Inkscape/C3/Create-a-3-fold-brochure/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:37, 28 June 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:01 Inkscape ను ఉపయోగించి Create a 3-fold brochure అను Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-
00:08 guidelines ఉపయోగం మరియు వాటిని సెట్ చేయడం
00:10 3-మడతల(ఫోల్డ్ ) కరపత్రం కొరకు సెట్టింగ్స్
00:12 ఒక 3-మడతల(ఫోల్డ్ )కరపత్రం రూపొందించడం.
00:15 మనం layers ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నేర్చుకుంటాం.
00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయటానికి, నేను-
00:21 Ubuntu Linux 12.04 OS
00:24 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:28 ఇది ఒక నమూనా 3 fold brochure. మనం దీన్ని తెరిచినప్పుడు, మనం దాని 3 మడతలు చూడవచ్చు.
00:34 ఇందులో 6 విభాగాలు ఉన్నవి.
00:37 బయటి భాగం 1, 5 మరియు 6 విభాగాలను కలిగి ఉంటుంది.
00:42 కరపత్రం లోపలి భాగం 2, 3 మరియు 4 విభాగాలను కలిగిఉంటుంది.
00:46 ఈ విధమైన ఒక brochure ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
00:51 Inkscape ను తెరవండి.
00:53 File పై క్లిక్ చేసి Document Properties కు వెళ్ళండి.
00:56 మొదట కొన్ని ప్రాథమిక సెట్టింగులను చేద్దాము.
00:59 Default units ను mm కు
01:03 Page Size ను A4 కు
01:05 Orientation ను Landscape కు
01:07 Custom Size Units ను mm కు మార్చండి.
01:11 మనం canvas ను 3 మడతలుగా విభజించవల్సి ఉంటుంది.
01:14 దీని కొరకు, canvas యొక్క వెడల్పు 297 ఉండాలి అని గమనించండి.
01:18 కనుక, మనం మూడు సెక్షన్ లు ఒకొక్కటి 99 ఉండేలా 297 ను 3భాగాలుగా విభజించవల్సి ఉంటుంది
01:27 ఇప్పుడు Document Properties డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
01:30 ఎడమవైపు నుండి ఒక guideline ను canvas పైకి క్లిక్ చేసి లాగండి.
01:35 ఈ guideline పై డబల్ -క్లిక్ చేయండి.
01:37 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:41 X యొక్క విలువను 99 కి మార్చి OK పై క్లిక్ చేయండి.
01:45 ఎడమవైపు నుండి వేరొక guideline ను canvas పైకి క్లిక్ చేసి లాగండి.
01:50 డైలాగ్ బాక్స్ ను తెరవటానికి దానిపై డబల్ -క్లిక్ చేయండి.
01:53 ఇక్కడ, X యొక్క విలువను 198కు మార్చండి.
01:56 ఇప్పుడు మన canvas 3 సమాన భాగాలుగా విభజించబడింది.
02:01 ఈ మార్గదర్శకాలు మనకు ప్రతీ మడత ( ఫోల్డ్ )ఎక్కడ ప్రారంభం అవుతుంది మరియు ముగుస్తుంది అనేది తెలుపుతాయి.
02:06 ఈ ఫైల్ ను రెండుసార్లు save చేద్దాం -
02:08 ఒకటి కరపత్రం లోపలి భాగం కోసం,
02:11 ఇంకొకటి కరపత్రం బయటి భాగం కోసం.
02:13 File కి వెళ్ళి Save as పై క్లిక్ చేయండి.
02:16 నేను ఈ ఫైల్ ను నా Desktop పై Brochure-OUT.svg అనే పేరుతో (సేవ్ చేస్తున్నాను) భద్రపరుస్తున్నాను.
02:22 మళ్ళీ ఇంకోసారి File కి వెళ్ళి Save as పై క్లిక్ చేయండి.
02:26 ఈ సారి, నేను Brochure-IN.svg అనే పేరును ఇచ్చి Save పై క్లిక్ చేస్తాను.
02:33 ఇప్పుడు మనం 2ఫైల్స్ కలిగిఉన్నాము - ఒకటి లోపలి భాగం కొరకు ఇంకొకటి బయటి భాగం కొరకు.
02:39 Brochure-IN.svg తో ప్రారంభిద్దాం.
02:43 మనం ఈ కరపత్రాన్నిరూపొందిస్తున్నపుడు, వివిధ element ల కొరకు వివిధ layers ను తగినవిధంగా ఉపయోగించాలి.
02:50 ఈ ట్యుటోరియల్ చివరలో, ఇలా చేయడం వలన ప్రయోజనాలను చూస్తాము.
02:54 మనం కరపత్రం లోని లోపలి భాగాలు అంటే అవి 2,3మరియు 4విభాగాలను రూపొందిద్దాం.
03:00 Bezier toolఉపయోగించి, canvas యొక్క మధ్యలో ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని గీసి, దాన్ని నీలం రంగు చేయండి.
03:09 stroke ను తొలగించండి.
03:14 ఒక కొత్త layer ను సృష్టించి దానికి మీకు నచ్చిన పేరును పెట్టండి.
03:19 150X150 pixels తో ఒక వృత్తాన్ని రూపొందించండి.
03:26 దానిని పచ్చరంగు మార్చండి.
03:28 వృత్తాన్ని నకిలీ చేసి, చూపినవిధంగా వేరు వేరు పరిమాణాలతో ఇంకో 5 వృత్తాలను రూపొందించండి.
03:36 ప్రదర్శిస్తున్నట్టుగా వాటిని స్పష్టమైన దృష్టాంతం చుట్టూ ఉంచండి.
03:40 ఈ వృత్తాల లోపల, మనం కొన్ని చిత్రాలను పెడదాం.
03:44 నేను ఇప్పటికే చిత్రాలను వృత్తాకార ఆకారంలోకి సవరించాను ఇంకా వాటిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
03:50 మీ సౌలభ్యం కోసం, ఈ చిత్రాలు Code files లింక్ లో మీకు అందించబడ్డాయి.
03:56 ట్యుటోరియల్ ని విరామంలో ఉంచండి, లింక్ పై క్లిక్ చేసి ఈ చిత్రాలను మీరు ఇష్టపడే స్థానంలో భద్రపరచండి.
04:02 దాని తరువాత, ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
04:04 File కి వెళ్ళి, Import పై క్లిక్ చేసి తరువాత Image1 పై క్లిక్ చేయండి.
04:09 దానిని మొదటి వృత్తం పైన ఉంచండి.
04:12 ఇదేవిధంగా, ఇతర 5 చిత్రాలకు ఈ సోపానాలు పునరావృతం చేయండి.
04:17 Align and Distribute ఎంపిక ఉపయోగించి వాటిని సమలేఖనం చేయండి.
04:20 ఇప్పుడు, మీ canvas చూడటానికి ఇలా కనిపిస్తుంది.
04:25 తరువాత ఒక కొత్త layer ని సృష్టించండి.
04:28 Bezier tool ను ఎంచుకుని ఒక బాణాన్ని గీయండి.
04:34 దాన్ని బూడిద రంగుకు మార్చండి.
04:38 stroke ను తొలగించండి.
04:41 Filters మెనూ కి వెళ్ళండి. Shadows and Glows ను ఎంచుకుని తరువాత Drop Shadow పై క్లిక్ చేయండి.
04:47 ప్రభావాన్ని గమనించడానికి Preview బాక్స్ పై క్లిక్ చేయండి.
04:50 ఇప్పుడు Apply పై క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ మూసివేయండి.
04:55 చూపిన విధంగా, దీనిని అతివ్యాప్తి పద్ధతిలో మొదటి వృత్తం పైన ఉంచండి.
05:01 మరో రెండు బాణాల ను సృష్టించేందుకు ఈ బాణాన్ని రెండు సార్లు నకిలీ చేయండి.
05:05 చూపిన విధంగా, వాటిని రెండవ మరియు మూడవ వృత్తాలపై వరుసగా ఉంచండి.
05:10 ఇప్పుడు, అన్ని గ్రాఫిక్ అంశాలు పూర్తి అయ్యాయి.
05:13 మనం ఇప్పుడు సంబంధిత టెక్స్ట్ లను చేర్చుదాం.
05:15 కొత్త లేయర్ పై, మొదటి బాణం పై Introduction అని టైప్ చేయండి.
05:20 రెండవ బాణం పై Features అని టైప్ చేయండి.
05:24 మూడవ బాణం పై Usage అని టైప్ చేయండి.
05:28 ఇప్పుడు, మనం ఈ విభాగాల యొక్క ప్రతిదాని క్రింద టెక్స్ట్ ను చేర్చాలి.
05:33 నేను ఇప్పటికే సేవ్ చేసిన ఒక LibreOffice Writer ఫైల్ నుండి టెక్స్ట్ లను copy మరియు paste చేస్తాను.
05:40 ఈ ఫైల్ మీకు, మీరు సేవ్ చేసిన ఫోల్డర్ లో అందుబాటులో ఉంటుంది.
05:43 దయచేసి దాన్నిగుర్తించి, టెక్స్ట్ ను దాని నుండి copy చేయండి.
05:47 ఆపై ఒక కొత్త layer పై చూపినవిధంగా దాన్ని paste చేయండి.
05:50 ఫాంట్ పరిమాణాన్ని 15 కి తగ్గించి వాటిని Text and Font ఎంపికను ఉపయోగించి సమలేఖనం చేయండి.
05:55 ellipse టూల్ ఉపయోగించి ఆకు పచ్చరంగుతో ఒక bullet ను సృష్టించండి.
05:59 దానిని మొదటి వాక్యం యొక్క కుడి వైపు ఉంచండి.
06:02 అన్ని వాక్యాలకు అదే విధానాన్ని పునరావృతం చేయండి.
06:05 ఇప్పుడు brochure (కరపత్రం) యొక్క లోపలి భాగం సిద్ధమైనది.
06:08 మన SVG ఫైల్ ను save చేయటానికి CTRL + S ను నొక్కండి.
06:12 బ్రోచర్(కరపత్రం)పూర్తీ అయిన తర్వాత దానిలో మీకు కావలసిన layers ను దాచవచ్చు లేదా చూపవచ్చు.
06:18 ఇప్పుడు మనము అదే ఫైల్ ను PDF లోకి సేవ్ చేద్దాము.
06:21 File కి వెళ్లి, Save As పై క్లిక్ చేయండి.
06:24 ఫైల్ ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చండి.
06:29 Save పై క్లిక్ చేయండి.
06:31 ఒక కొత్త dialog box కనిపిస్తుంది.
06:34 ముద్రణ ప్రయోజనం కోసం, స్పష్టత 300 ఉండాలి.
06:37 వెబ్ కోసం, ఇది 72 గా ఉంటుంది.
06:40 నేను దానిని 300 గా ఉంచుతాను.
06:42 ఇప్పుడు OK పై క్లిక్ చేయండి.
06:44 ఇప్పుడు బాణాల యొక్క opacity ని మార్చండి.
06:47 Arrow లేయర్ కి వెళ్ళి, లేయర్ యొక్క పారదర్శకతను 70 కు మార్చండి.
06:52 నేను కూడా ink-blot లతో ఒక కొత్త layer ను జోడించాను.
06:58 SVG మరియు PDF ఫార్మాట్ లలో ఫైల్ ను భద్రపరచండి.
07:04 తేడాను అర్థంచేసుకోవడానికి రెండు pdf లను పోల్చి చూడండి.
07:08 తరువాత,మనం బ్రోచర్ (కరపత్రం )యొక్క బయటి భాగాన్ని సృష్టిద్దాం.
07:12 File కి వెళ్ళి Open పై క్లిక్ చేయండి.
07:14 Brochure-OUT.svg ని ఎంచుకోండి.
07:18 ఇప్పుడు మనం 1, 5 మరియు 6 భాగాలను రుపొంచించాలి.
07:22 ఒకసారి మళ్ళీ, వివిధ element ల కొరకు వివిధ layers ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
07:28 చూపినవిధంగా Bezier tool ని ఉపయోగించి ఎడమ పైభాగంలో ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని గీయండి.
07:33 దానిని నీలం రంగు చేసి stroke ని తొలగించండి.
07:36 మీరు భద్రపరచిన ఫోల్డర్ లో ఉన్న Spoken Tutorial లోగోను దిగుమతి చేయండి.
07:40 పరిమాణాన్ని తగ్గించండి మరియు దానిని 1 వ విభాగం యొక్క ఎడమ ఎగువ మూలలో ఉంచండి.
07:46 Spoken Tutorial అని టైప్ చేసి దానిని logo కు కుడివైపున సర్దుబాటు చేయండి.
07:51 ఫాంట్ పరిమాణాన్ని 25 కి మార్చండి.
07:54 టెక్స్ట్ క్రిందన ఒక వృత్తాన్ని గీసి దానిని పసుపు రంగు చేయండి.
07:58 Inkscape లోగో Import చేయండి.
08:00 దానిని పసుపురంగు వృత్తంపై ఉంచండి.
08:03 లోగో క్రింద Inkscape అని టైప్ చేయండి. ఫాంట్ పరిమాణాన్ని 45 కు మార్చండి.
08:09 నేను Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి వివరాలను జోడించి, సంబంధిత లోగోలను చేర్చాను.
08:15 దయచేసి అలాగే చేయండి.
08:17 నేను అన్ని అంశాలను,
08:19 Text and font
08:21 మరియు Align and Distribute ఎంపికలు ఉపయోగించి సమలేఖనం చేశాను.
08:24 ఇప్పుడు బ్రోచర్(కరపత్రం) యొక్క వెలుపలి భాగం సిద్ధమైనది.
08:28 File కి వెళ్ళండి. Save As పై క్లిక్ చేయండి.
08:31 format ను SVG కి మార్చి Save పై క్లిక్ చేయండి.
08:37 అదే విధానాన్ని పునరావృతం చేయండి.
08:39 ఎక్స్టెన్షన్ (పొడిగింపు)ను PDF కు మార్చండి.
08:41 Save పై క్లిక్ చేయండి.
08:43 ఇది మన పూర్తి అయిన బ్రోచర్(కరపత్రం).
08:46 ఒకవేళ మీరు వివిధ అంశాల కొరకు layers ఉపయోగించినట్లయితే, మీరు మీ సౌకర్యం కొద్దీ రంగులను మరియు opacity ని మార్చవచ్చు.
08:54 నేను ఈ బ్రోచర్(కరపత్రం) కోసం రెండు ఇతర రంగు ఉపాయాలు కూడా సృష్టించాను.
09:00 సారాంశం చూద్దాం.
09:02 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి -
09:04 guidelines ను ఉపయోగించడం మరియు వాటిని అమర్చడం.
09:07 ఒక 3-fold brochure కొరకు సెట్టింగ్ లు.
09:09 3-మడతలతో ఒక బ్రోచర్ (కరపత్రం) ఆకృతి చేయడం.
09:11 మనం layers ను ఉపయోగించటం యొక్క ప్రాముఖ్యతను కూడా నేర్చుకున్నాం.
09:14 మరియు వివిధ రంగు ఉపాయలతో అదే బ్రోచర్(కరపత్రం) పొందటం.
09:18 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్-
09:20 Spoken Tutorial ప్రాజెక్ట్ కొరకు ఓక 3-fold brochure ను సృష్టించండి.
09:24 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
09:29 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
09:35 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:42 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
09:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
09:50 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:54 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:57 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya