BASH/C3/Here-document-and-Here-string/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:21, 20 February 2018 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:11 | ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents మరియు Here strings లను గురించి |
00:17 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:26 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
00:34 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:39 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:42 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి ఉపయోగించండి. |
00:49 | Here document ను గురించి నేర్చుకుందాం. |
00:52 | ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block. |
00:56 | ఇది ఒక రకమైన I/O redirect. |
01:00 | ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ ల జాబితాను ఇస్తుంది. |
01:06 | ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది. |
01:10 | ఇది shell script కు పంపగలిగే మల్టిపుల్ లైన్ input గా కూడా పరిగణించబడుతుంది. |
01:17 | సింటాక్స్ command space less than less than space HERE. |
01:24 | దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు. |
01:29 | ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు. |
01:33 | ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు. |
01:40 | టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము. |
01:46 | ఇది HERE document యొక్క ముగింపును సూచిస్తుంది. |
01:50 | దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం. |
01:53 | నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను. |
01:59 | కోడ్ యొక్క మొదటి లైన్ shebang line. |
02:04 | ఈ లైన్ తరువాత ఒక code block ను ఉంచుతాను. |
02:09 | wc word count ను సూచిస్తుంది. |
02:12 | wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది. |
02:20 | కోడ్ block లేదా text , రెండవ HERE సంభవించే వరకు, ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది. |
02:28 | HERE document లో ఉన్న కంటెంట్ wc hyphen w కమాండ్ కు input. |
02:36 | HERE అనేది కమాండ్ multi-line input ను రీడ్ చేసేటప్పుడు wc hyphen w కమాండ్ కు delimiter గా పనిచేస్తుంది. |
02:47 | ఒకవేళ మనం అదే కమాండ్ ను terminal లో execute చేయడానికి ప్రయత్నిస్తే, మనకు 4 అవుట్ పుట్ రావాలి. |
02:55 | ఇది ఎందుకంటే మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము. |
03:03 | ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి, Save పై క్లిక్ చేయండి. |
03:06 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి. |
03:15 | chmod space plus x space here dot sh అని టైప్ చేసి, |
03:22 | Enter నొక్కండి. |
03:24 | dot slash here dot sh అని టైప్ చేసి |
03:27 | Enter నొక్కండి. |
03:30 | మనం 4 ను అవుట్ పుట్ గా చూడవచ్చు |
03:33 | అంటే, Here document లో పదాల సంఖ్యా 4. |
03:38 | తిరిగి మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి. |
03:41 | ఇక్కడ, టెక్స్ట్ ప్రారంభంలో మరో రెండు పదాలను, జోడించండి. |
03:47 | Hello and welcome to Bash learning . |
03:52 | Save పై క్లిక్ చేయండి. |
03:54 | మళ్ళీ మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
03:57 | terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి |
04:04 | Enter నొక్కండి. |
04:06 | అవుట్పుట్ 6, ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము. |
04:13 | మనము ఒక argument ను Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు. |
04:18 | దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం. |
04:22 | నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి. |
04:28 | కమాండ్ cat ఫైళ్ళను జోడించి, standard output ను print చేస్తుంది. |
04:35 | మనం HERE string, this కు బదులుగా ఉపయోగించామని గమనించండి. |
04:41 | మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. |
04:47 | మీరు ఇతర delimiter ను కూడా ఉపయోగించవచ్చు. |
04:51 | ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది. |
04:55 | 0th (zeroth) argument , అప్రమేయంగా filename అవుతుంది. |
05:00 | ఈ లైన్, ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది. |
05:05 | ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది. |
05:09 | ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి. |
05:17 | ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం. |
05:21 | terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేసి, |
05:29 | Enter నొక్కండి. |
05:32 | dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి. |
05:40 | output |
05:43 | filename అయిన "0 th argument is: dot salsh hereoutput dot sh" గా ప్రదర్శింపబడుతుంది. |
05:49 | 1st argument is: Sunday |
05:51 | 2nd argument is: Monday. |
05:55 | ఇప్పుడు మనం Here string ను గురించి నేర్చుకుందాం. |
05:59 | Here స్ట్రింగ్ ను text లేదా variable నుండి input redirection కొరకు ఉపయోగిస్తాము. |
06:06 | input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది. |
06:12 | సింటాక్స్- command స్పేస్ మూడు less than symbols స్పేస్ వితిన్ సింగల్ కోట్స్ string |
06:22 | దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. |
06:25 | నేను అదే ఫైల్, here dot sh ను తెరుస్తాను. |
06:30 | ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w మూడు < గుర్తులు సింగిల్ కోట్స్ లో Welcome to Bash learning . |
06:44 | ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది. |
06:52 | మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి. |
06:55 | మనం Terminal కు వెల్దాము. |
06:58 | ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి. |
07:03 | మనం 6 మరియు 4 లను అవుట్ పుట్ గా చూడవచ్చు. |
07:08 | here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4. |
07:15 | అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్స్ ను వ్రాయండి. |
07:20 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:23 | సారాంశం చూద్దాం. |
07:25 | ఈ ట్యుటోరియల్ లో మనం |
07:27 | HERE డాక్యుమెంట్ |
07:29 | HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకున్నాము. |
07:31 | ఒక అసైన్మెంట్ గా, string ను |
07:36 | Here document Here string ఉపయోగించి ఎగువ కేసుకు మార్చండి: |
07:39 | సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z . |
07:47 | ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది. |
07:54 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:57 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
08:01 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
08:12 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:17 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
08:25 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
08:29 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
08:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:44 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
08:50 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి. |
08:54 | మీకు ధన్యవాదములు. |