Java/C2/Primitive-type-conversions/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | జావా లోని టైప్ కన్వెర్షన్ ఇన్ జావా అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో నేర్చుకునే అంశాలు, |
00:08 | డాటా ను ఒక డాటా టైప్ నుండి మరో దాటాటైప్ కు ఎలా మార్చడం. |
00:13 | రెండు రకాల కన్వెర్షన్ లు, ఒకటి ఇంప్లిసిట్ రెండోది ఎక్ష్ప్లిసిట్. |
00:18 | స్ట్రింగ్ లను నంబర్లకు ఎలా మార్చడం. |
00:23 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0,
JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:33 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి. |
00:38 | లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
00:47 | టైప్ కన్వెర్షన్ అంటే, డాటా ను ఒక విధమైన డాటా నుండి వేరొక విధంగా మార్చడం. |
00:53 | ఇది ఎలా చేయాలో చూద్దాం |
00:55 | ఎక్లిప్స్ కు మారుదాం. |
01:02 | ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
01:07 | నేను టైప్ కన్వెర్షన్ అనే క్లాస్ సృష్టించి దానికి మెయిన్ మెథడ్ జతచేశాను. |
01:13 | ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ ని సృష్టిద్దాం. |
01:19 | int a equal to 5;
float b; b equal to a; |
01:33 | నేను రెండు వేరియబుల్స్ ని సృష్టించాను. ఒకటి a పుర్ణాంకమ్ మరొకటి b అది ఫ్లోట్. |
01:39 | నేను పుర్ణాంక విలువని ఫ్లోట్ వేరియబుల్ లో నిల్వ చేస్తాను. |
01:43 | ఫ్లోట్ వేరియబుల్ లో ఏముందో చూద్దాం. |
01:48 | System dot out dot println(b); |
01:58 | సేవ్ చేసి, రన్ చేయండి. |
02:07 | ఇంటిజెర్ 5, float 5.0గా మార్చబడడం మనం చూడవచ్చు. |
02:13 | ఈ రకమైన కన్వెర్షన్ ని ఇంప్లిసిట్ కన్వెర్షన్ అంటారు. |
02:17 | పేరుకు తగ్గట్టుగానే, విలువ తనంతట తానే దానికి తగిన డాటా టైప్ కు మారింది. |
02:24 | ఇప్పుడు float ను intకి మారుద్దామ్. |
02:30 | 5 తీసివేసి, float b అనేది 2.5f కు సమానం మరియు 'b' ని 'a'లో నిల్వచేసి 'a' విలువను ముద్రిద్దాం. |
02:50 | ఫైల్ ను సేవ్ చేద్దాం. |
02:56 | అక్కడ ఎర్రర్ ఉండడం మనం గమనించవచ్చు. |
03:00 | ఎర్రర్ సందేశం లో Type mismatch: cannot convert from float to int అని చూడవచ్చు. |
03:06 | అంటే Implicit conversion అనేది int నుండి float కు మాత్రమే కాని వేరే వాటికి వర్తించదు. |
03:13 | float ను int కి కన్వెర్ట్ చేయడానికి మనము ఎక్ష్ప్లికిట్ కన్వెర్షన్ ను ఉపయోగించాలి. |
03:17 | అది ఎలాగో చూద్దాం. |
03:23 | మనం దాన్ని int ని పేరేంథేసిస్ గా వేరియబుల్ కి ముందు ఉపయోగించి చేస్తాం. |
03:34 | ఈ స్టేట్మెంట్ వీరియబుల్ 'b' లోని డేటా, int డేటా టైప్ కి మార్చబడి, 'a' లో నిలువ చేయబడాలని చెబుతుంది. |
03:43 | సేవ్ చేసి రన్ చేయండి. |
03:51 | మనం float విలువ int కి మారడం చూడవచ్చు. |
03:56 | కానీ, ఆ దాటాటైప్ కు సరిగా ఉండడానికి గాను డాటా తదను గుణంగా మార్చబడింది. |
04:01 | int నుండి floatకు మార్చడానికి కూడా ఎక్ష్ప్లిసిట్ కన్వెర్షన్ ఉపయోగ పడుతుంది. |
04:07 | ముందు చెప్పిన ఉదాహరణను ప్రయత్నిద్దామ్. |
04:10 | int a =5; float b; b = (float) a; |
04:32 | System.out.println(b); |
04:36 | మనం ఎక్ష్ప్లిసిట్ కన్వెర్షన్ ని ఇంటిజెర్ నుండి ఫ్లోట్ కు కన్వెర్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. |
04:42 | ఫైల్ సేవ్ చేసి రన్ చేయండి. |
04:51 | మనం int విలువ float కి మారడం చూడవచ్చు. |
04:58 | character ను integerకి మారిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. |
05:06 | int a; char c equal to in single quotes m; |
05:24 | a equal to (int) c; |
05:32 | System dot out dot println(a); |
05:36 | మనం క్యారెక్టర్ 'm'ని ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ చేసి విలువను ముద్రిద్దాం. |
05:43 | సేవ్ చేసి రన్ చేద్దాం. |
05:53 | ఔట్పుట్ 109 అది 'm'యొక్క ascii(ఆస్కీ) విలువ అని మనం చూడవచ్చు. |
05:58 | అంటే char అనేది int కి కన్వెర్ట్ అయితే , దాని ascii(ఆస్కీ) విలువ నిల్వచేయబడింది. |
06:03 | ఒక అంకె తో ప్రయత్నించి చూద్దాం. |
06:06 | char c = digit 5; |
06:11 | సేవ్ చేసి రన్ చేయండి. |
06:18 | ఔట్పుట్ 53, అది క్యారెక్టర్ 5 యొక్క ascii (ఆస్కీ) విలువ అని మనం చూడవచ్చు. |
06:24 | ఇది నంబర్ 5 కాదు. |
06:26 | నంబర్ రావడానికి మనం స్ట్రింగ్ ని వాడి, ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ చేయాలి. |
06:31 | ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. |
06:33 | మెయిన్ ఫంక్షన్ ను క్లీన్ చేద్దాం. |
06:38 | టైప్ చేయండి, |
06:40 | String sHeight అంటే హైట్ యొక్క స్ట్రింగ్ ఫామ్ equal to డబల్ కోట్స్ లో 6. |
06:58 | int h equal to explicit conversion int of sHeight and |
07:11 | System dot out dot println(h) అని ఫైల్ ను సేవ్ చేయండి. |
07:27 | 6 విలువగల స్ట్రింగ్ వేరియబుల్ ని నేను సృష్టించాను. నేను, దాన్ని ఇంటిజర్ కి కన్వర్ చేయడానికి ప్రయత్నిస్తే మనకు ఎర్రర్ అని రావడం చూడవచ్చు. |
07:37 | మరియు ఎర్రర్ సందేశం లో: Cannot cast from String to int. |
07:42 | దీనిబట్టి, స్ట్రింగ్స్ ని కన్వెర్ట్ చేయడానికి మనం ఇంప్లిసిట్ లేదా ఎక్ష్ప్లిసిట్ కన్వర్షన్ ఉపయోగించలేము అని తెలుస్తుంది. |
07:48 | దాన్ని, ఖచ్చితంగా వేరే విధంగా చేయాలి. అది ఎలాగో చూద్దాం. |
07:58 | int sHeight ని తీసివేసి Integer dot parseInt sHeight; అని టైప్ చేయండి. |
08:21 | సేవ్ చేసి రన్ చేయండి. |
08:29 | విలువ విజయవంతంగా ఇంటిజెర్ లోకి కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం. |
08:35 | దీన్ని చేయడానికి integer module యొక్క parseInt methodను ఉపయోగిస్తాం. |
08:41 | ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అంకెలు "6543" కు లాగా ఉంటే ఏంచేయాలో చూద్దాం. |
08:49 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
08:55 | నంబర్ గల స్ట్రింగ్ మరలా విజయవంతంగా కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం. |
09:03 | ఇప్పుడు స్ట్రింగ్ లో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. |
09:10 | 6543 ను 65.43 కి మార్చండి. మన స్ట్రింగ్ లో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉంది. దానిని మనం ఇంటిజెర్ కు కన్వెర్ట్ చేస్తున్నాం. |
09:22 | సేవ్ చేసి రన్ చేయండి. |
09:31 | ఎర్రర్ రావడం మనం చూడవచ్చు. ఎందుకంటే స్ట్రింగ్ లో ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ని మనం ఇంటిజెర్ గా కన్వెర్ట్ చేయలేము. |
09:41 | మనం దాన్ని ఫ్లోట్ కి కన్వెర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. |
09:45 | మొదట, దాటాటైప్ ఫ్లోట్ అయి ఉండాలి. |
09:51 | తర్వాత, మనం Float.ParseFloatని ఉపయోగిస్తాం. |
10:07 | మనం float class యొక్క parseFloat method ఉపయోగించి ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఉన్న స్ట్రింగ్ ను అసలైన ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ లాగా కన్వెర్ట్ చేస్తాం. |
10:18 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. స్ట్రింగ్ లో ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ విజయవంతంగా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ గా కన్వెర్ట్ అవ్వడం మనం చూస్తాం. |
10:33 | ఈ విధంగా మనం implicit మరియు explicit conversion ఇంకా strings ను numbersకి కన్వెర్షన్ చేయడం చూశాం. |
10:45 | దీనితో ఈ టుటోరియల్ చివరకు వచ్చాం. |
10:48 | ఈ టుటోరియల్ లో మీరు డాటా టైప్ కన్వెర్షన్ ఒక దాని నుండి మరో విధంగా ఎలా చేయాలో తెలుసుకున్నారు. |
10:54 | implicit and explicit కన్వెర్షన్ అంటే ఏమిటి అని. |
10:57 | మరియు స్ట్రింగ్స్ నుండి నంబర్ కన్వెర్షన్ ఎలా చేయాలి అని తెలుసుకున్నారు. |
11:01 | ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్ లాగా, Integer.toString మరియు Float.toString methodsను చదవండి. |
11:07 | మరియు వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి. |
11:14 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
11:20 | ఇది స్పోకెన్ టుటోరియల్ సారాంశంను ఇస్తుంది. |
11:23 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
11:27 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
11:31 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
11:34 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
11:40 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
11:44 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:50 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో. |
11:55 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |