Inkscape/C3/Create-a-3-fold-brochure/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:01 | Inkscape ను ఉపయోగించి Create a 3-fold brochure అను Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి- |
00:08 | guidelines ఉపయోగం మరియు వాటిని సెట్ చేయడం |
00:10 | 3-మడతల(ఫోల్డ్ ) కరపత్రం కొరకు సెట్టింగ్స్ |
00:12 | ఒక 3-మడతల(ఫోల్డ్ )కరపత్రం రూపొందించడం. |
00:15 | మనం layers ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నేర్చుకుంటాం. |
00:18 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయటానికి, నేను- |
00:21 | Ubuntu Linux 12.04 OS |
00:24 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:28 | ఇది ఒక నమూనా 3 fold brochure. మనం దీన్ని తెరిచినప్పుడు, మనం దాని 3 మడతలు చూడవచ్చు. |
00:34 | ఇందులో 6 విభాగాలు ఉన్నవి. |
00:37 | బయటి భాగం 1, 5 మరియు 6 విభాగాలను కలిగి ఉంటుంది. |
00:42 | కరపత్రం లోపలి భాగం 2, 3 మరియు 4 విభాగాలను కలిగిఉంటుంది. |
00:46 | ఈ విధమైన ఒక brochure ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
00:51 | Inkscape ను తెరవండి. |
00:53 | File పై క్లిక్ చేసి Document Properties కు వెళ్ళండి. |
00:56 | మొదట కొన్ని ప్రాథమిక సెట్టింగులను చేద్దాము. |
00:59 | Default units ను mm కు |
01:03 | Page Size ను A4 కు |
01:05 | Orientation ను Landscape కు |
01:07 | Custom Size Units ను mm కు మార్చండి. |
01:11 | మనం canvas ను 3 మడతలుగా విభజించవల్సి ఉంటుంది. |
01:14 | దీని కొరకు, canvas యొక్క వెడల్పు 297 ఉండాలి అని గమనించండి. |
01:18 | కనుక, మనం మూడు సెక్షన్ లు ఒకొక్కటి 99 ఉండేలా 297 ను 3భాగాలుగా విభజించవల్సి ఉంటుంది |
01:27 | ఇప్పుడు Document Properties డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
01:30 | ఎడమవైపు నుండి ఒక guideline ను canvas పైకి క్లిక్ చేసి లాగండి. |
01:35 | ఈ guideline పై డబల్ -క్లిక్ చేయండి. |
01:37 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:41 | X యొక్క విలువను 99 కి మార్చి OK పై క్లిక్ చేయండి. |
01:45 | ఎడమవైపు నుండి వేరొక guideline ను canvas పైకి క్లిక్ చేసి లాగండి. |
01:50 | డైలాగ్ బాక్స్ ను తెరవటానికి దానిపై డబల్ -క్లిక్ చేయండి. |
01:53 | ఇక్కడ, X యొక్క విలువను 198కు మార్చండి. |
01:56 | ఇప్పుడు మన canvas 3 సమాన భాగాలుగా విభజించబడింది. |
02:01 | ఈ మార్గదర్శకాలు మనకు ప్రతీ మడత ( ఫోల్డ్ )ఎక్కడ ప్రారంభం అవుతుంది మరియు ముగుస్తుంది అనేది తెలుపుతాయి. |
02:06 | ఈ ఫైల్ ను రెండుసార్లు save చేద్దాం - |
02:08 | ఒకటి కరపత్రం లోపలి భాగం కోసం, |
02:11 | ఇంకొకటి కరపత్రం బయటి భాగం కోసం. |
02:13 | File కి వెళ్ళి Save as పై క్లిక్ చేయండి. |
02:16 | నేను ఈ ఫైల్ ను నా Desktop పై Brochure-OUT.svg అనే పేరుతో (సేవ్ చేస్తున్నాను) భద్రపరుస్తున్నాను. |
02:22 | మళ్ళీ ఇంకోసారి File కి వెళ్ళి Save as పై క్లిక్ చేయండి. |
02:26 | ఈ సారి, నేను Brochure-IN.svg అనే పేరును ఇచ్చి Save పై క్లిక్ చేస్తాను. |
02:33 | ఇప్పుడు మనం 2ఫైల్స్ కలిగిఉన్నాము - ఒకటి లోపలి భాగం కొరకు ఇంకొకటి బయటి భాగం కొరకు. |
02:39 | Brochure-IN.svg తో ప్రారంభిద్దాం. |
02:43 | మనం ఈ కరపత్రాన్నిరూపొందిస్తున్నపుడు, వివిధ element ల కొరకు వివిధ layers ను తగినవిధంగా ఉపయోగించాలి. |
02:50 | ఈ ట్యుటోరియల్ చివరలో, ఇలా చేయడం వలన ప్రయోజనాలను చూస్తాము. |
02:54 | మనం కరపత్రం లోని లోపలి భాగాలు అంటే అవి 2,3మరియు 4విభాగాలను రూపొందిద్దాం. |
03:00 | Bezier toolఉపయోగించి, canvas యొక్క మధ్యలో ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని గీసి, దాన్ని నీలం రంగు చేయండి. |
03:09 | stroke ను తొలగించండి. |
03:14 | ఒక కొత్త layer ను సృష్టించి దానికి మీకు నచ్చిన పేరును పెట్టండి. |
03:19 | 150X150 pixels తో ఒక వృత్తాన్ని రూపొందించండి. |
03:26 | దానిని పచ్చరంగు మార్చండి. |
03:28 | వృత్తాన్ని నకిలీ చేసి, చూపినవిధంగా వేరు వేరు పరిమాణాలతో ఇంకో 5 వృత్తాలను రూపొందించండి. |
03:36 | ప్రదర్శిస్తున్నట్టుగా వాటిని స్పష్టమైన దృష్టాంతం చుట్టూ ఉంచండి. |
03:40 | ఈ వృత్తాల లోపల, మనం కొన్ని చిత్రాలను పెడదాం. |
03:44 | నేను ఇప్పటికే చిత్రాలను వృత్తాకార ఆకారంలోకి సవరించాను ఇంకా వాటిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
03:50 | మీ సౌలభ్యం కోసం, ఈ చిత్రాలు Code files లింక్ లో మీకు అందించబడ్డాయి. |
03:56 | ట్యుటోరియల్ ని విరామంలో ఉంచండి, లింక్ పై క్లిక్ చేసి ఈ చిత్రాలను మీరు ఇష్టపడే స్థానంలో భద్రపరచండి. |
04:02 | దాని తరువాత, ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
04:04 | File కి వెళ్ళి, Import పై క్లిక్ చేసి తరువాత Image1 పై క్లిక్ చేయండి. |
04:09 | దానిని మొదటి వృత్తం పైన ఉంచండి. |
04:12 | ఇదేవిధంగా, ఇతర 5 చిత్రాలకు ఈ సోపానాలు పునరావృతం చేయండి. |
04:17 | Align and Distribute ఎంపిక ఉపయోగించి వాటిని సమలేఖనం చేయండి. |
04:20 | ఇప్పుడు, మీ canvas చూడటానికి ఇలా కనిపిస్తుంది. |
04:25 | తరువాత ఒక కొత్త layer ని సృష్టించండి. |
04:28 | Bezier tool ను ఎంచుకుని ఒక బాణాన్ని గీయండి. |
04:34 | దాన్ని బూడిద రంగుకు మార్చండి. |
04:38 | stroke ను తొలగించండి. |
04:41 | Filters మెనూ కి వెళ్ళండి. Shadows and Glows ను ఎంచుకుని తరువాత Drop Shadow పై క్లిక్ చేయండి. |
04:47 | ప్రభావాన్ని గమనించడానికి Preview బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:50 | ఇప్పుడు Apply పై క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ మూసివేయండి. |
04:55 | చూపిన విధంగా, దీనిని అతివ్యాప్తి పద్ధతిలో మొదటి వృత్తం పైన ఉంచండి. |
05:01 | మరో రెండు బాణాల ను సృష్టించేందుకు ఈ బాణాన్ని రెండు సార్లు నకిలీ చేయండి. |
05:05 | చూపిన విధంగా, వాటిని రెండవ మరియు మూడవ వృత్తాలపై వరుసగా ఉంచండి. |
05:10 | ఇప్పుడు, అన్ని గ్రాఫిక్ అంశాలు పూర్తి అయ్యాయి. |
05:13 | మనం ఇప్పుడు సంబంధిత టెక్స్ట్ లను చేర్చుదాం. |
05:15 | కొత్త లేయర్ పై, మొదటి బాణం పై Introduction అని టైప్ చేయండి. |
05:20 | రెండవ బాణం పై Features అని టైప్ చేయండి. |
05:24 | మూడవ బాణం పై Usage అని టైప్ చేయండి. |
05:28 | ఇప్పుడు, మనం ఈ విభాగాల యొక్క ప్రతిదాని క్రింద టెక్స్ట్ ను చేర్చాలి. |
05:33 | నేను ఇప్పటికే సేవ్ చేసిన ఒక LibreOffice Writer ఫైల్ నుండి టెక్స్ట్ లను copy మరియు paste చేస్తాను. |
05:40 | ఈ ఫైల్ మీకు, మీరు సేవ్ చేసిన ఫోల్డర్ లో అందుబాటులో ఉంటుంది. |
05:43 | దయచేసి దాన్నిగుర్తించి, టెక్స్ట్ ను దాని నుండి copy చేయండి. |
05:47 | ఆపై ఒక కొత్త layer పై చూపినవిధంగా దాన్ని paste చేయండి. |
05:50 | ఫాంట్ పరిమాణాన్ని 15 కి తగ్గించి వాటిని Text and Font ఎంపికను ఉపయోగించి సమలేఖనం చేయండి. |
05:55 | ellipse టూల్ ఉపయోగించి ఆకు పచ్చరంగుతో ఒక bullet ను సృష్టించండి. |
05:59 | దానిని మొదటి వాక్యం యొక్క కుడి వైపు ఉంచండి. |
06:02 | అన్ని వాక్యాలకు అదే విధానాన్ని పునరావృతం చేయండి. |
06:05 | ఇప్పుడు brochure (కరపత్రం) యొక్క లోపలి భాగం సిద్ధమైనది. |
06:08 | మన SVG ఫైల్ ను save చేయటానికి CTRL + S ను నొక్కండి. |
06:12 | బ్రోచర్(కరపత్రం)పూర్తీ అయిన తర్వాత దానిలో మీకు కావలసిన layers ను దాచవచ్చు లేదా చూపవచ్చు. |
06:18 | ఇప్పుడు మనము అదే ఫైల్ ను PDF లోకి సేవ్ చేద్దాము. |
06:21 | File కి వెళ్లి, Save As పై క్లిక్ చేయండి. |
06:24 | ఫైల్ ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చండి. |
06:29 | Save పై క్లిక్ చేయండి. |
06:31 | ఒక కొత్త dialog box కనిపిస్తుంది. |
06:34 | ముద్రణ ప్రయోజనం కోసం, స్పష్టత 300 ఉండాలి. |
06:37 | వెబ్ కోసం, ఇది 72 గా ఉంటుంది. |
06:40 | నేను దానిని 300 గా ఉంచుతాను. |
06:42 | ఇప్పుడు OK పై క్లిక్ చేయండి. |
06:44 | ఇప్పుడు బాణాల యొక్క opacity ని మార్చండి. |
06:47 | Arrow లేయర్ కి వెళ్ళి, లేయర్ యొక్క పారదర్శకతను 70 కు మార్చండి. |
06:52 | నేను కూడా ink-blot లతో ఒక కొత్త layer ను జోడించాను. |
06:58 | SVG మరియు PDF ఫార్మాట్ లలో ఫైల్ ను భద్రపరచండి. |
07:04 | తేడాను అర్థంచేసుకోవడానికి రెండు pdf లను పోల్చి చూడండి. |
07:08 | తరువాత,మనం బ్రోచర్ (కరపత్రం )యొక్క బయటి భాగాన్ని సృష్టిద్దాం. |
07:12 | File కి వెళ్ళి Open పై క్లిక్ చేయండి. |
07:14 | Brochure-OUT.svg ని ఎంచుకోండి. |
07:18 | ఇప్పుడు మనం 1, 5 మరియు 6 భాగాలను రుపొంచించాలి. |
07:22 | ఒకసారి మళ్ళీ, వివిధ element ల కొరకు వివిధ layers ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. |
07:28 | చూపినవిధంగా Bezier tool ని ఉపయోగించి ఎడమ పైభాగంలో ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని గీయండి. |
07:33 | దానిని నీలం రంగు చేసి stroke ని తొలగించండి. |
07:36 | మీరు భద్రపరచిన ఫోల్డర్ లో ఉన్న Spoken Tutorial లోగోను దిగుమతి చేయండి. |
07:40 | పరిమాణాన్ని తగ్గించండి మరియు దానిని 1 వ విభాగం యొక్క ఎడమ ఎగువ మూలలో ఉంచండి. |
07:46 | Spoken Tutorial అని టైప్ చేసి దానిని logo కు కుడివైపున సర్దుబాటు చేయండి. |
07:51 | ఫాంట్ పరిమాణాన్ని 25 కి మార్చండి. |
07:54 | టెక్స్ట్ క్రిందన ఒక వృత్తాన్ని గీసి దానిని పసుపు రంగు చేయండి. |
07:58 | Inkscape లోగో Import చేయండి. |
08:00 | దానిని పసుపురంగు వృత్తంపై ఉంచండి. |
08:03 | లోగో క్రింద Inkscape అని టైప్ చేయండి. ఫాంట్ పరిమాణాన్ని 45 కు మార్చండి. |
08:09 | నేను Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి వివరాలను జోడించి, సంబంధిత లోగోలను చేర్చాను. |
08:15 | దయచేసి అలాగే చేయండి. |
08:17 | నేను అన్ని అంశాలను, |
08:19 | Text and font |
08:21 | మరియు Align and Distribute ఎంపికలు ఉపయోగించి సమలేఖనం చేశాను. |
08:24 | ఇప్పుడు బ్రోచర్(కరపత్రం) యొక్క వెలుపలి భాగం సిద్ధమైనది. |
08:28 | File కి వెళ్ళండి. Save As పై క్లిక్ చేయండి. |
08:31 | format ను SVG కి మార్చి Save పై క్లిక్ చేయండి. |
08:37 | అదే విధానాన్ని పునరావృతం చేయండి. |
08:39 | ఎక్స్టెన్షన్ (పొడిగింపు)ను PDF కు మార్చండి. |
08:41 | Save పై క్లిక్ చేయండి. |
08:43 | ఇది మన పూర్తి అయిన బ్రోచర్(కరపత్రం). |
08:46 | ఒకవేళ మీరు వివిధ అంశాల కొరకు layers ఉపయోగించినట్లయితే, మీరు మీ సౌకర్యం కొద్దీ రంగులను మరియు opacity ని మార్చవచ్చు. |
08:54 | నేను ఈ బ్రోచర్(కరపత్రం) కోసం రెండు ఇతర రంగు ఉపాయాలు కూడా సృష్టించాను. |
09:00 | సారాంశం చూద్దాం. |
09:02 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి - |
09:04 | guidelines ను ఉపయోగించడం మరియు వాటిని అమర్చడం. |
09:07 | ఒక 3-fold brochure కొరకు సెట్టింగ్ లు. |
09:09 | 3-మడతలతో ఒక బ్రోచర్ (కరపత్రం) ఆకృతి చేయడం. |
09:11 | మనం layers ను ఉపయోగించటం యొక్క ప్రాముఖ్యతను కూడా నేర్చుకున్నాం. |
09:14 | మరియు వివిధ రంగు ఉపాయలతో అదే బ్రోచర్(కరపత్రం) పొందటం. |
09:18 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్- |
09:20 | Spoken Tutorial ప్రాజెక్ట్ కొరకు ఓక 3-fold brochure ను సృష్టించండి. |
09:24 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
09:29 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
09:35 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:42 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
09:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
09:50 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:54 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:57 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |