Koha-Library-Management-System/C2/Add-Budget-and-Allocate-Funds/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Add a Budget and allocate Funds అనే స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా,

ఒక బడ్జెట్ని జోడించాలి , ఒక నకిలీ బడ్జెటను ఎలా తయారు చేయాలి మరియు ఫండ్స్ ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.

00:19 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:33 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:39 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:45 మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:49 మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:56 మనము ఒక బడ్జెట్ని ఎలా జోడించాలో నేర్చుకుందాం.
01:01 ముందుగా, బడ్జెట్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.

బడ్జెట్స్, Acquisitionsకి సంబంధించిన అకౌంటింగ్ విలువలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతాయి.

01:13 ఒక ఫండ్ని సృష్టించబడటానికి ముందే ఒక బడ్జెట్ని నిర్వచించాలి.
01:18 ఉదాహరణకు - ప్రస్తుత సంవత్సరం 2017 కోసం బడ్జెట్ను సృష్టించండి.
01:25 దానిని బుక్స్, జర్నల్స్ మరియు / లేదా డేటాబేస్లు వంటి వివిధ అంశాల కొరకు ఫండ్స్ గా విడదీయండి.
01:38 దయచేసి గమనించండి, బడ్జెట్లు మొదటి నుండి సృష్టించబడవచ్చు,

లేదా మునుపటి సంవత్సరాలలో తయారు చేసిన బడ్జెట్ ను డూప్లికేట్(duplicate) చేయవచ్చు.

01:50 లేదా, అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని డూప్లికేట్(duplicate) చేయడం ద్వారా

లేదా అంతకుముందు సంవత్సరం యొక్క బడ్జెట్ని మూసివేయడం ద్వారా.

02:00 ఇంతకూ ముందు ట్యుటోరియల్లో చెప్పినట్లుగా, సూపర్ లైబ్రేరియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
02:10 కోహహోమ్ పేజీ పై Acquisitions క్లిక్ చేయండి.
02:16 ఎడమవైపు ఉన్న ఎంపికల నుండి, Budgets పై క్లిక్ చేయండి.
02:21 ఇప్పుడు, New budget టాబ్ పై క్లిక్ చేయండి.
02:26 మొదట, ఈ బడ్జెట్ కోసం సమయ వ్యవధిని ఎంచుకోవాలి.
02:31 బడ్జెట్ ఒక అకాడెమిక్ సంవత్సరం, ఫిస్కల్ సంవత్సరం లేదా మూడు నెలల కోసం సృష్టించబడవచ్చు.
02:39 నేను ఒక ఫిస్కల్ ఏడాదికి కోసం బడ్జెట్ ను సృష్టిస్తాను.
02:43 ఆపై Start మరియు End dateలను ఎంచుకోండి.
02:48 Start date :04 / 01/2016 (MM / DD / YYYY) గా

End date :03 / 31/2017 (MM / DD / YYYY) గా ఎన్నుకుంటాను.

03:07 తరువాత మనం బడ్జెట్ కోసం description ఇవ్వాలి.
03:11 ఇది మనకు తరువాత ఆర్డర్ చేసే సమయంలో, గుర్తించడానికి సహాయపడుతుంది.
03:17 ఇక్కడ, నేను Spoken Tutorial Library 2016-2017 Phase I అని టైప్ చేస్తాను.
03:26 Amount బాక్స్ లో, ఈ ప్రత్యేకమైన బడ్జెట్ కోసం మొత్తాన్ని ప్రవేశ పెట్టాలి.
03:32 ఇది స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ కోసం ఇవ్వబడిన సమయ వ్యవధిని లో, ఖర్చు చేయబోతున్న మొత్తం డబ్బు.
03:41 ఈ ఫీల్డ్ సంఖ్యలు మరియు దశాంశాలను మాత్రమే అంగీకరిస్తుంది.
03:47 ప్రత్యేక క్యారెక్టర్ లు మరియు చిహ్నాలను అనుమతించదు.
03:51 మనము ప్రవేశ పెట్టిన Amount, ఆ లైబ్రరీకి ఆమోదించబడిన బడ్జెట్ ప్రకారం ఉండాలి.
03:57 ఇక్కడ, నేన Amount కోసం రూ. 5,00,000 / - ప్రవేశ పెడతాను.
04:03 తరువాత, Make a budget active పై క్లిక్ చేయండి.
04:08 ఇలా చేయడం ద్వారా, Acquisitions మాడ్యూల్ లో ఆర్డర్లను ఇచ్చినపుడు ఈ బడ్జెట్ ఉపయోగంలో కి వస్తుంది.
04:17 Budget End date తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఇది అలాగే ఉంటుంది.
04:24 ఇది మునుపటి సంవత్సరంలోని బడ్జెట్లో ఇచ్చిన ఆర్డర్లను రికార్డ్ చేయడాన్ని కూడా అనుమతిస్తుంది.
04:31 తరువాతది Lock budget కోసం చెక్ బాక్స్,
04:35 అంటే లైబ్రరీ స్టాఫ్ చే ఫండ్స్ తరువాత సవరించబడవని అర్థం.
04:41 నేను ఈ చెక్ బాక్స్ని ఖాళీగా వదిలివేస్తాను.
04:45 అన్ని ఎంట్రీలు పూర్తి చేసిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలోని సేవ్ బటన్పై క్లిక్ చేయండి.
04:52 ఒక కొత్త పేజీ Budgets administration తెరుచుకుంటుంది.
04:57 ఇక్కడ, +New Budget పేజీలో ఇంతకు ముందు జోడించిన వివరాలను చూడవచ్చు.
05:04 ఈ పేజీలో కనిపించే వివరాలు-
05:08 Budget name టాబ్ కింద వివరణ,

Start date,

End date,

Total amount,

Actions.

05:19 మన అవసరాన్ని బట్టి బడ్జెట్ ని సవరించవచ్చు, తొలగించండి లేదా డూప్లికేట్ చెయ్యవచ్చు.
05:25 ఇది చేయుటకు, ఆ Budget name యొక్క కుడి వైపు ఉన్న Actions పై క్లిక్ చేయండి.
05:33 డ్రాప్-డౌన్ లో నుండి, ఏ ఎంపిక నైనా ఎంచుకోండి,

Edit,

Delete,

Duplicate,

Close లేదా

Add fund.

05:44 మనము ఒక ఫిస్కల్ ఏడాదికి కోసం నిధులు ఎలా కేటాయించాలో నేర్చుకుందాం.
05:49 అదే టేబుల్లో, ఫండ్ కేటాయించాల్సిన నిర్దిష్ట బడ్జెట్ నేమ్ పై క్లిక్ చేయండి.
05:56 Spoken Tutorial Library 2016-2017 Phase 1 పై క్లిక్ చేస్తాను.
06:05 ఒక కొత్త పేజీ Funds for Spoken Tutorial Library 2016-2017 Phase 1 తెరుచుకుంటుంది.
06:14 Funds for Spoken Tutorial Library 2016-2017 Phase 1ట్యాబ ను కనుగొని, New పైన క్లిక్ చేయండి.
06:26 డ్రాప్-డౌన్ నుండి, New fund for Spoken Tutorial Library 2016-2017 Phase 1 ఎంచుకోండి.
06:36 తెరుచుకున్న కొత్త పేజీలో, ఈ క్రింది వివరాలను పూరించండి:

ఫండ్ కోడ్: బుక్స్

ఫండ్ నేమ్: బుక్స్ ఫండ్.

06:47 Amount ని 25000గా

Warning at (%): 10

06:55 Warning at (amount): కోసం నేను ఇప్పటికే Warning at (%) లో నింపాను, నేను ఈఫీల్డ్ను దాటవేస్తాను.
07:02 Owner మరియు Users ఫీల్డ్ లను కూడా దాటవేస్తాను.
07:08 లైబ్రరీ కోసం డ్రాప్-డౌన్ నుండి స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ని ఎంచుకోండి.
07:14 నేను Restrict access to ఆలాగే వదిలి వేస్తాను.
07:19 నేను Statistic 1 done on మరియు Statistic 2 done on ని ఖాళీగా వదిలేస్తాను.
07:27 అన్ని వివరాలను నింపిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Submit బటన్ పై క్లిక్ చేయండి.
07:34 ఆ ప్రత్యేక లైబ్రరీకి సంబంధించిన అన్నిఫండ్ కేటాయింపు వివరాలు, ఇప్పుడు ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తాయి.
07:42 ఎడమవైపు ఉన్న ఎంపికల నుండి, Budgets పై క్లిక్ చేయండి.
07:47 ఒక బడ్జెట్ను ఎలా డూప్లికేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను.
07:51 కానీ ముందుగా, బడ్జెట్ను ఎందుకు డూప్లికేట్ చేయాలో అనేది మొదట తెలుసుకోవాలి.
07:57 బడ్జెట్ మొత్తం మరియు ఫండ్స్ యొక్క మొత్తం తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా సమానంగా ఉంటే ఆ సందర్భంలో, మనము మేము బడ్జెట్ను డూప్లికేట్ చేయవచ్చు.
08:08 ఇది లైబ్రరీ స్టాఫ్ కు చాలా సమయం మరియు కృషిని తగ్గించడానికి సహాయపడుతాయి.
08:14 ఆలా చేయుటకు, Budget name యొక్క కుడి వైపు ఉన్న Actions ట్యాబ పై క్లిక్ చేయండి.
08:22 డ్రాప్-డౌన్ నుండి, Duplicate ఎంచుకోండి.
08:26 ఒక క్రొత్త పేజీ Duplicate Budget తెరుచుకుంటుంది.
08:30 Start date మరియు End date ని ప్రవేశ పెట్టండి. తరువాతి సంవత్సరం బడ్జెట్ కోసం నేను తేదీలు ప్రవేశ పెడతాను.
08:39 Start date:04 / 01/2017 (MM / DD / YYYY) గా

End date:03 / 31/2018 (MM / DD / YYYY)గా

08:53 తరువాతది Description.
08:56 Description వివరాలు, తరువాత ఆ ప్రత్యేకమైన బడ్జెట్ ని సులభంగా గుర్తించ బడేలా ఉండాలి.

కోహ అప్రమేయంగా, ముందుగా నమోదు చేసిన వివరణ చూపిస్తుంది.

09:10 కానీ, నేను దానిని Spoken Tutorial Library 2017-2018, Phase IIగా మార్చుతాను

మీరు మీ గ్రంథాలయానికి సంబంధించినది ఏదైనా ఎంటర్ చేయవచ్చు.

09:24 Change amounts by ఫీల్డ్ లో

గత సంవత్సర బడ్జెట్ నుండి తొలగించ వలసిన శాతాన్ని నమోదు చేయండి లేదా, అదే మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లండి.

09:38 స్పోకన్ ట్యుటోరియల్ Libraryకి రూ .5,00,000 /- ఆమోదించబడింది అని గుర్తుంచుకోండి.
09:45 అందువల్ల, నేను 1,00,000/- మొత్తాన్ని తీసివేయుటకు -20% (మైనస్ 20 పర్ సెంట్ ) ప్రవేశ పెడతాను.
09:54 తరువాతి ఫీల్డ్ If amounts changed, round to a multiple of, నేను ఆ ఫీల్డ్నుఖాళీగా వదిలేస్తాను.


10:03 ఆపై Mark the original Budget as inactive చెక్ బాక్స్ ఉంది.
10:10 ఆలా చేయడం తో, అసలైన బడ్జెట్ ఇకపై ఉపయోగించబడదు. మళ్ళీ, నేను ఈ బాక్స్ ఖాళీగా వదిలివేస్తాను.
10:19 చివరగా, Set all funds to zero చెక్ బాక్స్ ఉంది.
10:25 మీకు కొత్త బడ్జెట్, మునుపటి బడ్జెట్ ఫండ్ నిర్మాణాల తో కలిగి ఉండాలని అనుకుంటే ఈ బాక్స్ ను ఎంచుకోండి.
10:32 దయచేసి గమనించండి- మీరు ఫండ్ లో మాన్యువల్ గా మొత్తాన్ని ఎంటరు చేసే వరకు ఏ రకమైన కేటాయింపులు అనుమతించబడవు.

నేను ఇప్పటికి దీనిని ఖాళీగా వదిలివేస్తాను.

10:44 అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Save changes పై క్లిక్ చేయండి.
10:52 డూప్లికేట్ బడ్జెట్ స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ 2017-2018 Phase II కోసం నమోదు చేయబడిన వివరాలు Budgets administration పేజీలో కనిపిస్తుంది.
11:04 మీరు ఇప్పుడు కోహా సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వవచ్చు
11:09 మొదట, కుడి ఎగువ మూలలో ఉన్న స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేయండి.

ఆపై డ్రాప్-డౌన్ నుండి,లాగ్ అవుట్ ఎంచుకోండి.

11:21 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనము, బడ్జెట్ ని జోడించుట

డూప్లికేట్ బడ్జెట్ తయారు చేయుట మరియు

ఫండ్స్ కేటాయించుట నేర్చుకున్నాము.

11:34 బడ్జెట్ కోసం అసైన్మెంట్

ఆర్ధిక సంవత్సరం కోసం ఒక బడ్జెట్ ని జోడించి, దానికి Rs.50 లక్షలు కేటాయించండి.

11:44 ఫండ్స్ కేటాయింపు కోసం అసైన్మెంట్,

నాన్-ప్రింట్ మెటీరియల్ కోసం 20 లక్షల రూపాయల ఫండ్స్ కేటాయించండి.

11:53 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
12:01 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

12:09 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
12:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:25 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya