BASH/C2/More-on-Loops/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | BASH లోని Nested for loop పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనము Nested for loop ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH version 4.1.10 ఉపయోగిస్తున్నాను. |
00:24 | GNU Bash version 4 లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి సిఫార్సు చేయబడింది. |
00:31 | ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు Bash లో loops గురించి అవగాహన ఉండాలి. |
00:37 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org |
00:43 | Nested loop యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:46 | loop లోపల వేరొక loop ను వ్రాయుటను nested loop అని అంటారు. |
00:51 | సింటాక్స్ ను చూద్దాము. Outer for loop expression 1, 2, 3; |
00:57 | inner for loop expression 1, 2, 3; |
01:01 | statement 1, statement 2. |
01:04 | inner for loop ముగింపు outer for loop ముగింపు. |
01:09 | nested for loop కు ఒక ఉదాహరణను చూద్దాం. |
01:12 | మొదట, మనం directory structure ను తెలుసుకుందాం. |
01:17 | ఇక్కడ Desktop పై గల simple-nested-for అనే పేరు గల డైరెక్టరీ ను తెరుద్దాం. |
01:24 | మనం test, test2, test3 వంటి sub-directorie లు మరియు ఒక Bash script లను కలిగి ఉన్నాము. |
01:31 | ప్రతి sub-directory లో, చాలా text files ఉన్నాయి. |
01:36 | ఇప్పుడు మనము code కు వెళ్దాము. |
01:39 | ఈ ప్రోగ్రాం, ప్రతి sub-directory లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది. |
01:45 | దీనినే single line command ls -1 (hyphen one) -R(hyphen R) test* (test asterisk) తో పొందవచ్చు అని గమనించండి. |
01:53 | కానీ మనం దీనిని for loop ను ఉపయోగించి చేస్తాము. |
01:58 | మన Bash script పేరు nested-(hyphen)for dot sh అని గమనించండి. |
02:05 | ఇది మన shebang line. |
02:08 | ఇది outer for loop. |
02:10 | ఈ for loop test పేరుతో ప్రారంభమయ్యే directories ని తనిఖీ చేస్తుంది. |
02:15 | మొదటి echo లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది. |
02:21 | రెండవ echo లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది. |
02:25 | ఇది inner for loop. ఇది directories లోపల ఉన్న ఫైళ్ళను తనిఖీ చేస్తుంది. |
02:32 | ls డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
02:36 | |
02:41 | ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. done inner for loop ను ముగిస్తుంది. |
02:45 | ఈ command, outer for-loop యొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది. |
02:53 | done outer for loop ను ముగిస్తుంది. |
02:57 | ప్రోగ్రాం ని execute చేద్దాము. మీ కీ బోర్డు పై Ctrl + Alt+ T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:08 | ఇప్పుడు, మనం Bash script ఉన్న డైరెక్టరీ లోకి వెళ్దాము. |
03:13 | ఇది Desktop పై ఉంటుంది. |
03:15 | cd Desktop అని టైప్ చేయండి. మనం simple-(Hyphen)nested-(Hyphen)for అనే folder లోనికి వెళ్దాము. |
03:22 | Enter నొక్కండి. |
03:24 | chmod plus +x nested-(Hyphen)for dot sh టైప్ చేయండి. |
03:32 | Enter నొక్కండి. |
03:34 | dot slash nested-(Hyphen)for dot sh టైప్ చేయండి. |
03:39 | Enter నొక్కండి. outputను ప్రదర్శిస్తుంది. ఇది test, test2 మరియు test3 directory లోని ఫైళ్ళను చూపిస్తుంది. |
03:52 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
03:56 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం Nested for loop గురించి నేర్చుకున్నాము. |
04:02 | ఒక అసైన్మెంటుగా, |
04:04 | nested (hyphen)-for dot sh bash script ప్రోగ్రాం ను nested while loop ఉపయోగించి మరల తిరిగి వ్రాయండి. |
04:11 | మీ ప్రోగ్రాం ని nested-(hyphen)while dot sh అనే పేరుతో సేవ్ చేయండి. |
04:17 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
04:23 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
04:37 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
04:45 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
04:57 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:03 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
05:08 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |