Inkscape/C2/Layers-and-Boolean-operations/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Layers and Boolean operations పై ఈ Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం వీటి గూర్చి నేర్చుకుంటాం- లేయర్స్,
00:11 ఫిల్టర్స్ మరియు బూలియన్ ఆపరేషన్స్.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి,నేను,
00:18 Ubuntu Linux 12.04 OS
00:21 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:25 Inkscape ని తెరుద్దాం. Dash home వెళ్ళి Inkscape అని టైప్ చెయండి.
00:30 Inkscape లోగో పై క్లిక్ చేయండి.
00:32 మనం ఇదివరకే రూపొందించిన Assignment_2.svg ఫైల్ ను తెరుద్దాం
00:38 నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
00:41 ముందుగా, మనం Inkscape లో Layers గూర్చి నేర్చుకుందాం.
00:45 Layer మెనూ కి వెళ్ళి, Layers ఎంపిక పై క్లిక్ చేయండి.
00:50 ఇప్పుడు, interface యొక్క కుడిపక్క భాగంపై Layer palette తెరుచుకుంది.
00:55 అప్రమేయంగా, అక్కడ ఒక layer ఉంది.దానికి Layer 1గా పేరు ఉందని చూడవచ్చు.
01:01 ఒక కొత్త layer జోడించడానికి లేదా సృష్టించడానికి, Layer palette పైన ఉన్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:07 Add layer అనే పేరుతో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:10 Layer name టెక్స్ట్ బాక్స్ లో, మనం layer కు ఒక పేరును కేటాయించవచ్చు.
01:15 నేను ఈ లేయర్ కి eye గా పేరు పెడుతున్నాను.
01:18 ఇప్పుడు, మనం Position డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయటం ద్వారా layer యొక్క స్థానాన్ని నిర్ణయించవచ్చు.
01:25 ఇక్కడ 3 ఎంపికలు ఉన్నాయి.
01:27 Above current- ఇది ఈ లేయర్ ను ప్రస్తుత లేయర్ యొక్క పై భాగంలో ఉంచుతుంది.
01:32 Below current, ఇది ఈ లేయర్ ను ప్రస్తుత లేయర్ కిందన ఉంచుతుంది.
01:36 As sublayer of current ఇది ప్రస్తుత లేయర్ యొక్క ఒక భాగంగా ఉందని సూచిస్తుంది.
01:41 నేను దాని స్థానాన్ని Above current గా ఉంచుతాను మరియు Add బటన్ పై క్లిక్ చేస్తాను.
01:47 ఇప్పుడు Layer palette లో eye పేరుతో ఉన్న ఒక కొత్త layer కనిపిస్తుంది గమనించండి.
01:52 ఇదే విధంగా, bow పేరుతో వేరొక లేయర్ ని సృష్టించండి.
02:00 మన వద్ద Layer palette లో మూడు లేయర్ లు ఉన్నాయి.
02:04 తరువాత, ఒక layer పేరును మార్చడం నేర్చుకుందాం.
02:08 ముందుగా, Layer 1 పై డబల్ క్లిక్ చేయండి.తరువాత దాని పేరును circle గా మర్చిEnter నొక్కండి.
02:16 మన canvas కు తిరిగి వెళ్దాం... అక్కడ రెండు eyes మరియు ఒక bow ఉన్నాయి.
02:20 మనం సృష్టించిన రెండు లేయర్స్ కు ఈ ఆకారాలను కదిలిద్దాం.
02:25 mouse ని డ్రాగ్ చేయటం ద్వారా ఈ రెండు eyes ను ఎంచుకోండి.
02:28 ఇప్పుడు మీ కీబోర్డ్ పై Ctrl + X నొక్కండి. ఐస్(కళ్ళు) ఇప్పుడు కనుమరుగయ్యాయి.
02:34 ఇప్పుడు Palette లోని eye లేయర్ పై క్లిక్ చేయండి.
02:38 canvas కు తిరిగి రండి మరియు Ctrl + Alt + Vను నొక్కండి.
02:44 bow ఆకారం కొరకూ ఇదే చర్యను పునరావృతం చేయండి.
02:52 అన్ని ఆబ్జెక్ట్స్ ల ఎంపికను రద్దు చేయటానికి canvas పైన ఏదయినా ఖాళీ ప్రదేశం పై క్లిక్ చేయండి.
03:00 eye మరియు lock ఐకాన్స్ (చిహ్నాలు) లేయర్స్ ను దాచటానికి మరియు లాక్ చేయటానికి సహాయం చేస్తాయి.
03:04 మీరు ఒక లేయర్ ని దాచినపుడు, తరవాతి కింది లేయర్స్ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ ను స్పష్టంగా చూడగలరు.
03:11 మీరు ఒక లేయర్ ని లాక్ చేసినపుడు, ఆ నిర్దిష్ట లేయర్ ప్రమాదవశాత్తు చేసే సవరణలను (ఎడిట్స్) నిరోధించవచ్చు.
03:18 మనం పెద్దవి మరియు క్లిష్టమైన assignment ల పై పనిచేసేటప్పుడు ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి.
03:25 ప్రతీ layer యొక్క ఎడమవైపు ఒక eye మరియు ఒక lock అను పేర్లు గల 2 ఐకాన్లను గమనించండి.
03:32 ఇప్పుడు మనం వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
03:35 లేయర్స్ ను lock లేదా చేయటానికి, lock ఐకాన్ పై క్లిక్ చేయండి. Bow లేయర్ ను ఇప్పుడు నేను లాక్ చేశాను.
03:42 ఒకవేళ ఒక layer లాక్ అయ్యుంటే, మనం ఆ లేయర్ కు ఎటువంటి మార్పులను చేయలేము.
03:47 కేన్వాస్ పైన bow ను ఎంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆలా చేయటం సాధ్యం కావటం లేదు అన్నది మీరు గమనిస్తారు.
03:58 ఇప్పుడు, నేను bow layer ను unlock చేస్తాను.
04:01 ఇప్పుడు, నేను bow ఆబ్జెక్ట్ ను ఎంచుకోగలను మరియు దాని లక్షణాలను మార్పు చేయగలను.
04:07 కేన్వాస్ పైన ఒక layer ని కనిపించేలా లేదా కనిపించకుండా చేయటానికి,లేయర్ యొక్క ఎడమవైపు eye ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:15 bow layer కొరకు నేను eye ఐకాన్ పై క్లిక్ చేస్తున్నాను.
04:18 కేన్వాస్ పై ఏమి జరుగుతుందో గమనించండి.
04:23 ఇప్పుడు, నేను bow layer ని డూప్లికేట్ చేస్తాను.
04:26 Layer menu కి వెళ్ళి Duplicate Current Layer ఎంపిక పై క్లిక్ చేయండి.
04:32 Layer Palette window లో bow copy పేరుతో ఉన్న ఒక కొత్త లేయర్ సృష్టించబడిందని గమనించండి.
04:41 కానీ, మనం కేన్వాస్ పైన కొత్త bow ను చూడలేము. ఎందుకంటే bow object మునుపటి లేయర్లో అతివ్యాప్తి చెందుతుంది.
04:50 అన్నిటి కన్నా పైన ఉన్న లేయర్ నుండి bow ను ఎంచుకోని, రెండు bows ను చూడటానికి దానిని ఒక పక్కకి కదిలించండి.
04:56 circle layer ను ఎంచుకోండి.
04:58 eyes మరియు bows లను చుట్టుముట్టి canvas పైన ఒక ellipse ను గీయండి. దానిని నారంజి రంగుకు మార్చండి.
05:05 ellipse, బ్యాక్ గ్రౌండ్ గా కనిపిస్తుంది మరియు ఇతర ఆబ్జెక్ట్ లు దాని పైన కనిపిస్తాయి.
05:10 Layers Palette లోని plus ఐకాన్ కు తరువాత ఉన్న4 ఐకాన్లను ఎంచుకున్నlayer ను స్థానపర్చడానికి సహాయం చేస్తాయి.
05:17 మొదటి ఐకాన్ ఎంచుకున్న లేయర్ ను అన్నిటికంటే పైన ఉండే లేయర్ గా లేవదీస్తుంది.
05:23 ప్రస్తుతం circle layer ఎంచుకోబడింది.
05:25 దానిపై క్లిక్ చేసి గమనిస్తే, circle layer ఇప్పుడు అన్నిటి కంటే పైన ఉండే layer గా అవుతుంది.
05:33 చివరి ఐకాన్ ఎంచుకున్నlayer ను క్రిందికి దించి అన్నిటికంటే దిగువన ఉండే layer గా చేస్తుంది.
05:38 ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. circle layer ఇప్పుడు అన్నిటి కంటే దిగువన ఉండే layer గా అయిందని గమనించండి.
05:44 రెండవ ఐకాన్ ఎంచుకున్న layer ని, ఒక layer పైకి వచ్చేలా లేవదీస్తుంది.
05:48 ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. circle లేయర్ eye లేయర్ పైకి తరలించబడింది. కనుక ఐస్(కళ్ళు) కనిపించడం లేదు.
05:57 మూడవ ఐకాన్ ఎంచుకున్న లేయర్ ను, ఒక layer కిందికి తెస్తుంది.
06:01 ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. Circle లేయర్ ఇప్పుడు eye లేయర్ కిందికి తరలించబడింది.
06:07 అంటే, ఈ నాలుగు ఐకాన్ లు ఇలా పనిచేస్తాయని అర్థం.
06:13 చివరన ఉన్న మైనస్ ఐకాన్ ఎంచుకున్న layer ను తొలగిస్తుంది. bow copy లేయర్ ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి.
06:21 bow copy లేయర్ ఇక మీదట కనిపించడం లేదని గమనించండి.
06:27 ఒక మొత్తం లేయర్ కి Blend filter ను వర్తింపజేయుటకు Blend mode అనేది ఒక శీఘ్ర పరిష్కారం.
06:31 అంటే ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఎంచుకున్న లేయర్స్ పై అతిపాతం అవుతే Inkscape ఆ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క ఒక పిక్సెల్-బై -పిక్సెల్ మిశ్రమం చేస్తుంది.
06:41 కనుక, filter లు కనిపించేలా చేయడానికి circle లేయర్ అన్నిటికన్న పైన ఉంచండి.
06:46 Blend mode యొక్క డ్రాప్ -డౌన్ జాబితా పై క్లిక్ చేయండి. అక్కడ 5 ఎంపికలు ఉన్నాయని గమనించండి.
06:52 మొదటి ఎంపిక, అనగా Normal,అది లేయర్ కు ఎలాంటి filter ను జోడించదు.
06:57 నేను దానిపై క్లిక్ చేస్తాను. గమనించండి, లేయర్ కు ఫిల్టర్ జోడించబడలేదు.
07:03 తరువాత, Multiply పై క్లిక్ చేయండి.
07:06 పై లేయర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్, కాంతిని ఫిల్టర్ చేస్తాయని గమనించండి, అందువల్ల కింది లేయర్స్ లోని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి.
07:14 అదే సమయంలో, ఇది ఓవర్లాప్ ప్రాంతాలలో రంగులను ముదురు రంగులగా కలపడం లేదా మిశ్రమం చేయడం చేస్తుంది.
07:21 తరువాత ఎంపిక Screen.
07:25 పైన ఆబ్జెక్ట్స్ ను గమనించండి; అవి కింది ఉన్న ఆబ్జెక్ట్స్ కి లేత రంగును జోడిస్తాయి.
07:30 కనుక,ఇది ఓవర్లాప్ ప్రాంతాలలో రంగులను కలపడం లేదా మిశ్రమం చేయడం ద్వారా లేత రంగులకు మార్చుతుంది.
07:36 Darken ను ఎంచుకోండి. పైన లేయర్ లోని ఆబ్జెక్ట్స్, కింది లేయర్స్ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ ను ముదురుగా చేసాయి.
07:44 ఇప్పుడు, చివరి ఎంపిక Lighten ను ఎంచుకుందాం. ఇక్కడ పైన ఆబ్జెక్ట్స్ కింది ఆబ్జెక్ట్స్ ను లేతగా చేస్తాయి.
07:53 ఏ సమయంలో అయినా మీరు Blend mode లో Normal కు తిరిగి వెళ్తే, అప్పటివరకు వర్తించబడిన బ్లెండ్ ఫిల్టర్లు అదృశ్యమవుతాయి.
08:00 మనం Filters మెనూలో చాలా ఫిల్టర్లను చూడవచ్చు.
08:04 ఏదైనా నిర్దిష్ట ఫిల్టర్ను వర్తింపచేయడానికి, మొదట ఆబ్జెక్ట్ ను ఎంచుకుని ఆపై కావలసిన ఫిల్టర్ పై క్లిక్ చేయండి.
08:12 circle లేయర్ ను మళ్ళీ కిందికి తరలించండి.
08:16 నేను ఒక eye ని ఎంచుకుంటాను. Filters మెనూ కి వెళ్ళి Blur మరియు Fancy blur ను ఎంచుకోండి.
08:26 eye పైన మార్పులను గమనించండి.
08:29 నేను మరొక eye ని ఎంచుకుంటాను. Filters మెనూ కి వెళ్ళి Bevel మరియు Smart jelly ని ఎంచుకోండి.
08:39 eye కు వర్తించబడిన మార్పులను ఒకసారి మళ్ళీ గమనించండి.
08:44 ఇప్పుడు,bow ని ఎంచుకోండి. Filters మెనూ కి వెళ్ళి Scatter మరియు Air spray ని ఎంచుకోండి.
08:51వెళ్లి bow, ఒకవేళ air-spray చేయబడి ఉంటే ఎలా ఉంటుందో ఆలా కనిపిస్తుంది.
08:55 Opacity ఎంపిక, Blend mode కు సరిగ్గా కిందన ఉంటుంది. ఇది ఎంచుకున్న లేయర్ యొక్క పారదర్శకత తగ్గించడానికి సహాయం చేస్తుంది.
09:01 circle లేయర్ ను ఎంచుకోండి.
09:03 Opacity స్థాయిని సర్దుబాటు చేసి, దీర్ఘవృతం లోని మార్పులను గమనించండి.
09:10 తరువాత, మనం Boolean operations గూర్చి నేర్చుకుంటాం.
09:13 Path మెనూ కి వెళ్ళండి. ఇవి అందుబాటులో ఉన్నBoolean operations.
09:21 అందుబాటులో ఉన్న ఆకారాలను ఒక పక్కన ఉంచండి.
09:26 పచ్చ రంగుతో ఒక చతురస్రాన్ని మరియు ఎరుపు రంగుతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్తాన్ని చతురస్రం పక్క భాగం వైపు పైన ఉంచండి.
09:36 రెండిటిని ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి, Union పై క్లిక్ చేయండి. ఇప్పుడు రెండు ఆకారాలు ఒకదానితో ఒకటి కలిసిఉన్నాయని గమనించండి.
09:46 ఇప్పుడు ఈ చర్యను రద్దు చేయటానికి మీ కీబోర్డ్ పై Ctrl + Z ను నొక్కండి.
09:51 మళ్ళీ రెండిటిని ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళండి.
09:55 Difference పై క్లిక్ చేయండి మరియి ఏమి జరుగుతుందో గమనించండి.
09:59 ఈ చర్యను రద్దు చేయటానికి మళ్ళీ Ctrl + Z ను నొక్కండి.
10:03 మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళండి Intersection పై క్లిక్ చేయండి మరియు ఆకారంలో మార్పును గమనించండి.
10:11 ఈ చర్యను రద్దు చేయటానికి మళ్ళీ Ctrl + Z ను నొక్కండి.
10:16 మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి.Path మెనూ కి వెళ్ళి Exclusion పై క్లిక్ చేయండి.
10:22 ఆకారంలో మార్పును గమనించండి.
10:24 మళ్ళీ Ctrl + Z ను నొక్కండి.
10:27 మళ్ళీ ఇంకోసారి రెండు ఆబ్జెక్ట్ లను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి Division పై క్లిక్ చేయండి.
10:34 విభజించబడిన వృత్తంపై క్లిక్ చేయండి మరియు ఫలితాన్ని చూడటానికి ఆ భాగాన్ని ఒక పక్కకి కదిలించండి.
10:39 ఇప్పుడు, ఈ చర్యలను రద్దుచేయటానికి Ctrl + Z ని రెండు సార్లు నొక్కండి.
10:44 మళ్ళీ రెండు ఆబ్జెక్ట్ల ను ఎంచుకోండి. Path మెనూ కి వెళ్ళి Cut Path పై క్లిక్ చేయండి.
10:50 ఆకారంలో మార్పును గమనించండి.
10:53 ఒకవేళ ఆబ్జెక్ట్ స్ట్రోక్ ను కలిగివుంటేనే Cut Path ఎంపిక పనిచేస్తుంది. మొదటి ఆకారాల ఎంపిక ని రద్దు చేయండి.
10:59 ఇప్పుడు,strokes లో ఏదయినా ఒకటి ఎంచుకోని , cut path కనపడేలా చేయటానికి దానిని ఒక పక్కకి కదిలించండి.
11:05 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి-
11:09 లేయర్స్, ఫిల్టర్స్ మరియు బూలియన్ ఆపరేషన్స్.
11:14 ఇక్కడ మీకోసం 4 అసైన్మెంట్లు,
11:16 గులాబీ రంగుతో ఒక దీర్ఘ చతురస్రం మరియు ఆకు పచ్చ రంగుతో ఒక త్రిభుజం సృష్టించండి.
11:21 త్రిభుజాన్ని దీర్ఘచతురస్రం పైన ఉంచండి.
11:24 రెండిటిని ఎంచుకోండి. Union ఉపయోగించండి. ఇది చూడటానికి ఒక హోమ్ ఐకాన్ వలె ఉండాలి.
11:30 లేయర్ కు home గా పేరు పెట్టండి.
11:32 2 వృత్తాలు గీయండి.
11:34 ఒక దాన్ని వేరొక దానిపైన ఉంచండి.
11:36 రెండిటిని ఎంచుకోండి మరియు Difference ను ఉపయోగించండి.
11:39 ఇది చూడటానికి ఒక క్రీసెంట్ వలె ఉండాలి.
11:42 ఒక దీర్ఘవృత్తాన్ని గీయండి.
11:44 10 మూలలతో ఒక నక్షత్రాన్ని గీయండి.
11:46 దీన్ని దీర్ఘవృత్తం మధ్యలో ఉంచండి.
11:49 రెండిటిని ఎంచుకోండి మరియు Exclusion ను ఉపయోగించండి.
11:52 వరుసగా crescent మరియు star అనే పేర్లతో 2 లేయర్స్ ను సృష్టించండి.
11:57 క్రీసెంట్ ఆకారాన్నిCut చేసి, దాన్ని క్రీసెంట్ లేయర్ లో paste చేయండి.
12:00 అదే విధంగా, నక్షత్రం ఆకారం కోసం కూడా చేయండి.
12:03 మీ పూర్తి అయిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
12:07 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
12:16 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
12:23 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
12:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
12:34 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
12:39 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
12:42 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya