాలు. |
03:41 | ఇంకా ఒకవేళ త్రాడు ఒక నెల వయస్సులో ఊడి పడిపోకపోతే. |
03:46 | కొన్నిసార్లు ఇలాకూడా జరగవచ్చు త్రాడు ఊడిపడేటప్పుడు కొద్ది మొత్తంలో అక్కడ రక్తం రావొచ్చు.
ఇంకా త్రాడు పడిపోయిన తరువాత కూడా రావొచ్చు. కానీ దీన్ని త్వరగా ఆపాలి. |
04:01 | గుర్తుంచుకోండి, బొద్దుత్రాడును ఎప్పుడూ లాగవద్దు. |
04:04 | అలాగే, అక్కడ ఏ క్రీమ్ ను పౌడర్ ను రాయడం లేదా |
04:08 | త్రాడు పడిపోయిన తర్వాత శిశువు యొక్క బొడ్డుపై ఏదైనా బ్యాండేజ్ కట్టడం చేయవద్దు. |
04:13 | నవజాత సంరక్షణ యొక్క పోషక అంశాల కొరకు మనము శిశువుకు ఆహారం ఎలా ఇవ్వాలో చర్చిస్తాము. |
04:20 | ప్రసవించిన 1 గంటలోపు నవజాత శిశువుకు తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. |
04:25 | ప్రత్యేకంగా తల్లి పాలు మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల కొరకు సిఫార్సు చేస్తారు. |
04:30 | అదనంగా, తల్లి తన చర్మంతో బిడ్డ చర్మాన్ని తాకిస్తూ బిడ్డకు తగినంత చర్మ స్పర్శను అందించాలి మరియు బిడ్డ యొక్క ఆకలి సంకేతాలను గమనించాలి. |
04:40 | ఈ అంశాలన్నీ ఇదే సిరీస్‌లోని ఇతర ట్యుటోరియల్‌లలో చర్చించబడ్డాయి. |
04:46 | కొన్ని సందర్భాల్లో, నవజాత శిశువులు తరచూ మేల్కొనవలసి ఉంటుంది, కాబట్టి వారికి తగినంత ఆహారం ఇవ్వబడుతుంది,
ముఖ్యంగా చిన్నగా పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు. |
04:57 | ఆరోగ్యవంతమైన బిడ్డయినా లేదా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డయినా తల్లి రొమ్మును చీకడానికి ఆసక్తి కనపర్చని సందర్భంలో
తల్లి డాక్టర్ లేదా ఆరోగ్య కార్యకర్తను తప్పనిసరిగా సంప్రదించాలి. |
05:09 | తల్లి పాలిస్తున్నప్పుడు, పిల్లలు తరచూ గాలిని మింగేస్తారు, ఇది వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. |
05:15 | దీనిని నివారించడానికి, ప్రతిసారి బిడ్డకు పాలిచ్చిన తర్వాత బిడ్డను కూర్చోపెట్టి త్రేన్పు వచ్చేలా (బర్పింగ్) చేయండి. |
05:20 | ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది. |
05:25 | తరువాతది డైపర్ వేయడం. ప్రతిసారి బిడ్డ మలవిసర్జన చేసిన తర్వాత లేదా గుడ్డ నాపీ తడిగా ఉన్నట్టయితే- శిశువును వీపుభాగంపై ఉంచి మురికి నాపీని తీసివేయండి. |
05:37 | శిశువు యొక్క జననేంద్రియ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రపరచడానికి మరియు తుడవడానికి నీరు ఇంకా మెత్తని తడిపిన వస్త్రాన్ని ఉపయోగించండి. |
05:44 | శిశువు యొక్క జననేంద్రియ ప్రాంతంలో సబ్బు రాయవద్దు.
ఎప్పుడైనా ఒక ఆడబిడ్డని శుభ్రంచేస్తున్నట్టయితే, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఆమెను ముందు నుండి వెనుకకు తుడవండి. |
05:55 | తల్లి లేదా సంరక్షకుడు నాపీని మార్చడానికి ముందు మరియు మార్చిన తరువాత ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. |
06:03 | కొన్నిసార్లు ఇలా జరగవచ్చు,శిశువు డైపర్ దద్దుర్లుతో బాధపడవచ్చు. |
06:08 | డైపర్ దద్దుర్లు అనేది ఒక సాధారణ సమస్య. సాధారణంగా దద్దుర్లు ఎర్రగా మరియు ఎగుడుదిగుడుగా ఉంటాయి ఇంకా వేడినీళ్ళతో స్నానంచేయిస్తూ ఉంటే కొద్దీ రోజుల్లో పోతాయి. |
06:18 | కొంచం డైపర్ క్రీమ్ రాసి ఉంచాలి, మరికొన్ని సార్లు జననేంద్రియ ప్రాంతంలో డైపర్ లేదా న్యాపీ లేకుండా వదిలేయాలి. |
06:25 | శిశువు యొక్క చర్మం సున్నితంగా ఉంటుంది కనుక ఎక్కువగా తడి నాపీ వలన చర్మం కమిలి దద్దుర్లు వస్తాయి. |
06:33 | డైపర్ దద్దుర్లను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి, ముఖ్యంగా మలవిసర్జన తర్వాత శిశువు యొక్క నాపీని తరచుగా మారుస్తూఉండండి. |
06:41 | మృదువైన వస్త్రం మరియు నీటితో ఆ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రం చేయండి.
తుడిచి పడేసే వాటిని వాడకండి కొన్నిసార్లు అవి బిడ్డకు చికాకు కలిగించవచ్చు. |
06:50 | డైపర్ రాష్ లేదా బారియర్ క్రీమ్ ను ఎక్కువగా తీసుకుని దళసరి పొరలాగా రాయండి. |
06:55 | జింక్ ఆక్సైడ్ కలిగిన క్రీములు తేమకు వ్యతిరేకంగా అవరోధంగా ఏర్పడతాయి కనుక వాటిని సిఫార్సు చేస్తారు. |
07:03 | రంగు మరియు సువాసన లేని డిటర్జెంట్లను ఉపయోగించి శిశువు యొక్క నాపీలను ఉతకాలి. |
07:08 | శిశువును రోజులో కొంత భాగం డైపర్ లేదా న్యాపీ లేకుండా ఉండనివ్వండి.
ఇది చర్మానికి గాలి తగలడానికి అవకాశం ఇస్తుంది. |
07:18 | ఒకవేళ, డైపర్ దద్దుర్లు 3 రోజులకు పైగా ఉంటే లేదా ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తే, దయచేసి వైద్యుడిని సంప్రదించండి. |
07:27 | ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిఉండవచ్చు అలాంటివాటికి డాక్టర్ ఇచ్చే మందులు అవసరం. |
07:33 | చివర్లో, మనం శిశువును నిద్రపుచ్చే విధానం గురించి చర్చిద్దాం. |
07:38 | పిల్లలు ఒక రోజులో 14 నుండి 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోతారు. |
07:43 | నవజాత శిశువులు సాధారణంగా 2-4 గంటల సేపు నిద్రపోతారు. |
07:48 | చాలామంది నవజాత శిశువులకు వారి పగలు మరియు రాత్రులు కలిసిపోతాయి. |
07:52 | వారు రాత్రి మేల్కొని, అప్రమత్తంగా ఉంటారు మరియు పగటిపూట నిద్రపోతారు. |
07:58 | వారు రాత్రి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడానికి వారికి సహాయపడే ఒక మార్గం రాత్రిపూట కొద్దిసేపైనా పడుకొనేలా వారిని ప్రేరేపించాలి.
ఉదాహరణకు: నైట్ లాంప్ ను ఉపయోగించి తక్కువ వెలుతురు ఉండేలా ఉంచడం మరియు పగటిపూట ఆమెతో మాట్లాడటం ఇంకా ఆడుకోవడం ద్వారా ఆమెను కొంచెం ఎక్కువసేపు మేల్కొని ఉంచడానికి ప్రయత్నించడం. |
08:17 | ఒక బిడ్డ నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ తన వీపుపై ఉండాలని తల్లి లేదా సంరక్షకుడు గుర్తుంచుకోవాలి. |
08:24 | ఇది ఆకస్మిక శిశు మరణ లక్షణాల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. |
08:30 | ఇతర సురక్షితమైన నిద్ర పద్ధతుల కోసం, ఈ క్రింది వాటిని వారి ఉయ్యాలలో ఉపయోగించకుండా ఉండండి -
దుప్పట్లు, పల్చని పరుపులు, గొర్రె చర్మాలు, దూది నింపిన బొమ్మలు మరియు దిండ్లు. |
08:44 | ఇవన్నీ శిశువుకు ఉపిరిఆడకుండా చేయవచ్చు. |
08:47 | అలాగే, ప్రతి రాత్రి శిశువు తల యొక్క స్థానాన్ని ప్రత్యామ్నాయంగా మార్చండి - మొదట కుడి, తరువాత ఎడమ ఇంకా మిగిలినవైపులకు. |
08:58 | ఇది శిశువు తలపై ఒక వైపు భాగం సమంగా అవ్వకుండా ఆపుతుంది. |
09:04 | ఇది మనల్ని నవజాత సంరక్షణ యొక్క ప్రాథమిక అంశాలపై ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |