Linux-AWK/C2/Built-in-Functions-in-awk/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | awk లోని built-in functions పై స్పొకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం వివిధరకాల built-in functions అనగా Arithmetic functions, |
00:15 | స్ట్రింగ్ ఫంక్శన్స్, |
00:17 | ఇన్పుట్ ఔట్ పుట్ ఫంక్శన్స్ మరియు Time-stamp functions ల గురించి నేర్చుకుంటాం. |
00:23 | మనం దీనిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. |
00:26 | ఈ ట్యుటోరియల్ ని రెకార్డ్ చేయడానికి నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను. |
00:38 | మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:42 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి. |
00:49 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
00:56 | లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
01:02 | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి సంగ్రహించండి. |
01:12 | Built-in functions ఎల్లప్పుడూ awk కొరకు కాల్ చేయడానికి అందుబాటులో ఉంటాయి. |
01:17 | ముందుగా మనం arithmetic functions గురించి తెలుసుకుందాం. square root function (sqrt (x)), ఒక సంఖ్య x యొక్క ధన వర్గమూలాన్ని తిరిగి ఇస్తుంది. |
01:27 | int ఫంక్షన్ x ను పూర్ణాంక విలువకు కుదిస్తుంది. |
01:32 | exponential function x యొక్క ఎక్స్పోనెంశియల్ ను ఇస్తుంది. |
01:37 | log function, x యొక్క సహజ logarithm విలువను ఇస్తుంది. |
01:43 | sin మరియు cos వరుసగా sine(x) మరియు cosine(x) విలువలను ఇస్తుంది. |
01:49 | argument x ను తప్పనిసరిగా radians లోనే పేర్కొనాలని గుర్తుంచుకోండి. |
01:55 | ఇప్పుడు ఒక ఉదాహరణతో ఈ functions గురించి తెలుసుకుందాం. |
02:00 | నేను ఇంతకముందే ఒక కోడ్ ని arithmetic underscore function dot awk ఫైల్ లో రాసి ఉంచాను. అదే కోడ్ Code Files లింక్ లో అందుబాటులో ఉంది. |
02:10 | ఇక్కడ మనం వరసగా ఒక ధన మరియు రుణ సంఖ్య యొక్క వర్గమూలాన్ని ముద్రిస్తున్నాం. |
02:17 | తర్వాత మనం వరసగా ఒక ధన మరియు రుణ సంఖ్యల యొక్క పూర్ణాంక విలువను ముద్రిస్తాం. |
02:24 | తర్వాత మనం ఒక చిన్న మరియు ఒక అతి పెద్ద నంబర్ల యొక్క ఎక్స్పొనెంశియల్ లను ముద్రిస్తాం. |
02:31 | ఆ తర్వాత, ధన మరియు రుణ సంఖ్యల యొక్క సహజ logarithm విలువను ముద్రిద్దాం. |
02:38 | మనము 0.52 రేడియన్ ఏదైతే 30 డిగ్రీ అవుతుందో, దాని sine మరియు cosine విలువలను ని కూడా ముద్రిద్దాం. ఫైల్ను టెర్మినల్ పై ఎగ్జిక్యూట్ చేద్దాం. |
02:50 | Ctrl, Alt మరియు T కీలను నొక్కి టర్మినల్ ను తెరవండి. |
02:55 | తర్వాత మీరు cd కమాండ్ ను ఉపయోగించి ఫైల్ ను డౌన్ లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ కు వెళ్ళండి. |
03:03 | ఇప్పుడు awk space -f space arithmetic_function.awk అని టైప్ చేసి ఔట్ పుట్ను చూడడానికి ఎంటర్ నొక్కండి. |
03:14 | ఈ అవుట్పుట్ నుండి కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. |
03:18 | sqrt() function ఒక ధన సంఖ్య యొక్క వర్గమూలాన్ని ఇస్తుంది. |
03:23 | ఒకవేళ అది రుణ సంఖ్య అయితే అది nan లేదా not a number తిరిగి ఇస్తుంది. |
03:29 | int(), ఏదైనా ధన లేక రుణ సంఖ్యయొక్క ట్రంకేటెడ్ పూర్ణసంఖ్య ని ఇస్తుంది. |
03:36 | exp() ఫంక్షన్ అనేది ఒక సంఖ్యయొక్క ఎక్స్పొనెంశియల్ ను ఇస్తుంది. సంఖ్య గనక చాలా పెద్దది అయితే, ఆ ఫంక్షన్ inf ను తిరిగి ఇస్తుంది. |
03:47 | ఒక ధనసంఖ్యయొక్క సహజ logarithm అనేది log() function ద్వారా ఇవ్వబడుతుంది. |
03:53 | ఒకవేళ ఆ సంఖ్య రుణ సంఖ్య ఐతే ఆ function తిరిగి nan అని ఇస్తుంది. |
03:58 | Sine మరియు cosine functions సంబంధిత విలువలని ఇస్తాయి. మీరు వాటి విలువలను క్యాలిక్యులేటర్ తో సరిచూసుకోవచ్చు. |
04:07 | ఇప్పుడు కొన్ని random functions గురించి తెలుసుకుందాం. |
04:11 | rand() functions అనేది 0 నుండి 1 వరకు ఏదైనా యాద్రుచ్చిక సంఖ్య ను తిరిగి ఇస్తాయి. కానీ ఎప్పుడూ 0 లేదా 1 ని తిరిగి ఇవ్వవు. |
04:21 | ఉత్పత్తి అయిన సంఖ్యలు ఒక awk అమలులోయాద్రుచ్చికంగా ఉంటాయి. |
04:27 | కానీ awk ప్రోగ్రాం యొక్క వేర్వేరు అమలులో ఉహించదగినది. |
04:33 | srand(x) function అనేది ఒక random function కొరకు seed value x ని అందిస్తుంది. |
04:39 | x లేనప్పుడు, రోజు యొక్క తేదీ మరియు సమయం అనేది seed value గా ఉపయోగించబడుతుంది.
వీటిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. |
04:49 | నేను ఒక random function కొరకు కోడ్ ను రాసి దానిని random.awk గా సేవ్ చేసాను. |
04:56 | ఇక్కడ, for loop లోపల, rand() function అనేది 0 మరియు 1 మధ్య ఒక యాద్రుచిక్కసంఖ్య (random number) ను ఉత్పత్తి చేస్తుంది. |
05:04 | తర్వాత ఉత్పత్తి అయిన సంఖ్య 50 తో గుణించబడి ముద్రించబడుతుంది. |
05:10 | అందువల్ల ఈ కోడ్ 50 లోపల గల 5యాద్రుచ్చిక సంఖ్యలను ఉత్పత్తి చేస్తుంది. |
05:16 | టర్మినల్ కు మారి ఫైల్ ను అమలుచేయండి. నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను. |
05:23 | awk space hyphen f space random dot awk అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
05:31 | చూడండి, ఇది 5 యాద్రుచ్చిక సంఖ్యలను ఇస్తుంది. |
05:35 | ఒకవేళ నేను కోడ్ ని మళ్ళీ అమలుచేస్తే ఏమవుతుందో? |
05:39 | ముందుగా అమలు పరచిన కమాండ్ కొరకు అప్ యారో కీ ని నొక్కి ఎంటర్ నొక్కండి. |
05:47 | మనకు అదే ఔట్పుట్ వస్తుంది. దీని అర్థం awk ఒకే రకమైన ర్యాండం నంబర్స్ ని ప్రతి ఒక్క ఎక్సిక్యుశన్ లో ఉత్పత్తి చేస్తుంది. |
05:57 | మరి మనకు ప్రతి ఎక్సిక్యుశన్ లో ర్యాండమ్ నుంబర్ల యొక్క కొత్త నంబర్ల సెట్ ఎలా వస్తుంది. కోడ్ కి మళ్ళీ మారండి. |
06:06 | for loop, కన్న ముందు srand() function ని టైపు చేయండి. |
06:11 | Crtl మరియు S కీలను నొక్కి ఫైల్ ని సేవ్ చేయండి. |
06:16 | టర్మినల్ కు మారండి. |
06:19 | ముందుగా అమలు పరచిన కమాండ్ కొరకు అప్ యారో కీ ని నొక్కి ఎంటర్ నొక్కండి. |
06:27 | అది ర్యాండమ్ నుంబర్ల యొక్క వివిధ జతలను ఇస్తుంది. |
06:31 | మనం ఒక కొత్త నంబర్ల సెట్ ను srand function, ను argument లేకుండా ఉపయోగించి ఉత్పత్తి చేయవచ్చు. |
06:40 | తరువాత మనం కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్ల గురించి తెలుసుకుందాం. length ఫంక్షన్ ఒక నిర్దిష్ట స్ట్రింగ్ s యొక్క పొడవును ఇస్తుంది. |
06:49 | index function, ఒక పెద్ద string s1 లో string s2 యొక్క స్థానాన్ని గుర్తిస్తుంది. |
06:57 | ఉదాహరణకి index parenthesesల లోపల double quotes లోపల linux comma double quotes లోపల n, ఇది 3 ని తిరిగి ఇస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణని చూద్దాం. |
07:10 | awkdemo.txt అనే ఫైల్ ని తెరవండి. |
07:14 | awkdemo.txt ఫైల్ లో ని ప్రతి స్టూడెంట్ 4 అంకెల రోల్ నంబర్ ని (క్రమసంఖ్య) కలిగి ఉన్నారని మనకు తెలుసు. |
07:21 | టైపింగ్ దోషాల వల్ల రోల్ నంబర్స్ అంకెల యొక్క తప్పుడు సంఖ్యలను కలిగి ఉండవచ్చు. మనం awk commands సాయంతో వాటిని సులువుగా కనుకోగలం. |
07:30 | టర్మినల్ కు మారండి. ముందుగా నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను. |
07:36 | ఇప్పుడు కమాండ్ ని ఇక్కడ చూపినవిధంగా టైప్ చేస్తాను. ఇక్కడ మనం మొదటి ఫీల్డ్ యొక్క పొడవు 4 కి సమానామా కాదా అని పరిశీలిస్తాం. |
07:46 | లేకపొతే, ఆ నిర్దిష్ట రికార్డ్ ముద్రించబడుతుంది. ఎంటర్ నొక్కండి. |
07:53 | ఇక్కడ ఒక రోల్ నంబర్ S02 అనేది తప్పుగా టైప్ చేయబడిందని గమనించండి. |
08:00 | అది మూడు అంకెలను కలిగిఉంది. మిగతావన్నీ నాలుగు అంకెలు కలిగి ఉన్నాయి. |
08:07 | substr (s, a, b) ఫంక్షన్ ఒక పెద్ద స్ట్రింగ్ s నుండి సబ్స్ట్రింగ్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. |
08:14 | నేను ఆ పారామీటర్లను వివరిస్తాను. |
08:17 | ఇక్కడ s అనేది ఒక string. |
08:20 | a అనేది ప్రారంభమయ్యే ఎక్సట్రాక్షన్ నుండి s లో దాని స్థానాన్ని సూచిస్తుంది. |
08:26 | b అనేది ఎన్ని క్యారెక్టర్లను సంగ్రహించాలో వాటి సంఖ్యను సూచిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. |
08:33 | awkdemo.txt ఫైల్ కు మారండి. |
08:37 | రోల్ నంబర్స్ యొక్క మొదటి అక్శరం ఆ నిర్దిష్ట విద్యార్ధి నివసించే Hostel code ను సూచిస్తుంది. |
08:46 | ఒకవేళ మనం హాస్టల్ A లో నివసించే స్టూడెంట్ ల జాబితాను తెలుసుకోవాలనుకుంటే, |
08:52 | అది తెలుసుకోవడానికి టర్మినల్ కు మారండి. |
08:56 | కమాండ్ ని ఇక్కడ చూపినవిధంగా టైప్ చేయండి. |
09:00 | ఇక్కడ మనం $1 చే సూచించబడిన string ను తీసుకుంటాము. |
09:05 | $1 అనేది మొదటి ఫీల్డ్ కి ప్రాతినిధ్యం వహిస్తుంది. అది మన సంధర్భం లో రోల్ నంబర్. |
09:12 | తరువాత, మనం అక్షరం పొడవు వన్ తో స్థానం వన్ వద్ద మొదలయ్యే సబ్స్ట్రింగ్ ను సంగ్రహిస్తాము. |
09:19 | ఒక వేళా అది కాపిటల్ A కు సమానం ఐతే, ఆ ఫైల్ నుండి ఆ లైన్ ముద్రించబడుతుంది. అవుట్ ఫుట్ చూడడానికి ఎంటర్ నొక్కండి. |
09:29 | మనకు హాస్టల్ A లో ఉండే స్టూడెంట్ ల జాబితా వచ్చింది. |
09:34 | మనం ఇంతకుముందే function split ని చూసాం. అందువల్ల నేను దాని గురించి వివరించను. |
09:40 | మీకు ఏవైనా సందేహాలుంటే మునుపటి awk ట్యుటోరియల్స్ ని చూడండి. |
09:45 | ఇక్కడ మరికొన్ని Input/Output కి సంభందించిన functions ఉన్నాయి. system() function- awk లోపల ఏదైనా unix కమాండ్ ని అమలు చేయడానికి సహాయపడుతుంది. |
09:56 | ఇక్కడ, మనం unix command date ని awk command ద్వారా రన్ చేద్దాం. |
10:01 | టర్మినల్ లో ఇక్కడ చూపినట్టుగా ఈ కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:09 | ఈ రోజు యొక్క తేది మరియు సమయం టర్మినల్ పై ఔట్ పుట్ గా చూపించబడుతాయి. |
10:15 | ఇది మనకు ఎందుకు అవసరం? మనం కేవలం awk command లోని BEGIN విభాగాన్ని మాత్రమే ఉంచాము. |
10:21 | కానీ మనం వాస్తవ ప్రపంచ దృశ్యాలలో, అవసరమైన అవుట్పుట్ను ప్రదర్శించే ముందు సిస్టమ్ డేట్ ని ప్రింట్ చేయాలనుకోవచ్చు. |
10:28 | ఆ సంధర్భం లో మనం awk command లో నుండి system commands ని అమలుచేయాల్సిన అవసరం ఉంటుంది. |
10:34 | ఇక్కడ time stamps తో వ్యవహరించే కొన్ని functions లు systime(), strftime(), లాంటివి ఉన్నాయి. |
10:43 | ఇంటర్ నెట్ ద్వారా బ్రౌజ్ చేసి ఈ functions గురించి తెలుసుకొండి. |
10:48 | ఇంతటి తో ఈ ట్యుటొరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం. |
10:53 | ఈ ట్యుటొరియల్ లో మనం వివిధ రకాల built-in functions, అనగా Arithmetic functions, String functions, Input/Output functions మరియు Time stamps functions గురించి తెలుసుకున్నాం. |
11:06 | ఒక అస్సైన్మెంట్ గా – awkdemo.txt ఫైల్ ను ఉపయోగించి, ప్రతి రెకార్డ్ యొక్క చివరి ఫీల్డ్ ను ముద్రించేలా మరియు |
11:13 | స్టూడెంట్ పేరు లో మూడవ అక్షరం గా small u ను కలిగి ఉండేలా ఒక awk ప్ప్రొగ్రామ్ను రాయండి. |
11:22 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
11:30 | స్పొకన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:43 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
11:47 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
11:59 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |