Inkscape/C2/Layers-and-Boolean-operations/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 19:31, 28 June 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Layers and Boolean operations పై ఈ Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం వీటి గూర్చి నేర్చుకుంటాం- లేయర్స్, |
00:11 | ఫిల్టర్స్ మరియు బూలియన్ ఆపరేషన్స్. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి,నేను, |
00:18 | Ubuntu Linux 12.04 OS |
00:21 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:25 | Inkscape ని తెరుద్దాం. Dash home వెళ్ళి Inkscape అని టైప్ చెయండి. |
00:30 | Inkscape లోగో పై క్లిక్ చేయండి. |
00:32 | మనం ఇదివరకే రూపొందించిన Assignment_2.svg ఫైల్ ను తెరుద్దాం |
00:38 | నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
00:41 | ముందుగా, మనం Inkscape లో Layers గూర్చి నేర్చుకుందాం. |
00:45 | Layer మెనూ కి వెళ్ళి, Layers ఎంపిక పై క్లిక్ చేయండి. |
00:50 | ఇప్పుడు, interface యొక్క కుడిపక్క భాగంపై Layer palette తెరుచుకుంది. |
00:55 | అప్రమేయంగా, అక్కడ ఒక layer ఉంది.దానికి Layer 1గా పేరు ఉందని చూడవచ్చు. |
01:01 | ఒక కొత్త layer జోడించడానికి లేదా సృష్టించడానికి, Layer palette పైన ఉన్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:07 | Add layer అనే పేరుతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
01:10 | Layer name టెక్స్ట్ బాక్స్ లో, మనం layer కు ఒక పేరును కేటాయించవచ్చు. |
01:15 | నేను ఈ లేయర్ కి eye గా పేరు పెడుతున్నాను. |
01:18 | ఇప్పుడు, మనం Position డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయటం ద్వారా layer యొక్క స్థానాన్ని నిర్ణయించవచ్చు. |
01:25 | ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి. |
01:27 | Above current- ఇది ఈ లేయర్ ను ప్రస్తుత లేయర్ యొక్క పై భాగంలో ఉంచుతుంది. |
01:32 | Below current, ఇది ఈ లేయర్ ను ప్రస్తుత లేయర్ కిందన ఉంచుతుంది. |
01:36 | As sublayer of current ఇది ప్రస్తుత లేయర్ యొక్క ఒక భాగంగా ఉందని సూచిస్తుంది. |
01:41 | నేను దాని స్థానాన్ని Above current గా ఉంచుతాను మరియు Add బటన్ పై క్లిక్ చేస్తాను. |
01:47 | ఇప్పుడు Layer palette లో eye పేరుతో ఉన్న ఒక కొత్త layer కనిపిస్తుంది గమనించండి. |
01:52 | ఇదే విధంగా, bow పేరుతో వేరొక లేయర్ ని సృష్టించండి. |
02:00 | మన వద్ద Layer palette లో మూడు లేయర్ లు ఉన్నాయి. |
02:04 | తరువాత, ఒక layer పేరును మార్చడం నేర్చుకుందాం. |
02:08 | ముందుగా, Layer 1 పై డబల్ క్లిక్ చేయండి.తరువాత దాని పేరును circle గా మర్చిEnter నొక్కండి. |
02:16 | మన canvas కు తిరిగి వెళ్దాం... అక్కడ రెండు eyes మరియు ఒక bow ఉన్నాయి. |
02:20 | మనం సృష్టించిన రెండు లేయర్స్ కు ఈ ఆకారాలను కదిలిద్దాం. |
02:25 | mouse ని డ్రాగ్ చేయటం ద్వారా ఈ రెండు eyes ను ఎంచుకోండి. |
02:28 | ఇప్పుడు మీ కీబోర్డ్ పై Ctrl + X నొక్కండి. ఐస్(కళ్ళు) ఇప్పుడు కనుమరుగయ్యాయి. |
02:34 | ఇప్పుడు Palette లోని eye లేయర్ పై క్లిక్ చేయండి. |
02:38 | canvas కు తిరిగి రండి మరియు Ctrl + Alt + Vను నొక్కండి. |
02:44 | bow ఆకారం కొరకూ ఇదే చర్యను పునరావృతం చేయండి. |
02:52 | అన్ని ఆబ్జెక్ట్స్ ల ఎంపికను రద్దు చేయటానికి canvas పైన ఏదయినా ఖాళీ ప్రదేశం పై క్లిక్ చేయండి. |
03:00 | eye మరియు lock ఐకాన్స్ (చిహ్నాలు) లేయర్స్ ను దాచటానికి మరియు లాక్ చేయటానికి సహాయం చేస్తాయి. |
03:04 | మీరు ఒక లేయర్ ని దాచినపుడు, తరవాతి కింది లేయర్స్ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ ను స్పష్టంగా చూడగలరు. |
03:11 | మీరు ఒక లేయర్ ని లాక్ చేసినపుడు, ఆ నిర్దిష్ట లేయర్ ప్రమాదవశాత్తు చేసే సవరణలను (ఎడిట్స్) నిరోధించవచ్చు. |
03:18 | మనం పెద్దవి మరియు క్లిష్టమైన assignment ల పై పనిచేసేటప్పుడు ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. |
03:25 | ప్రతీ layer యొక్క ఎడమవైపు ఒక eye మరియు ఒక lock అను పేర్లు గల 2 ఐకాన్లను గమనించండి. |
03:32 | ఇప్పుడు మనం వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
03:35 | లేయర్స్ ను lock లేదా చేయటానికి, lock ఐకాన్ పై క్లిక్ చేయండి. Bow లేయర్ ను ఇప్పుడు నేను లాక్ చేశాను. |
03:42 | ఒకవేళ ఒక layer లాక్ అయ్యుంటే, మనం ఆ లేయర్ కు ఎటువంటి మార్పులను చేయలేము. |
03:47 | కేన్వాస్ పైన bow ను ఎంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆలా చేయటం సాధ్యం కావటం లేదు అన్నది మీరు గమనిస్తారు. |
03:58 | ఇప్పుడు, నేను bow layer ను unlock చేస్తాను. |
04:01 | ఇప్పుడు, నేను bow ఆబ్జెక్ట్ ను ఎంచుకోగలను మరియు దాని లక్షణాలను మార్పు చేయగలను. |
04:07 | కేన్వాస్ పైన ఒక layer ని కనిపించేలా లేదా కనిపించకుండా చేయటానికి,లేయర్ యొక్క ఎడమవైపు eye ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:15 | bow layer కొరకు నేను eye ఐకాన్ పై క్లిక్ చేస్తున్నాను. |
04:18 | కేన్వాస్ పై ఏమి జరుగుతుందో గమనించండి. |
04:23 | ఇప్పుడు, నేను bow layer ని డూప్లికేట్ చేస్తాను. |
04:26 | Layer menu కి వెళ్ళి Duplicate Current Layer ఎంపిక పై క్లిక్ చేయండి. |
04:32 | Layer Palette window లో bow copy పేరుతో ఉన్న ఒక కొత్త లేయర్ సృష్టించబడిందని గమనించండి. |
04:41 | కానీ, మనం కేన్వాస్ పైన కొత్త bow ను చూడలేము. ఎందుకంటే bow object మునుపటి లేయర్లో అతివ్యాప్తి చెందుతుంది. |
04:50 | అన్నిటి కన్నా పైన ఉన్న లేయర్ నుండి bow ను ఎంచుకోని, రెండు bows ను చూడటానికి దానిని ఒక పక్కకి కదిలించండి. |
04:56 | circle layer ను ఎంచుకోండి. |
04:58 | eyes మరియు bows లను చుట్టుముట్టి canvas పైన ఒక ellipse ను గీయండి. దానిని నారంజి రంగుకు మార్చండి. |
05:05 | ellipse, బ్యాక్ గ్రౌండ్ గా కనిపిస్తుంది మరియు ఇతర ఆబ్జెక్ట్ లు దాని పైన కనిపిస్తాయి. |
05:10 | Layers Palette లోని plus ఐకాన్ కు తరువాత ఉన్న4 ఐకాన్లను ఎంచుకున్నlayer ను స్థానపర్చడానికి సహాయం చేస్తాయి. |
05:17 | మొదటి ఐకాన్ ఎంచుకున్న లేయర్ ను అన్నిటికంటే పైన ఉండే లేయర్ గా లేవదీస్తుంది. |
05:23 | ప్రస్తుతం circle layer ఎంచుకోబడింది. |
05:25 | దానిపై క్లిక్ చేసి గమనిస్తే, circle layer ఇప్పుడు అన్నిటి కంటే పైన ఉండే layer గా అవుతుంది. |
05:33 | చివరి ఐకాన్ ఎంచుకున్నlayer ను క్రిందికి దించి అన్నిటికంటే దిగువన ఉండే layer గా చేస్తుంది. |
05:38 | ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. circle layer ఇప్పుడు అన్నిటి కంటే దిగువన ఉండే layer గా అయిందని గమనించండి. |
05:44 | రెండవ ఐకాన్ ఎంచుకున్న layer ని, ఒక layer పైకి వచ్చేలా లేవదీస్తుంది. |
05:48 | ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. circle లేయర్ eye లేయర్ పైకి తరలించబడింది. కనుక ఐస్(కళ్ళు) కనిపించడం లేదు. |
05:57 | మూడవ ఐకాన్ ఎంచుకున్న లేయర్ ను, ఒక layer కిందికి తెస్తుంది. |
06:01 | ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. Circle లేయర్ ఇప్పుడు eye లేయర్ కిందికి తరలించబడింది. |
06:07 | అంటే, ఈ నాలుగు ఐకాన్ లు ఇలా పనిచేస్తాయని అర్థం. |
06:13 | చివరన ఉన్న మైనస్ ఐకాన్ ఎంచుకున్న layer ను తొలగిస్తుంది. bow copy లేయర్ ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి. |
06:21 | bow copy లేయర్ ఇక మీదట కనిపించడం లేదని గమనించండి. |
06:27 | ఒక మొత్తం లేయర్ కి Blend filter ను వర్తింపజేయుటకు Blend mode అనేది ఒక శీఘ్ర పరిష్కారం. |
06:31 | అంటే ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఎంచుకున్న లేయర్స్ పై అతిపాతం అవుతే Inkscape ఆ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క ఒక పిక్సెల్-బై -పిక్సెల్ మిశ్రమం చేస్తుంది. |
06:41 | కనుక, filter లు కనిపించేలా చేయడానికి circle లేయర్ అన్నిటికన్న పైన ఉంచండి. |
06:46 | Blend mode యొక్క డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయండి. అక్కడ 5 ఎంపికలు ఉన్నాయని గమనించండి. |
06:52 | మొదటి ఎంపిక, అనగా Normal,అది లేయర్ కు ఎలాంటి filter ను జోడించదు. |
06:57 | నేను దానిపై క్లిక్ చేస్తాను. గమనించండి, లేయర్ కు ఫిల్టర్ జోడించబడలేదు. |
07:03 | తరువాత, Multiply పై క్లిక్ చేయండి. |
07:06 | పై లేయర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్, కాంతిని ఫిల్టర్ చేస్తాయని గమనించండి, అందువల్ల కింది లేయర్స్ లోని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. |
07:14 | అదే సమయంలో, ఇది ఓవర్లాప్ ప్రాంతాలలో రంగులను ముదురు రంగులగా కలపడం లేదా మిశ్రమం చేయడం చేస్తుంది. |
07:21 | తరువాత ఎంపిక Screen. |
07:25 | పైన ఆబ్జెక్ట్స్ ను గమనించండి; అవి కింది ఉన్న ఆబ్జెక్ట్స్ కి లేత రంగును జోడిస్తాయి. |
07:30 | కనుక,ఇది ఓవర్లాప్ ప్రాంతాలలో రంగులను కలపడం లేదా మిశ్రమం చేయడం ద్వారా లేత రంగులకు మార్చుతుంది. |
07:36 | Darken ను ఎంచుకోండి. పైన లేయర్ లోని ఆబ్జెక్ట్స్, కింది లేయర్స్ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ ను ముదురుగా చేసాయి. |
07:44 | ఇప్పుడు, చివరి ఎంపిక Lighten ను ఎంచుకుందాం. ఇక్కడ పైన ఆబ్జెక్ట్స్ కింది ఆబ్జెక్ట్స్ ను లేతగా చేస్తాయి. |
07:53 | ఏ సమయంలో అయినా మీరు Blend mode లో Normal కు తిరిగి వెళ్తే, అప్పటివరకు వర్తించబడిన బ్లెండ్ ఫిల్టర్లు అదృశ్యమవుతాయి. |
08:00 | మనం Filters మెనూలో చాలా ఫిల్టర్లను చూడవచ్చు. |
08:04 | ఏదైనా నిర్దిష్ట ఫిల్టర్ను వర్తింపచేయడానికి, మొదట ఆబ్జెక్ట్ ను ఎంచుకుని ఆపై కావలసిన ఫిల్టర్ పై క్లిక్ చేయండి. |
08:12 | circle లేయర్ ను మళ్ళీ కిందికి తరలించండి. |
08:16 | నేను ఒక eye ని ఎంచుకుంటాను. Filters మెనూ కి వెళ్ళి Blur మరియు Fancy blur ను ఎంచుకోండి. |
08:26 | eye పైన మార్పులను గమనించండి. |
08:29 | నేను మరొక eye ని ఎంచుకుంటాను. Filters మెనూ కి వెళ్ళి Bevel మరియు Smart jelly ని ఎంచుకోండి. |
08:39 | eye కు వర్తించబడిన మార్పులను ఒకసారి మళ్ళీ గమనించండి. |
08:44 | ఇప్పుడు,bow ని ఎంచుకోండి. Filters మెనూ కి వెళ్ళి Scatter మరియు Air spray ని ఎంచుకోండి. |
08:51వెళ్లి | bow, ఒకవేళ air-spray చేయబడి ఉంటే ఎలా ఉంటుందో ఆలా కనిపిస్తుంది. |
08:55 | Opacity ఎంపిక, Blend mode కు సరిగ్గా కిందన ఉంటుంది. ఇది ఎంచుకున్న లేయర్ యొక్క పారదర్శకత తగ్గించడానికి సహాయం చేస్తుంది. |
09:01 | circle లేయర్ ను ఎంచుకోండి. |
09:03 | Opacity స్థాయిని సర్దుబాటు చేసి, దీర్ఘవృతం లోని మార్పులను గమనించండి. |
09:10 | తరువాత, మనం Boolean operations గూర్చి నేర్చుకుంటాం. |
09:13 | Path మెనూ కి వెళ్ళండి. ఇవి అందుబాటులో ఉన్నBoolean operations. |
09:21 | అందుబాటులో ఉన్న ఆకారాలను ఒక పక్కన ఉంచండి. |
09:26 | పచ్చ రంగుతో ఒక చతురస్రాన్ని మరియు ఎరుపు రంగుతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్తాన్ని చతురస్రం పక్క భాగం వైపు పైన ఉంచండి. |
09:36 | రెండిటిని ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి, Union పై క్లిక్ చేయండి. ఇప్పుడు రెండు ఆకారాలు ఒకదానితో ఒకటి కలిసిఉన్నాయని గమనించండి. |
09:46 | ఇప్పుడు ఈ చర్యను రద్దు చేయటానికి మీ కీబోర్డ్ పై Ctrl + Z ను నొక్కండి. |
09:51 | మళ్ళీ రెండిటిని ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళండి. |
09:55 | Difference పై క్లిక్ చేయండి మరియి ఏమి జరుగుతుందో గమనించండి. |
09:59 | ఈ చర్యను రద్దు చేయటానికి మళ్ళీ Ctrl + Z ను నొక్కండి. |
10:03 | మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళండి Intersection పై క్లిక్ చేయండి మరియు ఆకారంలో మార్పును గమనించండి. |
10:11 | ఈ చర్యను రద్దు చేయటానికి మళ్ళీ Ctrl + Z ను నొక్కండి. |
10:16 | మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి.Path మెనూ కి వెళ్ళి Exclusion పై క్లిక్ చేయండి. |
10:22 | ఆకారంలో మార్పును గమనించండి. |
10:24 | మళ్ళీ Ctrl + Z ను నొక్కండి. |
10:27 | మళ్ళీ ఇంకోసారి రెండు ఆబ్జెక్ట్ లను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి Division పై క్లిక్ చేయండి. |
10:34 | విభజించబడిన వృత్తంపై క్లిక్ చేయండి మరియు ఫలితాన్ని చూడటానికి ఆ భాగాన్ని ఒక పక్కకి కదిలించండి. |
10:39 | ఇప్పుడు, ఈ చర్యలను రద్దుచేయటానికి Ctrl + Z ని రెండు సార్లు నొక్కండి. |
10:44 | మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి Cut Path పై క్లిక్ చేయండి. |
10:50 | ఆకారంలో మార్పును గమనించండి. |
10:53 | ఒకవేళ ఆబ్జెక్ట్ స్ట్రోక్ ను కలిగివుంటేనే Cut Path ఎంపిక పనిచేస్తుంది. మొదటి ఆకారాల ఎంపిక ని రద్దు చేయండి. |
10:59 | ఇప్పుడు,strokes లో ఏదయినా ఒకటి ఎంచుకోని , cut path కనపడేలా చేయటానికి దానిని ఒక పక్కకి కదిలించండి. |
11:05 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- |
11:09 | లేయర్స్, ఫిల్టర్స్ మరియు బూలియన్ ఆపరేషన్స్. |
11:14 | ఇక్కడ మీకోసం 4 అసైన్మెంట్లు, |
11:16 | గులాబీ రంగుతో ఒక దీర్ఘ చతురస్రం మరియు ఆకు పచ్చ రంగుతో ఒక త్రిభుజం సృష్టించండి. |
11:21 | త్రిభుజాన్ని దీర్ఘచతురస్రం పైన ఉంచండి. |
11:24 | రెండిటిని ఎంచుకోండి. Union ఉపయోగించండి. ఇది చూడటానికి ఒక హోమ్ ఐకాన్ వలె ఉండాలి. |
11:30 | లేయర్ కు home గా పేరు పెట్టండి. |
11:32 | 2 వృత్తాలు గీయండి. |
11:34 | ఒక దాన్ని వేరొక దానిపైన ఉంచండి. |
11:36 | రెండిటిని ఎంచుకోండి మరియు Difference ను ఉపయోగించండి. |
11:39 | ఇది చూడటానికి ఒక క్రీసెంట్ వలె ఉండాలి. |
11:42 | ఒక దీర్ఘవృత్తాన్ని గీయండి. |
11:44 | 10 మూలలతో ఒక నక్షత్రాన్ని గీయండి. |
11:46 | దీన్ని దీర్ఘవృత్తం మధ్యలో ఉంచండి. |
11:49 | రెండిటిని ఎంచుకోండి మరియు Exclusion ను ఉపయోగించండి. |
11:52 | వరుసగా crescent మరియు star అనే పేర్లతో 2 లేయర్స్ ను సృష్టించండి. |
11:57 | క్రీసెంట్ ఆకారాన్నిCut చేసి, దాన్ని క్రీసెంట్ లేయర్ లో paste చేయండి. |
12:00 | అదే విధంగా, నక్షత్రం ఆకారం కోసం కూడా చేయండి. |
12:03 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
12:07 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
12:16 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
12:23 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
12:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
12:34 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
12:39 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
12:42 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |