Koha-Library-Management-System/C2/Add-Budget-and-Allocate-Funds/Telugu
|
|
00:01 | Add a Budget and allocate Funds అనే స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా,
ఒక బడ్జెట్ని జోడించుట, ఒక నకిలీ బడ్జెటను ఎలా తయారు చేయుట మరియు ఫండ్స్ ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము. |
00: 19 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:33 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:39 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:45 | మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:49 | మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
00:56 | మనము ఒక బడ్జెట్ని ఎలా జోడించాలో నేర్చుకుందాం. |
01: 01 | ముందుగా, బడ్జెట్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
బడ్జెట్స్, Acquisitionsకి సంబంధించిన అకౌంటింగ్ విలువలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతాయి. |
01:13 | ఒక ఫండ్ని సృష్టించబడటానికి ముందే ఒక బడ్జెట్ని నిర్వచించాలి. |
01:18 | ఉదాహరణకు - ప్రస్తుత సంవత్సరం 2017 కోసం బడ్జెట్ను సృష్టించండి. |
01: 25 | దానిని బుక్స్, జర్నల్స్ మరియు / లేదా డేటాబేస్లు వంటి వివిధ అంశాల కొరకు ఫండ్స్ గా విడదీయండి. |
01: 38 | దయచేసి గమనించండి, బడ్జెట్లు మొదటి నుండి సృష్టించబడవచ్చు,
లేదా మునుపటి సంవత్సరాలలో తయారు చేసిన బడ్జెట్ ను డూప్లికేట్(duplicate) చేయవచ్చు. |
01:50 | లేదా, అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని డూప్లికేట్(duplicate) చేయడం ద్వారా
లేదా అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని మూసివేయడం ద్వారా. |
02:00 | ఇంతకూ ముందు ట్యుటోరియల్లో చెప్పినట్లుగా, సూపర్ లైబ్రేరియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
02:10 | కోహహోమ్ పేజీ పై Acquisitionsక్లిక్ చేయండి. |
02: 16 | ఎడమవైపు ఉన్న ఎంపికల నుండి,Budgets పై క్లిక్ చేయండి. |
02: 21 | ఇప్పుడు, New budget టాబ్ పై క్లిక్ చేయండి. |
02: 26 | మొదట, ఈ బడ్జెట్ కోసం సమయ వ్యవధిని ఎంచుకోవాలి. |
02:31 | బడ్జెట్ ఒక అకాడెమిక్ సంవత్సరం, ఫిస్కల్ సంవత్సరం లేదా మూడు నెలల కోసం సృష్టించబడవచ్చు. |
02:39 | నేను ఒక ఫిస్కల్ ఏడాదికి కోసం బడ్జెట్ ను సృష్టిస్తాను. |
02: 43 | ఆపై Start మరియు End dateలను ఎంచుకోండి. |
02:48 | నేను,
Start date :04 / 01/2016 (MM / DD / YYYY) గా End date :03 / 31/2017 (MM / DD / YYYY) గా ఎన్నుకుంటాను. |
03: 07 | తరువాత మనం బడ్జెట్ కోసం description ఇవ్వాలి. |
03:11 | ఇది మనకు తరువాత ఆర్డర్ చేసే సమయంలో, గుర్తించడానికి సహాయపడుతుంది. |
03: 17 | ఇక్కడ, నేను Spoken Tutorial Library 2016-2017 Phase I అని టైప్ చేస్తాను. |
03: 26 | Amount బాక్స్ లో, ఈ ప్రత్యేకమైన బడ్జెట్ కోసం మొత్తాన్ని ప్రవేశ పెట్టాలి. |
03:32 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ కోసం ఇవ్వబడిన సమయ వ్యవధిని లో, ఖర్చు చేయబోతున్న మొత్తం డబ్బు . |
03:41 | ఈ ఫీల్డ్ సంఖ్యలు మరియు దశాంశాలను మాత్రమే అంగీకరిస్తుంది. |
03: 47 | ప్రత్యేక క్యారెక్టర్ లు మరియు చిహ్నాలను అనుమతించదు. |
03: 51 | మనము ప్రవేశ పెట్టిన Amount, ఆ లైబ్రరీకి ఆమోదించబడిన బడ్జెట్ ప్రకారం ఉండాలి. |
03:57 | ఇక్కడ, నేన Amount కోసం రూ. 5,00,000 / - ప్రవేశ పెడతాను. |
04: 03 | తరువాత, Make a budget active పై క్లిక్ చేయండి. |
04:08 | ఇలా చేయడం ద్వారా, Acquisitions మాడ్యూల్ లో ఆర్డర్లను ఇచ్చినపుడు ఈ బడ్జెట్ ఉపయోగంలో కి వస్తుంది. |
04:17 | Budget End date తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఇది అలాగే ఉంటుంది. |
04:24 | ఇది మునుపటి సంవత్సరంలోని బడ్జెట్లో ఇచ్చిన ఆర్డర్లను రికార్డ్ చేయడాన్ని కూడా అనుమతిస్తుంది. |
04: 31 | తరువాతది Lock budget కోసం చెక్ బాక్స్, |
04:35 | అంటే లైబ్రరీ స్టాఫ్ చే ఫండ్స్ తరువాత సవరించబడవని అర్థం. |
04:41 | నేను ఈ చెక్ బాక్స్ని ఖాళీగా వదిలివేస్తాను. |
04: 45 | అన్ని ఎంట్రీలు పూర్తి చేసిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలోని సేవ్ బటన్పై క్లిక్ చేయండి. |
04: 52 | ఒక కొత్త పేజీ Budgets administration తెరుచుకుంటుంది. |
04: 57 | ఇక్కడ, +New Budget పేజీలో ఇంతకు ముందు జోడించిన వివరాలను చూడవచ్చు. |
05:04 | ఈ పేజీలో కనిపించే వివరాలు - |
05:08 | Budget name టాబ్ కింద వివరణ,
Start date:, End date:, Total amount:, Actions:. |
05: 19 | మన అవసరాన్ని బట్టి బడ్జెట్ ని సవరించవచ్చు, తొలగించండి లేదా డూప్లికేట్ చెయ్యవచ్చు. |
05: 25 | ఇది చేయుటకు, ఆ Budget nameయొక్క కుడి వైపు ఉన్న Actions పై క్లిక్ చేయండి. |
05:33 | డ్రాప్-డౌన్ లో నుండి, ఏ ఎంపిక నైనా ఎంచుకోండి:
Edit, Delete, Duplicate, Close లేదా Add fund. |
05:44 | మనము ఒక ఫిస్కల్ ఏడాదికి కోసం నిధులు ఎలా కేటాయించాలో నేర్చుకుందాం. |
05: 49 | అదే టేబుల్లో, ఫండ్ కేటాయించాల్సిన నిర్దిష్ట బడ్జెట్ నేమ్ పై క్లిక్ చేయండి. |
05: 56 | Spoken Tutorial Library 2016-2017 Phase 1 పై క్లిక్ చేస్తాను. |
06: 05 | ఒక కొత్త పేజీ Funds for Spoken Tutorial Library 2016-2017 Phase 1 తెరుచుకుంటుంది. |
06:14 | Funds for 'Spoken Tutorial Library 2016-2017 Phase 1 పైన Newట్యాబ పై క్లిక్ చేయండి. |
06:26 | డ్రాప్-డౌన్ నుండి, New fund for Spoken Tutorial Library 2016-2017 Phase 1 ఎంచుకోండి. |
06:36 | తెరుచుకున్న కొత్త పేజీలో, ఈ క్రింది వివరాలను పూరించండి:
ఫండ్ కోడ్: బుక్స్ ఫండ్ నేమ్ : బుక్స్ ఫండ్. |
06:47 | Amount ని 25000గా
Warning at (%): 10 |
06:55 | Warning at (amount): కోసం నేను ఇప్పటికే Warning at (%) లో నింపాను, నేను ఈఫీల్డ్ను దాటవేస్తాను. |
07:02 | Owner మరియు 'Users' ఫీల్డ్ లను కూడా దాటవేస్తాను. |
07:08 | లైబ్రరీ కోసం డ్రాప్-డౌన్ నుండి స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ని ఎంచుకోండి. |
07:14 | నేను Restrict access toఆలాగే వదిలి వేస్తాను. |
07:19 | నేను Statistic 1 done on మరియు Statistic 2 done on ని ఖాళీగా వదిలేస్తాను. |
07:27 | అన్ని వివరాలను నింపిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Submit బటన్ పై క్లిక్ చేయండి. |
07:34 | ఆ ప్రత్యేక లైబ్రరీకి సంబంధించిన అన్నిఫండ్ కేటాయింపు వివరాలు, ఇప్పుడు ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తాయి. |
07: 42 | ఎడమవైపు ఉన్న ఎంపికల నుండి, Budgets పై క్లిక్ చేయండి. |
07: 47 | ఒక బడ్జెట్ను ఎలా డూప్లికేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. |
07: 51 | కానీ ముందుగా, బడ్జెట్ను ఎందుకు డూప్లికేట్ చేయాలో అనేది మొదట తెలుసుకోవాలి. |
07:57 | బడ్జెట్ మొత్తం మరియు ఫండ్స్ యొక్క మొత్తం తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా సమానంగా ఉంటే
ఆ సందర్భంలో, మనము మేము బడ్జెట్ను డూప్లికేట్ చేయవచ్చు. |
08:08 | ఇది లైబ్రరీ స్టాఫ్ కు చాలా సమయం మరియు కృషిని తగ్గించడానికి సహాయపడుతాయి. |
08:14 | ఆలా చేయుటకు, Budget name యొక్క కుడి వైపు ఉన్న Actions ట్యాబ పై క్లిక్ చేయండి. |
08:22 | డ్రాప్-డౌన్ నుండి, Duplicate ఎంచుకోండి. |
08: 26 | ఒక క్రొత్త పేజీ'Duplicate Budget తెరుచుకుంటుంది. |
08:30 | Start date మరియు End date ని ప్రవేశ పెట్టండి. తరువాతి సంవత్సరం బడ్జెట్ కోసం నేను తేదీలు ప్రవేశ పెడతాను . |
08:39 | Start date:04 / 01/2017 (MM / DD / YYYY) గా
End date:03 / 31/2018 (MM / DD / YYYY)గా |
08: 53 | తరువాతది Description. |
08:56 | Description వివరాలు, తరువాత ఆ ప్రత్యేకమైన బడ్జెట్ ని సులభంగా గుర్తించ బడేలా ఉండాలి .
కోహ అప్రమేయంగా, ముందుగా నమోదు చేసిన వివరణ చూపిస్తుంది. |
09:10 | కానీ, నేను దానిని Spoken Tutorial Library 2017-2018, Phase IIగా మార్చుతాను
మీరు మీ గ్రంథాలయానికి సంబంధించినది ఏదైనా ఎంటర్ చేయవచ్చు. |
09: 24 | Change amounts by ఫీల్డ్ లో
గత సంవత్సర బడ్జెట్ నుండి తొలగించ వలసిన శాతాన్ని నమోదు చేయండి లేదా, అదే మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లండి. |
09:38 | స్పోకన్ ట్యుటోరియల్ Libraryకి రూ .5,00,000 / - ఆమోదించబడింది అని గుర్తుంచుకోండి. |
09:45 | అందువల్ల, నేను 1,00,000/-' మొత్తాన్ని తీసివేయుటకు -20% (మైనస్ 20 పర్ సెంట్ ) ప్రవేశ పెడతాను |
09: 54 | తరువాతి ఫీల్డ్ If amounts changed, round to a multiple of, నేను ఆ ఫీల్డ్నుఖాళీగా వదిలేస్తాను.
|
10: 03 | ఆపై Mark the original Budget as inactive చెక్ బాక్స్ ఉంది. |
10:10 | ఆలా చేయడం తో , అసలైన బడ్జెట్ ఇకపై ఉపయోగించబడదు. మళ్ళీ, నేను ఈ బాక్స్ ఖాళీగా వదిలివేస్తాను. |
10: 19 | చివరగా, Set all funds to zero చెక్ బాక్స్ ఉంది. |
10:25 | మీకు కొత్త బడ్జెట్, మునుపటి బడ్జెట్ ఫండ్ నిర్మాణాల తో కలిగి ఉండాలని అనుకుంటే ఈ బాక్స్ ను ఎంచుకోండి. |
10:32 | దయచేసి గమనించండి- మీరు ఫండ్ లో మాన్యువల్ గా మొత్తాన్ని ఎంటరు చేసే వరకు ఏ రకమైన కేటాయింపులు అనుమతించబడవు.
నేను ఇప్పటికి దీనిని ఖాళీగా వదిలివేస్తాను. |
10: 44 | అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Save changes పై క్లిక్ చేయండి. |
10: 52 | డూప్లికేట్ బడ్జెట్ స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ 2017-2018 Phase II కోసం నమోదు చేయబడిన వివరాలు Budgets administration పేజీలో కనిపిస్తుంది. |
11: 04 | మీరు ఇప్పుడు కోహా సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వవచ్చు |
11: 09 | మొదట, కుడి ఎగువ మూలలో ఉన్న స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేయండి.
ఆపై డ్రాప్-డౌన్ నుండి,లాగ్ అవుట్ ఎంచుకోండి. |
11: 21 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో మనము, బడ్జెట్ ని జోడించుట డూప్లికేట్ బడ్జెట్ తయారు చేయుట మరియు ఫండ్స్ కేటాయించుట నేర్చుకున్నాము. |
11:34 | బడ్జెట్ కోసం అసైన్మెంట్
ఆర్ధిక సంవత్సరం కోసం ఒక బడ్జెట్ ని జోడించి, దానికి Rs.50 లక్షలు కేటాయించండి.
|
11:44 | ఫండ్స్ కేటాయింపు కోసం అసైన్మెంట్,
నాన్-ప్రింట్ మెటీరియల్ కోసం 20 లక్షల రూపాయల ఫండ్స్ కేటాయించండి. |
11:53 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:01 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
12:09 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
12:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:25 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |