LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:06, 30 March 2013 by Udaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రేఆఫీస్ Calc లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటాము:
00:09 ఒక డాక్యుమెంట్ లోకి ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము.
00:13 ఉదా: jpeg, png లేదా bmp.
00:19 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము
00:28

• ఇమేజెస్ ను ఒక స్ప్రెడ్ షీట్ లో ఈ క్రింది విధంగా చేర్చవచ్చు, • నేరుగా ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము • ఒక గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి • ఒక క్లిప్ బోర్డ్ సహాయముతో లేదా • గ్యాలరీ నుండి. •

00:39 ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చర్చిద్దాము.
00:43 మన "Personal-Finance-Tracker.ods" స్ప్రెడ్ షీట్ ను ఓపెన్ చేద్దాము.
00:48 ముందుగా, మనము షీట్ 2 ను సెలెక్ట్ చేసుకుందాము.
00:51 ఈ షీట్లలో మనము ఇమేజెస్ ఇన్సర్ట్ చేద్దాము.
00:54 ఒక సెల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత చిత్రాలను ఇన్సర్ట్ చేయడము మంచి పద్దతి
00:59 ఒక ఇమేజ్ మీ కంప్యూటర్ లో ఇదివరకే సేవ్ అయ్యి ఉంటే, దానిని మీరు ఈ విధముగా ఇన్సర్ట్ చేయవచ్చు ముందుగా "Insert" పై క్లిక్ చేయండి
1:06 మరియు తరువాత "Picture" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "From File" సెలెక్ట్ చేయండి.
1:10 ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ ను కనుగొనండి.
1:14 నేను ఇదివరకే కొన్ని ఇమేజ్ లను "Images" అనే పేరుతో ఉన్న ఫోల్డరులో డెస్క్ టాప్ పై సేవ్ చేసాను.
1:20 కాబట్టి, నేను "Image1 ఎంచుకుంటాను.
1:24 ఇమేజ్ యొక్క పేరును మనము "Location" ఫీల్డ్ లో చూస్తాము.
1:28 "Open" బటన్ పై క్లిక్ చేయండి.
1:31 స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ కనిపిస్తుందని గమనించండి. <pause>
1:38 మనము దానిని లింక్ చేయడము ద్వారా మరొక చిత్రమును ఇన్సర్ట్ చేద్దాము.
1:42 ముందుగా మనము ఒక కొత్త సెల్ ను సెలెక్ట్ చేసుకుందాము.
1:45 ఇప్పుడు, మనము "Insert" మరియు "Picture" పై క్లిక్ చేద్దాము మరియు "From File" నుండి సెలెక్ట్ చేసుకుందాము. మనము మరొక ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుందాము.
1:55 ఇప్పుడు "Image2" పై క్లిక్ చేయండి.
1:58 ఇమేజ్ ను మీ డాక్యుమెంట్ కు లింక్ చేయుటకు, "Link" ఆప్షన్ ను చెక్ చేయండి మరియు "Open" పై క్లిక్ చేయండి.
2:05 కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Keep Link" బటన్ పై క్లిక్ చేయండి.
2:11 చిత్రము ఇప్పుడు ఫైల్ కు లింక్ చేయబడింది.
2:15 లింకింగ్
2:17 మనము ఒక ఫైల్ ను లింక్ చేసినప్పుడు:

ముందుగా, అది సేవ్ చేయబడినప్పుడు, అది స్ప్రెడ్ షీట్ యొక్క సైజ్ ను తగ్గిస్తుంది.

2:23 మన స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ లేదు కాబట్టి.
2:27 రెండు ఫైల్స్ ను విడివిడిగా మార్చుటకు అది యూజర్ కు అవకాశమును ఇస్తుంది.
2:32 ఇమేజ్ ఫైల్ కు చేయబడిన ఏవైనా మార్పులు,

స్ప్రెడ్ షీట్ లో లింక్ చేయబడిన ఇమేజ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి.

2:39 ఫైల్ కు గ్రే స్కేల్ కు లింక్ చేయబడిన ఇమేజ్ 2 యొక్క రంగును మారుద్దాము.
2:46 ఈ చిత్రమును ఎడిట్ చేయుటకు నేను పిక్చర్ ఎడిటర్ GIMP ఉపయోగిస్తున్నాను.
2:50 మీ సిస్టం పై ఇన్స్టాల్ చేయబడిన ఏదైనా ఎడిటర్ ను మీరు ఉపయోగించవచ్చు.
2:54 ముందుగా మనము "Personal-Finance-Tracker.ods" ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము.
3:01 తరువాత, ఇమేజెస్ ఫోల్డరుకు వెళ్దాము.
3:04 "Image 2" ను సెలెక్ట్ చేయండి.
3:06 ఇప్పుడు, రైట్ క్లిక్ చేసి Open with GIMP ను సెలెక్ట్ చేయండి.
3:10 ఇమేజ్ 2 GIMP లో ఓపెన్ అవుతుంది.
3:13 ఇప్పుడు, చిత్రమును కలర్ నుండి గ్రే స్కేల్ కు మారుద్దాము.
3:18 ఇప్పుడు, ఇమేజ్ ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము.
3:22 "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము.
3:26 ఇమేజ్ 2 ఇప్పుడు గ్రే స్కేల్ లో కనిపిస్తుంది.
3:30 అయినప్పటికీ, ఫైల్ ను లింక్ చేయుటలో ఉన్న ప్రధాన పత్రికూలము ఏమిటంటే,

ఈ స్ప్రెడ్ షీట్ ను వేరొక కంప్యూటరుకు లేదా యూజరుకు మీరు పంపినప్పుడు,

3:40 మీరు స్ప్రెడ్ షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపవలసి ఉంటుంది.
3:44 అంటే, మీరు రెండు ఫైళ్ళను సేవ్ చేస్తున్న స్థానము యొక్క ట్రాక్ ను ఎప్పుడూ ఉంచుకోవలసి ఉంటుంది.
3:52 ఈ ఇమేజ్ ను స్ప్రెడ్ షీట్ యొక్క కుడివైపుకు కదిలిద్దాము.
3:58 ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజెస్ ను ఇన్సర్ట్ చేసే మరొక విధానము దానిని ఫోల్డరు నుండి డ్రాగ్ చేయడము.
4:05 దానిని మీరు సేవ్ చేసిన చోటి నుండి, మీ స్ప్రెడ్ షీట్ లోనికి డ్రాప్ చేయడము.
4:09 ఇప్పుడు మనము ఒక ఇమేజ్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము.
4:12 ఇప్పుడు, స్ప్రెడ్ షీట్ లో మీరు ఉంచాలని అనుకుంటున్న చోటికి ఇమేజ్ ను నేరుగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి.
4:19 ఇమేజ్ మీ డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ అవటము మీరు చూడవచ్చు.
4:23 CTRL మరియు Z ప్రెస్ చేసి ఈ మార్పును అన్ డూ చేద్దాము.
4:29 ఇప్పుడు, డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ఇమేజ్ ను లింక్ చేద్దాము
4:34 ఇది చాలా సులభము!

"Control" మరియు "Shift" కీలను ప్రెస్ చేసి పట్టుకోండి.

4:40 స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజ్ ను డ్రాగ్ చేసే సమయములో.
4:44 ఇమేజ్ ఫైల్ ఇప్పుడు డాక్యుమెంట్ కు లింక్ అయింది.
4:48 CTRL మరియు S కీ లను కలిపి ప్రెస్ చేయడము ద్వారా ఈ Calc ఫైల్ ను సేవ్ చేద్దాము.
4:54 ఈ ఫైల్ ను క్లోస్ చేద్దాము.
4:58 ఇప్పుడు మనము ఇమేజ్ ఉన్న ఫోల్డరుకు వెళ్దాము.
5:02 మనము ఇన్సర్ట్ చేసిన “Image 3.jpg”, ఇమేజ్ ను “Image4.jpg” గా రీనేం చేద్దాము.
5:12 ఇప్పుడు "Personal Finance Tracker.ods" ఫైల్ ను తిరిగి ఓపెన్ చేద్దాము.
5:18 లింక్ చేయబడిన ఇమేజ్ కనిపించడము లేదని మీరు చూడవచ్చు.
5:22 లింక్ పాత్ ఒక తప్పును చూపుతుంది!
5:25 ఈ లింక్ ను మనము డిలీట్ చేద్దాము.
5:28 ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకుందాము మరియు ఈ అభ్యాసము చేయండి.
5:32 ఒక ఇమేజ్ ను Calc షీట్ లో లింక్ వలే ఇన్సర్ట్ చేయండి, దానిని సేవ్ చేసి క్లోస్ చేయండి.
5:38 ఇప్పుడు, ఇమేజ్ సేవ్ చేయబడిన ఫోల్డరు వద్దకు వెళ్ళండి మరియు ఇమేజ్ ను డిలీట్ చేయండి.
5:43 ఇమేజ్ ఇంకా అక్కడ కనిపిస్తుందా లేదా అని చూడటానికి Calc ఫైల్ ను ఓపెన్ చేసి చెక్ చేయండి.
5:49 ఇప్పుడు ఇమేజ్ ను తిరిగి ఇమేజ్ ఫోల్డరులోనికి పేస్ట్ చేయండి.
5:53 Calc ఫైల్ లో ఇమేజ్ ఇంకా కనిపిస్తుందో లేదో చెక్ చేయండి.
5:57 "Standard" టూల్ బార్ క్రింద ఒక కొత్త టూల్ బార్ కనిపించడము గమనించండి.
6:02 ఇది "Picture" టూల్ బార్.
6:04 "Picture" టూల్ బార్ యొక్క పైభాగము ఎడమవైపు ఉన్న "Filter"బటన్ ఇమేజ్ యొక్క ఆకృతిని మార్చుటకు అనేకమైన ఆప్షన్లను అందిస్తుంది.
6:13 CTRL మరియు Z ప్రెస్ చేయడము ద్వారా దీనిని మనము అన్ డూ చేద్దాము.
6:18 ఇమేజ్ ను గ్రేస్కేల్, బ్లాక్ అండ్ వైట్ లేదా ఒక వాటర్ మార్క్ లాగా మార్చుటకు "Graphics mode" బటన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
6:26 "Picture" టూల్ బార్ పై ఉన్న ఇతర ఆప్షన్ల గురించి మనము తరువాత కవర్ చేద్దాము.
6:32 తరువాత ఒక క్లిప్ బోర్డు నుండి ఇమేజ్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము.
6:37 క్లిప్ బోర్డ్ పై సేవ్ చేయబడిన ఇమేజ్ లను ఒక లిబ్రేఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి మరొకదానికి కాపీ చేయవచ్చు.
6:44 మనము ఒక కొత్త స్ప్రెడ్ షీట్ సృష్టిద్దాము మరియు దానికి "abc.ods" అని పేరు పెడదాము.
6:50 ఇది మన టార్గెట్ డాక్యుమెంట్
6:53 మనకు ఇదివరకే "Personal-Finance-Tracker.ods" ఫైల్ లో ఒక ఇమేజ్ ఉంది.
6:59 ఇది మన సోర్స్ డాక్యుమెంట్
7:02 ఇప్పుడు సోర్స్ ఫైల్ నుండి కాపీ చేయవలసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి.
7:06 ఇమేజ్ ను కాపీ చేయుటకు "CTRL" మరియు "C" కలిపి ప్రెస్ చేయండి.
7:11 ఇమేజ్ ఇప్పుడు క్లిప్ బోర్డు పై సేవ్ చేయబడింది.
7:15 ఇప్పుడు "abc.ods" అయిన టార్గెట్ డాక్యుమెంట్ కు మారండి.
7:21 "abc.ods" లో సేవ్ చేయబడిన మీ ఇమేజ్ ను మీరు ఎక్కడ ఉంచాలని అనుకుంటున్నారో ఆ ప్రదేశమును సెలెక్ట్ చేయండి.
7:28 ఇప్పుడు డాక్యుమెంట్ లోనికి ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయుటకు "CTRL" మరియు "V" కీలను కలిపి ప్రెస్ చేయండి.
7:35 మన టార్గెట్ ఫైల్ లోకి ఇమేజ్ ఇన్సర్ట్ అయిందని మనము చూడవచ్చు.
7:42 ఇప్పుడు మనము Calc Gallery నుండి నేరుగా ఇమేజెస్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము.
7:48 "Gallery" లో మీరు మీ స్ప్రెడ్ షీట్ లోనికి ఇన్సర్ట్ చేసుకోగల ఇమేజ్ మరియు ధ్వనులు కూడా ఉంటాయి.
7:54 దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాము.
7:57 స్టాండర్డ్ టూల్ బార్ లో "Gallery" ఐకాన్ పై క్లిక్ చేయండి.
8:01 మరొక విధంగా, మెనూ బార్ లో ఉన్న "Tools" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత దానిని ఓపెన్ చేయుటకు "Gallery" పై క్లిక్ చేయండి.
8:09 ఇప్పుడు "Gallery" అందించే ఇమేజెస్ ను చూడండి మరియు మీ డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.
8:18 "Gallery" నుండి ఇమేజ్ ను డ్రాగ్ చేయండి

మరియు దానిని మీరు స్ప్రెడ్ షీట్ లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నారో అక్కడ డ్రాప్ చేయండి.

8:26 ఇమేజ్ మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ లోనికి ఇన్సర్ట్ అయిందని మీరు చూడవచ్చు.
8:34 దీనితో మనము "లిబ్రేఆఫీస్ Calc" పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
8:39 సారాంశముగా, మనము ఈ క్రిందివి నేర్చుకున్నాము-

అనేక విధములుగా ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము

8:46 ఒక ఫైల్ నుండి

ఒక క్లిప్ బోర్డు నుండి లేదా గ్యాలరీ నుండి


8:52 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
8:55 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
8:58 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు
9:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.

9:08 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
9:12 మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
9:19 స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
9:23 దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
9:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారము

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది

9:41 ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారు అందించారు

కలిసినందుకు ధన్యవాదములు

ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya