LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
00:09 ఒక డాక్యుమెంట్లో ఇమేజ్ ఫైల్ను ప్రవేశ పెట్టడం.
00:13 ఉదాహరణకు jpeg, png లేదా bmp.
00:19 ఇక్కడ మనం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:28 స్ప్రెడ్షీట్లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశ పెట్ట వచ్చు,

నేరుగా ఇమేజ్ ఫైల్ను ప్రవేశపెట్టుట

గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి

క్లిప్ బోర్డు నుండి లేదా

గ్యాలరీ నుండి.

00:39 ప్రతి ఒక్కదాని గురించి వివరంగా చర్చిద్దాం.
00:43 Personal-Finance-Tracker.ods స్ప్రెడ్షీట్ను తెరుద్దాం.
00:48 షీట్ 2ను ఎంపిక చేసుకుందాం.
00:51 ఈ షీట్లో చిత్రాలను ప్రవేశ పెడదాం.
00:54 ముందుగా సెల్ను ఎంచుకొని తరవాత చిత్రాలను ప్రవేశ పెట్టడం మంచి పధ్ధతి.
00:59 ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు ప్రవేశ పెట్టుటకు Insert పై క్లిక్ చెయ్యాలి.
01:06 తర్వాత Picture మరియు From Fileను ఎంచుకోండి.
01:10 ఇప్పుడు ప్రవేశ పెట్టలనుకున్న చిత్రాన్ని కనుకోనండి.
01:14 నేను ముందుగానే డెస్క్‌టాప్ పై Images ఫోల్డర్లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను.
01:20 Image1ను ఎంపిక చేసుకుంటాను.
01:24 Location ఫీల్డ్ లో చిత్రం యొక్క పేరును చూడండి.
01:28 Open బటన్ పై క్లిక్ చేయండి.
01:31 స్ప్రెడ్షీట్లో చిత్రం రావడం గమనించండి.
01:38 లింకింగ్ ద్వారా మరొక చిత్రాన్ని ప్రవేశ పెద్దాం.
01:42 ముందుగా ఒక కొత్త సెల్ను ఎంపిక చేసుకోండి.
01:45 ఇప్పుడు, Insert మరియు Picture పై క్లిక్ చేసి From Fileను ఎంపిక చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం.
01:55 ఇప్పుడు Image 2 పై క్లిక్ చేద్దాం.
01:58 ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్కు లింక్ చేయడానికి, Link ఎంపిక పై చెక్ పెట్టి Open పై క్లిక్ చేయండి.
02:05 కనిపించే డైలాగ్ బాక్స్లో, Keep Link బటన్ పై క్లిక్ చేయండి
02:11 ఇప్పుడు చిత్రం ఫైల్కు లింక్ చెయ్యబడింది.
02:15 లింకింగ్
02:17 మనం ఫైల్ను లింక్ చేసినపుడు,

మొదట స్ప్రెడ్షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది సేవ్ చేసినపుడు.

02:23 ఎందుకంటే స్ప్రెడ్షీట్ లో చిత్రం లేదు గనక.
02:27 రెండవది, ఇది యూసర్(user)కు రెండు ఫైల్ళను విడి విడిగా మార్పులు చేయడానికి అనుమతిస్తుంది.
02:32 ఇమేజ్ ఫైల్లో చేసిన మార్పులు, స్ప్రెడ్షీట్లో లింక్ చేసిన చిత్రానికి వర్తిస్తాయి.
02:39 ఫైల్కు లింక్ చేసిన Image 2 రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
02:46 ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ GIMP(గింప్)ను ఉపయోగిస్తున్నాను.
02:50 మీరు మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయివున్న ఏ ఎడిటర్నైనా ఉపయోగించవచ్చు.
02:54 ముందుగా Personal-Finance-Tracker.odsను సేవ్ చేసి మూసివేద్దాం.
03:01 తదుపరి, ఇమెజేస్ ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
03:04 Image 2ను ఎంచుకుందాం.
03:06 ఇప్పుడు రైట్ క్లిక్ చేసి Open with GIMని ఎంపిక చేసుకుందాం.
03:10 GIMPలో Image 2 తెరుచుకుంటుంది.
03:13 ఇప్పుడు చిత్రం యొక్క రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
03:18 చిత్రాన్ని సేవ్ చేసి మూసివేద్దాం.
03:22 Personal-Finance-Tracker.odsను తెరుద్దాం.
03:26 Image 2, గ్రేస్కేల్లో కనిపిస్తుంది.
03:30 ఫైల్ను లింక్ చేస్తే, ఒక ప్రతికూలత ఏమిటంటే, ఈ స్ప్రెడ్షీట్ ను వేరే కంప్యూటర్కు లేదా యూసర్కు పంపాల్సివాస్తే,
03:40 మీరు స్ప్రెడ్షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపాల్సి వుంటుంది.
03:44 అనగా, మీరు ఎప్పుడు రెండింటి లొకేషన్ ట్రాక్ చేయాల్సి వుంటుంది.
03:52 ఈ చిత్రాన్ని స్ప్రెడ్షీట్ కుడి వైపుకు తీసుకెళ్దాం.
03:58 స్ప్రెడ్షీట్లో చిత్రాలను ప్రవేశపెట్టాడానికి మరొక పద్దతి,
04:05 ఏ ఫోల్డర్లో చిత్రం నిలువ చేశామో అక్కడి నుండి స్ప్రెడ్షీట్లోకి డ్రాప్ చేయడం.
04:09 ఇప్పుడు చిత్రాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం.
04:12 ఇమేజ్ ఫైల్ను స్ప్రెడ్షీట్లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా, అక్కడే డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి.
04:19 మీ డాక్యుమెంట్లో చిత్రం ప్రవేశ పెట్టబడిందని గమనించండి.
04:23 CTRL మరియు Zను నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
04:29 ఇప్పుడు డ్రగ్ మరియు డ్రాప్ పద్ధతిలో చిత్రని లింక్ చేద్దాం.
04:34 ఇది చాలా తేలిక. Control మరియు Shift కీలను నొక్కి పట్టు కొని,
04:40 చిత్రాన్ని స్ప్రెడ్షీట్ లోకి డ్రాగ్ చేయండి.
04:44 ఇప్పుడు ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్కు లింక్ చేయబడింది.
04:48 CTRL మరియు S కీలను నొక్కి ఈ క్యాల్క్ ఫైల్ ను సేవ్ చేద్దాం.
04:54 ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం.
04:58 చిత్రం వున్న ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
05:02 మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చితం పేరును Image 3.jpg, నుండి Image 4.jpgకు మారుద్దాం.
05:12 ఇప్పుడు Personal Finance Tracker.ods ఫైల్ను తెరుద్దాం.
05:18 లింక్ చెయ్యబడ్డ చిత్రం ఇక పై కనిపించదు!
05:22 లింక్ చెయ్యబడ్డ పాత్ ఎర్రర్ చూపుతుంది!
05:25 ఈ లింక్ను తొలగిద్దాం.
05:28 ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అభ్యాసంను చేయండి.
05:32 క్యాల్క్ షీట్ లో ఒక చిత్రాన్ని లింక లాగా ప్రవేశ పెట్టి, సేవ్ చేసి మూసివెయ్యండి.
05:38 ఇప్పుడు చిత్రం నిలువ ఉన్న ఫోల్డర్కు వెళ్ళి దానిని తొలగిద్దాం.
05:43 క్యాల్క్ ఫైల్ను తెరిచి చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
05:49 ఇప్పుడు ఇమేజ్ ఫోల్డర్లోకి చిత్రాన్ని తిరిగి పేస్ట్ చేద్దాం.
05:53 క్యాల్క్ ఫైల్లో చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
05:57 స్టాండర్డ్ టూల్బార్ దిగువన ఒక కొత్త టూల్బార్ను గమనించండి.
06:02 ఇది Picture టూల్బార్.
06:04 Picture టూల్బార్ యొక్క పై ఎడమ భాగంలో వున్న Filter బటన్లో, చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి.
06:13 CTRL మరియు Z నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
06:18 గ్ర్యాఫిక్స్ మోడ్ బటన్లోని ఎంపికతో చిత్రాన్ని గ్రేస్కేల్, నలుపు-మరియు-తెలుపు లేదా వాటర్మార్క్( watermark)గా మార్చవచ్చు.
06:26 Picture టూల్బార్లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం.
06:32 తర్వాత, క్లిప్‌బోర్డ్ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశాపెట్టలో చూద్దాం.
06:37 క్లిప్ బోర్డ్ లో నిలువ వున్న చిత్రాన్ని ఒక లిబ్రే ఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి ఇంకో దానికి కాపీ చెయ్యవచ్చు.
06:44 ఒక కొత్త స్ప్రెడ్షీట్ను సృష్టించి, దాని పేరు abc.ods అని పెడుదాం.
06:50 ఇది మన టార్గెట్ డాక్యుమెంట్.
06:53 Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ఇదివరకే వుంది.
06:59 ఇది మన సోర్స్ డాక్యుమెంట్.
07:02 కాపీ చేయాల్సిన చిత్రాన్ని సోర్స్ ఫైల్ నుండి ఎంపిక చేసుకోండి.
07:06 చిత్రాన్ని కాపీ చేయటకు CTRL మరియు C కీలను నొక్కండి.
07:11 ఇప్పుడు చిత్రం క్లిప్ బోర్డు లో సేవ్ చేయబడింది.
07:15 abc.ods టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం.
07:21 abc.odsలో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి.
07:28 CTRL మరియు V కీలను నొక్కి ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టండి.
07:35 మన టార్గెట్ ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడడం చూడండి.
07:42 ఇప్పుడు, నేరుగా క్యాల్క్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం.
07:48 గ్యాలరీలో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్షీట్లో ప్రవేశ పెట్టవచ్చు.
07:54 దీనిని ఎలా చేయాలో చూద్దాం.
07:57 స్టాండార్డ్ టూల్ బార్లో గ్యాలరీ ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:01 ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో Tools ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై దాన్ని తెరవడానికి గ్యాలరీ పై క్లిక్ చేయండి.
08:09 మీరు గ్యాలరీలోని చిత్రాలలో నుండి డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి.
08:18 గ్యాలరీ నుండి చిత్రాన్ని డ్రాగ్ చేసి స్ప్రెడ్షీట్లో ఎక్కడ ప్రవేశ పెట్టలనుకుంటున్నరో అక్కడికి డ్రాప్ చేయండి.
08:26 Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడింది.
08:34 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
08:39 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,

స్ప్రెడ్షీట్ లో ఇమేజ్ ఫైల్ను వివిధ రకాలుగా ఎలా ప్రవేశ పెట్ట వచ్చు.

08:46 అనగా ఫైల్ నుండి, క్లిప్ బోర్డ్ నుండి లేదా గ్యాలరీ నుండి.
08:52 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:55 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:58 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:08 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది.
09:12 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
09:19 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
09:23 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రోలో అందుబాటులో ఉంది.
09:41 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya